జాతకం లేకనే మీ జాతకంలోని గ్రహాల భలా భలాలను తెలుసుకోవచ్చు. అదెలా అంటారా? ఒక్కో గ్రహం యొక్క కారకత్వాలను క్రింద ఇచ్చాను. వీటిలో ఏ మాత్రం మీకు రానింపు ఉంది.ఈ విషయాలు ఏమెరకు మీకు అనుకూలంగా ఉన్నాయని బేరేజు వేసుకుంటే ఏ గ్రహం భలంగా ఉందో ,ఏ గ్రహం భలహీనంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.గ్రహాలు బలహీనపడిన యెడల చేసుకోవలసిన పరిహారాలు కూడ పొందుపరిచాను. ఏ గ్రహం యొక్క కారకత్వంలో మీరు ఎక్కువగా నష్ఠ పోయారో ఆ గ్రహం మీ జాతకాన బలహీనంగా ఉందని లెక్క. ఆ గ్రహ సంభంధ పరిహారాలు చేసుకుంటే మీ జీవితం నల్లేరు మీద నడకే
రవియొక్క కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)
తండ్రి ,తండ్రి ఆస్తి,తండ్రి తరపు భంధువర్గం, తూర్పు దిక్కు, కెంపు రత్నం, గడియారం,ఆత్మ, ఆత్మ విశ్వాసం, పల్లు (టీత్) ,ఎముక, వెన్నెముక,కుడి కన్ను, కొండ ప్రదేశాలు, నాయకత్వ లక్షణాలు, ప్రాక్టికాలిటి, సూపర్ వైజింగ్,
క్వాలిటి కంట్రోల్, తామర పువ్వు, వ్యాపార ప్రకటనలు, అనవున్స్ మెంట్స్, దిన పత్రికలు, నిస్వార్థ సేవలు, ఇత్తడి, రోజువారి షెడ్యూల్డ్ ప్రయాణాలు, షటిల్ ప్రయాణాలు, గ్రామం, గ్రామాధిపత్యం, పురపాలక సంస్థ, పారదర్శకత, దానం, నిక్క పొడుచుకుని ఉన్న తల వెంట్రుకలు గల వారు, పై కప్పు లేని ఇల్లు, ఏక పుత్రుడు, బోన్ ఫ్రేక్చర్, నిద్ర లేమి ,ముళ్ళున్న కాయలు,పుష్పాలు, స్వేచ్చా స్వాతంత్ర్యం
ఆరంజ్ రంగులకు రవియే అధిపతి.
గమనిక: శరీరంలోని కుడి కన్ను, కుడి భాగానికి రవి అధిపతి. అయితే ఇది స్త్త్రీల విషయంలో వామ భాగం రవి ఆధిక్యతలో ఉంటుంది,
రవి బలహీణుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:
సూర్య నమస్కారం, ఉదయం ,సాయంత్రం వాక్ చెయ్యడం ,ఆదిత్య హృదయం శ్లోకాలు చదవడం, క్యేల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, యూరిన్ టెస్ట్ చెయించుకోవడం ( లాస్ ఆఫ్ క్యేల్షియం ఉందేమో చూసుకోవడం , యూరిక్ యాసిడ్ మోతాదుకన్నా ఎక్కువ ఉందేమో చూసుకోవడం) ఒక వేళ ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించడం, రవి కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని తండ్రి లేదా తండ్రి వరస వచ్చే వారికి ఇవ్వడం.
