ఈ రోజుల్లో ఏ సంభాష్ణలో ఏ స్కామ్ దాగుందో చెప్పలేం. కాబట్టి ఈ రోజు నాకు ఒక సాహితీ మితృనికి మద్య జరిగిన సంభాష్ణను జాగరూకతో గమనించాలని మనవి.
"హలో మురుగా.. "
"చెప్పు శీను!"
"ఏం ఎలా ఉన్నావు? నీ పత్రిక ఎలా ఉంది? బ్లాగులు ఎలా పోతున్నాయి?"
"భాగానే ఉన్నా. పత్రికదేముంది. పతిరక తరపున ఒక మల్టికలర్ క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నా బ్యేక్ అండ్ బ్యేక్ వస్తుంది. ఒక పక్క ఎమో కమర్షియల్స్, మరో పక్కేమో సి.కె బాబు అతని అభిమానులు"
"ఇదేం మురుగా ! ఎన్.టి.ఆర్ పోయాక కూడ తె.దేశానికి చేసేవాడివి..కదా?"
"నెను ప్రజాస్వామ్యవాదిని.ప్రజలు ఎవరిని మెచ్చుకుంటే నేను వారిని మెచ్చుకుంటా. ఎన్.టి.ఆర్ కు చేసిన ద్రోహాన్ని సైతం పక్కన పెట్టి 1999 ఎన్నికల్లో తె.దే.పా కే చేసాను. ఏం లాభం రాజకీయాల్లో హత్యలుండవు.అన్నీ ఆత్మ హత్యలే అన్నట్టుగా నిరూపించాడు బాబు"
"బాబు కథ సరే సి.కె.బాబు కథేమీ?"
"2004 ఎన్నికల్లో తె.దే.పాను ఓడించండని మాత్రమే కరపత్రాలతో ప్రచారం చేసాను. కాని వై.ఎస్. జలయజ్నం, రెండు రూపాయలకే కిలో భియ్యం ఎట్సెట్రా ఎట్సెట్రా వల్ల 2009 ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాంగ్రెస్ ను గెలిపించండని ప్రచారం చేసాను"
"అది కాదుయ్యా. సి.కె.బాబు?"
"శీను! సి.కె.బాబు గురించి నువ్వేమైనా విని ఉంటే అవన్ని పత్రికల సృష్ఠే. అభూత కల్పనలే.. ఆయనది ఒకటే పొరభాటు. అదేమంటే ప్రెస్ రిలేషన్స్ పెద్దగా మెయింటెయ్న్ చెయ్యడు - అతని వైరి వర్గాలు పక్కాగా ఉంటారు. కోడి కూరలు,కుక్క కూరలు, సంక్రాంతికి బట్టలు,సెల్ ఫోన్స్, రీచార్జీలు"
"ఎవరికి?"
"ఇంకెవరికి విలేకరులకే"
"సరే సి.కె.బాబు కడిగిన ముత్యమంటావా?"
"అలా అని నేను చెప్పను. కాని మిగిలిన అందరు నాయకులకంటే ఇతను సెంట్ పెర్సంట్ బెటర్"
"సర్లే.. ప్రచారం చేసావు ఓకే.. ఈ క్యాలండరు పాడు ఎందుకు?"
"మనిషిని మనిషి నమ్మలేని రోజులొచ్చేసాయి.కాని ఒక్క మనిషి మీద ఇంత మంది ఇంత నమ్మకం ఉంచారంటే ఆ నమ్మకాన్ని ఈ లోకానికి చాటాలిగా? "
"ఇంత మందికి అతను ఏం చేసాడబ్బా?"
