Monday, December 6, 2010

కాల సర్ప దోషం: కొన్ని టాప్ సీక్రెట్స్

అన్ని గ్రహాలు రాహు కేతువుల నడుమ చిక్కుకుని పోవడాన్నే కాల సర్ప దోషం అంటారు. ఈ గ్రహ స్థితి ఉంటే జాతకునుకి 45 సం.లు నిండితే కాని పెద్దగా సక్సెస్ కాడు .ఏదో ఒక లోటు తప్పక కొనసాగుతుందని శాస్త్ర్రం. ఉ: విద్య పూర్తి కాక పోవడం - ఉధ్యోగంలో స్థిరత్వం లేకుండుట- అవివాహితుడుగా ఉండి పోవడం -పిల్లలు లేక పోవడం.

ఇదెందుకిలా జరుగుతుందంటే రాహు కేతువులు అన్య భాషస్తులను,మతస్థులను,కొత్తగా పరిచయమగువారిని సూచించే గ్రహాలు. తక్కిన గ్రహాలు తల్లి,తండ్రి,సోదరులు, ఫ్రెండ్,లవర్,వ్యాపార భాగస్వామి,స్వమతస్తులు,స్వ భాషస్తులను సూచిస్తాయి.

తక్కిన గ్రహాలన్ని రాహు కేతువుల నడుమ చిక్కుకుంటే సతరు జాతకునుకి  తన అన్న వారంతా దూరంగా ఉండొచ్చు ( స్థూలంగా కాని మానసికంగా కాని)  తన చుట్టూ అన్య భాషస్తులను,మతస్థులను,కొత్తగా పరిచయమగువా .అలా ఉన్న యెడల జాతకుని  అభివృద్ది కుంటు బడటం సహజమేగా.

ఎంత కాదన్నా స్వంత మనుషులతో పోల్చుకుంటే అన్య భాషస్తులను,మతస్థులను,కొత్తగా పరిచయమగువారు పెద్దగా మన అభివృద్దికి సహకరించ లేరుగా (ప్రత్యేకించి జీవిత భాగస్వామి ఎంపికలో)

పైగా స్వంత మనుషులతోనే దగ్గరగా ఉండలేని వారు అన్య మనుషులతో ఎంతమెరకు దగ్గరగా ఉంటారు?


రాహు కేతువులంటే విషాలకు ప్రతీకలు. మానవ శరీరంలోను విషాలు ఉన్నవి. మనం ఆక్సిజన్ పీల్చి కార్బండై యాక్సైట్ విశర్జిస్తాం, మన స్వాశ లోతుగా జరిగితే ఊపిరితిత్తుల్లోని  చివరి పాయింట్ దాక కార్బండై యాక్సైట్  విశర్జింప పడుతుంది. లేకుంటే అది మన శరీరంలోనే ఉండి పోతుంది. ఇదే మన ఆహారం - మల విశర్జన, మనం త్రాగే నీరు - మూత్ర విశర్జనల్లోను జరుగుతుంటాయి.

ఇలా మానవ శరీరంలో విషాలు పేరుకు పోతాయి. రాహు కేతువులు మంచి స్థానంలో ఉన్నవారు ఈ విషాలతో బాటుగా జీవించేస్తుంటారు. కాని రాహు కేతువులు దుస్థానాల్లో ఉన్నవారికి రక రకాలైన సమస్యలొస్తుంటాయి.

ఉ: చర్మం నల్లగా మారడం, అన్ వారంటెడ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్, బక్క చిక్కిన శరీరం, లేదా ఊభకాయులు కావడం.

పాయింటుకొస్తా. రాహు కేతువులు విషాలకు ప్రతీకలైతే ఇతర గ్రహాలు మానవ శరీరంలోని ఇతర అవయవాలను సూచిస్తాయి. ఉ: గురు అంటే కడుపు, రవి అంటే తల ,చంద్ర అంటే ఊపిరితిత్తులు,మూత్ర పిండాలు

అన్ని గ్రహాలు రాహు కేతువుల నడుమ ఉంటే ఇతర అవయవాలు విషమయమై పోయే ప్రమాదం ఉందని భావం.

తమ మద్య తగులుకున్న గ్రహాలను రాహు కేతువులు నియంత్రించి నిర్వీయం చేస్తుండటం చేత ఈ పరిస్థితి తలెత్తుతుంది.

ఈ లోపం కారణంగా రాహు కేతువులు దుస్థానాల్లో ఉన్నవారు ( సర్ప దోష జాతకులు) ,కాల సర్ప దోషం గలవారు శారీరక,మానసిక రుగ్మతలకు లోనై ,ఏకాకులై పోతారు.

 ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహు కేతువుల నడుమ తగులుకు పోయి కాలసర్పదోషం పొందిన వారు  ధీర్ఘ కాలిక శారీరక,మానసిక రుగ్మతలకు లోనై ,ఏకాకులై ఇతర గ్రహాల వలన లభించ వలసిన యోగాలను సైతం  మద్య వయస్సు దాటాకే పూర్తిగా అందుకోవడం అనుభవంలో చూస్తున్నాను..

No comments:

Post a Comment