ఇంటి మద్య భాగాన రోలు, గుంత ఉంటే వాటిని సరిచేసుకోవడం
చంద్ర కారకత్వం: ( పోర్ట్ ఫోలియో)
శరీరంలోని ఎడమ కన్ను , ఎడమ భాగం (స్త్రీల విషయంలో ఇది కుడి కన్ను,కుడి భాగమై ఉంటుంది) వాయు దిక్కు ( నార్త్ వెస్ట్) ముత్యం, ప్రముఖుల భార్యలు, తల్లి, తల్లి, ఆమె తరపు భంధువులు, ఆమె తాలూకు ఆస్తి ఊపిరి తిత్త్లులు, మూత్ర పిండాలు,రాత్రి సమయం, ఊహా శక్తి, కనికరం, మంచి మానవత్వం, పౌర్ణమి, సముద్ర తీరం, చంచలం, చపలత్వం, ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని అతిథి, కుళ్ళి పోయే కూర గాయలు, పూలు, మనోల్లాసం, ఆశ్వర్యం కలిగించే విషయాలు ( రెండు తలలతో పుట్టిన దూడ వంటివి) జల సంభంధ ప్రదేశాలు, ఎవరు ఎంత సేపుంటారో తెలీని ప్రదేశాలు, ఉ: పెళ్ళి మండపం, సినిమా హాళ్ళు సంత, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయం, పడవ, నావ, సముద్రయానం, ఇసక, సీజనల్ వ్యాపారాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభంధం గల పనులు నది , నది తీరం, తల్లి వయస్సుగల స్త్ర్రీలు, మదర్లి ఫిసిక్ ఉన్న స్త్ర్రీలు, రెండుంపావు రోజుల్లో పూర్తికాగల ప్రాజెక్టులు, నిలకడన లేని తనం, నీరు ,ద్రవ పదార్థాలు, అనిశ్చితి ,
చంద్రుడు బలహీణ పడియున్న యెడల చేసుకోవలసిన పరిహారాలు:
ఇంట్లోపు చిన్న సైజు ఫౌంటేన్ (రెడిమేడ్స్ దొరుకుతాయనుకుంటా) , అక్వేరియం ఏర్పాటు చెయ్యండి.ఊయల ఉంటే మంచిది .ఊగండి. అమావాశ్య తరువాత వచ్చే పదునాలుగు రోజులూ మూన్ లై ట్ డిన్నర్ ( ఇంటి డాబా పై) చెయ్యండి. చంద్ర కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని తల్లి లేదా తల్లి వరస వచ్చే వారికి ఇవ్వడం.దుమ్ము,దూళి, టెన్షన్ పనికిరాదు. వీటికి దూరంగా ఉండండి. ఏనీరంటే ఆ నీరు త్రాగకండి. ఇంటినుండే ఒక బాటిల్లో తీసుకెళ్ళినా బెటరే. ఆయుధం దరించని శాంతస్వరూపు అయిన అమ్మవారిని పూజించండి. ముఖ్యంగా కన్యాకుమారి అమ్మవారు. ఎవరికీ ఖచ్చితమైన మాట ఇవ్వకండి. కమిట్ కాకండి. చూద్దాం చూద్దాం అంటూ పోతే మంచిది.స్విమ్మింగ్, తల స్నానం అధికం చెయ్య కూడదు. వాయు దిక్కులో వంటగది ,గుంతలు, భావి, ఉండ కూడదు . మీరనుకున్న చెడ్డ విషయాలు జరిగిపోయే పమాదం ఉంది. అనుకోని మంచి విషయాలే అనుకోని సందర్భంలో జరుగుతాయి.
కుజ కారకత్వం:( పోర్ట్ ఫోలియో)
పోలీస్,మిలిటరి, రైల్వే,భూములు,సోదరులు,కెమికల్స్, అగ్ని,ఇందనాలు (ఫ్యూయల్స్) కట్టెలు,విద్యుత్, ప్రేలుడు పదార్థాలు, శతృవులు,మీకన్నా వయస్సులో చిన్నవారు, చిన్నవారిలాకనబడే వారు ( ఫిసిక్ - రూపం) , రాజు కులస్తులు, అగ్ని ముఖ వృత్తి వారు, దక్షిణ దిక్కు,ఉష్ణ రోగాలు, ట్యూమర్స్, రక్త శుద్దిలో సమస్యలు, కడుపులో మంట.పెప్టిక్ అల్సర్, పైల్స్, శస్త్ర్ర చికిత్స, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, కోపం,ద్వేషం, రంపు,రచ్చ, కొమ్మున్న జంతువులు,పాలు ,పాల ఉత్పత్తులు, మాంసం, సుబ్రమణ్యస్వామి, స్పోర్ట్స్, వంట, మార్షల్ ఆర్ట్స్,యుద్దాలు, తర్కం, వ్యూహం, పగడం, ఎముకలోని బోన్ మ్యేరో, వ్యాధి నిరోధక శక్తి, బలి, మాంసాహారం.
