ఇదే ఈ రోజు స్టుడియో ఎన్ చానల్లో ప్రముఖంగా ప్రసారమిన కథనం యొక్క సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటి?.గతంలో మంత్రి శంకర్ రావు జగన్ సంస్థల్లో పెట్ట్టు బడుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసేరు. వాటిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై 52 మందికి నోటీసులు జారి చేసింది ( గమనించండి: తీర్పు వినిపించలేదు)
ఈ మాత్రానికి ఇంత అత్యుత్సాహం చూపుతున్నారంటే జగన్ దెబ్బకి ఎంతకి దిమ్మతిరిగి ఉన్నారో అర్థమవుతూనే ఉంది. వారి ముఖ్య ఆరోపణ ఏమంటే ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే షేర్లెలా అమ్ముడు పోయాయి? వాటి విలువా ఏటా ఎలా పెరిగాయి?
వారి ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాన్ని,వై.ఎస్.ని మచ్చిగ చేసుకోవడం కోసం "ఎవరో" పెట్టుబడులు పెట్టారన్నదే.
మీరో నేనో వెళ్ళి ఒక సినిమా తియ్యాలనుకుంటే ఆ సినిమాకయ్యే ఖర్చు మొత్తం హాట్ కేష్ గానో, బ్యాంక్ బేలన్సుగానో కలిగి ఉండాలి. ఇదే ఒక "విశ్వసనీయత"గల సంపన్నుడు / ప్రముఖుడు సినిమా తీయాలనుకుంటే ఒక ఏ4 కాయితం మీద ఒక్క రూపాయి స్కెచ్ పెన్నుతో ప్రొడక్షన్ నెం. వన్ అని వ్రాసి బొట్టు పెట్టి హారతి ఇస్తుంటే ఆ హారతి తాలూకు కల్పూరం ఆరే లోపల ఏరియాలు సేల్ అయిపోతాయి. అడ్వాన్సులు కోట్లల్లో అందుతాయి.
దీనిని అవినీతి అంటారా? జగన్ ఉత్సాహవంతుడు,సమర్థుడు, విద్యావంతుడు, ఎప్పట్లోనుండో కార్పోరేట్ రంగంలో ఉంటూ అనుభవం గడించినవాడు. పైగా వై.ఎస్. తనయుడు. మాట తప్పను -మడమ తిప్పను అనే పంచ్ డైలాగుతో రీ ఎంట్రి ఇచ్చి దుమ్మురేపిన ప్రాక్టికల్ హీరో వై.ఎస్.. ఇన్ని అంశాలను పట్టి పెట్టుబడి పెట్టేవారు పెడతారు.
ఇందుకు జగన్ని భాధ్యుడ్ని చెయ్యడం ఎంతమెరకు తర్కం? ఇంతకీ నత్తి-సుత్తికి పేటెంట్ రైట్ కలిగి ఊక దంపుడు మాటలు విసిరే శంకర్ రావు మాటల్లో ఏమెరకు పస ఉంది? నాకేమో ఇది జగన్ కు పరీక్షలా అనిపించడం లేదు. శంకర్ రావు మాటలు ఆధార రహితమని తేలడం ఖాయం.
మీరు నేను టీ కొట్లో మాట్లాడుకోవడం వేరు.. బ్లాగుల్లో బండ భూతులు వ్రాసుకోవడం వేరు. కాని శంకర్ రావు ఒక మంత్రి .అతని మాటలు నిరాధారమైనవని తేలితే కోర్టు అభిశంసించవచ్చు. జగన్
మంత్రి పైన , దూకుడుగా ఏక పక్ష వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్ళ పైన లక్షల కోట్లకు పరువు నష్ఠదావా వేయ వచ్చు.
అదే జరిగితే చానళ్ళకు కాపలా కాస్తున్న సెక్యూరిటి కుర్చీ సైతం జప్తుకు గురికావచ్చు.
Showing posts with label జగన్. Show all posts

Monday, January 24, 2011
Tuesday, January 18, 2011
సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !
ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)
రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.
కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.
ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)
విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.
హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.
ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.
కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.
ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.
ఈ కథనంతో చిర్రెత్తి 2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి
ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.

Labels:
Jagan,
mastan rao,
murder abn,
soori,
sucide,
ఆత్మ హత్య,
ఏబిఎన్,
జగన్,
మస్తాన్ రావు,
సూరి,
హత్య
Monday, December 13, 2010
రైతును పక్కన పెట్టి విధ్యార్దులకు పెద్ద పీఠ వేయడం మూర్ఖత్వం
రైతా? విథ్యార్థియా? - మీమాంశలో రాజకీయ పార్టీలు
ఒక రైల్వే స్టేషన్ .అందరు దేశ ప్రధానికోసం వెయిట్ చేస్తున్నారు. ఒకతను కుర్దా , బుష్కోటుతో ,నెత్తి మీద ఖద్దర్ టోపీతో వచ్చాడు.స్టేషన్ మాస్టర్ అతన్ని విసుక్కున్నాడు. అప్పుడతను చెప్పాడు " మీరు ఎవరికోసం వేచి ఉన్నారో ఆ ప్రధానిని నేనే.
