విశ్వసనీయత పోగొట్టుకోవడం నిజమైతే మీడియా రంగం అన్ పాపులర్ అయ్యుండాలిగా. వాటి రీడర్ షిప్ ,వ్యూయర్ షిప్ పూర్తిగా పడిపోయుండాలిగా అని మీరు ప్రశ్నిస్తారు.
విశ్వసనీయత పోగొట్టుకోవడం. నిరాధారణకు గురికావడం అన్నది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు .అది స్లో పాయిజన్లా ఎక్కుతుంటుంది. అసలు దానిని గుర్తించలేక పోయే ప్రమాదం కూడ ఉంటుంది. చడి చప్పుడు కాకుండా జరిగి పోతుంటుంది.
చంద్రబాబు - మీడియాను పోల్చుకుని కొంత వెనక్కు తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది.
చంద్రబాబుకు ఎన్.టి.ఆర్ బతికున్న రోజుల్లో నెంబర్ టూగా ఎంతో విశ్వసనీయత ఉండేది. అగ్ర శ్రేణి నాయకులుసైతం ఎన్.టి.ఆర్ తో పంచుకోలేని భావాలను సైతం బాబుతో పంచుకునేవారు. వెన్నుపోటు ఉదంతం తరువాత ఇది మరింత తగ్గింది. వె.పో.ఉధంతంలో బాబుకు సహకరించిన వారు మాత్రం బాబు మీద అశలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాని బాబు వారిని సైతం నట్టేట ముంచేరు ( ఉ: కేసిఆర్). దీంతో బాబు విశ్వసనీయత మరింత తగ్గింది.
మీడియా బతుకూ ఇంతే . దేశ స్వేచ్చ కోసం పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే అక్షరం కూడ ప్రజల చేతిలో ఆయుధంగా ఉండేది. ఇందుకు కారణం పత్రికాధినేతలు ఏదో లక్షయ సాధనార్థం పత్రికలు నెలకొలిపి నడిపేవారు. దోంతో వీటికి ప్రజల నడుమ ఎంతో ప్రాధన్యత, విశ్వసనీయత ఉండేవి.
దేశం భానిసపు సంకేళ్ళను తెంచుకున్న తరువాత కూడ ఈ నిజాయితీ స్ఫూర్తి కొనసాగింది.
క్రమేణా అన్నిరంగాల్లోలాగే పత్రికా రంగంలోని వ్యాపారస్తులు, ఆదర్శాలు పక్కన పడేసి అవసరమైనప్పుడు తమ స్వార్థ పూరిత లక్ష్యాలకు పత్రికలను వినియోగించడం మొదలు పెట్టేరు. ఉ.ఎమెర్జెన్సి పై విమర్శలు ( ఇవి సబబే -కాని కాని దీని వెనుక దాగిన ఉద్దేశం? -ప్రభుత్వాన్ని పడగొట్టడం పైగా ఇవి యజమాన్యం మౌలికాదేశాలకు అనుగుణంగా వెలు బడ్డవి) బోఫార్స్ (ఇది కూడ సబబే కావచ్చు - కాని దీని వెనుక దాగిన ఉద్దేశం? ప్రభుత్వాన్ని పడగొట్టడం.
సాధారణంగా యుద్దం పూర్తి అయ్యాక రాజు సైనికులందరికి బహుమానాలందిస్తుంటాడు.అలానే పై కోవకు చెందిన మీడియా సంస్థలు గత ప్రభుత్వాన్ని పడకొట్టే ప్రక్రియలో పాల్గొన్నందుకు ప్రతిఫలంగా కొత్త ప్రభుత్వంలో కొంతమెరకన్నాలాభం పొంది ఉంటాయి.
ఈ రెండు ఎపిసోడ్స్ మీడియా యొక్క శక్తిని చాటిచెప్పాయి. ప్రతిఫలాన్ని కూడ అందింఛాయి. ఈ రెండు సంగతులే దేశ మీడియా పోకడను మార్చి వేసాయన్నది నా అంచనా.
ఇక చంద్రబాబు విషయానికొద్దాం. ఎంతగా విశ్వసనీయ పోకొట్టుకున్నప్పటికి ఆతరువాత వచ్చిన ఎన్నికల్లో (1999) భా.జా.పాతో పొత్తుతో ఆ పార్టి పొందిన రెండు శాతం ఓట్లతో గట్టెక్కారు( ఆ ఎన్నికల్లో కంగ్రెస్ కి,తె.దే.పా.కి మద్యన రెండు శాతం ఓట్లే తేడా.)
ఇదేవిదంగా పవర్ పాలిటిక్స్ లో పాల్పంచుకుని కొద్దిగా లాభపడినట్టనిపించినా మీడియా రంగం కూడ తన విశ్వసనీయతను పోగొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎక్స్ ప్రెస్ గ్రూప్ అంటే ఇలా వ్రాస్తారని, మరో గ్రూప్ అంటే ఇలానే వ్రాస్తారని పాఠకుల్లో అవగాహణ వచ్చేసింది.
