Showing posts with label అంబపలుకు. Show all posts
Showing posts with label అంబపలుకు. Show all posts

Saturday, January 1, 2011

దారిద్రియం దగ్ద చేయగా మిగిలేదే అసలైన మీరు

తల్లీ !
ఎన్నో కథలు చదివాను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను కంటున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవితపు
సుఖ దుఖాల్లో పాలుపంచుకుంటున్నా
అయితే అమ్మా....
నా కథలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
క్షణాల్లో,గంటల్లో,రోజుల్లో,నెలల్లో వీరి స్థిథి గతులు
తలక్రిందలై పోతుంటే
నేను మాత్రం జస్ట్ ప్రేక్షకుడిగా -ఏలీన్ గా- గ్రహాంతరవాసిలా
ఎలా చూడగలుగుతున్నానే వీరి ఆరాటాలను -జీవన పోరాటాలను

నా తల్లికి కుచేలుని భార్య పేరు
కుదిరింది కాబట్టే
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతూందా?
ఈ దారిద్రియమే నా ఆలోచనలను కేంద్రీకృతం చేసి
తాబేలువలే నన్నో లక్షయపు గూడులో చెర పెట్టిందా? లేదా బధ్ర పరచిందా?

పుట్టిన నాటినుండి నేటి వరకు
ఎదో రూపంలో
ఎదో మోతాదులో
దారిద్రియం... దారిద్రియం..
ఈ దారిద్రియాన్ని దగ్దం చేసేందుకు
ఎంతగానో ఎదిగాను
మరెంతగానో దిగ జారాను
కాని .. కాని ..కాని
దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.. శాపంలా
వెంటాడుతూనే ఉంది
ఎందుకమ్మా?
కాని ఒక్క విషయాన్ని అంగీకరిచాలి
నా పేదరికమే నిజమైన "నేను" ఏమిటో నాకు స్ఫురింప చేసింది.

కొంపదీసి ఇదీ నీ స్వరూపమేమో?
బహుసా ! నేను భవిష్యత్తులో కేవలం డబ్బు మనిషిగా
పరివర్తన (ఐ మీన్ దిగజారి) చెంది ఈ సమాజాన్ని
దోచుకుని నా జాతకాన్ని సార్థకం చెయ్యాలని
ఈ టీర్ట్మెంటా తల్లీ!

అమ్మా!
నా గోడును ఏ మాటలతో చెప్పాలనుకున్నా
అదే గోడును మరేవో   మాటలతో నీకు విన్నవించుకున్న
సందర్భాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి
అన్ని విదాల అర్హత ఉండిఅదృష్ఠవంతుడిగా ఎదగనిచ్చే జాతకంలోనే పుట్టాను
నా ప్రయత్నంలో అతి ఉండొచ్చు గాని
లోపం మాత్రం లేదు

ఈ దేశాన్ని ఉద్దరించాలనుకున్నాను
కనీశం నా కుటుంభాన్ని సైతం
పోషించలేని దుస్థితిలోనే ఉన్నాను
గురు చంద్ర సంయోగ ఫలమగు
పద్నాలుగు సం.ల వనవాసం ఇదేనేమో అనుకుని
ఓర్చుకున్నాను

అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను ఒక భీజాన్ని ఐదు సం.లుగా ద్యానిస్తూనే ఉన్నాను

ఏవో కొన్ని చిల్లర  అద్భుతాలు జరుగుతున్నాయి గాని
నా దారిద్రియం మటుకు దగ్దం కావడం లేదు
ఎందుకు?

గతాన్ని విడిచి పెడతాం
అప్పుడు నేను కేవలం ఒక తెలివైన చిలుకను మాత్రమే

మరి నేడు?
హే మదుర మీనాక్షి !
నీ చేతిలోని చిలుకంతటి స్థాయికి ఎదిగాను
హే అంబ!
నా పలుకులు నీ పలుకులంతగా భీభత్సాన్ని సృష్ఠిస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడలాడుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు కొణ ప్రాణంతోనన్నా
కొట్టుమిట్టాడుతూనే ఉంది
పొరభాటున నా దారిద్రియానికి చిరంజీవత్వం
ప్రసాదించలేదుగా?

పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించ లేదుగా?
బై మిస్టేక్.. ఈ నా దారిద్రియం నీ ప్రతిరూపం కాదు కదా?

నేను చెయ్యాలి యుద్దం!
అందుకు కావాలి నా దారిద్రియం దగ్దం
అని ఒక మూల ఆలోచిస్తున్నా

శిలనై ఉన్న నన్నుశిల్పంగా మలచింది ఈ దారిద్రియమేనో ఏమో అన్న అనుమానమూ కలుగక మానడం లేదు..

చెడ్డవానికి చెడిపోయే కాలం వచ్చే సమయాన అతనికి మంచి ఆలోచన ఇచ్చి ముంచేయడం

మంచివానికి భాగుపడే కాలం వచ్చిన సమయాన
అతనికి చిన్న చెడు ఆలోచన ఇచ్చి సెటిల్ చెయ్యడం నీ స్టైల్..

ఎందుకో డబ్బు మీద నాకున్న అపోహలను తొలగించావు

వీరి డబ్బు జబ్బును కుదర్చాలంటే నేనదే డబ్బును సంపాదించి చూపాలి..

మరీ వీరిలా డబ్బును ప్రాణంతో ముడి పెట్టుకుని,మరణానికి చేరువవుతూ కాక
ఆడుతూ పాడుతూ..

ఇంకా సంపాదిస్తా.. లక్ష్యం సాధిస్తా.. ఆపై వీరికి సృష్థి రహస్యం భోదిస్తా..

Monday, December 20, 2010

తల్లి నీకే తల్లినైనవాడను

నువ్వే రూపాన వచ్చినా  గుర్తించే స్థితిలో ఉన్నానన్న భ్రమ నాకుంది
నాడు నెను అపర  బ్ర్హహ్మనన్న అపార విశ్వాసంతో
విర్ర వీగుతుంటే
విశ్వనాథునివలే నా అదనపు శిరస్సును ఖండించావు

అలా ఖండించక మునుపే నువ్వు దర్శనమిచ్చి ఉన్నా
ఏ నటీ మణో మేకప్పుతో రోడ్డున పడిందనుకునే వాడ్నేమో?

ఆనాడు ఐదు తలల్లో  పది కళ్ళున్నా నిన్ను గుర్తించక సజావుగా బతికెయ్య కలిగాను
నేడైతే ఉన్న ఒక్క తల తిరిగి పోతుంది.
ఉన్న రెండు కళ్ళు కన్నీళ్ళల్లో కరిగి పోతున్నాయి.

ఈ నా కన్నీళ్ళు నీ పాదాలను కడగడానికో కొత్తగా నీ కరుణను పొందటానికో కాదు
ఇన్నాళ్ళు నాకోసం నువ్వున్నావని, నీ కరుణతోనే నన్ను మననిస్తున్నావని గుర్తించలేక పోయినందుకే.

నేను అహంకారిని నాకోసమే కాదు నీ కోసము సైతం కన్నీళ్ళు పెట్టను
కోట్ల మంది నా పై కత్తులు దూస్తే హాయిగా నవ్వుకోగలను .వారు నన్ను ,నా ఉనికిని గుర్తించారని మురిసి పోగలను.

కాని ..కాని.. ఒక్క నీ  కరుణను మాత్రం భరించలేక పోతున్నానే కన్నీటిని కట్టిడి చేసుకోలేక పోతున్నానే.

నాటి మలుపుల్లోని పరమార్థం..
నిన్నా మొన్నటి మలుపుల్లోని గూడార్థం అన్ని తెలిసాక

వాటి వెనుక ఉన్న నీ అమ్మ మనసు అర్థమయ్యాక  నా కాళ్ళు వెల వెల పోతున్నాయి.
అన్నీ అర్థమయ్యాక - నా అహాన్ని సంతృప్తి పరచగల నా ప్రయత్నాలన్ని వ్యర్థమయ్యాక
నా శరీరమే నాతో అహాయ నిరాకరణ చేస్తుంటే మహా అహంకారినైన నేను
ఎలా తట్టుకోనే? దానిని నీ పాదాల చెంతకు ఎలా నెట్టుకురానే?