కుజుడు బలహీనుడైన యెడల పరిహారాలు:
రక్తదానం , మాంసాహార విందు ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరిలు, దర్గా,గుళ్ళకు విద్యుత్ పరికరాలు దానం చెయ్యడం, యోగాసనం, వ్యాయామం, మార్షెల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. మీ ఇంటికి దక్షిణాన ఖాళి స్థలమ్, పల్లం, ఉంటే సరి చేయండి. కొండ మీద ఉన్న సుభ్రమణ్య స్వామిని పూజించండి. చంద్ర కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని సోదరుడు/సోదరి లేదా ఆ వరస వచ్చే వారికి ఇవ్వడం. కుజ సంభంధ కారకత్వాల్లో మెళకువ పాటించడం. వీలున్నంత వరకు దూరంగా ఉండడం.
రాహు కారకత్వం: (పోర్ట్ ఫోలియో)
సినిమా,లాటరి, సారాయి, జూదం, పొగాక,సర్పాలు, విష జంతువులు,ఇతర బాషస్తులు, అన్ వారంటడ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్స్, ఎగుమతి,దిగుమతి,వేదేశాలు, విదేశీ యానం, కాకిలాంటి నల్లని రంగు గల మనుష్యులు, కాకిలా ఓర చూపు చూసే వారు, త్రాగు బోతులు, జూదరులు, మేజీషియన్స్, అల్లోపతి మందులు, రసాయినిక ఎరువులు, సి.ఐ.డిలు, ముసుగు దొంగలు, మాఫియా, డ్యూప్లికేట్ వస్తువులు, రాత్రి పూట చేసే పనులు, చీకటిలో చేసే రహస్య కార్య కలాపాలు ,కుట్రలు, రహస్య శతృవులు.స్మగ్లింగ్, పన్ను ఎగవేత,బ్లాక్ మని, తెర వెనుక ఆడించే రాజ్యాంగేతర శక్తులు,నడుముకు క్రింది భాగం, అక్కడ గుర్తు తెలియని నొప్పులు, బలహీనతలు దొంగ లెక్కలు, సరకుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వయసుకు తగిన ఎదుగుదల లేక బక్క చిక్కి ఉండటం ,లేదా బోద శరీరం, ఫుడ్ పాయిజనింగ్, మెడికల్ అలెర్జి,మాధక ద్రవ్యాలు.
రాహు బలహీనుడైన యెడల చేయవలసిన పరిహారాలు:
పుట్ట కలిగి, బ్రహ్మణులు పూజ చెయ్యని అమ్మవారి గుడి సందర్శన ఫ్రెంచ్,జెర్మన్ వంటి విదేశీ బాషలను నేర్వడం. ఫోటోగ్రఫిని హాబిగా పెట్టుకోవడం, దోపిడి, నేరాలను చిత్రీకరించే సినిమాలు చూడడం. కథలు చదవడం, తమాషాకు ఇస్పేటు కాయితాలాడటం, నష్ఠ పోవడానికే లాటరి టికెట్ కొనడం , పరమ పదం ఆడడం, ఇంటి హాల్, బెడ్ రూమ్స్ గోడలకు చైనీస్ డ్రాగన్ పోస్టర్, రబ్బర్ పాములు వేసి ఉంచడం.