అతనెవరో కాదు. లాల్ బహదూర్ శాస్త్ర్రి. అతనప్పట్లో కేంద్ర రైల్వే మంత్రి. అరియలూరులో ఒక రైలు ప్రమాదం జరిగింది. వెంటనే తన పదవికి రాజీనామా చేసి పారేసాడు. అతనే లాల్ బహదూర్ శాస్త్ర్రి. అతను ఒక నినాదాన్ని జాతికిచ్చాడు. అది జై జవాన్! జై కిసాన్ !! ఏ నాయకుడూ జై విథ్యార్థి అనలేదు.
( నేటి తరం నాయకులు ఏదో విదంగా తమ అజెండా ఫలప్రదమైతే చాలని విథ్యార్దులను ఉసికొలిపి వారి ప్రాణాలను హరిస్తున్నది వేరే సంగతి - నేను చెప్పడం నాటి తరం నాయకుల గురించి)
అసలు విథ్యార్ది అనే వాడు ఒక అన్ ప్రొడక్టివ్ కన్సియూమర్. అంటే అనుత్పాదక వినియోగదారుడు. అతను చదువు మద్యలోనే ప్రేమ కోసం ఆత్మ హత్య చేసుకుంటాడో.. ఫెయిల్ అవుతాడో ర్యాడికల్ అవుతాడో నక్సలైట్ అవుతాడో క్రిమినల్ అవుతాడో ఎవరికీ తెలియదు.
అయినా అటు ప్రభుత్వం ఎన్నో వెసలు బాటు కల్గిస్తూంది. స్కాలర్షిప్పులు,హాస్టళ్ళు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్లు , పుస్తకాల పై సబ్సిడీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇటు తల్లి తండ్రులు తమ రెక్కల కష్ఠాన్ని కేవలం లాటరి టిక్కెట్ వంటి విద్యార్థి మీద వెచ్చిస్తారు. తమ అవసరాలను సైతం త్యజించి, తమ సుఖాలను కాదని తమ పిల్లల పై అంటే విథ్యార్దుల పై ఖర్చు పెడుతుంటారు
సతరు విథ్యార్ది పెరిగి పెద్దవాడై డిగ్రి పొందొచ్చే ఏమో గాని ఉధ్యోగాల మాట గగనమే. పొరభాటుగా ఉధ్యోగాలొచ్చినా ప్రేమ పేరుతోనో , పెళ్ళి పేరుతోనో ఎవరో ముందు వెనుక తెలియని ఆడదాని చంక నాకుతూ తల్లి తండ్రులను వృద్దాశ్రమం పాలో, రోడ్ల పాలో చెయ్యడని గ్యారంటీ సైతం లేదు.
అయినా ఇన్ని రిస్కులు భరించి తల్లి తండ్రులు పిల్లలను చదివిస్తున్నారు. ఈ చదువులు అతనిని సంస్కరించి ఒక మంచి పౌరునిగా మారుస్తుందన్న గ్యారంటీ అన్నా ఉందా ? లేదు. అయినా ఎవరి పిచ్చి వారికానందం చందాన తల్లి తండ్రి చదివిస్తున్నారు. ఓట్లకోసమో, అధికారం కోసమో ఏదో కారణంతో ప్రభుత్వాలు ఎన్నో వెసలు బాటు కల్పిస్తున్నాయి.
ఇక విథ్యార్ది డ్యూటి ఏమి? చదువుకోవడం. ఉధ్యమాల్లో పాల్గొనడమో? భలవంతపు వసూళ్ళకు పాల్పడటమో? బస్సులను తనను తగలపెట్తుకోవడమో కాదు. కాని అన్నీ చేసేరు. పోలీసులు కేసులు పెట్టేరు. ( అక్రమ కేసులూ ఉంటాయి. కాదనను - వీరిని ఉసికొలిపిన రాజకీయ పార్టీలు లీగల్ సెల్ ఏర్పాటు చేసుకుని కేసులు నడిపించుకోవాలి - కాని ఇంతకాలం వారిని గాలికొదిలేసి శాసన సభ సమావేశాలు మొదలు కాగానే కేసుల ఉపసంహరణ నినాదాన్ని చేత పట్టుకున్నాయి .(ముఖ్యంగా టి.ఆర్ .ఎస్)
దేశంలో 70శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధార పడి బతుకుతున్నారు. అంటే ఈ విథ్యార్దుల తల్లి తండ్రుల్లో సైతం 70శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధార పడి బతుకుతుంటారు కదా? ఈ రాజకీయ పార్టీలకు తల్లి, తండ్రుల మీది కన్నా వారి పిల్లల మీదే ప్రేమ ఎక్కువైంది కాబోలు.
ఏ నాయకుడూ ఆత్మ హత్య చేసుకోడు. ఏ నాయకుని కొడుకూ కూతురూ నిప్పంటించుకుని చావరు. కాని ఊళ్ళో వారి పిల్లలు ఆత్మ హత్య చేసుకోవాలి. వారికి జీవితం యొక్క వస్తవికత తెలియదు. నాయకుల అసలు రంగు తెలీదు. వీరే వారి లక్ష్య సాధనకు (అధికారం) పనికొస్తారు. కాబట్టి విథ్యార్దులను వెనక్కేసుకొస్తున్నారు.
