జగన్ పార్టి అనకుండా అండ్ కో అనడం ఏమిటని మీరు భావించ వచ్చు. కాని కొత్త పార్టి విషయంలో వారి వైఖరి కేవలం కార్పోరేట్ కంపెనిలా ఉందే కాని రాజకీయ పార్టిలా లేదు.
రాజకీయం అంటే ఒక ముహూర్తం తరువాతో పార్టి రెజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేతి వస్తేనో ప్రారంభమయ్యేది కాదు.అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ రోజు ఎన్.టి.విలో కొండా సురేక మాటలు చూస్తే చిర్రెత్తింది.
కృష్ణా కమిషన్ రిపోర్ట్ రావాలట. వచ్చాక స్టాండ్ తీసుకుంటారట. కేవలం ఒక్క తెలంగాణ విషయంలొనే క్లేరిటి లేకుంటే ఇక సవా లక్ష అంశాలున్నాయి. ( లేటెస్ట్: ఎస్.సి.వర్గీకరణ ఈ అంశం పట్ల వై.ఎస్. ఎప్పుడో అనుకూలంగా స్పందించారు. కాని జూ పూడి ప్రభాకర్ జగన్ వెనుకనుండి వర్గీకరణకు వ్యతిరేకంగా హూంకరిస్తున్నారు) .
జీవితంలో ప్రతి సెకను ఒక జంక్షన్ పాయింట్. అటో ..ఇటో..ఎటో తేల్చుకోవాలి. లేకుంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది.
నన్ను చిర్రెత్తించిన విషయాల్లో ఇదొకటైతే మరొకటి వై.ఎస్.అవినీతిలో సోనియాకు సైతం భాధ్యత ఉందని అంబటి రాం బాబు వ్యాఖ్యానించడం.
ఈ ముక్క తొలి సారి చిరంజీవికి అదిష్థానం పిలుపందిన నాడే నేను చెప్పాను. చిరంజీవి ఏమో గత ఎన్నికల్లో "వై.ఎస్. రాష్ఠ్ర్ర ప్రజా దనాన్ని సోనియాకు దోచి పెడుతున్నాడని " ఆరోపించాడు.
ఆయనగారిని దిల్లికి పిలిపించి ఆయనతో సయోధ్య కుదుర్చుకోవడం అంటే అతని ఆరోపణలను అంగీకరించినట్టేనా? ఆయన గారికీ కొంత వాటా కల్పించనున్నట్టా ? అని నేను ఏనాడో ప్రశ్నించాను.
మరి ఈ సాక్షి టివి చూస్తేనా మరీ చిర్రెత్తిస్తుంది. అస్తమానం వై.ఎస్. అస్తమానం జగన్ పురాణం అందుకుంటున్నారు. ( అందుకే నేను పార్టి కోసం కొత్త చానల్ పెట్టుకోవాలని సలహా ఇచ్చాను) - ప్రేక్షకుడ్ని సాక్షి చానల్ నుండి తరిమి తరిమి కొట్టేలా ఉన్నాయి ఆ చానల్ ప్రసారం చేసే కార్యక్రమాలు. తొలూత ప్రేక్షకులను చానల్ మార్చి వేయకుండ చూసుకుని ఆతరువాత చే పట్టాలి ప్రసారమన్న చిన్న లాజిక్ సైతం వీరికి బోధ పడటం లేదు
రాష్ఠ్ర్రంలో ఎన్నో సమస్యలున్నవి. జగన్ చెప్పినట్టుగా 45 రోజుల అనంతరమే పార్టి అంకురార్పణ జరగనీ . అందాక చేతులు ముడుచుకుని కూర్చోక ప్రజా సమస్యల పట్ల ప్రత్యక్ష పోరాటానికి పూనుకోవాలి.
సాక్షి పత్రికలో వై.ఎస్. పథకాలకు రోశయ్య ప్రభుత్వం ఎన్ని విదాలుగా గండి కొట్టిందని తాటికాయంత అక్షరాలతో వ్రాసారు కదా. అప్పుడైతే పార్టి,క్రమ శిక్షణ వంటివి అడ్డొచ్చాయి. ఇప్పుడవేవి లేవుగా.
వెంటనే ప్రభుత్వానికి పెదిహేను రోజుల గడువుతో ఒక అల్టిమేటమ్ జారి చేసి ( వై.ఎస్. పథకాలకు కొట్టిన గండీలను పూడ్చడానికి) జగన్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవాలి.
ఈ కోణం, ఈ ముక్క తట్టడానికి జగన్ ముఖ్య అనుచరులు అంబటి రాంబాబుగారికి
ఇంత కాలం పట్టింది. ఇలా అయితే గోవిందా గోవిందా..
తెలుగు వారిని విభజించి పాలింప చూస్తున్నారని చిరంజీవిని, అన్యాయానికి గురైన మహా నేతల వారసుల్లో జూ.ఎన్.టి.ఆర్ ఒకరని జూ.ఎన్.టి.ఆర్ని కలుపుకుని జగన్ వెళ్ళాలి. ప్రధాన ప్రతిపక్షమైన తె.దే.పాను ఇరుకున పెట్టడానికి, ప్రజారాజ్యాన్ని న్యూట్రల్ చెయ్యడానికి ఈ ఎత్తు పనికొస్తుంది.
జగన్! ప్రధాన సమస్యల్లో అటో ఇటో ఎటో తేల్చుకో.. చంద్రబాబులా నాన్చుతో ఉంటే జగన్ అండ్ కో దివాళా తీయడం ఖాయం.
jagan, aaripoye deepaaniki velugekkuva...
ReplyDelete