Sunday, December 26, 2010

కాంగ్రెస్ ఎం.పీల ఆక్రోశం వెనుక రాజకీయ అభద్రత

ఆంథ్ర జ్యోతి హెడ్ లైన్ తెలంగాణ హెడ్ లైన్ ( తల+వ్రాత)


ఇక కాంగ్రెస్ తెలంగాణ ఎం.పీల దీక్ష:
అంటే ఇంత కాలం కె.సి.ఆర్ ఇచ్చిన బిరుదును( చవటలు) సార్థకం చేస్తుండి పోయారన్న మాట

*కేసుల ఎత్తివేత కోసం నిరవదిక నిరశన:
నిరశన అంటేనే ఏదో వ్యవధి ఉంటుంది కదా మీ అరెస్టు దాకా? ప్రెసిడెంట్ పాలన విధించేంతవరకా? - సోనియా కన్నెర్ర చేసేంత వరకా? తెలంగాణ వచ్చేంత వరకా ? ఏదో ఒకటి తేల్చండి బాసు

*నేటి నుండే ఆరంభం
అంటే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టిని తెలంగాణలో ఎలా అంతం చెయ్యాలన్న పాయింట్ మీద పనిచేసారన్న మాట

*వేదిక గన్ పార్క్:

పోనిలే వేదిక ఎంపికలో సైతం (జ) గన్ ను వదల్లేదు

*దిక్కార స్వరంతో ఉధ్యమంలోకి :
అంటే సోనియా చలితో (భయంతో)  ఇంతకాలం స్వరం భయిటకు పొక్కలేదన్న మాట

*రంగంలోకి దిగిన సి.ఎమ్:
దేనికీ? ఇప్పటికే 36 ఎమ్.ఎల్.ఏలను జగన్ కు కట్ట బెట్టారు.. ఉన్న కొంతమందినీ తెలంగాణ ఉధ్యమానికి  సంతర్పణ చేసేందుకేనా?

*దీక్ష వద్దని వినతి:
నాలా ఉండరాదూ?  మూనాళ్ళ ముచ్చటే అయినా రాజభోగం అని  చెప్పారేమో?

*నేతల బేఖాతర్:
అంతేలే ఎలాగూ ప్రెసిడెంట్ రూల్ - ఉప ఎన్నికలు -తప్పడం లేదు - కుర్చీకి కర్చీఫ్ అన్నా వేసి ఉంచాలిగా?

*ఫలించని జానా దౌత్యం:

వై.ఎస్. బతికి ఉండగానే హోమ్ గా ఉన్నప్పుడే హోమ్ ను చక్క దిద్దలేక పోయాడు. ఇప్పుడేం పుడుస్తాడు? నన్ను తెలంగాణ సి.ఎం చెయ్యండి అని అడక్కుంటే సరి

*30న సోనియాకు రాజినామా సమర్పణ

ఓసి మీ తెలివి మండి పోనూ.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైన పదవిని వదులుకోవడానికి సైతం ఆలోచిస్తున్నారా?

*16మంది ఎమ్.ఎల్.ఏలు రాజినామా చేస్తే రాష్ఠ్ర్ర సర్కార్ పడిపోతుంది -కే.కే
జగన్ వెంట ఉన్నవారు చేస్తే ఊడదా కేకె గారు ( అన్నట్టు మీ పుత్ర రత్నం కేసేమైంది?)

*40 మందిమి సిద్దంగా ఉన్నాం -దామోధర్ రెడ్డి

సోనియాకు రాజినామా లేఖలు సమర్పించేందుకే కదా? మీ దుంప తెగా.. మీ ఈ అష్ఠ తెలువులతోనే తెలంగాణలో కాంగ్రెస్ను జీరో లెవల్ కి తెచ్చారు కదయ్యా..మీకు దమ్ము,దైర్యం,కమిట్ మెంట్ ఉంటే కొండా సురేఖలా గవర్నరుకు ఇవ్వండి మీ రాజినామాలు

*మేమూ రాజినామా చేస్తాం - మంతృలు

పాపం. రాజ సేవ రోజుల్లెక్కే అన్నప్పుడు ఇంకేం చేస్తారు

*తెలంగాణ నేత సి.ఎమ్.కావల్సింది : సర్వే
ఇప్పటికీ ఈ పిచ్చి మిమ్మల్ని వదిలినట్టు లేదు

సీమాంధ్ర నేతలు బ్రోకర్లు.. వారికి లేని అధిష్ఠానం మనకే ఎందుకు?: గుత్తా

నిజంగానే వారు బ్రోకర్లు. ప్రజల మనోభీష్ఠాన్ని  (సమైఖ్యాంథ్ర) ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్ళారు

హైదరాబాదూ కావాలి: రాజగోపాల్‌రెడ్డి

దిల్లీ వద్దేంటి..

No comments:

Post a Comment