నెలకొక సారైనా ఎవరన్నా ముసలి వానికి ఒక క్వార్టర్ మందు దానం చెయ్యండి. మీకా అలవాటుంటే మానెయ్యండి. తప్పక దానికి భానిసలై పోతారు. పామువంటి ఉంగరం దరించడం, పులిమీద ఉన్న అమ్మవారిని పూజించడం,
గమనిక:
రాహు కేతువులు ఒకరికొకరు సమసప్తకంలో అంటే 180 డిగ్రీల్లో ఉంటూ ఒకరినొకరు ప్రభావిస్తారు కాబట్టి కేతు సంభంధ విషయాల్లోనూ మెళకువ పాటిస్తూ,కేతు కారకత్వాల్లోనుండి కూడ దూరంగా ఉంటే మంచిది
గురు కారకత్వం: ( పోర్ట్ ఫోలియో)
గోల్డ్, కుదువ వ్యాపారం, నామ మాత్రపు వడ్డీతో సాగే ఫైనాన్స్ వ్యాపారం, టీచింగ్, రాజకీయం, తి.తి.దే వంటి ధార్మిక సంస్థలు, వృద్దులు, గెజటడ్ ఆఫీసర్శ్, ఖజాణా, బ్యాంకులు, పెళ్ళి, భార్యా, పిల్లలు, గౌరవం,పలుకు బడి, బ్రాహ్మణులు, పురాణ ఇతిహాసాలు, సంస్కృతం,గుళ్ళు,గోపురాలు,సేవా సంస్థలు,హిందూ మతం, మత సంస్థలు, ఈశాన్య దిక్కు, న్యాయ స్థానం, పుష్యరాగం,హృదయం, కడుపు, జ్నాపక శక్తి, ఆస్తికత్వం,ప్రభుత్వ గుర్తింపు, అవార్డు,రివార్డులు, ప్రభుత్వ గృహ వసతి, గురువులు (ఉ: షిర్డి సాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి, తీర్థ యాత్రలు, క్యేషియర్/ షరాఫ్ , ముందు చూపు,ప్రణాళికలు రోపొందించుకోవడం, బిజినస్ అడ్మినిస్ట్ర్రేషన్, ఈశాన్య దిక్కు, కనక పుష్యరాగం,కోర్టు, బ్రాహ్మణులు,వేదాలు,యజ్న యాగాదులు, బెల్లం,పప్పు దినుసులు.
గురువు బలహీనుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:
గురువారం పసుపు బట్టలు దరించి శివాలయం లేదా ఎవరైన గురువుల వద్దకు వెళ్ళి దర్శనం.
భంగారం దరించక బ్యాంక్ లాకర్స్ లో దాచడం. అజీర్తిని వారించడం,వయస్సుకు తగ్గ వ్యాయామం. బ్రాహ్మణ స్నేహితులుంటే వారికి బ్రేక్ ఫాస్ట్ ,మీల్స్ ఆఫర్ చెయ్యడం. గురు కారకత్వం గల విషయాలకు దూరంగా ఉండటం. సేవా కార్యక్రమాలకు ముఖ్యంగా గుళ్ళు గోపురాలకు డబ్బులు ఇవ్వొచ్చు కాని చొరవ తీసుకోకూడదు. పెద్ద మనుషులతో కాస్త మెళకువతోనే వ్యవహరించడం. బ్యాంక్, కోర్టు,ప్రభుత్వ సంభంధ విషయాల్లో పక్కా గా వ్యవహరించడం. ఉదయమే లేచి పళ్ళు తోమి బిల్వ ఆకులు నమిలి తినడం. ఇంటికి
ఈశాన్యంలో వంటగది, మరుగు దొడ్డి, మెట్లు, మిట్ట, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఉంటే తొలగించండి.సంపు నిర్మించుకొండి.
