Showing posts with label ఆథ్యాత్మికం. Show all posts
Showing posts with label ఆథ్యాత్మికం. Show all posts

Monday, October 18, 2010

ఆథ్యాత్మికం X సెక్స్

లోకం అపార్థం చేసుకుంటుందని నిజం చెప్పడం మానెయ్యడం నా వల్ల కాదు. గతంలో  భర్త చని పోగానే స్త్ర్రీని భూడిద చెయ్యద్దన్నా అపార్థం చేసుకునేరు. తదుపరి గుండు గీయించొద్దంటే అపార్థం చేసుకునేరు.

నేను సెక్స్ గురించి ప్రస్తావించటం ఎందుకంటే "కామి కాని వాడు మోక్ష కామి కాలేడు" సెక్స్ ఎల్.కె.జి అంటే ఆథ్యాత్మికం  యుకేజి వంటిది.

నా అసలైన ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆథ్యాత్మికం వైపు ఆకర్షించి వారిలో ఆథ్యాత్మికతను పెంపొందించాలన్నదే. కాని చాలా మంది ఆథ్యాత్మికమంటే  అందులో  సెక్సుకు తావు లేదని, అది  నిషేదించ బడిందని అపోహ పడి దూరంగా పారి పోతారు.

నాకు కలిగిన అనుభవం ఏమంటే బ్ర్హహ్మచర్యమన్నది ఆథ్యాత్మికతకు కావల్సిన క్వాలిఫికేషన్ కాదు. ఆథ్యాత్మికతతో లభించే డిగ్రీ వంటిది. ఆథ్యాత్మికానికి కావలసింది స్పృహతో కూడిన లోతైన ధీర్ఘకాలిక రతి.
ఇటువంటి రతి సంప్రాప్తించినప్పుడు తదుపరి కోరిక కలగడానికి మామూలు కంటే ఎక్కౌవ కాలం పడుతుంది.

సంఖ్య తగ్గుతుంది గాని కలిగే అనుభూతికేం కొదవ ఉండదు. కాని మానవులు సెక్స్ గురించిన అవగాహణ లేక ,మూడ నమ్మకాలతో,అపోహలతో, అపరాథ భావంతో ఆ సుఖాన్ని పొందక పోగా తరచూ దానికోసమే ప్రాకులాడుతూ ఆథ్యాత్మికానికి దూరమై పోతున్నారు.

అందుకే మళ్ళీ నా బ్లాగ్ నిషేదానికి గురైనా సరేనని "భావ ప్రాప్తి"కి కొన్ని మార్గాలను సూచించే ఈ టపాను పోస్ట్ చేస్తున్నాను.

భావ ప్రాప్తి వావ్ ఏం పదమండి బాబు ! రతియొక్క అసలైన భావం (మీనింగ్) ఏమిటో ప్రాప్తించటాన్నే భావ ప్రాప్తి అన్నారేమో?  నిజానికి కామోద్రేకమన్నది పంచేంద్రియాల ద్వారే కాక ప్రతి అణువు ద్వార ఆస్వాదించగల విషయం, ఎదుటివారికి పంచేటి విషయం.

రతి అంటే అదేదో రెండు మర్మాంగాలకు సంభంధించిన విషయం కానే కాదు. మరి లోతుగా వెళ్తే కుర్రాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో. సూటిగా చెబుతాను. మన దేశంలో రతిలో కర్త పురుషుడు, క్రియ ఆతనికే చెల్లుతుంది. కర్మ స్త్రీయే. (రాముడు రొట్టెలు తిన్నాడు అనే పదంలో రాముడు కర్త, రొట్టె కర్మ , తిన్నాడు క్రియ)

ఈ ఉదాహరనలో కర్మ రోట్టె  ముక్క కాబట్టి దానిని ఎలా తిన్నా దానికి ఒరిగేది ఏమీ లేదు.దానికి కలిగే బాధేదీ లేదు  కాని స్త్రీ ప్రాణమున్న మానవ పుట్టుక.