అన్ని వర్గాల వారు తమ పొట్టలను, బీరువాలను, ఇనుప పెట్టెలను, హాలులోని షో కేసులను నిప్పుకుంటారు. కాని ఒక్క రైతు మాత్రమే తన పొట్టను సైతం మాడ్చుకుని ఈ దేశం కడుపులు నింపుతాడు.
రైతును ఆదుకోవడం అంటే అదేదో ఉదారత్వం కాదు..ధర్మం కాదు బొంగు కాదు. రైతును ఆదుకోవడం అంటే మనలను మనం కాపాడుకోవడమే. నిజానికి కేంద్ర ,రాష్ఠ్ర్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 70శాతం నిదులు వ్యవసాయ రంగానికి కేటాయించాలి.
దేశంలో ఒక వేశ్యకు సైతం తనకో దర నిర్ణయించే అధికారం ఉంది. కాని రైతుకు? ఏ వర్గం వారైనా తమ రంగం లాభసాటిగా లేకుంటే వారానికో నెలకో పై తొలుగుతారు. కాని తరతరాలుగా నష్ఠ పోవడం కోసమే వ్యవసాయ రంగాన్ని వీడని రైతును పక్కన పెట్టి కేవలం అనుత్పాదక వినియోగదారులైన విధ్యార్దులకు పెద్ద పీఠ
వేయడం మూర్ఖత్వం

Saturday, December 11, 2010
ఒక రహస్య సంభాష్ణ
ఈ రోజుల్లో ఏ సంభాష్ణలో ఏ స్కామ్ దాగుందో చెప్పలేం. కాబట్టి ఈ రోజు నాకు ఒక సాహితీ మితృనికి మద్య జరిగిన సంభాష్ణను జాగరూకతో గమనించాలని మనవి.
"హలో మురుగా.. "
"చెప్పు శీను!"
"ఏం ఎలా ఉన్నావు? నీ పత్రిక ఎలా ఉంది? బ్లాగులు ఎలా పోతున్నాయి?"
"భాగానే ఉన్నా. పత్రికదేముంది. పతిరక తరపున ఒక మల్టికలర్ క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నా బ్యేక్ అండ్ బ్యేక్ వస్తుంది. ఒక పక్క ఎమో కమర్షియల్స్, మరో పక్కేమో సి.కె బాబు అతని అభిమానులు"
"ఇదేం మురుగా ! ఎన్.టి.ఆర్ పోయాక కూడ తె.దేశానికి చేసేవాడివి..కదా?"
"నెను ప్రజాస్వామ్యవాదిని.ప్రజలు ఎవరిని మెచ్చుకుంటే నేను వారిని మెచ్చుకుంటా. ఎన్.టి.ఆర్ కు చేసిన ద్రోహాన్ని సైతం పక్కన పెట్టి 1999 ఎన్నికల్లో తె.దే.పా కే చేసాను. ఏం లాభం రాజకీయాల్లో హత్యలుండవు.అన్నీ ఆత్మ హత్యలే అన్నట్టుగా నిరూపించాడు బాబు"
"బాబు కథ సరే సి.కె.బాబు కథేమీ?"
"2004 ఎన్నికల్లో తె.దే.పాను ఓడించండని మాత్రమే కరపత్రాలతో ప్రచారం చేసాను. కాని వై.ఎస్. జలయజ్నం, రెండు రూపాయలకే కిలో భియ్యం ఎట్సెట్రా ఎట్సెట్రా వల్ల 2009 ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాంగ్రెస్ ను గెలిపించండని ప్రచారం చేసాను"
"అది కాదుయ్యా. సి.కె.బాబు?"
"శీను! సి.కె.బాబు గురించి నువ్వేమైనా విని ఉంటే అవన్ని పత్రికల సృష్ఠే. అభూత కల్పనలే.. ఆయనది ఒకటే పొరభాటు. అదేమంటే ప్రెస్ రిలేషన్స్ పెద్దగా మెయింటెయ్న్ చెయ్యడు - అతని వైరి వర్గాలు పక్కాగా ఉంటారు. కోడి కూరలు,కుక్క కూరలు, సంక్రాంతికి బట్టలు,సెల్ ఫోన్స్, రీచార్జీలు"
"ఎవరికి?"
"ఇంకెవరికి విలేకరులకే"
"సరే సి.కె.బాబు కడిగిన ముత్యమంటావా?"
"అలా అని నేను చెప్పను. కాని మిగిలిన అందరు నాయకులకంటే ఇతను సెంట్ పెర్సంట్ బెటర్"
"సర్లే.. ప్రచారం చేసావు ఓకే.. ఈ క్యాలండరు పాడు ఎందుకు?"
"మనిషిని మనిషి నమ్మలేని రోజులొచ్చేసాయి.కాని ఒక్క మనిషి మీద ఇంత మంది ఇంత నమ్మకం ఉంచారంటే ఆ నమ్మకాన్ని ఈ లోకానికి చాటాలిగా? "
"ఇంత మందికి అతను ఏం చేసాడబ్బా?"
