Showing posts with label Rasi palalu. Show all posts
Showing posts with label Rasi palalu. Show all posts

Monday, October 18, 2010

శని గ్రహం - A టు Z పరిచయం

మనకు ఎవడినన్నా నచ్చకుంటే అతను లేనప్పుడు అతనిని "శనిగాడు" అంటాం.  ఎవరికన్నా కష్ఠాలే వస్తుంటే "పాపం.. అతనిని శని పట్టి పీడిస్తున్నాడంటాం. మన దైనందిన జీవితంలో శని పేరును ప్రస్తావించలేక పోతున్నాం. తొమ్మిది గ్రహాలున్నప్పటికి శనికున్న ప్రాభల్యం మరే గ్రహానికీ లేదు. అట్ ది సేమ్ టైమ్ శని గురించిన అపోహలు కూడ ఎక్కువే. ఆ అపోహలను తొలగించి శని గొప్పతనాన్ని మీకు తెలియ చెయ్యాలనే ఈ టపా.

మొదట ప్రాథమిక సమాచారాలు కొన్నింటి చూద్దాం:

1.శని మీ రాశికి 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలు చేస్తాడు.
ఇతర రాశుల్లో సంచరిస్తేనే పీడిస్తాడు
2, మొత్తం 12 రాశులున్నాయి.  శని ఒక్కో రాశిలోను రెండున్నర సం.లు సంచరిస్తాడు. - 12X2 1/2 ముప్పై సంవత్సరాల్లో (ఒక రౌండ్)  శని ఒక జాతకునికి అనుకూలంగా ఉండేది జస్ట్ పది సం.లేనన్నమాట. తక్కిన   ఇరవై సం.లు ప్రతికూలుడే.-

3.అలాగే శని ఒక రాశిలో తానున్నప్పుడు   4/12 రాశులవారికే మేలు చేస్తాడు. తక్కిన 8/12 రాశుల వారికి కీడు చేస్తాడనుకోవచ్చు. అంటే మెజారిటి  జాతకులు శని పీడనలోనే ఉంటారు. ( అందుకేనేమో జ్యోతిష్కులెప్పుడూ బిసిగా ఉంటారు)

4.శని ఒక  రాశి నుండి మరో రాశికి  మారేందుకు 6 నెలలు పూర్వమే కవుంట్ డౌన్ మొదలవుతుంది. కాని   తన ద్వితీయ భాగంలోనే( 1 1/4 +1 1/4) విజృంబిస్తాడు.
5.నదుల అనుసంథానం, జలయజ్నం  వంటి బౄహత్తర పథకల పట్ల ఆసక్తి కనబరచాలన్నా , రూపొందించాలన్నా , అమలు చెయ్యాలన్నా శని భలం ఎంతో ముఖ్యం.ఓర్పు,ఓపిక,త్యాగం,నిస్వార్థాలతో పూనుకుంటే కాని నదుల అనుసంథానం, జలయగ్నం వంటి పథకాలు అమలు కావు.
6. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి మూలం, నరాల బలహీనత వరకు వస్తుంది.