పురుషుడి కామం పాలు పొంగినట్టే నిమిషాల్లో అయిపోతుంది. పాలు పొంగినట్టు వీర్య స్కలనం జరిగిపోతుంది. తను భావప్రాప్తి చెందినట్టుగా భావిస్తాడు. కాని ఒక గొప్ప వ్యూహంతో స్త్రీకి దగ్గరై ఆమెను చూపులతో, మాటలతో,నిట్టూర్పులతో, స్పర్శతో, నాలికతో,పెదాలతో , కాళ్ళు,చేతులు , ఒకటేం కర్మ అన్ని అంగాలతో ఉడికించి ఆమె ఇక తట్టుకోలేను బాబో అని పురుషుడ్ని తన మీదికి  లాగేసుకోవాలి . అంగ ప్రవేశానికి తపించి పోవాలి. అందాక పురుషుడు వీర్య స్కలనం కానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకో కగాలి.

 అంగ ప్రవేశానంతరం కూడ తొందరపడక ఆమె స్థితి గతులపై దృష్ఠి పెట్టి ఓపికతో, ఓర్పు, నేర్పులతో కదలికలు,ఆట విడుపులు ప్లాన్ చేసుకోకలిగిన   నాడు ఆమెకు కలిగే భావప్రాప్తికి ఏమాత్రం తీసిపోని ఆత్మ సంతృప్తి పురుషునికి కలుగుతుంది.

అది మాటల్లో చెప్పలేనిది. . ఇలా ప్రతి భార్య ,భర్త ఒక రాత్రి భావ ప్రాప్తి చెందితే మరో నెలదాక ఇద్దరికీ రతి పై ఆలోచన కూడ కలుగదు. అది రతిలోని మర్మం. ఎంత లోతుగా అనుభవిస్తే సంఖ్యలు తగ్గి పోతాయి.

సహజ సిద్దంగానే ఇద్దరికీ ప్రకృతి మీద,సృష్ఠి మీద ,సృష్ఠికర్త మీద భక్తి భావం చిగురిస్తుది.

Thursday, September 30, 2010

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2
సాధారణంగా ప్రతి ఒక్కరు భావించేదేమంటే ఆథ్యాత్మికం , సెక్స్ పరస్పర వైరుధ్యము గల అంశాలని .నిజానికి ఇవి మానవుడ్ని ఉన్నత శిఖరాలకు చేర్చే , కనీశం జంతు స్థాయికి దిగజారిపోక చూసే మెట్లే. అవును మరి. మనిషి
తలచుకుంటే దేవుడు కాగలడు. లేదా జంతు స్థాయికి దిగ జారగలడు. ఈ రెండింటిని నిర్ణయించేది సెక్స్ పట్ల అతనుకున్న దృక్పథమే.

ఒక వేళ అతను సెక్స్ అంటే నేరమని, పాపమని, ఆయువును తగ్గిస్తుందని, శక్తి హీనుడుగా మారుస్తుందని , మాయలో పడవేస్తుందని ఇలా రక రకాలుగా భావించి తనలోని కామవాంచను అనగత్రొక్క చూస్తే ఏదో రోజున అతనిలో చాలా కాలంగా భంధించి ఉంచిన జంతువు సంకేళ్ళను తెంపుకుని భయిటకొచ్చి స్వైరవిహారం చేస్తుంది.

అలా కాక యాంత్రికంగా సెక్సును అనుభవిస్తూ , దానికే భానిసై పోయినా అతను జంతు మాత్రంగా మిగిలి పోతాడు. బుద్దుడు చెబుతాడు. సత్యం ఆ కోశాన లేదు, ఈ కోశానా లేదు. అది మద్యలో ఉంది. విడ మరచి చెప్పాలంటే జీవన వికాశం సెక్సులోను లేదు, బ్రహ్మచర్యంలోను లేదు.

