కన్యా :
కన్యా రాశివారి గురించి చెప్పాలంటే మూడే ముక్కలు శతృ,రోగం,రుణం, ఇవి ఈ రాశి వారిని కాదండోయి వీరి చుట్టూ ఉన్నవారిని సైతం బాధిస్తాయి.ఇందుకు చక్కని పరిహారం ఉంది, కన్యా లగ్నం లో జన్మించిన వారే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడ క్రింది పరిహారాలు చేసుకుంటే మంచిది. లేకుంటే చుట్టూ ఉన్నవారితో బాటు జాతకుడు సైతం రోగిష్ఠిగానో, అప్పుల అప్పారావుగానో, కోర్టు కేసులంటూ తిరుగు వాడుగనో తయరవుతారు.
పరిహారం:
ఏ మంచి పని మొదలు పెట్టినా ఒక్క రూపాయన్న అప్పు చేసిన సొమ్ముతోనే ప్రారంభించాలి. గ్రీన్ కలర్ దుస్తులు,వస్తువులు ఎక్కువగా వాడాలి. తమ ఆఫీసు రూమ్/ పడక గదిని ఆసుపత్రి/కోర్టు /బ్యాంకును తలపించే విదంగా అలంకరించుకోవాలి
ఉ. గ్రీన్ కలర్ స్క్ర్రీన్స్, బెడ్ కవర్,పిల్లో కవర్ వాడండి, మీకు అవసరం లేక పోయినా ఖాళి ప్రొనోట్స్,రెవిన్యూ స్టాంపులు, స్తాంపు పేపర్లు నిల్వ ఉంచండి, చక్క సుత్తి, న్యాయ దేవత బొమ్మ వాడండి. మీ అభిమాన నాయకుల్లో/ కథానాయకుల్లో ఎవరన్నా లాయర్/ డాక్టర్ ఉంటే వారు సతరు డ్రెస్ లో ఉన్న ఫోటో మీ కళ్ళ ముందు పెట్టుకొండి. ఒక ఐదు వారాలు ఏదైన విష్ణు ఆలయానికి వెళ్ళి తులశి మాల వేసి దండం పెట్టుకుని రండి (మరెప్పుడన్నా మీకు శతృ,రోగ,రుణ బాధలు కల్గినా ఈ పని చెయ్యండి)
తుల:
పుట్టిన ఊళ్ళో ఉన్నంత వరకు కుండలో దీపం. దానిని విడిచాక కొండ మీద దీపం. మీ ఆర్థిక పురోగతిని చూస్తే రొటేషన్ చక్రవర్తి అని చెప్పొచ్చు. మీ జీవితం పై ఫ్రెండ్,లవర్, భాగస్వాముల ప్రభావం అదికంగా ఉండొచ్చు. మంచైనా చెడ్డైనా వారి వల్లే జరిగే అవకాశం ఉంది.
సుఖాన్వేషిగా వృషభరాశివారికి ఏమాత్రం తీసిపోరు. అయితే వృషభరాశివారు అటు ఇటుగా సర్దుకు పోయి సుఖాన్ని పొందితే మీరు పోట్లాడైనా సరే సుఖాన్ని పొందుతారు. వారు కాస్త స్లో , మీరు కస్త ఫాస్ట్ . వారు డబ్బును ఫణంగా పెట్టడానికి సైతం వెనుకాడుతురు. మీరు ఎదగడం కోసం జీవితాన్నే ఫణంగా పెట్టే దమ్ము గలవారు.మీ పెళ్ళి కూడ శతృ కుటుంభ జనిత అమ్మాయి/అబ్బాయితోనే అవుతుంది. కొత్త సంభంధమైతే క్రమేణా అత్తా మామలకు దూరమవుతారు. మీకు పొదుపు చాలా అవసరం. ఆస్తుల పై పెట్టుబడి పెట్టి ఏ పరిస్థితిలోను వాటి జోలికి పోకుండా ఉండాలి. లేకుంటే మీ వింత వైఖరి వలన అయినవారే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్తా!
