అన్నగారు బతికుండి ఆయనగారి సినిమాకంటూ నేనో కథ చెప్పే అవకాశం వస్తే!
అన్నాగారంటే ఒక్క ఎన్.టి.రామారావు గారే. ఆయన బతికుండి ఆయనకు సినిమాలో నటించే ఓపికుండి ఆయనకు నేనో కథ చెప్పే అవకాశం వస్తే ఎలా ఉండేదో ఊహించుకుని ఈ టపా వ్రాస్తున్నా
(ఇదెలా సాధ్యమని మీరు అడగవచ్చు. చెబుతా! చంద్రబాబు వెన్నుపోటు అనంతరం ఎన్.టి.ఆర్ చనిపోలేదనుకొండి. అతను చంద్ర బాబుకు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రచార కార్యక్రమం విజయవంతమైయుండేది. ఆ తొమ్మిది సం.లు తె.దే.పా పాలన సాగేది. ఆ 9 సం.ల్లో ఏదో రోజు తిక్క పుట్టి ఒక సినిమా చెయ్యాలనుకొని - అదీ లేటెస్ట్ ట్రెండులో- నా గొప్పతనం ఎవరి నోటో విని నన్ను పిలిపించేవాడే)
నేను: నమస్తే అన్నగారూ..
ఎన్.టి.ఆర్:రండి బ్రదర్ ! కూర్చోండి. శివాజి గణేశన్ "ముదల్ మరియాదై"చేసాడుకదా.. అలాంటి కథాంశంతో మేకప్ లేకుండా మేము ఒక సినిమా చెయ్యాలనుకున్నాం.
నేను: వావ్ ! సూపర్ సార్ ! ఇప్పుడే చెబుతా..
ఎన్.టి.ఆర్: హూం మొదలు పెట్టండి
నేను: ఓపనింగ్ సీన్ ఏమంటే మీరు మీ ఒరిజినల్ హేర్ స్టైల్ , ఒరిజినల్ ఫేస్ జస్ట్ ఒక్క మీసం మాత్రం అదనంగా ఉంటుంది. ఈ గెట్ అప్లో మీరు నార్త్ ఇండియా టూర్ భయలు దేరేందుకు పెట్టా బేడా సర్దుతుంటారు
ఎన్.టి.ఆర్:ఇదేంటి బ్రదర్ జీవితంలో అంతా పూర్తయ్యాకే కదా తీర్థ యాత్రకు భయలు దేరుతారు? మరి మొదటి సీన్లోనే పెట్టా బేడా సర్దడమే..
నేను: నాకు పావు గంట టైమ్ ఇవ్వండి సార్ ..కథ పుంజుకుంటుంది
ఎన్.టి.ఆర్: ఓకే ఓకే ..కానీయండి
నేను: ఈ సినిమాలో మీ క్యేరెక్టరు ఏమంటే .. మీవయస్సుకి,తరానికి పొంతనలేని కుర్రతనం ఉట్టిపడుతుంటుంది. కాలనిలోని కుర్రాళ్ళంతా మీ శిష్యులే. వారి క్రికెట్ టీమ్లో మీరూ సభ్యులు. వారు ఎదో న్యూసెన్స్ చేసి పోలీసోళ్ళు బుక్ చేస్తే అందులో మీరూ ఒక నిందితులు
ఎన్.టి.ఆర్: ఇదేదో వెరైటిగా ఉందే .. చెప్పండి చూద్దాం
నేను:అంతే కాదు సార్ .. మీరంటే ఆడోళ్ళకి చచ్చేంత ఇష్ఠం. పదాహారేళ్ళ అమ్మాయినుండి - నలబై ఏళ్ళ ఆంటి వరకు అందరూ మీతో క్లోసుగా ఉంటారు. మీ అబ్బాయికి ఇది అలవాటే కాబట్టి నో ప్రోబ్లం. కాని కోడలు ?
ఎన్.టి.ఆర్: ఐ సీ.. అంటే నన్ను గెంటి వేస్తారా?