"వద్దులే శీను.. నేను చెప్పినా బ్లాగ్లోకం నమ్మదు. పైగా నవ్వి పోతుంది. నేను 2009 ఏప్రల్ 7 నుండి 21 వ తేది వరకు అతని కాన్వాయ్ తోనే ప్రచార వాహణంలో ప్రయాణించాను. ఉదయం ఆరు నుండి రాత్రి పది వరకు అతనిని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఆ 14 రోజులు నాకు కలిగిన అనుభవాలు చెబితే చంచా, చక్క భజన అంటూ ఆడి పోసుకుంటారేమో ..ఇంకో సందర్భంలో వివరిస్తాలే"
"మురుగా మురుగా.. నువ్వు నేను మాట్లాడుతున్నాం ఇందులో బ్లాగ్లోకం ఎక్కడొచ్చింది?"
"మన ఈ సంభాష్ణను బ్లాగ్లో పెడ్తా?"
"వద్దయ్యా.. "
"నాది మహాత్ముడి స్టైల్. నా జీవితమే ఒక తెరచిన పుస్తకంగా ఉండాలన్నది నా కోరిక. భహిరంగంగా చెయ్యలేని పని రహస్యంగా కూడ చెయ్యకూడదు"
"సర్లే నీ ఖర్మ గాని .. నువ్వేమో వై.ఎస్. అభిమానివి - జగన్ పట్ల నీ గుండె కొట్టుకుంటుంది. మరి లోకల్ గా చూస్తే సి.కె.బాబు స్టాండ్ ఎలా ఉంది?"
"ఎలా ఉన్నా జగనే చెప్పేసాడుగా .. ఈ ప్రభుత్వం మరో మూడున్నరేళ్ళు కొనసాగాలని. 2014 ఎన్నికల్లో కదా జగనా కాంగ్రెసా గొడవ?"
"మద్యంతర ఎన్నికలొస్తే?"
" గత ఎన్నికల్లో ఏదో వై.ఎస్. పుణ్యమా అంటూ టిక్కెట్ వచ్చింది గాని 2014 ఎన్నికల్లోనైతే గోవిందా.. జగన్ కేమో గెలిచే అభ్యర్ధి కావాలి. అది ఒక్క సి.కెనేనని అందరికి తెలుసు చూద్దాం"
"నీ బ్లాగ్ చదివా. టామి టైగరుకు చెప్పిన ఆథ్మ కథ.. భాగానే ఉంది గాని చిరు,జగన్ కలుస్తారంటావా?"
"జూనియర్ ఎన్.టి.ఆర్ కూడ కలవాలని చెబుతున్నా"
"ఏందో అంతా నీ పిచ్చి"
" నా కాన్సెప్ట్ ఒక్కటే ఈ రాష్ఠ్ర్రాన్ని పరిపాలించినవారిలో సామాన్యుడి కోసం ఆలోచించి సామాన్యునికి దగ్గరైన వారు ఇద్దరే ఒకటి ఎన్.టి.ఆర్ రెండు వై.ఎస్.ఆర్ ..వీరి వారసులు కలవాలి"
"చిరంజీవి ఎవరికి వారసుడు?"
"ఏం రజనికాంత్ లాగా ఊరించి ఊరించి పబ్బం కడుక్కోక ఎన్.టి.ఆర్ భాటలో ధైర్యం చేసి రాజకీయంలో దూకిన చిరంజీవి ఎన్.టి.ఆర్ వారసుడు కాదా?"
"ఏమిటో నీ లాజిక్కులు.. ప్రజాస్వామ్యవాదినన్నావు.. మళ్ళీ వారసత్వపు రాజకీయాలకు వత్తాసు పలుకుతావు"
"జగన్ గాని,జూ.ఎన్.టి.ఆర్ గాని,జగన్ గాని కొత్తగా ఏదో పొడుస్తారని కాదు నా ఉద్దేశం. వీరు పగ్గాలు చేపడితే ఆ ప్రభుత్వం ఎన్.టి.ఆర్, వై.ఎస్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటాయని నా ఆశ "
"సర్లే.. నీ బ్లాగులో ఒక పరమ చెత్త పోస్టు వేసేందుకు నేనూ ఒక కారణమయ్యాను గుడ్ నైట్"

Thursday, December 9, 2010
టామి వెర్సస్ టైగర్ ( ఇది జగన్ చిరు గురించిన టపా కానే కాదు)
టామి అని,టైగర్ అని పేర్లుండడం చూసి మీకు మీరై ఇవి రెండూ వేర్వేరు జీవరాశులని ఊహించుకోకండి. రెండూ అక్షరాల పులులే. ఈ రెండు పులులు చిత్తూరు కలెక్టర్ బంగళాలో కలుసుకున్నాయి. అప్పుడు ఆ రెండూ ఒకరికొకరు చెప్పుకొన్న ఆత్మకథలను క్లుప్తంగా ఇస్తాను. ఆతరువాత సంభాష్ణలోకి ఎళదాం
టామి టైగురుకు చెప్పుకున్న ఆత్మ కథ:
మా తాత ఒక టైగర్. ఆయన పేరు చెబితే ఆ ప్రాంతమంతా హడల్. ఇప్పటికీ కొందరికి ఆయన పేరు చెప్పుకుంటే వళ్ళు పులకరిస్తుంది. కొందరికైతే వళ్ళు జలదరిస్తుంది. మా నాన్న కూడ ఒక టైగర్. మొదట జిల్లా లెవలు. ఆపై రాష్ఠ్ర్రం లెవల్లో ఎదగాలని అప్పట్లో ఆయన అభిమానులు తపించేవారు. అందుకు అదేదో పెద్ద సర్కస్ కంపెని ఉందని అందులో చేరితే అలా ఎదగొచ్చని సలహా ఇచ్చేవారు. అతనో సర్కస్ కంపెనిలో చేరాడు.