శని పట్టుకుంటే 7.5 సం.లు పీడిస్తాడని అదని ఇదని ఎన్నో అపోహలు మీలో ఉన్నాయి.
వ్యవసాయరంగానికి అధిపతి శనియే. అంతే కాదు చాలా ఆలస్యంగా ఫలితం ఇవ్వగల ఏ వ్యాపారం,రంగం,పని, ప్రయత్నాలకు శనియే అధిపతి. శని భలం ఉన్నవారే లాంగ్ టెర్మ్ ప్రోజెక్టుల్లో దిగుతారు, సాధిస్తారు. ఇతరులు ఏవో చిన్నా , చితకా విషయాలకు పరిమితం అయిపోతారు.
శని భలం ఎవరికి ఉంటుంది ?:
8 వతేది ,లేదా 17,26 తేదీలో పుట్టిన వారికి, శనికి సంభంధించిన పుష్యమి,అనురాధా,ఉత్తరాభాధ్రా నక్షత్రాల్లో పుట్టిన వారికి మకర,కుంభ రాశి/లగ్నం వారికి  శని మితృడుగా ఉన్న వృషభం, మిథునం, కన్యా,తుల, రాశులవారికి ప్రాధమికంగా శని భలం ఉన్నట్టే. అలాగే పుట్టిన తేది,నెల,సం. సంఖ్యలను కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 8 వచ్చినా శని భలం ఉన్నట్టే
శని భలం ఉన్నవారి లక్షణాలు:
అందం,అలంకరణ, డబ్బు, డాబు,దుబారాల పై దౄష్ఠి పెట్టరు. చాలా పొదుపుగా ఉంటారు( శని భలం లేని వారు దుబారా చేసి , దివాళా తీసి ఆ తరువాత పీనాసులుగా తయారవుతారు.వ్యవసాయం, గ్రనైట్స్,పరిశ్రమలు వీరిని మరింత ఆకర్షిస్తాయి. వీరు విధి  వ్రాతను విశ్వసిస్తారు. హస్త సాముద్రికంలో శని రేఖకు ఫేట్ లైన్ /విధి రేఖా అని కూడ ఒక పేరుంది. వీరి తీర్పులు నిర్మొహమాటంగా ఉంటాయి. సాధారణ సైనికునిగా చేరి కమేండరుగా, హోటల్ సర్వరు గా జీవితం ప్రారంభించి, ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా ఎదిగిన వారి జాతకంలో ఖచ్చితంగ శని భలం ఉండి తీరుతుంది. వీరు పై పై తళుకులకు లొంగరు. పర్పస్ సెర్వ్ కావడమే వీరికి ముఖ్యం. శని భలం ఉన్న జాతకులకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వారి శరమ ఫలితం కేవలం వౄద్దాప్యంలోనె అందుతుంది.
శని పట్టడానికి ముందు:
తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును
పరిహారం:
శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి .ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును
శని పడితేనే మంచిది:
అవును బాసు .. శని ఆయుష్కారకుడు కాబట్టి జాతకుడ్ని తన ఆదీనంలో ఉంచుకున్నంత కాలం   ( ఏల్నాటి శని,శని దశ,శని భుక్తి జరుగునప్పుడు) స్వతంత్రించి జాతకుడికి మరణాన్ని ప్రసాదించడు. మరే మారకుని వీక్షణమన్నా కలిగితె గాని మరణం అసంభవం.

శని పడితే భలం పెరుగుతుంది:
అవును గురువా.. సు:ఖాలు మనుషుల్ని భలహీనపరుస్తాయి. బాధలే మనిషిలో దాగున్న శక్తి సామర్త్యాలను వెలికి తీయడంతో పాటు ఆయుష్షును పెంచుతాయి.

Tuesday, April 13, 2010

2010 లో మీ భవిష్యత్

సాధారణంగా సం. ఫలితాలు చెప్పినప్పుడు శని,గురు,రాహు, కేతువులను బట్టి ఫలితాలు చెబుతుంటారు. ఇది ఒక విదంగా తర్క సమ్మతమే. పై గ్రహాలు ఒక్కో రాశిలో సం.లు తరబడి ఉండి ఫలితాలిస్తుంటారు. కాని వీరికన్నా భలవంతుడు,ఫల వంతుడు కుజుడు. అందుకే నేను కుజ గ్రహ సంచారాన్ని పట్టి ఫలితాలు చెప్ప దలచాను.