మీడియా పవర్ ఏమిటో తెలుసుకున్న ప్రభుత్వాలు యాజమాన్యాలకు, విలేకరులకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. తమ సత్తా తెలుసుకున్న మీడియా రంగం కూడా దీనిని స్వీకరించింది. కేవలం పాఠకుని పక్షం వహించి,పాఠకుని కోణంలో, అతని అవసరార్థం నడుచుకోవలసిన మీడియా ప్రభుత్వ తాయిలాలను,సబ్సిడిలను స్వీకరించేరు. విలేకరులు ఫ్రీ పాసులు వంటివాటిని స్వీకరించేరు.
పవర్ సెంటర్ పై నిఘా ఉంచవలసిన మీడియా ఆ పవర్ సెంటరుకు దగ్గరగా ఉండడమె కాక లాభ పడటం కూడ మొదలు పెట్టింది. యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా యజమాన్యం పోకడతో సిబ్బంది మైండ్ సెట్ కూడ మారింది. వీరు వారిని వారు వీరిని తప్పుపట్టలేని స్థితి వచ్చింది.
ఇలా నీరుకారిన మీడియా పాఠకులకన్నా ప్రభుత్వ సాయం/సహకారం పై ఎక్కువగా ఆధార పడే రోజులొచ్చినవి.
ఇదో ఎత్తైతే ప్రభుత్వ ప్రైవేటు ప్రకటనలపై ఆధారపడే కొత్త సంస్కృతి వచ్చింది. ఈ ఆధార పడటం ఎన్.టి.ఆర్ కాలం నాటి బా.జా.పాతో పొత్తులా కాక ( ఎన్.టి.ఆర్ ఏక పక్షంగా సీట్లు కేటాయించేవారు) , చంద్ర బాబు రెజిమ్ లో పొత్తులాగా ( ద్వై పాక్షిక చర్వలు జరిగేవి-అలకలు - భుజ్జగింపులు మొదలయ్యాయి) మారింది.
మీడియా రంగంలోని ఈజి మని /పవర్ అసలు సిసలైన వ్యాపారవేత్తలను ఆకర్ఠించింది. స్వార్థపరులను బ్లాక్ మెయిలర్లకు సైతం ఎర్ర తివాచి పరచింది. ప్రస్తుతం పత్రికల స్థితి ఎంతకు దిగ జారాయంటే ప్రభుత్వ ,ప్రైవేటు ప్రకటలు లెకుంటే మనుగడే లేదన్న దుస్థితి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పత్రికలకు కండిషన్స్ పెట్టే స్థితికొచ్చేసేరు. ఆ నిభంధనలను పూర్తిచేస్తేగాని ప్రకటనలు లభ్యం కాని స్థితి. ఎప్పుడైతే వీరి ఆలోచనా విదానంలో ఈ మార్పు వచ్చిందో పాఠకులకు దూరం కావడం మొదలు పెట్టేరు.
తమ పాతివ్రత్యం, పత్రికా ధర్మాలు, నామ్స్ అన్నింటిని గాలికొదిలేసి సెన్సేషన్ పేరుతో పాఠకుడ్ని ఆకర్షించే స్థితికొచ్చేరు. ఇక ఎక్కడి మీడియా?ఎక్కడి మీడియా ధర్మం?
ఈ విషయంలో బాబే బెటర్. భా.జా.పా పొత్తు వద్దనుకుని 2004 ఎన్నికల్లో ఓడారు. ఇన్స్ టంట్ కాఫిలా వేడి వేడిగా తయారైన ప్రజారాజ్యం పొత్తు వద్దనుకున్నారు ( రాజగురువు పంచాయితిలు సైతం పలించలేదు -ఎంతకాదన్నా బాబు ఒక రాజకీయ వేత్తగా పరిణితి చెందేసారు)
కాని మీడియా రంగం అటు ప్రభుత్వం -ఇటు ప్రైవేటు ప్రకటనలకోసం కనీశ మోరల్స్ సైతం గాలికొదిలి పబ్బం కడుక్కునె స్థాయికి దిగజారిపోయింది.
ఎలక్ట్రానిక్ మీడియా గురించి వేరే చెప్పాలా? బాబులా వీరు ఆత్మగౌరవంతో ప్రభుత్వ,ప్రైవేటు ప్రకటన పై ఆధారపడటాన్ని వదలరు.వీరితో పోల్చుకుంటే భాజాపా తో పొత్తును త్యజించిన బాబే బెటర్. మీడియాను ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలవారు త్యజించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి.
అప్పుడు భయిటపడుతుంది మీడియా రంగంయొక్క అసలు సిసలైన భలం ఏమిటో? పాఠకుల నడుమ వీరికున్న మద్దత్తేమిటో?
ఒక పత్రిక పది రూపాయలకు అమ్మే రోజులొస్తాయి. అప్పుడు సైతం పాఠకుడు వీటిని కొని చదువుతాడంటారా? నాకైతే నమ్మకం లేదు
NTR,YSR kante chandrababu chala beter.
ReplyDelete