ఆ కంపెనికి దేశ వ్యాప్తంగా శాఖలుండేవి .మా నాన్న ఆంథ్ర ప్రదేశ్ శాఖలో చేరాడు. మా నాన్న పులే. కాని ఆ కంపెనిలో వృధాగా తిని కూర్చున్న ముసలి నక్కలు ఆయన్ని బలే ఇబ్బంది పెట్టేవారు.
మా నాన్న తాను పుట్టి పెరిగిన అడవి, అది తనకిచ్చిన స్వేచ్చ, భలం, ఆత్మవిశ్వాసం, దాని సౌందర్యం అన్ని తలచుకుని మదనపడుతూ రింగ్ మాస్టర్లు చెప్పిన విదంగా ఏవేవో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. జనం కూడా భాగానే మెచ్చుకునేవారనుకో. కాని ఈ రింగ్ మాస్టర్లు సర్కస్ ఓనరమ్మను కలిసి మా నాన్న ఇంకా ఆడవిని మరిచి పోలేదని, స్వేచ్చా జీవి అని, మొరటోడని ఎప్పటికైనా ఓనరమ్మకే ఎదురు తిరుగుతాడని పెద్ద ప్రోగ్రామ్స్ ఏవి ఇవ్వకూడదని చాడి చెప్పేవారు.
అప్పుడప్పుడు బఫూన్లను మా నాన్న మీద రింగ్ మాస్టరుగా నియమించేవారు. ఒక దశలో ఈ అవమానాలు భరించలేక మరికొందరు పులులు ఇతరత్రా జంతువులతో ఆ సర్కస్ కంపెని వదిలి పెట్టి భయిటకొచ్చేసాడు. వీరందరు కలిసి చిన్న సర్కస్ కంపెని ఒకటి పెట్టేరు.
కాని ప్రకృతి నుండి దూరంగా దూరంగా వచ్చేసిన జనం, ఆహార వేటకు ఇరవై కిలో మీటర్లు తిరిగే శక్తి ఉన్నా పక్క వీథిలోని మెస్ కి టూవీలర్లో వెళ్ళి రోగాలు తెచ్చుకునే జనం
" నువ్వు సర్కస్లో ఎం చక్కా వార్తలు చదివేవాడివి, ఏం చక్క తోకతో పల్లు తోముకునేవాడివి .బంతాట ఆడేడివి ఆ సర్కస్లో నీ ప్రోగ్రామ్ బలే ఉండేదని" ఊరించేరు.
దీంతో విధిలేక మానాన్న అదే కంపెనిలో చేరారు.పెద్ద ఓనరమ్మ పోయి ఆమె కొడుకొచ్చాడు,కొడుకు పోయి కోడలొచ్చింది. కాని చాలా మంది మేధావులు ఆ సర్కస్ కంపెనియే చట్ట విరుద్దమని, సర్కస్ కంపెని నెపంతో స్కేమ్స్ చేస్తున్నారని అదని ఇదని దర్ణాలు,రాస్తా రోకోలంతా చేసేరు.
కంపెనికి బలే చెడ్డ పేరు వచ్చేసింది. కలెక్షన్ బాగా పడి పోయింది. రాష్ఠ్ర్రంలో గూడారమే ఖాళి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తరుణంలో కొత్త ఓనరమ్మ నీ మీద ఏ రింగ్ మాస్టర్లు ఉండరు , ఏం చేసినా నువ్వే అని చెప్పి హెడ్ ఆఫీసుకెళ్ళి పోయింది.
మా నాన్న అష్ఠ కష్ఠాలు పడి ఇక్కడ ఉన్న గబ్బిలాలు, నక్కలు,తోడేళ్ళను మ్యేనేజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ కంపెనిని మంచి స్థాయికి తెచ్చేసాడు. ఈ ప్రయత్నంలో నేను అతని బిడ్డగా అతను అందుభాటులో లేనప్పుడు అతని ప్రతిథిగా చిన్నా చితకా ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడ్ని. ఒక ఐదేళ్ళు ఏ సమస్యా లేకుండా పోయింది. మా నాన్న ఎంత పెద్ద పులి అయినప్పటికి అలవాట్లో పొరభాటుగా వై? (ఎందుకు?) అని ప్రశ్నించినా చివరికి ఎస్ అని చేసేవాడు. పులిబిడ్డనైన నాకు సైతం టామి అని పేరు పెట్టారంటే చూసుకో.
