Friday, December 17, 2010

మీ రాశి - మీ క్యేరెక్టర్ - టూ ఇన్ వన్

కుంభం:
వీరి జీవితంలో ఎంతటి గడ్డు స్థితి వచ్చినా ఏదైనా సరే బొత్తిగా ఖాళి కాదు. అది డబ్బుకావచ్చు, పలుకుబడి కావచ్చు ప్రేమ కావచ్చు, లోపలి మనుషులు .రహస్యాలుంటవి. ఏది చేసినా "నాకేంటి?" అని ప్రశ్నించుకుని (లాభమండి బాబు) కాని పనిలో దిగరు. యవ్వనంలో ఈ నేచర్ కనబడక పోవచ్చేమో క్రమేణా స్వార్థపరులుగా తయారవుతారు. వీరి పనితీరులో కాస్త నిదానం ఉండవచ్చేమోగాని డాబు,డబ్బాల పై ఆసక్తి ఉండదు. ముఖ్యంగా నాలవల్టీస్, ఫేన్సి, కాస్మెటిక్స్ పై నిరాసక్తత ఉండును. జీవితాంతం యూనిఫార్మ్/జిడ్డు/ మురికి/కంపు కనీశం ఆ వాతావరణం వీరిని వీడదు. మీ జీవితంలో వృద్ద సోదర,సోదరిమణుల ప్రభావం అత్యధికంగా ఉండొచ్చ్యు. ఎవడు ఏమై పోతే నాకేంటి నా పని నాది,నా కూలి నాకు గిట్టిందా అని ఉన్నప్పటికి ఏదైన సందర్భంలో ఓనరు/ఉన్నతాధికారులతో డీ అంటే  డీ అని దిగే అవకాశం కూడ లేక పోలేదు.

మీనం:
ఇది మీ చివరి జన్మ అని కూడ కొందరు చెబుతారు. మీకు ఇతరులకి బేసికల్ గా ఉండే వ్యత్యాసం ఇది.ఇతరులు అన్ని కావాలని ఉవ్విళ్ళూరి అన్నీ పొందే ప్రయత్నంలో  ఖర్మ ఖాతాలో ఖర్మను సైతం ఎక్కువ చేసుకుంటూ పోతారు (దీని ఫలితంగా తదుపరి జన్మల్లో కష్థ నష్ఠాలకు గురై ఈ ఖర్మలను పోగొట్టుకుంటారు)
కాని మీకు ఇదె చివరి జన్మ కాబట్టి మీరు అంటి ముట్టనట్టే ఉంటారు. పతి దానిలోను కొద్దిగానైనా కష్ఠ నష్ఠాలకు గురవుతుంటారు. కాని జీవితపు మొదటి గట్టంలో రివర్స్ ఎఫెక్ట్ కారణంగా అన్నీ తమకే కావాలని ఉవ్విళ్ళూరే అవకాశం కూడ ఉంది.
ప్రారంభ దశలో భాగా సంపాదించినప్పటికి ఆ తరువాత అంత:కరణ ప్రేరణతో ఆదాయం చేతికందే మునుపే ఖర్చులు ప్లాన్ చెయ్యడం, అప్పులు చేసైనా ఖర్చులు చెయ్యడం మొదలవుతుంది. సుదూర ప్రయాణాల్లో ఆసక్తి ఉంటుంది. అసలు గమ్యం తెలీని ప్రయాణాల పై కూడ ఆసక్త్ గలదు. వీరికి పాదాలు, నడకలో కొంత తేడా కనిపించే అవకాశం కూడ ఉంది.ఎందులోను  పెద్దగా కమిట్ కారు. జారిపోతుంటారు. అందుకేనేమో ఇతరులు మిమ్మల్ని  చిక్కడు దొరకుడు అంటుండవచ్చు.

No comments:

Post a Comment