రైతుల పట్ల నాకున్న గౌరవం స్వార్థ పూరితమే. అంటే రైతు నాయకుడై పోవాలని కాదు. రైతే గాని చేతులెత్తేసాడంటే దేశమే దివాళెత్తి పోతుంది. జనాభాలో 70శాతం వ్యవసాయం ద్వార అసలు సిసలైన ఉత్పత్తి చేస్తుంటే తక్కిన 30 శాతం వారిని నాజూగ్గా దోచుకుంటూ బతుకుతున్నాం. జ్యోతిష్యం కూడా ఈ 30 శాతం కేటగిరిలోనే వస్తుంది.
రైతుకు మద్దత్తుగా ఇటు బాబు,అటు జగన్ దీక్షకు దిగడం ( వారి కారణాలేమైనా) శుభ పరిణామమే. కాని ఇద్దరు ఒకే శిభిరంలో కూర్చుని ఉంటే దిల్లి వారి దిమ్మ తిరిగి పోయుండేది. ఇప్పటికీ మించి పోయిందేమి లేదు జగన్ స్వయంగా వచ్చి బాబు దీక్షకు సంఘీభావం వ్యక్తం చెయ్యాలి.రాజకీయాలు వేరని రైతుల సంక్షేమంలో రాజకీయాలకు తావులేదని ప్రకటించాలి.
ఆలాగే డిసెంబరు 21న బాబు విజయవాడ వెళ్ళి జగన్ దీక్షకు సంఘీభావం వ్యక్తం చెయ్యాలి.రైతు సంక్షేమార్థం జగన్, తాను డబుల్ బేరెల్డ్ పిస్తూలులా పని చెయ్యగలమని ప్రకటించాలి. దెబ్బకు సోనియా కాదు ఆమె తలలో జేజమ్మ దిగి వస్తుంది. వై.ఎస్., చంద్రబాబు ఒకే పార్టిలో పని చేసినవారు. సమ వయస్కులు, రాజకీయంగా చూస్తే ( వారి స్టాండ్ ఏదైనా సరే) పోరాట పటిమ గలవారు. ప్రత్యర్దులుగా చూసినా బాబు లేనిదే వైఎస్ లేడు.
ఆనాడు బాబు చేసిన చారిత్రిక తప్పిదాలే వై.ఎస్.ను తిరుగు లేని నాయకుడ్ని చేసాయి. ఏది ఏమైనా వై.ఎస్. ఏదో రూపంగా బాబులో జీవించి ఉన్నాడు ( కనీశం ఒక శతృవుగానన్నా - రాజకీయ ప్రత్యర్దిగానన్నా) . తండ్రితోను పోట్లాడి,కొడుకుతోను పోట్లాడటం మరి బోర్ అనిపిస్తుంది. ఒక విదంగా ఇది బాబుకు మైనస్సే.
పెద్దరికంగా ఆలోచించి మొదట రాష్ఠ్ర్రం బయిట నుండి రాష్ఠ్ర్రానికి పొంచి ఉన్న ప్రమాదానికి ఆనకట్ట వేసే ప్రయత్నం చెయ్యాలి. చిరులో ఇప్పటికీ రియలైజేషన్ రాలేదు. సోనియా ఇంటి గూర్కా లా మాట్లాడుతున్నారు. కనీశం బాబు జగన్ అన్నా పరస్పర అవగాహణతో మెలగాలి. కనీశం దిల్లి పెత్తనానికి తెర పడేంత వరకైనా.
అమెరికా దౌత్య వేత్త సమీక్షంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు భా.జ.పను అగ్గి మీద గుగ్గిలం చేసింది. వన్ పాయింట్ ప్రోగ్రామ్ క్రిమ్ద భా.జ.పను కలుపుకు పోవడానికి అనువైన పాయింట్ ఇది. ఆలోచిస్తారో ఏమో చూద్దాం
No comments:
Post a Comment