అమ్మా!
నీ ఛాయ నాటి ఆ మాయను ఆనాడే మాయం చేసి ఉంటే ఈ కాయం, ఈ గాయం ఇంతగా భాధ పెట్టేది కాదేమో?

నీ భీజం , నీ నామం , ఈ అక్షర హోమం యింకాస్త ముందుగా అంది ఉంటే  నా అహం పిచ్చి మొక్కగా ఉన్నప్పుడే తుంచి పారేసేవాడ్నేమో?

నా గ్రహం - దాని ఆగ్రహం - నీ అనుగ్రహం ఇంకాస్త ముందుగా తెలిసి ఉంటే ఈ ఆపరేషన్ ,ఈ పరేషాన్లకు అవసరం లేక పోయేదేమో?

అయితేనేం? పురిటి నెప్పులు ఎంత ఎక్కువగా భరించి ఉంటే అంతగా తల్లి బిడ్డల నడుమ అనుభంధం గట్టి పడుతుందని తెలుసుకోలేని మూర్ఖుడను కాను కదా..

ఇక్కడ నా హృదయ గర్బంలో నీ భీజాన్ని మోసి నాకే నాకై నిన్ను  కన్న వాడ్ని నేను. తల్లి నీకే తల్లినైనవాడను నేను

ఓం శక్తి

Sunday, December 19, 2010

అంబపలుకు ( కవితా సంకలనం ) ఉపోద్ఘాతం

అంబపలుకు ( కవితా సంకలనం ) ఉపోద్ఘతం ( కవితలను  దశలవారిగా అందిస్తా)
ఈ కవితా సంకలనానికి అంబపలుకు అని పేరైతే పెట్టాను. కాని ఈ శీర్షికకు అర్థం ఇదని నిర్ధారించుకోలెక పోతున్నా. ఈ కవితలు అంబ (కరుణ) కొరకు పలికిన పలుకులో/ అంబ నా చేత పలికించిన పలుకులో ఏదైతేనేమి ఇందులో అంబ ఉంది. పలుకు ఉంది. పంచ దశాక్షర్యై స్వాహా అని శాక్తేయులు కీర్తించే అంబ ప్రతి అక్షరంలోను ఉండగా లేనిది ఈ కవితా సంకలనంలోని కవితాక్షరాల్లో లేక పోవడమేంది సిల్లిగా!

ఇంతకీ ఈ అంబపలుకు అన్న పదాన్ని బుడ బుక్కలవారి పలుకుల్లో నుండే స్వీకరింఛాను. అంబ, అమ్మ, తల్లి,మాత, అని ఎన్ని విదాలుగా  పలికినా అంబ అనగానే గుర్తుకొచ్చేవి చెరువు లాంటి ఆ కళ్ళు, నుదట మెగా సైజు తిలకం. వీటికి సరితూగే విదంగా ఊహించుకుంటే ఆమె పలుకు ఉరుములా, చూపు మెరుపులా ఉంటుందేమో?

ఇక నడక బూకంపంలా, స్నానం సునామిలా ఉంటాయెమో? కాని శాక్తేయులు మాత్రం ఆమె రూపాన్ని శ్రీబాలగా ( బాలిక స్వరూపం) సైతం ఊహించి ద్యానించి తరించే విదానం లేక పోలేదు. నేనైతే టీన్ ఏజ్ రూపంలో భువనేశ్వరిగానే ఊహిస్తుంటా. నా ఈ 43 సం.ల వయస్సుకు అమ్మవారి పట్ల నా మనస్సు మొగ్గింది కేవలం 10సం.లకు పుర్వమే.