"వద్దులే శీను.. నేను చెప్పినా బ్లాగ్లోకం నమ్మదు. పైగా నవ్వి పోతుంది. నేను 2009 ఏప్రల్ 7 నుండి 21 వ తేది వరకు అతని కాన్వాయ్ తోనే ప్రచార వాహణంలో ప్రయాణించాను. ఉదయం ఆరు నుండి రాత్రి పది వరకు అతనిని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఆ 14 రోజులు నాకు కలిగిన అనుభవాలు చెబితే చంచా, చక్క భజన అంటూ ఆడి పోసుకుంటారేమో ..ఇంకో సందర్భంలో వివరిస్తాలే"
"మురుగా మురుగా.. నువ్వు నేను మాట్లాడుతున్నాం ఇందులో బ్లాగ్లోకం ఎక్కడొచ్చింది?"
"మన ఈ సంభాష్ణను బ్లాగ్లో పెడ్తా?"
"వద్దయ్యా.. "
"నాది మహాత్ముడి స్టైల్. నా జీవితమే ఒక తెరచిన పుస్తకంగా ఉండాలన్నది నా కోరిక. భహిరంగంగా చెయ్యలేని పని రహస్యంగా కూడ చెయ్యకూడదు"
"సర్లే నీ ఖర్మ గాని .. నువ్వేమో వై.ఎస్. అభిమానివి - జగన్ పట్ల నీ గుండె కొట్టుకుంటుంది. మరి లోకల్ గా చూస్తే సి.కె.బాబు స్టాండ్ ఎలా ఉంది?"
"ఎలా ఉన్నా జగనే చెప్పేసాడుగా .. ఈ ప్రభుత్వం మరో మూడున్నరేళ్ళు కొనసాగాలని. 2014 ఎన్నికల్లో కదా జగనా కాంగ్రెసా గొడవ?"
"మద్యంతర ఎన్నికలొస్తే?"
" గత ఎన్నికల్లో ఏదో వై.ఎస్. పుణ్యమా అంటూ టిక్కెట్ వచ్చింది గాని 2014 ఎన్నికల్లోనైతే గోవిందా.. జగన్ కేమో గెలిచే అభ్యర్ధి కావాలి. అది ఒక్క సి.కెనేనని అందరికి తెలుసు చూద్దాం"
"నీ బ్లాగ్ చదివా. టామి టైగరుకు చెప్పిన ఆథ్మ కథ.. భాగానే ఉంది గాని చిరు,జగన్ కలుస్తారంటావా?"
"జూనియర్ ఎన్.టి.ఆర్ కూడ కలవాలని చెబుతున్నా"
"ఏందో అంతా నీ పిచ్చి"
" నా కాన్సెప్ట్ ఒక్కటే ఈ రాష్ఠ్ర్రాన్ని పరిపాలించినవారిలో సామాన్యుడి కోసం ఆలోచించి సామాన్యునికి దగ్గరైన వారు ఇద్దరే ఒకటి ఎన్.టి.ఆర్ రెండు వై.ఎస్.ఆర్ ..వీరి వారసులు కలవాలి"
"చిరంజీవి ఎవరికి వారసుడు?"
"ఏం రజనికాంత్ లాగా ఊరించి ఊరించి పబ్బం కడుక్కోక ఎన్.టి.ఆర్ భాటలో ధైర్యం చేసి రాజకీయంలో దూకిన చిరంజీవి ఎన్.టి.ఆర్ వారసుడు కాదా?"
"ఏమిటో నీ లాజిక్కులు.. ప్రజాస్వామ్యవాదినన్నావు.. మళ్ళీ వారసత్వపు రాజకీయాలకు వత్తాసు పలుకుతావు"
"జగన్ గాని,జూ.ఎన్.టి.ఆర్ గాని,జగన్ గాని కొత్తగా ఏదో పొడుస్తారని కాదు నా ఉద్దేశం. వీరు పగ్గాలు చేపడితే ఆ ప్రభుత్వం ఎన్.టి.ఆర్, వై.ఎస్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటాయని నా ఆశ "
"సర్లే.. నీ బ్లాగులో ఒక పరమ చెత్త పోస్టు వేసేందుకు నేనూ ఒక కారణమయ్యాను గుడ్ నైట్"
No comments:
Post a Comment