కుజ గ్రహం యొక్క విశిష్ఠత:
జాతకాలు చూచు వారు తక్కిన గ్రహాల స్థితి  బాగా లేక పోతే ఆ గ్రహం భాగాలేదు,ఈ గ్రహం బాగా లేదు అంటారు. కాని  ఒక్క కుజ గ్రహ స్థితి భాగా లెకుంటే మాత్రం "అమ్మో ! ఇది దోష జాతకమని ప్రక్కన పెడతారు

ఎందుకంటే ఇతర గ్రహాలు భాగాలేకుంటే వారికి సంభందించిన జబ్బులే వస్తాయి. ఫలానా గ్రహం భాగాలేదు. ఫలానా జబ్బొస్తుందని చెప్పవచ్చు. కాని కుజ గ్రహం రక్తానికి,రక్తంలోని తెల్లకణాలను తయారు చేసే ఎముకల్లోని బోన్ మ్యేరోకి అధిపతి. తెల్లకణాల గురించి తెలుసుగా ? మనిషికి వ్యాధి నిరోధక శక్తినిచ్చే గ్రహం కుజుడు. అట్టి కుజుడు జాతకంలో భాగా లేకుంటే బోన్ మ్యేరో దెబ్బ తింటుంది. అది తయారు చేసే తెల్లకణాల సంఖ్య తగ్గి పోతుంది.వ్యాధి నిరోధక శక్తి పడి పోతుంది.అప్పుడేమవుతుంది ? ఏ జబ్బన్నా వచ్చే అవకాశం కలుగుతుంది.

ఇదో ఎత్తైతే కుజుడు కోపానికి కారకుడు. కోపం వస్తే ఎంతటి గుణవంతుడైనా గుణ హీనుడవుతాడు, ఎంతటి బుద్దిమంతుడికన్నా బుద్ది ప్రకోపిస్తుంది. దాని పర్యావసనం ఎలా ఉంటుందో మీరే ఊహించుకొండి

మరో కోణం కూడ ఉంది. కుజగ్రహన్ని గ్రహాల సైన్యాధిపతిగా పేర్కొంటారు.రాజు ఎక్కడో మందు కొట్టి పడుకుని ఉన్నా సైన్యాన్ని నడిపేది సైన్యాధిపతియే. అట్టి సైన్యాధిపతియొక్క ఆజ్న లేనిదే సైన్యం (ఇతర గ్రహాలు) కదులుతుందా? కదలదు.

అందుకే జాతకంలో కుజునికి వెనుక ఉన్న గ్రహాలను గ్రహ యుద్దంలో ఓడి పోయిన గ్రహాలుగా ,శక్తి హీన గ్రహాలుగా పరిగణిస్తారు.

మనిషికి దైర్య,సాహసాలను ఇచ్చే గ్రహం కుజుడు. ఇతను ఒక రాశిలో సంచరించే కాలం దాదాపుగా 45 రోజులే అయినప్పటికి ఆ 45 రోజుల్లో అధ్భుతాన్ని సృష్ఠిస్తాడు. చిత్తూరు.ఎం.ఎల్.ఏ సి.కె.బాబు మూడవ పర్యాయం పోటీలో ఉన్నప్పుడు అతని జన్మ రాశి అయిన మకరానికి ఒక్క కుజుడు తప్పా అన్ని గ్రహాలు ప్రతికూలమే. సి.కె.పై పోటికి దిగిన అభ్యర్థి రాశి సింహం.ఒక్క కుజ గ్రహం మినహా అన్ని గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయి. గ్రహస్థితి ప్రభావం కారణంగా నాటి ప్రభుత్వం సి.కె.పై,సి.కె.అనుచర గణాల పై ఎన లేని ఆంక్షలు విధించింది.  షేడో పార్టీలంటూ,ఎస్కార్ట్ అంటూ సి.కె.వెనుక బలగాలను మొహరింప చేసేరు.కనీశం ఫోలింగ్ బూతుల్లో పోలింగ సరళి గురించి తన అనుచరులను వాకబు చేద్దామన్నా కుదరని పరిస్థితి. ఈ దుందుడుకు చర్యల పై ఎన్నికల రోజున సాయంత్రం  సి.కె. నేతృత్వం కూడ నిరసన  ర్యాలి కూడ నిర్వహించారు. కాని చివరికి ఏమైంది. ముచ్చటగా సి.కె. మూడో సారి ఎం.ఎల్.ఏ అయ్యారు. ఇదీ కుజ గ్రహం యొక్క గొప్పదనం. అందుకే 2010 లో మీ భవిష్యత్తును కుజ గ్రహ స్థితిని పట్టి వివరించాలని నిర్ణయించాను

