అనాదిగా ఆదివారం
ఆదిలోన కుల మతాలు లేనట్టే, ఈ వారాలు,నెలలు,వత్సరాలు కూడ లేవు. రాత్రి పగల్ తేడాలైతే ఉండేవేమో గాని అది కూడ థామస్ ఆల్వా ఎడిసన్ పుణ్యమా అంటూ పోయింది. ( బల్బు కన్గొనడంతో) మరి ట్యూబ్ లైట్లతోనైతే "పగలే వెన్నలాయె"
మరి ఆదివారాలు మాత్రం ఎందుకిలా తయారయ్యాయి. ఇంతకీ ఈ ఆదివారం శెలవన్నది ఎలా వచ్చింది. బ్రిటీషు వారు తమ పరిపాలనో తమ వారు చర్చీలకు వెళ్ళటానికి అనువుగా లీవు ప్రకటించేరు. అది భానిసత్వం పోయినా కొనసాగుతూనే ఉంది. దానిని మార్చమని నేను కోరను . స్థూల విషయమిది. మరి ఇది మీ మనస్సు మీద శరీరం మీద పనిచేస్తుండటమే సమస్య. దీని గురించే ఈ టపా.
రోజుల నడుమ తేడా ఏంది దరిద్రంగా? ఈ సృష్ఠిలో ఒక నక్షత్రానికి ఎంత ప్రాధన్యత ఉందో..ఒక గడ్డి పరకకు కూడ అంతే ప్రాధన్యత ఉంది. ఏది పోయినా ఈ సృష్ఠి కుంటు పడుతుంది. అలాగే ఆదివారం కూడ ఒక మామూలు దినమే. మరి ఈ రోజున మాత్రం ఎనిమిదింటికి లేవాలని రూలేమిటి. ఏ పని చెయ్య కూడదన్న బద్దకం ఏంటి?
మూత్ర విశర్జనకు రీసెస్ బెల్ కి సంభంధం లేకున్నా రీసెస్ బెల్ మోగగానే మూత్ర విశర్జనకు కుప్పలు తెప్పలుగా పరుగులు తీస్తారు.గంట కొట్టడానికి ఆకలికి సంభంధం లేకున్నా బడిలో పిల్లలు లాంగ్ బెల్ కొట్టగానే ఆకలి దంచేస్తుంది. ఎంత పెరిగి పెద్దవారైనా మనుషుల భానిసత్వపు బుద్దులు మాత్రం మారలేదు. ఇవన్ని పరిసరాలు మన పై చూపే ప్రభావాలు. పరిసరాలు బలహీనులనే ఎక్కువగా ప్రభావిస్తాయి.
నా దృష్థిలో ఆది లేదు ,సోమా లేదు. నా పని నాదే. శనివారం నాడు అర్ద రాత్రిదాక కష్ఠపడి ఒక పొడవాటి టపా వ్రాసాను. దాని శీర్షిక "జాతకం లేకనే మీ భవిష్యత్ తెలుసుకొండి ! పరిహారాలతో సక్సెస్ కండి !
ఒక జ్యీతిష్కునిగా నేను 1989 నుండి 2010 దాకా ఎంతో శ్రమతో తెలుసుకో కలిగిన విషయాలన్నింటిని ఇందులో వివరించాను. జాతకం ఉన్నవారికి,లేని వారికి సైతం ఇది యూస్ ఫుల్ గా ఉంటుంది.
హేతువాదులు సైతం తమ జీవితాలను విశ్లేషించుకుని/ తమకు ఏ ఏ గ్రహం ప్రతికూలంగా పనిచేసాయో తెలుసుకుని పరిహారాలు చేసి చూసి తమ అనుభవాలను వ్రాయొచ్చు.
ఓకే సీ యు..
( బుద్దుంటే శని వారం అర్ద రాత్రి పూట మాత్రం టపా పోస్టు చెయ్యకూడదురా నాయనా)
ఆదివారం జబ్బుతో ఈ టపాను మిస్ అయిన వారు ఇక్క డ నొక్కి చదివెయ్యండి బాసూ..
No comments:
Post a Comment