బ్రహ్మచర్యం మనిషిని సెక్సుకు సిద్దం చేస్తుంది. లోడడ్ పిస్టల్ గా మారుస్తుంది. ట్రిగ్గర్ మీద చెయ్యి తగిలితే ప్రేలి పోతాడు. అలాగే సెక్సు బ్రహ్మచర్యానికి సిద్దం చేస్తుంది. అంటే మరో సారి సెక్సులో పాల్గొనే శక్తిని పుంజుకునేంత వరకు.

ఈ చట్రంలో తగులుకుంటే మనిషి కేవలం జంతువులాగే జీవించ వలసి వస్తుంది.  దీంతో మనిషి సెక్సు మీద చిన్న చూపు, బ్రహ్మచర్యమంటే గొప్పా అనే నిర్ణయానికొస్తాడు.   ఇటువంటి వారే సమాజాన్ని ముఖ్యంగా యువతరాన్ని తప్పు ద్రోవ పట్టించి సెక్స్ పట్ల అపరాధ భావాన్ని పెంపొందించారు. మానవశరీరం, సెక్సు  ఆథ్యాత్మికతకు అడ్డని భావించి ఎన్నో ఆంక్షలు విధించేరు.

ఓషో చెబుతారు. మానవ శరీరం అతనికి ఒక శతృవు కాదు. మితృడు కాదు.అదో పరికరం. కాని మానవ నైజం ఎట్టిదంటే ప్రతి దానిని వారు తమ నాశనం కోసమే వినియోగిస్తుంటారు. ఇది కేవలం తెలియని తనమే. ప్రేమ,దేశ భక్తి,దైవ భక్తి ఏదైనా మరి దేనినైనా తమ సర్వ నాశనానికి వినియోగించుకోవడంలో మానవులను మించిన జీవరాశులు  భూ ప్రపంచం మీద లేవు. అలానే సెక్సును సైతం తమ నాశనానికే వినియోగించేరు.  అత్యుత్సాహంతో చితికిన పడి సెక్సును దాదాపుగా నిషేదించేరు.

 నీళ్ళకు సంభందించి ఒక రూల్ ఉంది. నీటిని అదిమి దానిని పరిమానాన్ని తగ్గించలేము.దీనిని బాస్కలిన్ రూల్ అంటారు. కామవాంచ కూడ అటువంటిదే. భూమిలోనైతే విత్తనం వేస్తే/పడితే అది వృక్షమై ఫలితాన్నిస్తుంది. బొగ్గు సైతం వజ్రంగా పరిణితి చెంద కలదు. కాని మానవ మస్తిష్కంలో కామ వాంచను పాతి పెడితే అది హింసా ప్రవృత్తిగా పరిణితి చెంది భయిటపడుతుంది.

ఇక్కడ ఒక నిగూఢ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. ఈ జీవరాశులన్నింటికి మూలం ఏక కణ జీవి అయిన అమీబా. అది బలిసి సెల్ కాపియింగ్ ద్వారా రెండుగా విడిపడింది.  ఈ క్రమంలో కాపియింగ్ లో తారాసపడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు పుట్టుకొచ్చాయి. కోతి వచ్చింది. కోతినుండి మానవుడు వచ్చాడు.

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు కాలం,దూరం, అబధ్రత, సమాచార లోపం వంటి ఏ సమస్యా లేదు. ఈ తియ్యని స్మృత్లులు సెల్ కాపియింగ్ ద్వారా  సెల్ టు సెల్ కాపి అయ్యి  ప్రస్తుతం మానవ మస్తిష్కంలోను ఆ స్మృతులు ఉన్నాయి.

