Pages

Monday, January 4, 2010

నా మనసాయెను వల్లకాడు

అమ్మా అమ్మోరు తల్లి !
ఇక నా వల్ల కాదు
నా మనస్సు ఆయెను వల్లకాడు
మనిషై పుట్టాను
మనసే పెంచాను
ప్రేమ పై ఈ సమస్త విశ్వాసానికి ఇంత విశ్వసనీయతను పంచి
మానవత్వాన్ని పెంచాలనుకున్నాను
నా విశ్వ ప్రేమ వికటించేలా ఉంది
నా ఓర్పు నీ తీర్పుకై యుద్దాన్ని ప్రకటించేలా ఉంది
అమ్మా
వైద్యం చేయనొచ్చి రోగాన్ని ఎలా వ్యాపింప చేస్తానే
ప్రేమను పంచనొచ్చి యుద్దాన్నెలా చేస్తానే
తల్లీ !
నా వల్లకాదు. నా మనసాయెను వల్లకాడు
నా మాటలతో బీటులు వారిన మానవత్వపు కోటకు
మరమ్మత్తులు చేయ చూసాను
ద్రోహం నన్ను ఒడిసి పట్టింది
నా వ్యూహం బెడిసి కొట్టింది

No comments:

Post a Comment