శని కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)
.శని:
ఐరన్,స్టీల్,ఆయిల్, సెకండ్ హ్యాండ్ వస్తువులు, దుమ్ము దూళి నిండినవి, కుళ్ళు కంపు వచ్చేవి, జిడ్డు గలవి,నల్ల రంగుగలవి , పడమర దిశ, ఎస్.సి, బి.సి లు క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్, పేద ప్రజలను దోచుకునే వ్యాపారాలు, (ఉ. నూటికి పది వడ్డి వ్యాపారం) , యూని ఫార్మ్ దరించిన కార్మికులు, కార్మిక సంఘాలు, నల్లని చాయ కలిగిన వ్యక్తులు, వికలాంగులు (ముఖ్యంగా కుంటి వారు) , నరాల వ్యవస్థ, కాలు, ఆసనం, ఆలశ్యం, బంధించపడటం, అవమానం, వ్యవసాయం, క్వారిలు,స్వరంగాలు, దీర్ఘ కాల ప్రాజక్టులు, దళిత వాడలు (మాల పల్లెలు), మరుగు దొడ్లు, డ్రెయినేజి వ్యవస్థ, సోమరితనం, కూలడానికి సిద్దంగా ఉన్న, కోర్టువ్యాజ్యాల్లో ఉన్న నివాసాలు, కాయులా పడ్డ కర్మా గారాలు, ప్రేతాత్మలు, బక్క చిక్కి పీక్కు పోయిన శరీరం,ముఖం గలవారు,కాళ్ళు,నూనె విత్తనాలు,లాయర్లు, మంద బుద్ది, అశుబ్రత, మరణ సంభంధ ఆదాయాలు, చేదైన వస్తువులు, చెత్త,చెదారం, స్క్రాబ్, భానిస వృత్తులు, మరణ సంభంద వ్యాపారాలు ( ఫ్రీజర్ బాక్స్) , జెయిలు, మార్చువరి,వల్లకాడు, మల బద్దకం ఆలశ్యం.ఎనుములు.
శని బలహీనుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:
వంటకు మంచి నూనె వాడటం - సైనస్ తదితర సమస్యలు (చంద్ర సంభంధమైన జబ్బు) లేనియెడల ప్రతి శనివారం మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యడం,నలుపు రంగు వస్తువులు,భట్టలు మాని నీలి రంగు వస్తువులు,బట్టలు ఎక్కువగా వాడటం. శని వారం దళితులకు ఇనుముదానం, సువాసనాది ద్రవ్యాలు వాడకుండుట, వేప చిగుళ్ళు తినడం, ఆవుకు అవిశాకు పెట్టడం,వండి తామూ తినడం, కాకరకాయ సైడ్ డిష్ గా పెట్టుకోవడం, వీలు కాకుంటే కాకర కాయఒడియాలు నంచుకోవడం. వెండిలో నీలం పొదిగించి దరించడం. స్టీల్ ఉంగరం, కడియం దరించడం. పరిసరాలను మరీ అలంకరించక, అతిగా శుబ్రపరచకుండుట, వీలుంటే తోట పెంచడం, వీలు లేకుంటే మొక్కలు పెంచడం,మల బద్దకాన్ని వారింఛడం, గ్రామ దేవతను పూజించడం, చనిపోయిన పూర్వీకులను పూజించడం ,అమావాశ్య రోజు కాకికి భోజనం పెట్టడం. ఎవరైన పోలీస్ స్టేషన్, కోర్టు,ఆసుపత్రి,వల్లకాటికి లిఫ్ట్ అడిగితే ఇవ్వడం. ఇంటికి పడమర ఖాళి స్థలం,పల్లం లేకుండా జాగ్రత్త పడండి.
బుధ కారకత్వం :( పోర్ట్ ఫోలియో)
పోస్టల్,ఎస్.టి.డి, మొబైల్స్, మెడిసిన్స్, గణితం , అకౌంట్స్, ఆడిటింగ్, కన్సల్టన్సి, కొరియర్,లైసెన్ ఆఫీసర్, అఫిషియల్ స్పోక్స్ మ్యెన్, విద్యా, వైద్య సంస్థలు, సంఘాలు ,సమైఖ్యలు, .వ్యాపార రంగం, కమీషన్ ఏజెన్సి, డీలర్ షిప్, ఫ్రాంచెస్.