రైతా? విథ్యార్థియా? - మీమాంశలో రాజకీయ పార్టీలు
ఒక రైల్వే స్టేషన్ .అందరు దేశ ప్రధానికోసం వెయిట్ చేస్తున్నారు. ఒకతను కుర్దా , బుష్కోటుతో ,నెత్తి మీద ఖద్దర్ టోపీతో వచ్చాడు.స్టేషన్ మాస్టర్ అతన్ని విసుక్కున్నాడు. అప్పుడతను చెప్పాడు " మీరు ఎవరికోసం వేచి ఉన్నారో ఆ ప్రధానిని నేనే.
అతనెవరో కాదు. లాల్ బహదూర్ శాస్త్ర్రి. అతనప్పట్లో కేంద్ర రైల్వే మంత్రి. అరియలూరులో ఒక రైలు ప్రమాదం జరిగింది. వెంటనే తన పదవికి రాజీనామా చేసి పారేసాడు. అతనే లాల్ బహదూర్ శాస్త్ర్రి. అతను ఒక నినాదాన్ని జాతికిచ్చాడు. అది జై జవాన్! జై కిసాన్ !! ఏ నాయకుడూ జై విథ్యార్థి అనలేదు.
( నేటి తరం నాయకులు ఏదో విదంగా తమ అజెండా ఫలప్రదమైతే చాలని విథ్యార్దులను ఉసికొలిపి వారి ప్రాణాలను హరిస్తున్నది వేరే సంగతి - నేను చెప్పడం నాటి తరం నాయకుల గురించి)
అసలు విథ్యార్ది అనే వాడు ఒక అన్ ప్రొడక్టివ్ కన్సియూమర్. అంటే అనుత్పాదక వినియోగదారుడు. అతను చదువు మద్యలోనే ప్రేమ కోసం ఆత్మ హత్య చేసుకుంటాడో.. ఫెయిల్ అవుతాడో ర్యాడికల్ అవుతాడో నక్సలైట్ అవుతాడో క్రిమినల్ అవుతాడో ఎవరికీ తెలియదు.
అయినా అటు ప్రభుత్వం ఎన్నో వెసలు బాటు కల్గిస్తూంది. స్కాలర్షిప్పులు,హాస్టళ్ళు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్లు , పుస్తకాల పై సబ్సిడీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇటు తల్లి తండ్రులు తమ రెక్కల కష్ఠాన్ని కేవలం లాటరి టిక్కెట్ వంటి విద్యార్థి మీద వెచ్చిస్తారు. తమ అవసరాలను సైతం త్యజించి, తమ సుఖాలను కాదని తమ పిల్లల పై అంటే విథ్యార్దుల పై ఖర్చు పెడుతుంటారు
సతరు విథ్యార్ది పెరిగి పెద్దవాడై డిగ్రి పొందొచ్చే ఏమో గాని ఉధ్యోగాల మాట గగనమే. పొరభాటుగా ఉధ్యోగాలొచ్చినా ప్రేమ పేరుతోనో , పెళ్ళి పేరుతోనో ఎవరో ముందు వెనుక తెలియని ఆడదాని చంక నాకుతూ తల్లి తండ్రులను వృద్దాశ్రమం పాలో, రోడ్ల పాలో చెయ్యడని గ్యారంటీ సైతం లేదు.
అయినా ఇన్ని రిస్కులు భరించి తల్లి తండ్రులు పిల్లలను చదివిస్తున్నారు. ఈ చదువులు అతనిని సంస్కరించి ఒక మంచి పౌరునిగా మారుస్తుందన్న గ్యారంటీ అన్నా ఉందా ? లేదు. అయినా ఎవరి పిచ్చి వారికానందం చందాన తల్లి తండ్రి చదివిస్తున్నారు. ఓట్లకోసమో, అధికారం కోసమో ఏదో కారణంతో ప్రభుత్వాలు ఎన్నో వెసలు బాటు కల్పిస్తున్నాయి.
ఇక విథ్యార్ది డ్యూటి ఏమి? చదువుకోవడం. ఉధ్యమాల్లో పాల్గొనడమో? భలవంతపు వసూళ్ళకు పాల్పడటమో? బస్సులను తనను తగలపెట్తుకోవడమో కాదు. కాని అన్నీ చేసేరు. పోలీసులు కేసులు పెట్టేరు. ( అక్రమ కేసులూ ఉంటాయి. కాదనను - వీరిని ఉసికొలిపిన రాజకీయ పార్టీలు లీగల్ సెల్ ఏర్పాటు చేసుకుని కేసులు నడిపించుకోవాలి - కాని ఇంతకాలం వారిని గాలికొదిలేసి శాసన సభ సమావేశాలు మొదలు కాగానే కేసుల ఉపసంహరణ నినాదాన్ని చేత పట్టుకున్నాయి .(ముఖ్యంగా టి.ఆర్ .ఎస్)
దేశంలో 70శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధార పడి బతుకుతున్నారు. అంటే ఈ విథ్యార్దుల తల్లి తండ్రుల్లో సైతం 70శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధార పడి బతుకుతుంటారు కదా? ఈ రాజకీయ పార్టీలకు తల్లి, తండ్రుల మీది కన్నా వారి పిల్లల మీదే ప్రేమ ఎక్కువైంది కాబోలు.
ఏ నాయకుడూ ఆత్మ హత్య చేసుకోడు. ఏ నాయకుని కొడుకూ కూతురూ నిప్పంటించుకుని చావరు. కాని ఊళ్ళో వారి పిల్లలు ఆత్మ హత్య చేసుకోవాలి. వారికి జీవితం యొక్క వస్తవికత తెలియదు. నాయకుల అసలు రంగు తెలీదు. వీరే వారి లక్ష్య సాధనకు (అధికారం) పనికొస్తారు. కాబట్టి విథ్యార్దులను వెనక్కేసుకొస్తున్నారు.
అన్ని వర్గాల వారు తమ పొట్టలను, బీరువాలను, ఇనుప పెట్టెలను, హాలులోని షో కేసులను నిప్పుకుంటారు. కాని ఒక్క రైతు మాత్రమే తన పొట్టను సైతం మాడ్చుకుని ఈ దేశం కడుపులు నింపుతాడు.
రైతును ఆదుకోవడం అంటే అదేదో ఉదారత్వం కాదు..ధర్మం కాదు బొంగు కాదు. రైతును ఆదుకోవడం అంటే మనలను మనం కాపాడుకోవడమే. నిజానికి కేంద్ర ,రాష్ఠ్ర్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 70శాతం నిదులు వ్యవసాయ రంగానికి కేటాయించాలి.
దేశంలో ఒక వేశ్యకు సైతం తనకో దర నిర్ణయించే అధికారం ఉంది. కాని రైతుకు? ఏ వర్గం వారైనా తమ రంగం లాభసాటిగా లేకుంటే వారానికో నెలకో పై తొలుగుతారు. కాని తరతరాలుగా నష్ఠ పోవడం కోసమే వ్యవసాయ రంగాన్ని వీడని రైతును పక్కన పెట్టి కేవలం అనుత్పాదక వినియోగదారులైన విధ్యార్దులకు పెద్ద పీఠ
వేయడం మూర్ఖత్వం
No comments:
Post a Comment