అంబపలుకు ( కవితా సంకలనం ) ఉపోద్ఘతం ( కవితలను దశలవారిగా అందిస్తా)
ఈ కవితా సంకలనానికి అంబపలుకు అని పేరైతే పెట్టాను. కాని ఈ శీర్షికకు అర్థం ఇదని నిర్ధారించుకోలెక పోతున్నా. ఈ కవితలు అంబ (కరుణ) కొరకు పలికిన పలుకులో/ అంబ నా చేత పలికించిన పలుకులో ఏదైతేనేమి ఇందులో అంబ ఉంది. పలుకు ఉంది. పంచ దశాక్షర్యై స్వాహా అని శాక్తేయులు కీర్తించే అంబ ప్రతి అక్షరంలోను ఉండగా లేనిది ఈ కవితా సంకలనంలోని కవితాక్షరాల్లో లేక పోవడమేంది సిల్లిగా!
ఇంతకీ ఈ అంబపలుకు అన్న పదాన్ని బుడ బుక్కలవారి పలుకుల్లో నుండే స్వీకరింఛాను. అంబ, అమ్మ, తల్లి,మాత, అని ఎన్ని విదాలుగా పలికినా అంబ అనగానే గుర్తుకొచ్చేవి చెరువు లాంటి ఆ కళ్ళు, నుదట మెగా సైజు తిలకం. వీటికి సరితూగే విదంగా ఊహించుకుంటే ఆమె పలుకు ఉరుములా, చూపు మెరుపులా ఉంటుందేమో?
ఇక నడక బూకంపంలా, స్నానం సునామిలా ఉంటాయెమో? కాని శాక్తేయులు మాత్రం ఆమె రూపాన్ని శ్రీబాలగా ( బాలిక స్వరూపం) సైతం ఊహించి ద్యానించి తరించే విదానం లేక పోలేదు. నేనైతే టీన్ ఏజ్ రూపంలో భువనేశ్వరిగానే ఊహిస్తుంటా. నా ఈ 43 సం.ల వయస్సుకు అమ్మవారి పట్ల నా మనస్సు మొగ్గింది కేవలం 10సం.లకు పుర్వమే.
గతంలో శాక్తేయం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. జ్యోతిషం నేర్చుకుంటున్న కొత్తలో నా జాతకాన శివశక్తియోగం ఉందని ఎగిరెగిరి పడి విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్, కవర్ల పై శివయ్య అమ్మవారితో ఉన్న స్టిల్ ముద్రించి మురిసి పోయి ఉండొచ్చు. కాని సీరియస్ గా ఆ తల్లితో కమ్యూనికేషన్ ఏర్పడింది మాత్రం 10సం.లకు పుర్వమే.
అన్ని వర్గాల వారితోను కలిసి పోయే తత్వం ఉన్న నాకు భువనేశ్వరి మాతను ఆరాద్య దైవంగా భావించి గృపుతో పరిచయం కావడంలో ఆశ్చర్యమేమి లేదు. మానసికంగా ఎదగని మగ పిల్లలు తల్లిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. కాని మానసికంగా ఎదిగిన ఆడ పిల్లలు మాత్రం తండ్రితో దగ్గరగా ఉండ కలుగుతారు. ఇది సైకాలజియే కాదు నా అనుభవం కూడాను.
మరి నేను మానసికంగా ఎదగని వాడ్నా? లేక నా పెద్దరికం, మెచ్యూరిటి పై నాకే విసుగు పుట్టి రెఫ్రెష్మెంట్ కోసం ఇలా కవితలు వ్రాసుకున్నానా? లేక ఎన్ని ప్రళయాలు వచ్చి , ఎన్ని కల్పాలు మొదలైనా ఏ మాత్రం మార్పు చెందక నిత్య యవ్వనంతో దేవుళ్ళను కనిపెడుతుందని దేవి భాగవతం పేర్కొనే కార్టూన్ టైప్ కథలను నాలోని చిన్నపిల్లవాడు ఇష్ఠపడ్డాడా? లేక అటువంటి యవ్వనిక తారాసపడితే ఆమెతో ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని నాలోని కాసనోవా కోరుకున్నాడో ?
లేక ఇన్కార్నేషన్ థియరి ప్రకారం ఇందాక నేను ఈ భువి పై పుట్టినప్పుడల్లా అమెనే ద్యానించి పూజించి చచ్చానా ? నాకైతే అర్థం కాలేదు.
నేను ఆమెను కోరిందల్లా ఒక్కటే "ఈ దేశాన ఆకలి -దోపిడీలను సర్వనాశనం చేసే అంతిమ యుద్దంలో నన్ను భాగస్వామిని చెయ్యి!"
కాని ఆమె నా తూ తూ మంత్రాలకు, తప్పుల తడకగా తెలుగు కాని తెలుగులో వాగే (ఆసు) కవిత్వాలకే ఉబ్బి పోయి సరస్వతిగా నా నాలిక పై నృత్యం చేస్తూ, భూత వర్థమాన భవిష్యత్ పరిణామాలను ఇట్టే అనలైజ్ చేసే శక్తిని ఇచ్చింది.
లక్ష్మీ దేవిగా నా ఇంట స్థిరవాసం చేస్తూ నా దారిద్రియాన్ని దహనం చేసింది. ధైర్య లక్ష్మిగా నా గుండెలో జెండా పాతింది. జెడ్ క్యేటగిరి సెక్యూరిటి ఇస్తూంది. ఇన్ని ఇచ్చినా ఆమె పై సంతృప్తిలోనే ఉన్నాను.
ఆమె సంతృప్తి చెందుతుందనే ఈ పిచ్చి వ్రాతలు వ్రాస్తున్నా. ఆమె సంతృప్తి చెందేదెన్నడో? నా కోరిక నెరవేరేదెన్నడో కూడా నాకు తెలుసు. ఆ ఘడియలు కూడ మొదలయ్యాయి. అందుకేనేమో పది సం.లుగా నా ఒకనికే పరిమితమైన ఈ వ్రాతలు కనీశం రెండొందల మందికన్నా చేరువ కానుంది ( ఆమె అనుమతితో ..ఆమె సమ్మతితో) చూద్దాం.
No comments:
Post a Comment