వైశ్యులు ఉత్తర దిక్కు ,బజారు వీథి , చేంబర్ ఆఫ్ కామర్స్, చర్మం, పురుషుల్లో అండం (టేస్టికల్స్ ), స్త్ర్రిలలో ఓవరీస్ , కీళ్ళు, సమాచార సేకరణ, క్రోడీకరణ, వాటిని సక్రమంగా పొందుపరచడం ( భావ ప్రకటనా సామర్థ్యం) ప్రభుత్వం+ప్రైవేటు రంగాలవారు కలిసి నిర్వహించే సంస్థలు . కొత్తవారిని జంకు బొంకు లేక సంప్రదించే శక్తి, కన్సల్టన్సి,జ్యోతిష్యం,ముందు వెనుకా తెలియని ఏ ఇరువురిని కలిపే వృత్తైనా అది బుధుని కారకత్వమే. మార్కెటింగ్, సేల్స్ రెప్, కథ, వ్యాస రచన,ఇంటర్ నెట్, కంప్యూటర్,సహకార సంస్థలు, అరేటరి (ప్రసంగం చేయు శక్తి)
సెమినార్, పార్క్, చిత్త భ్రమ, మేనమామ , మామగారు,వైష్ణవ నామం గలవారు, చర్మ రోగం గలవారు, పిచ్చోళ్ళు
బుధుడు బలహీనుడైనయెడల చేసుకోవలసిన పరిహారాలు:
మీ దైనందిన జీవితానికి , మీ వృత్తి వ్యాపారాలకు అవసరం లేని విషయాలను తెలుసుకోకండి. సమాచారం కలుషితం కావడమే చిత్త భ్రమకు హేతువు .ఎవరి మాట ఎవరికీ చెప్పకండి. ధౌత్యం పనికి రాదు. వ్యాపార రంగం మీకు పనికి రాదు. మూడో వ్యక్తుల మాట నమ్మకండి.స్వయంగా క్రాస్ చెక్ చేసుకొండి. బుధ కారకత్వ వృత్తి వ్యాపారాలు వద్దు. ( తప్పదంటే మీ ఆదాయంలో కొంత భాగం మీ మేనమామ /మామగారికి ఇవ్వండి). ఏ సమాచారాన్నైనా మీరే స్వయంగా తెలపండి. ఎవరిని ధూతగా వాడకండి. క్లబ్బులు,యూనియన్స్ మీకు పనికి రావు . ఇన్ ఆక్టివ్ గా ఉండండి.బుధ సంభంధ వ్యక్తుల వద్ద మెళకువ పాటించండి. చర్మ సంభంధ రుగ్మతలుంటే వైద్యం చెయ్యకండి. ( ప్రక్టుతి వైద్యం ఒకటే దీనికి పరిష్కారం) విథ్యార్థులు గణితం, సైన్స్ ముఖ్య సబ్జెక్టులుగా తీసుకోకండి. బుధవారం శ్రీ కృష్ణుని పటానికి తులశి మాల వేసి పూజించండి. జాతి పచ్చ ఉంగరం దరించండి
కేతు కారకత్వాలు: (పోర్ట్ ఫోలియో)
రాజ యోగం, ద్యానం,వేదాంతం,విరక్తి,సన్యాసులు, బైరాగులు,దేశ దిమ్మరులు,హిప్పీలు, పుండ్లు, తల,శరీరంలో పేను, వృధా ఖర్చులు,త్రిప్పుట అలసట,అకారణ,తర్కాతీత సమస్యలు, వీధిన పడటం, అన్నానికి అలమటించటం, కట్టుకోవడానికి బట్టలు సైతం లేని దుస్థితి,మనస్సున గుర్తు తెలియని భీతి ఎవరైనా చేతబడి చేసారేమోనన్న ఫీలింగ్, పాము పుట్ట వద్ద పనుకొన్నంత పరిస్థితి ,మంత్ర విద్యల్లో ఆసక్తి, నిదులు, వశీకరణం, రసవాదం వంటి వాటి పై పిచ్చి, నమ్ముకున్న వారెల్లా నట్టేట ముంచటం, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి మోస పోవడం,విదేశాల్లో ఉండగా పాస్ పోర్టు,వీసా మిస్ అవడం,లేదా యుద్దం ప్రకటించ పడటం, ముందు వెనుక తెలియని చోట దారి తప్పడం,అన్య మతస్థులు,అన్య మత ప్రార్థనా స్థలి
కేతు బలహీనంగా ఉన్నయెడల పరిహారం:
సన్యాసులకు భోజనం పెట్టడం, అన్య మత ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం, అన్య మత గ్రంథాలు చదవడం, తగిన గురువును ఆశ్రయించి యోగా ( యోగాసనం కాదు) నేర్చుకోవడం,పై కప్పు సైతం లేని వినాయక స్వామిని పూజించడం, వైడూర్యం దరించడం, వారంలో ఒక్క రోజైనా కాషాయం దరించడం. శుభ కార్యాలు, విందు వినోదాలకు దూరంగా ఉండటం.