కష్ఠాల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ పార్ట్నర్ షిప్పులు కలిసి క్రమేణా స్థిర పడటం మొదలైంది.
మెయిన్ బ్రాంచ్ స్థిర పడేసరికి రాష్ఠ్ర్రంలోని బ్రాంచ్ రానింపు కొద్దిగా తగ్గింది. పాత సర్కస్ కంపెని ఒకటి టిక్కెట్ ఫ్రీ, పాప్ కార్న్ ఫ్రీ అని ప్రకటించడం , కొత్త సర్కస్ కంపెని ఒకటి కొత్తగా రావడం. అందులో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి పెద్ద పెద్ద డైరక్టర్ల దగ్గర పని చేసిన ఒక పులి ఉండటం వల్ల ఇలా రానింపు తగ్గినా ఉనికికి ప్రమాదం రాకుండా ఉండేందుకు సర్కస్ కంపెని అడవర్టైజ్మెంట్ కోసం నేను ఒక టివి చానల్, దినపత్రిక పెట్టడంతో గండం గట్టెక్కింది.
దీంతో ఓనరమ్మ దీని పై దృష్ఠి సారించింది. పూర్వంలోలాగా పెత్తనం చెయ్య దలచింది.
ఆ సమయానికి మా నాన్న ఓక కుట్రకు బలై పోయాడు. ఎలాగూ సర్కస్లోని జంతువుల గురించి భాగా తెలిసినవాడ్ని, మా నాన్నతో కలిసి మెలిసి పని చేసి వాటి లొసుగులు తెలిసిన వాడ్ని,జనం నాడి తెలిసినవాడ్ని , సర్కస్ దివాళా తీసి పోకుండా చానల్,పత్రిక నడిపిన వాడ్ని కాబట్టి నన్నే ఇన్ చార్జిగా పెడతారనుకున్నాను. ప్చ్! చివరికి నన్ను బఫూన్ చెయ్యాలని (చూ)చేసేరు.
దీంతో విసిగి పోయి ఇలా వచ్చేసాను.
టైగర్ టామికి చెప్పుకున్న ఆత్మ కథ:
అయ్యో పాపం! నీ కథ గనక వింటే గనక నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంది. నువ్వన్నావే కొత్త టైగర్ -కొత్త సర్కస్ కంపెని అని. ఆ టైగర్ ని నేనే. కొత్త కంపెని ఏమీ లాభసాటిగా నడవడం లేదు. సర్కస్ పెట్టిన కొత్తలో గోడ దూకి వచ్చినవారిలో సగం మంది మొదటి ఫో
ప్రారంభం కాక మునుపే వెళ్ళి పోయేరు. మిగిలిన సగం మంది అది పూర్తికాక ముందే గోడ దూకి వెళ్ళి పోయేరు.
నువ్వా సర్కస్ కంపెని వదిలి పెడితే ఆ సర్కస్ దివాళా తీయకుండా ఉండేందుకు నన్ను రమ్మన్నారు. మీ నాన్నలాగే నేనూ ఒక అడవిలో రారాజుగా ఉన్నవాడ్నే. కాని ఆ అడవిలోకి కుర్ర పులుల రాకతో ఎక్కడ డి ఫేమ్ అయిపోతానోనని కొత్త సర్కస్ కంపెని పెట్టా బేడ్ లక్. ఇలా అయ్యింది . సర్లే పెద్ద కంపెని కదా చేరిపోదామని భయలు దేరాను. నీ మాటలు వింటుంటే గనక రేపు నా బతుకూ ఇంతేనేమో?
అన్నట్టు మనమిద్దరం కలిసి ఒక సర్కస్ కంపెని పెడితే ఎలా ఉండేదో ఆలోచించు..
కొంత చర్చల అనంతరం టామి టైగర్ల మద్య ఒక అవగాహణ కుదిరింది. రెండూ చెట్టా పట్టాల్ వేసుకుని భయలు దేరాయి. కలెక్టర్ సి.సి సిగరట్ తాగాలని వచ్చి ఈ రెండు పులుల ఐక్యతా రాగం విని అదరి,వెదరి,చెదరి పరుగులు తీస్తూ వెళ్ళి కలెక్టరుగారికి విన్నవించాడు.
కలెక్టర్ వనికి పోతూ సర్కస్ కంపెనికి ఫోన్ చేసి కొత్త మ్యేనేజరుకు విషయం చెప్పాడు. కొత్త మేనేజర్ చేతులు కట్టేసుకుని, నోటి మీద వ్రేలు పెట్టేసుకుని హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పగా చిర్రెత్తిన ఓనరమ్మ , " వెంటనే కలెక్టర్ బంగళాకెళ్ళు ..రెండు ఫ్లాస్కులు తీసుకో .. ..తెచ్చి ఫ్రిడ్జిలో పెట్టేసుకుని ..రోజుకి మూడు పూట్లా సేవించు" అనేసి నెత్తి పట్టుకుంది.

Tuesday, December 7, 2010
దివాళా దిశగా జగన్ & కో
జగన్ పార్టి అనకుండా అండ్ కో అనడం ఏమిటని మీరు భావించ వచ్చు. కాని కొత్త పార్టి విషయంలో వారి వైఖరి కేవలం కార్పోరేట్ కంపెనిలా ఉందే కాని రాజకీయ పార్టిలా లేదు.
