10.మకరం:
రాశి చక్రంలో వృత్తి వ్యాపారాలను సూచించే 10 వ రాశియందు పుట్టిన మకర రాసి మితృలారా !
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన నిష్కామ్య కర్మం మీకు ఇట్టే సరిపోతుంది. మీకు 3/12 స్థానాధిపతి అయిన గురువు 12న స్వక్షేత్రం పొందాడు (2010,డిసెంబరు ఆరున) గురు మూడున ఉంటే భయం ,బెంగ కలగాలి.కాని ఇతనికి వ్యయాధిపత్యం ఉండటంతో సోదర హాని, అతి సాహసంతో చిక్కులు, కర్ణరోగాలు సంభవం. సోదరుల వలన చిక్కులో పడే అవకాశం కూడ ఉంది. వృధా ప్రయాణాలు చేస్తారు. మీ సాహస యత్నాలు ఇతరులకు లబ్ది చేకూర్చవచ్చు కాని మీకు కాదు. గురు భలం లేనందున ప్రతి పనికి అతిగా శ్రమించి,అతిగా వెచ్చించవలసి ఉంటుంది
11.కుంభం:
రాశి చక్రంలో 11 వ రాశియై,లాభాన్ని,అన్నయ్య,అక్కయ్యలను సూచించే కుంభరాశియందు జన్మించిన మితృలారా ! మీ జీవితం పై మీ అన్నయ్య,అక్కయ్యల ప్రభావం మెండు. ప్రతి విషయంలో నాకేంటి లాభమని ఆలోచించే లాభాపేక్షతో కార్యోన్ముఖులు కావడం మీ నైజం. అయితే లాభ నష్ఠాలు దైవాదీనాలు కదా ! అసలే అష్ఠమ శని ప్రభావంతో కొట్టు మిట్టాడుతున్న మీకు దన,వాక్కు,కుటుంభ నేత్ర స్థానమగు రెండున గురు స్వక్షేత్రం పొందటం కొంత ఊరటను కలిగిస్తుంది. ఆదాయం పెరుగును. మాటకు విలువ కలుగును. కుటుంభంలో ఐక్యత పెరుగును. అయితే గురువుకు లాభాధిపత్యం ఉన్నందున అతి వాగుడు వలన ఇబ్బంది కలుగ వచ్చును. గురు ప్రభావానికి కాస్త తగ్గు ముఖం పట్టిన శని ప్రభావం అదను చూసి దెబ్బ కొట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగానే వ్యవహరించటం మేలు.
12.మీనం:
రాశి చక్రంలో ఖర్చులు,నిద్ర,, రతి (సెక్స్)లను సూచించే పన్నెండవ రాశియగు మీన రాశియందు పుట్టిన మితృలారా !
రాశి చక్రంలో కైవల్యాన్ని సూచించే మీన రాశిలో జన్మించిన మీకు తొలూత ప్రాపంచిక విషయల్లో ఎనలేని ఆసక్తి కలిగి ఉన్నప్పటికి క్రమేణా ఆథ్యాత్మిక జీవితం వైపుగా మళ్ళి పోతారు. సప్తమ శని కారణంగా సహపాఠులవల పక్క ద్రోవ పడుతున్న మీకు మీకు లగ్నాధిపతి స్వక్షేత్రాన రావడం కొంత మేలే. రియలైజేషన్,సర్దుపాటుకు అవకాశం గలదు. గురు తన ఐదో చూపుతో బుద్ది కుశలతను, పేరు ప్రఖ్యాతలను,అదృష్ఠాన్ని, ఏడో చూపుతో ప్రేమ,పెళ్ళి ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వొచ్చు ( ఇందుకు మీ సహపాఠులే ఆటంకం సృష్ఠించే అవకాశం లేక పోలేదు). తొమ్మిదవ చూపుగా తండ్రి,ఆయన తరపు భంధువులు,తండ్రి ఆస్తి వగైరాల్లోను అనుకూలత కలుగును. గురుడికి జీవనాధిపత్యం కూడ ఉంది కావున వృత్తి వ్యాపారాల్ల్లో ఆసక్తి పెరుగును. అయినా ఉదర సంభంధ రుగ్మతలూ కలుగ వచ్చును టేక్ కేర్
No comments:
Post a Comment