వృశ్చికం:
వీరు ఎంత ఓర్పుగా ఉండ దలచినా పరిస్థితి అందుకు సహకరించదు. వీరికే తెలియకుండా వీరి మాటలు ఎదుటివారికి కాసింత బాధ కల్గించి వేస్తాయి. వీరికి ఊపిరితిత్తులు సంభంధ సమస్యలు రావచ్చును ( పొగ,సెగ,మానసిక వత్తిడి కారణంగా) .వీరికి యుద్దమంటే ఎంతో మక్కువ. చాలాసార్లు వీరే సమర శంఖం పూరిస్తారు. ఒక శతృవు ఉన్నంత కాలం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. లేకుంటే బోర్ అనిపిస్తుంది. వీరికి బాల్యంలో అమ్మోరు, ట్యూమర్స్ వంటివి వచ్చుండొచ్చు. లేదా ఎత్తైన చోటునుండి క్రింద పడిపోవడం,కొమ్మున్న జంతువులు, కరెంట్,అగ్ని సంభంధంగా నష్ఠం జరిగి ఉండవచ్చు. కొమ్మున్న జంతువుల వలన ఆర్థిక నష్ఠం కూడ కలిగి ఉండవచ్చు వీరిలో శక్తి జెనరేట్ అవుతూ ఉంటుంది. దానిని సక్రమంగా వినియోగించుకోకుంటే మానసిక వత్తిడి,షుగర్, వంటివి రావచ్చు. ఫిసికల్ ఎక్సర్ సైజు అనివార్యం. వీరికి ప్రజా జీవితం అంతగా అచ్చురాదు.
దనస్సు:
ఒకింతవరకు దూర దృష్థి ,పొదుపు,భవిష్యత్ గురించిన ఆలోచన గలవారే. కాని డబ్బులిచ్చి మోస పోయినవారు, ప్రైవేటు చిట్ ఫండ్స్, చిన్నా చితకా బ్యాంకుల్లో పొదుపు చేసి మోస పోయినవారు, ఆస్తి వివాదాల్లో తలమునకలయ్యేవారొలో దనుర్ రాశి వారు ఎక్కువగా ఉంటారు. మగవాడన్నాక సంపాదనార్థం దూరదేశాలకు సైతం వెళ్ళాల్సిందేననే ఆలోచన గలవారు. పుణ్యక్షేత్ర యానం, తీర్థయాత్రలకు ప్రాధన్య ఇస్తారు. మీరు భవిష్యత్తులో పది మందికి మంచి చెడ్డా చెప్పే గురు స్థానంలో ఉండాల్సినవారు.కాని బాల్యం,యవ్వనంలో "అటు ఇటుగా" ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్య వయస్సులో సైతం డబుల్ యాక్ట్ ఇస్తుంటారు ( చదివేది రామాయణం - దూరేది ....గుడిసెలు అన్న చందంగా) .ఒక వ్యవహారం క్లీష్థంగా తయారవ్వాలంటే వీరిని రంగంలో దింపితే సరి. తమ మాటలతో పరిష్కారమవుతున్న వ్యవహారాన్ని మొదటికి తెస్తారు. వీరి జీవితంలో తండ్రి ,తండ్రి ఆస్తి, ఆయన తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తీర్థ యాత్రలు అధిక ప్రాధన్యత కలిగి ఉంటాయి. దూర దేశాలతో సంభంధాలు కలిగి ఉంటారు. ఈ ఏడాది ఆదాయాన్ని ఈ ఏడాదే అనుభవించే యోగం తక్కువనే చెప్పాలి. దానిని డంప్ చేసి దాని పై పెద్ద పోరాటం చేసి తదుపరి ఏడాది అనుభవించేలా చేసుకుంటారు.
మకరం:
మీ లగ్నం మకరం .ఇది రాశి చక్రంలో పదో రాశి కాబట్టి మీరు ఒర్కహాలిక్ గా ఉంటారు ( మీ లగ్నాధిపతి శని అయినందున కాస్త ఆలశ్యం తామసం ఉన్నప్పటికి మీరు ఒర్క హాలిక్. లగ్నాధిపతితో చంద్రుడు చేరాడు కాబట్టి మీ చురుకుదనంలో నిలకడ లేని తనం ఉండొచ్చు. ముఖ్యంగా అమావాశ్య తరువాత వచ్చే పద్నాలుగు రోజుల్లో కాస్త సోమరిగా ,ఊహల్లో మునిగి తేలుతూ ఉండొచ్చేమో గాని పౌర్ణమి తరువాత మాత్రం కర్మయోగి లెవల్లో పనుల మీద దృష్ఠి పెడతారు)
మీరు చేసే పని ఏది? దాని విలువెంత? అందుకుగాను మీకు ముట్టేదెంత? అసలు దాని ప్రతిఫలం ఎవరికి చేరుతుందని కూడ ఆలోచించరంటే చూసుకొండి.
No comments:
Post a Comment