రాజకీయం అంటే ఒక ముహూర్తం తరువాతో పార్టి రెజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేతి వస్తేనో ప్రారంభమయ్యేది కాదు.అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ రోజు ఎన్.టి.విలో కొండా సురేక మాటలు చూస్తే చిర్రెత్తింది.
కృష్ణా కమిషన్ రిపోర్ట్ రావాలట. వచ్చాక స్టాండ్ తీసుకుంటారట. కేవలం ఒక్క తెలంగాణ విషయంలొనే క్లేరిటి లేకుంటే ఇక సవా లక్ష అంశాలున్నాయి. ( లేటెస్ట్: ఎస్.సి.వర్గీకరణ ఈ అంశం పట్ల వై.ఎస్. ఎప్పుడో అనుకూలంగా స్పందించారు. కాని జూ పూడి ప్రభాకర్ జగన్ వెనుకనుండి వర్గీకరణకు వ్యతిరేకంగా హూంకరిస్తున్నారు) .
జీవితంలో ప్రతి సెకను ఒక జంక్షన్ పాయింట్. అటో ..ఇటో..ఎటో తేల్చుకోవాలి. లేకుంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది.
నన్ను చిర్రెత్తించిన విషయాల్లో ఇదొకటైతే మరొకటి వై.ఎస్.అవినీతిలో సోనియాకు సైతం భాధ్యత ఉందని అంబటి రాం బాబు వ్యాఖ్యానించడం.
ఈ ముక్క తొలి సారి చిరంజీవికి అదిష్థానం పిలుపందిన నాడే నేను చెప్పాను. చిరంజీవి ఏమో గత ఎన్నికల్లో "వై.ఎస్. రాష్ఠ్ర్ర ప్రజా దనాన్ని సోనియాకు దోచి పెడుతున్నాడని " ఆరోపించాడు.
ఆయనగారిని దిల్లికి పిలిపించి ఆయనతో సయోధ్య కుదుర్చుకోవడం అంటే అతని ఆరోపణలను అంగీకరించినట్టేనా? ఆయన గారికీ కొంత వాటా కల్పించనున్నట్టా ? అని నేను ఏనాడో ప్రశ్నించాను.
మరి ఈ సాక్షి టివి చూస్తేనా మరీ చిర్రెత్తిస్తుంది. అస్తమానం వై.ఎస్. అస్తమానం జగన్ పురాణం అందుకుంటున్నారు. ( అందుకే నేను పార్టి కోసం కొత్త చానల్ పెట్టుకోవాలని సలహా ఇచ్చాను) - ప్రేక్షకుడ్ని సాక్షి చానల్ నుండి తరిమి తరిమి కొట్టేలా ఉన్నాయి ఆ చానల్ ప్రసారం చేసే కార్యక్రమాలు. తొలూత ప్రేక్షకులను చానల్ మార్చి వేయకుండ చూసుకుని ఆతరువాత చే పట్టాలి ప్రసారమన్న చిన్న లాజిక్ సైతం వీరికి బోధ పడటం లేదు
రాష్ఠ్ర్రంలో ఎన్నో సమస్యలున్నవి. జగన్ చెప్పినట్టుగా 45 రోజుల అనంతరమే పార్టి అంకురార్పణ జరగనీ . అందాక చేతులు ముడుచుకుని కూర్చోక ప్రజా సమస్యల పట్ల ప్రత్యక్ష పోరాటానికి పూనుకోవాలి.
సాక్షి పత్రికలో వై.ఎస్. పథకాలకు రోశయ్య ప్రభుత్వం ఎన్ని విదాలుగా గండి కొట్టిందని తాటికాయంత అక్షరాలతో వ్రాసారు కదా. అప్పుడైతే పార్టి,క్రమ శిక్షణ వంటివి అడ్డొచ్చాయి. ఇప్పుడవేవి లేవుగా.
వెంటనే ప్రభుత్వానికి పెదిహేను రోజుల గడువుతో ఒక అల్టిమేటమ్ జారి చేసి ( వై.ఎస్. పథకాలకు కొట్టిన గండీలను పూడ్చడానికి) జగన్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవాలి.
ఈ కోణం, ఈ ముక్క తట్టడానికి జగన్ ముఖ్య అనుచరులు అంబటి రాంబాబుగారికి
ఇంత కాలం పట్టింది. ఇలా అయితే గోవిందా గోవిందా..
తెలుగు వారిని విభజించి పాలింప చూస్తున్నారని చిరంజీవిని, అన్యాయానికి గురైన మహా నేతల వారసుల్లో జూ.ఎన్.టి.ఆర్ ఒకరని జూ.ఎన్.టి.ఆర్ని కలుపుకుని జగన్ వెళ్ళాలి. ప్రధాన ప్రతిపక్షమైన తె.దే.పాను ఇరుకున పెట్టడానికి, ప్రజారాజ్యాన్ని న్యూట్రల్ చెయ్యడానికి ఈ ఎత్తు పనికొస్తుంది.