నేను: అదెలా జరుగుతుంది సార్. మంత్రి మండలిని సైతం మీరు భతరఫ్ చెయ్యిస్తారుగాని
ఎన్.టి.ఆర్: హ హా... చెప్పండి
నేను: మీరిలా కాలని కుర్రాళ్ళకు ప్రేమా ఇతరత్రా విషయాల్లో సహకరిస్తూ వారిని దారిన పెడుతూ వచ్చే సమయంలో ప్రేమికులిద్దరు ఆత్మ హత్య చేసుకుని చని పోతారు. అంటే ఆ ప్రేమ జంటలోని అబ్బాయికి అమ్మాయి మీతో చనువుగా ఉండటం పట్ల అనుమానం
మీరు వాత్సాయన మహర్షిలా లెక్చర్లు దంచుతుంటారు. ( మన సినిమాలో మీరిందాక ఎయ్యని గెట్టప్పుతో ఒక పాట కూడ పెట్టొచ్చు సార్ అదే వాత్సాయనుడు) అబ్బాయికేమో ప్రీ మెచ్యూర్డ్ ఎజాగులేషన్ ఉంటుంది..
ఎన్.టి.ఆర్: ఇదేంది బ్రదర్! మరీ కాశివిశ్వనాథ్ కథలా పోతూంది.
నేను: డోంట్ వొర్రి సార్! ఇది ఒక చిన్న ట్రాక్ రెండు మూడు మ్యేండేజ్ షాట్సుతో పూర్తై పోయేది.
ఎన్.టి.ఆర్: ఓకే ఓకె.. వారిద్దరు ఆత్మహత్య చేసుకుంటారు .. అందరు నన్నాడి పోసుకుంటారు నేను విరక్తితో నార్త్ ఇండియా టూర్ అంతేనా బ్రదర్
నేను: అమ్మమ్మా.. ఇంత సింపుల్ ట్విస్ట్ ఉంటే మరీ టివి సీరియల్లా తయారవుతుంది అన్నగారూ .. అసలు కథ ఏమంటే వాళ్ళది ఆత్మ హత్యలు కావు. హత్యలు. మీ సలహా మెరకు ఇద్దరు మనస్సు విప్పి మాట్లాడుకుని సర్దుకుంటారు. కాని వారు కాపురమున్న అదే కాంపవుండ్లో విదేశి విథ్యార్దుల ముసుగులో తీవ్రవాదులు ఉంటారు. అందరు కుర్రాళ్ళు మీతో కలిసి మెలిసి ఉన్నా వారు మాత్రం మీతో కలవరు. వీరితో గొడవలు కారణంగానే పోలీస్ స్టేషనుకు సైతం వెళ్ళాల్సి వస్తుంది. వారి రహస్య కార్య కలాపాలు అకస్మాత్తుగా
ఈ జంట కంట పడుతుంది. కాబట్టి తీవ్రవాదులు వాళ్ళని ఫినిష్ చేసి ఆత్మ హత్యలా చిత్రీకరిస్తారు. మీరు అరెస్ట్ కావడం -బెయిల్ మీద భయిటకు రావడం కాలని కుర్రాళ్ళ సాయంతో మిస్టరి చేధించడం జరుగుతాయి
ఎన్.టి.ఆర్: ప్రోబ్లమ్ సాల్వ్ అయిపోతుందికదా? మళ్ళీ నార్త్ ఇండియా టూర్ ఎందుకని?
నేను: చెబుతా.. మీరు మైక్రో లెవల్లో యూత్ తో ఇంటరాక్ట్ అవ్వడం - వారి సాయంతో తీవ్రవాదుల గుట్టు రట్టు చెయ్యడం చూసి మన కేంద్ర నిఘా విభాగం మీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి మిమ్మల్ని దిల్లీకి పిలిపిస్తుంది. కాని ఈ విషయం ప్రపంచానికి తెలియ కూడదుగా.. అందుకే నార్త్ ఇండియా టూర్ ముసుగు
ఎన్.టి.ఆర్: ఇదేదో భాగానే ఉందిగాని పతాక సన్నివేశాలన్ని అయిపోయినట్టుందే.. కథను ఎలా ముందుకు నడపడం?
నేను: మీరున్నారుకదా సార్.. మీ చెరిస్మా లాక్కెళ్తుంది. చెబుతా.. చెబుతా..
(సశేషం తరువాతి టపాలో)
No comments:
Post a Comment