గమనిక:
రాహు కేతువులు ఒకరికొకరు సమసప్తకంలో అంటే 180 డిగ్రీల్లో ఉంటూ ఒకరినొకరు ప్రభావిస్తారు కాబట్టి రాహు సంభంధ విషయాల్లోనూ మెళకువ పాటిస్తూ,రాహు కారకత్వాల్లోనుండి కూడ దూరంగా ఉంటే మంచిది
శుక్ర కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)
హౌసింగ్,ఆటో మొబైల్స్, స్నాక్స్,చిరు తిండులు,వాహణాలు, ఫర్నిచర్స్, జాలి టూర్, పక్నిక్,పెళ్ళీళ్ళు,పేరంటాలు,పార్టీలు, సెక్స్, జన్య భాగాలు, ఆపోజిట్ సెక్స్, లలిత కళలు, ఫ్యేన్సి, నావల్టీస్, గర్భస్త బ్రాహ్మణ స్త్రీ, పట్టు వస్త్రాలు, అందమైన భార్య/ప్రియురాలు, మంచి నిద్ర నృత్యం, గానం , ఆకలిని తీర్చని చిరు తిండులు (కోక్ పీట్సా) , దప్పికను తీర్చని పానీయాలు (కొక్కో కోలా) ఫైవ్ స్టార్ హోటెల్, ఏ.సి గదులు ,స్లీపర్స్, ఆగ్నేయ దిక్కు ( సౌత్ ఈస్ట్) ,వెండి. హ్యేండి క్రాఫ్ట్ ,రంగులు,కలర్ సెన్స్,టెక్స్ టైల్స్,రెడిమేడ్స్, బ్యూటి పార్లర్స్, హై క్లాస్ సెలూన్స్,హోమ్ నీడ్స్, టూర్స్ అండ్ ట్రావల్స్, వుల్వా బస్సులు, విందు వినోదాలు, రతి
శుక్రుడు బలహీనంగా ఉన్న యెడల పరిహారాలు:
అవివాహితులు బ్రహ్మచర్యం పాటించడం/వివాహితులు రతుల సంఖ్యను తగ్గించుకొని , భావ ప్రాప్తికి ప్రయత్నించడం ,డాబు మాని నిరాడంభర జీవితం గడపడం, లగ్జరి,ఫ్యాన్సి ,వాహణాలు వాడటం మానడం. ఆరు శుక్రవారాలు లక్ష్మి పూజ . ఆరో శుక్రవారం అరుగురు ముత్తైదువులకు వెండి/ పూలు,పళ్ళు,/పసుపు కుంకుమ/ సబ్బు, /సెంటు వంటివి తాంబూలంలో పెట్టి ఇచ్చి వారి ఆశిస్సులు పొందటం. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తెల్ల పట్టుచీర అర్పించాలని డబ్బులు కూడ పెట్టడం.
టివి,సినిమా,చాటింగ్,గానా భజానాలు మానాలి. ఇంటికి ఆగ్నేయంలో పల్లం, సెప్టిక్ ట్యాంక్, బాత్ రూమ్ వంటివి ఉంటే వాటిని సరి చేసుకోవడం.కటిక నేల పై పడుకోవడం,ఫర్నిచర్స్ వాడకుండుట.
హెశ్చరిక:
ఈ టపా మీ వ్యక్తిగత ప్రయోజనార్థమే .దీనిని ఇతరులకు ఎరవు ఇవ్వడం,లేదా ఫార్వార్డ్ చెయ్యడం,జిరాక్సులు ఇవ్వడం నిషిద్దం. అది ధర్మ విరుద్దం మాత్రం కాదు .చట్ట విరుద్దం కూడ. దీని పై కాపి రైట్ కలిగి ఉన్నానన్న సంగతి మరిచి పోకండోయి.
No comments:
Post a Comment