గతంలో శాక్తేయం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. జ్యోతిషం నేర్చుకుంటున్న కొత్తలో నా జాతకాన శివశక్తియోగం ఉందని ఎగిరెగిరి పడి విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్, కవర్ల పై శివయ్య అమ్మవారితో ఉన్న స్టిల్ ముద్రించి మురిసి పోయి ఉండొచ్చు. కాని సీరియస్ గా ఆ తల్లితో కమ్యూనికేషన్ ఏర్పడింది మాత్రం 10సం.లకు పుర్వమే.

అన్ని వర్గాల వారితోను కలిసి పోయే తత్వం ఉన్న నాకు భువనేశ్వరి మాతను ఆరాద్య దైవంగా భావించి గృపుతో పరిచయం కావడంలో ఆశ్చర్యమేమి లేదు. మానసికంగా ఎదగని మగ పిల్లలు తల్లిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. కాని మానసికంగా ఎదిగిన ఆడ పిల్లలు మాత్రం తండ్రితో దగ్గరగా ఉండ కలుగుతారు. ఇది సైకాలజియే కాదు నా అనుభవం కూడాను.

మరి నేను మానసికంగా ఎదగని వాడ్నా? లేక  నా పెద్దరికం, మెచ్యూరిటి పై నాకే విసుగు పుట్టి రెఫ్రెష్మెంట్ కోసం ఇలా కవితలు వ్రాసుకున్నానా? లేక ఎన్ని ప్రళయాలు వచ్చి , ఎన్ని కల్పాలు మొదలైనా ఏ మాత్రం మార్పు చెందక నిత్య యవ్వనంతో దేవుళ్ళను కనిపెడుతుందని దేవి భాగవతం పేర్కొనే కార్టూన్ టైప్ కథలను నాలోని చిన్నపిల్లవాడు ఇష్ఠపడ్డాడా? లేక అటువంటి యవ్వనిక   తారాసపడితే ఆమెతో ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని నాలోని కాసనోవా కోరుకున్నాడో ?

లేక ఇన్కార్నేషన్ థియరి ప్రకారం ఇందాక నేను ఈ భువి పై పుట్టినప్పుడల్లా అమెనే ద్యానించి పూజించి చచ్చానా ? నాకైతే అర్థం కాలేదు.

నేను ఆమెను కోరిందల్లా ఒక్కటే "ఈ దేశాన ఆకలి -దోపిడీలను సర్వనాశనం చేసే అంతిమ యుద్దంలో నన్ను భాగస్వామిని చెయ్యి!"

కాని ఆమె నా తూ తూ మంత్రాలకు, తప్పుల తడకగా తెలుగు కాని తెలుగులో వాగే (ఆసు) కవిత్వాలకే ఉబ్బి పోయి సరస్వతిగా నా నాలిక పై నృత్యం చేస్తూ, భూత వర్థమాన భవిష్యత్ పరిణామాలను ఇట్టే అనలైజ్ చేసే శక్తిని ఇచ్చింది.

లక్ష్మీ దేవిగా నా ఇంట స్థిరవాసం చేస్తూ నా దారిద్రియాన్ని దహనం చేసింది. ధైర్య లక్ష్మిగా నా గుండెలో జెండా పాతింది. జెడ్ క్యేటగిరి సెక్యూరిటి ఇస్తూంది. ఇన్ని ఇచ్చినా ఆమె పై సంతృప్తిలోనే ఉన్నాను.

ఆమె సంతృప్తి చెందుతుందనే ఈ పిచ్చి వ్రాతలు వ్రాస్తున్నా. ఆమె సంతృప్తి చెందేదెన్నడో? నా కోరిక నెరవేరేదెన్నడో కూడా నాకు తెలుసు. ఆ ఘడియలు కూడ మొదలయ్యాయి. అందుకేనేమో పది సం.లుగా నా ఒకనికే పరిమితమైన ఈ వ్రాతలు కనీశం రెండొందల మందికన్నా చేరువ కానుంది ( ఆమె అనుమతితో ..ఆమె సమ్మతితో) చూద్దాం.