సాటి జీవరాశులతో మమేకం అయితే కాని తమలోని అబధ్రత పోదన్న తలంపు ప్రతి మానవుని మస్తిష్కపు పొరల్లోను దాగి ఉంది. అయితే ఇక్కడ చిన్న పొరభాటు జరిగి పోయింది . ఒకే ప్రాణం, ఒకే శరీరంగా ఉన్న తాము విడి పడడానికి, ఏకం కాలేక పోతుండటానికి  తమ శరీరాలే కారణం అన్న పోహ మనుషుల్లో వచ్చింది.

సైకాలజి చెప్పేదేమంటే " ప్రతి మానవుడు ఏం చేసినా ఆ చర్యకు అతనిని ప్రేరేపించేవి రెండే వాంచలు ఒకటి చంపటం, మరొకటి చావడం"

ఈ వాంచల గంగోద్రి ఏదో సైకాలజి చెప్పలేదు. దాని పని కూడా కాదది. అయితే యాధృచికంగా ఈ జిష్ఠును నేను పట్టుకో కలిగాను.  చావడం చంపడం దేనికి? శరీరాలను రాల్చుకోవడానికి ! శరీరాలను త్యజించాలనుకోవడం దేనికి?
శరీరాలు లేకుంటే  ఆత్మ స్వరూపంతో సాటి జీవ రాశులతో మమేకం  కావడం సులభతరమన్న భావం.

మాంసాహారం పై ప్రీతి, భరువు తగ్గించుకోవాలన్న ఆకాంక్ష అందుకోసం ప్రాణాల మీదికి తెచ్చుకునే దుస్సాహసం ఇవన్నింటికి కారణం కూడా చావడం, లేదా చంపడం పై ఉన్న జిలే. మరి దీనికి సెక్సుకి ఏమిటి సంబంధం అంటారా? ఉంది.

పురుషుని కోణంలో:
వీర్య స్కలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చచ్చే కోరిక నెరవేరుతుంది
స్త్ర్రీ కోణంలో:
పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే  కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చంపే  కోరిక నెరవేరుతుంది

చచ్చే చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సులోనే సుసాథ్యం కాబట్టె మానవులకు సెక్సు పట్ల ఇంత మక్కువ ఏర్పడింది.

బుల్లి మరణం:
పైగా స్త్ర్రీ పురుషులు ఇరువురు మెళకువతో, ప్రజ్నతో, నేర్పుతో, చైతన్యంతో సెక్సులో పాల్గొంటే ఇద్దరికి ఏక కాలంలో ఆర్గాజం ( భావ ప్రాప్తి) కలిగే అవకాశం ఉంటుంది. భావ ప్రాప్తి కలిగినప్పుడు కాలం తెలీని స్థితి ఏర్పడుతుంది.శరీరం, మనస్సు, భుద్ది అన్నీ స్విట్చ్ ఆఫ్ అవుతాయి. వీటికి అధనంగా తనకేదో మరో రూపం, వేవ్ లెంగ్త్ ఉందనే భావం మనిషిలో ఏర్పడుతుంది. ఈ స్థితిని ఆంగ్లంలో బ్లాక్ అవుట్ అంటారు. కాని నేను దీనిని బుల్లి మరణమనై వ్యవహరించ దలచాను.

ఈ బుల్లి మరణం యోగంలో కలిగే సమాధికి ట్రెయిలర్ వంటిది.ట్రెయిలరే చూడలేని వాడు సినిమా ఎలా చూడ గలడు. అందుకే  ఆథ్యాత్మికం వయా సెక్స్ అని పేర్కొన్నాను. సెక్సునుండి సమాధి అనేది వేరే స్కూలు. ఇది తాంత్రికానికి సంభంధించింది. ఇది సామాన్యులకు అసాధ్యం. కాని ఈ టపాలో నేను పేర్కొన్న ఆథ్యాత్మికం వయా సెక్స్ అందరికి సుసాధ్యం. దానిని ఎలా సాధ్యం చేసుకోవాలో తదుపరి టాపాల్లో వివరిస్తాను.

జీవరాశుతర తరాలుగా