ఏప్రల్ 5 నుండి 26 వరకు సింహంలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
మేషం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
వృషభం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
మిథునం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
కర్కాటకం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
సింహం:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
కన్య:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
వృశ్చికం:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
దనస్సు:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
మకరం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
కుంభం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి
మీనం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం

ఏప్రల్ 26 నుండి జూలై 20 వరకు కన్యలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
(ఇక్కడ ఇదివరకే ఉన్న శనితో కుజుడు కలవడం వలన మంచి గాని చెడ్డ గాని తీవ్ర స్థాయిలో జరుగుతాయి)
మేషం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం
వృషభం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
మిథునం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
కర్కాటకం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
సింహం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
కన్య:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
వృశ్చికం:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
దనస్సు:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
మకరం:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
కుంభం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
మీనం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి

Wednesday, February 24, 2010

జాతకాన్ని పట్టి ఏ ఏ విషయాలు తెలుస్తాయి?

జాతకం నిజమేనా ? జ్యోతిష్యం హేతుబద్దమేనావంటి విషయాలపై నిర్దిష్ఠమైన ఆధారలతో వాదనలతో వ్రాసే సత్తా ఉన్నప్పటికి తొలూత జ్యోతిష్యం పై విశ్వాసం గలవారిని సంతృపితి పరచి ఆ పై నిరూపణ విషయానికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. జాతకంలో నవగ్రహ స్థితిని పట్టి,రాశి,లగ్నం , భావాలు,భావాధిపతుల స్థితిగతులను పట్టి ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు, అందుకున్న రూల్స్ ఏవి వంటి విషయాలను ఈ టపాలో వివరిస్తాను. జాతకాన్ని బట్టి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

జోతిష్యంలోని కీలక విషయాలను, ప్రొఫేష్నల్ సీక్రెట్స్ సైతం పాఠకులకు ఒక సీరియల్ గా అందించాలని సంకల్పించాను. కనీశం వందమందియన్నా ఈ టపాను చదివి పది మందియన్నా తమ స్పందనను తెలుపుతూ వస్తే ఈ దారావాహికం కొనసాగుతుంది. ఇందుకు మీరు చెయ్యవలసిందల్లా క్రింది లింకును తమ నెట్ ఫ్రెండ్స్ కు ఈ మెయిల్ ద్వారా పంపడమే! లేదా ఈ టపాను ట్విటర్ వంటి వాటి ద్వారా సన్నిహితులతో షేర్ చేసుకోవడమే.

1..రవి:
జాతకంలో రవి గ్రహ స్థితిని పట్టి పగటి పూట పుట్టిన వారికి తండ్రి,తండ్రి ఆస్తి,తండ్రి తరపు బంధువుల విషయాలు తెలుస్తాయి. అందరికి వారి తల, కుడి కన్ను,దంతాలు,ఎముకలు, వెన్నెముక, ఆత్మ విశ్వాసం, దాన గుణాలు తెలుస్తాయి. పైగా నాయకత్వ లక్షణాలు, గ్రామాధికారం,
విమర్శనాత్మక దృష్ఠి, దైర్యం,సాహసం, తన వారిని సంరక్షించాలన్న తపనలు తెలుస్తాయి. అలాగే కొండ ప్రదేశాలు, పాతివ్రత్యం, ఒంటి తల నెప్పి,ఉత్సాహం, చొరవ,నిద్రలేమి వంటి విషయాలతో పాటు ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి.

2.చందృడు:
మనుష్యుల మనో భలం, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, శరీరంలోని ద్రవస్థితి, కల్పనా చాతుర్యం, చంచలం, ఆకస్మిక దనలాభాలు, స్ఫురణ, మిమిక్రి చేసే సత్తా తెలుస్తాయి. రాత్రి పూట పుట్టిన వారికి తల్లి,తల్లి తరపు బంధువులు,తల్లి ఆస్తి గురించినవి తెలుస్తాయి. అలాగే ప్రముఖుల భార్యల అనుకూలత, జల రాశి, కొబ్బరి వంటి వాటివలన అనుకూలత, ద్రవ రూప వస్తువుల తయారి, విక్రయాల్లో అనుకూలత,ప్రజాధరణ, స్వాశ కోశ వ్యాధులు,సముద్ర స్నానం, 108 శక్తి స్థలాల సందర్శన బాగ్యం, వైశ్యకుల స్త్రీలు,ఓడలు, సముద్రయానం, జల వనరులు, వంటివి తెలుస్తాయి.
3.కుజ:
పోలీసు,మిలిటరి,రైల్వే,ఎలక్ట్రా)నిక్స్ రంగాల్లో అవకాశం. రియల్ ఎస్టేట్స్, సోదర వర్గం, శతృవులు,రక్తం ,మంట సంభంధ వ్యాదులు, రోడ్డు,అగ్ని ప్రమాదాలు, ఆయుధాలతో బెడద, ఇందనాలు,కోపం,తర్కం,వ్యూహ రచన, పోటా పోటి, క్రీడలు, ఇటుకలు, మెటల్ ఫోర్జింగ్, మెటల్ మోల్డింగ్, హోటల్, వంట, వ్యాధి నిరోధక శక్తి, హఠాన్మరణం, అంగం తెగి పడుట,యుద్దం, పోటాలటలు, ప్రేలుడు పదార్థాలు,టపాకాయలు, ఆవేశ పూరిత అనాలోచిత ప్రేమలు, ప్రేమ బగ్నాలు,విడాకులు, దంపతులు విడిపోవడం,వన్య కుల క్షత్రియులు, రాజులు (కులం), అగ్ని ముఖ వృత్తులు, సతరు వృత్తులు చేయువారు వంటి విషయాల వలన జాతకునికి జరిగే లాభ నష్ఠాలను జాతకంలో కుజ స్థితిని పట్టి తెలుసుకోవచ్చు.

4.రాహు:
సినిమా,లాటరి,సారాయి,ఫోర్జరి, మేజిక్,దొంగలు,దొంగతనం, దొంగ రవాణా, స్మగ్లింగ్, ఎగుమతి,దిగుమతి, లైసెన్స్ లేని వ్యాపారాలు, జిరాక్స్, అనాలోచిత విరేచనాలు,వాంతులు, విష భీతి, విష జంతువులు, మెడికల్ రియాక్షన్, ఫుడ్ పాయిజనింగ్, నడుముకు క్రింది భాగాన గుర్తు తెలియని నొప్పులు భలహీనతలు, రహస్యం,రాత్రి పూట చేసే వ్యాపారాలు, చీకటిలో చేసే పనులు, ఓర చూపు,దుర్గ,అబద్దాలు, ముసుగు దొంగలు, చీకటి శతృవులు,అనుమానం, మతాంతర వివాహం, ఇతర మతస్తులు,5.6.7.8.9.
ఆకాశ రామన్న ఉత్తరాలు, సర్పాలు తండ్రి తరపు తాత,అవ్వ వంటి విషయాల వలన జాతకునికి జరిగే లాభ నష్ఠాలను జాతకంలో కుజ స్థితిని పట్టి తెలుసుకోవచ్చు.


(ఇతర గ్రహాల, ఇతర అంశాలను పట్టి చెప్ప గల విషయాలతో పాటు మీ జాతకాన్ని మీరే పరిశీలించి ఫలాలు తెలుసుకునేందుకు వీలు పడే అన్ని విషయాలను వరుస క్రమంలో అందించ గలను)