జగన్! ప్రధాన సమస్యల్లో అటో ఇటో ఎటో తేల్చుకో.. చంద్రబాబులా నాన్చుతో ఉంటే జగన్ అండ్ కో దివాళా తీయడం ఖాయం.

Friday, December 3, 2010
జగన్ కొత్త పార్టి రూపు రేఖలు ఇలా ఉంటే మేలు
పార్టి ప్రాధన్యతలు:
*ప్రతి పౌరుని ఆత్మ గౌరవం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఉపాది మరియు ఉధ్యోగవకాశం ప్రాణ రక్షణ - కూడు,గూడు,గుడ్డ, విద్య ఆరోగ్యానికి అత్యంత ప్రాధన్యత.
*తెలుగు నాట ఆశేష ప్రజాభిమానాన్ని చొరగొన్న ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ ఆదర్శాల అచరణకే మొగ్గు. సంక్షేమం అభివృద్దిల నడుమ బేరేజు
పార్టి రూపు రేఖలు:
పేరు : కాంగ్రెస్ వై.ఎస్.
జెండా: మువ్వన్నెల జెండా నడుమ వై.ఎస్. ఆర్
ప్రత్యేకతలు:
*అటు దేశ భక్తి, దేశ భద్రత, సమగ్ర దేశాభివృద్దికి కట్టుబడి ఉంటూ రాష్ఠ్ర్ర ఆత్మ గౌరవం, అభివృద్ది,సంక్షేమాలకై నిర్విరామ పోరు
* ప్రతి విషయంలోను అంతర్గత ప్రజా స్వామ్యం -స్వేచ్చ
*పార్టికంటూ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెని. ప్రతి సభ్యునికి షేర్స్. సతరు కంపెని ఆద్వర్యంలో వెబ్ సైట్, టివి చానల్, దిన పత్రిక, ఒక ఎఫ్.ఎమ్. రేడియో చానల్
*ప్రతివారం పార్టి అద్యక్షునితో కార్యకర్తల ఇంటరాక్షన్ ( టి.వి చానల్ ద్వారా)
*సభ్యులకు ప్రత్యేక కరెస్పాండెన్స్ కోర్శు -అందులో నెగ్గితేనే యాక్టివ్ మెంబర్ షిప్. నిరక్షరాశ్య్లకు ఆడియో ,వీడియో లెసన్ ప్లాన్ - ఓరల్ టెస్ట్. ( ముఖ్యాంశాలు: ప్రజాస్వామ్యం - నిర్వహణ -ప్రజా సంభందాలు - వై.ఎస్.ఆర్
*లీగల్ సెల్ పై ప్రత్యేక దృష్ఠి - సామాన్య కార్యకర్తకు చట్ట, న్యాయ సాయం -అధ్యక్షుని ప్రత్యక్ష పర్యవేక్షణలో
*వివిద స్థాయిలో స్పోక్స్ మెన్ ( అధికార ప్రతినిదులు)
తెలంగాణ సమస్య :
ప్రత్యేక రాష్ఠ్ర్ర డిమాండు వెనుకున్న వాస్తవికతను గుర్తించటం.డిమాండుకున్న కారణాలను (అసమానత) రూపు మాపేందుకు వంద రోజుల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడం . ఆపై తెలంగాణ ప్రజల మద్య వోటింగ్ నిర్వహించి ప్రజలు కోరుకుంటే తెలంగాణా లేకుంటే గోల్డెన్ తెలంగాణా
పరిపాలన చేపడితే (ఎన్నికల హామి) :
* జల యజ్నం పై సిటింగ్ జడ్జితో విచారణ కమిషన్ - ప్రత్యేక మంత్రిత్వ శాఖ - ప్రత్యేక సిబ్బంది - ఈ తరహా ప్రాజెక్టులు చే పట్టి సక్సెస్ అయిన దేశానికి చెందిన నిఫుణుల సాయం + పర్యవేక్షణ
*ప్రతి కుటుంభానికి ఒక సెల్ ఫోన్ ఉచితం (విత్ ఎఫ్.ఎమ్ రేడియో) ప్రతి పట్ట బద్దునుకి ఒక కంప్యూటర్
*స్వచ్చంద బైండోవర్ ( స్టాంప్ పేపర్ పై డిక్లరేషన్ ఆధారంగా ఎటువంటి దర్యాప్తు లేకనే తక్షణం సంక్షేమ పథకాల వర్తింపు. మూడు నెలలలోపు విచారణ - నిర్ధారణ అనర్హులని తేలితే క్రిమినల్ చర్యలు.
*ప్రత్యేక రోగ నిరోధక ప్రాజక్ట్ - ఆరోగ్య శ్రీతో అనుసందానం
*రెండు రూపాయలకే బియ్యం పథకం క్రింద నెలకు ముప్పై కేజిల బియ్యం - అది వద్దన్న అర్హులకు పదిహేను కేజిల సన్న బియ్యం
*మందు బాబులకు ప్రత్యేక యూజర్ నెంబర్ - కిడ్ని -కాలేయం సంభంధ వ్యాధులకు ఇన్షియూరెన్స్ వర్తింపు - ప్రిమియం చెల్లింపు భాధ్యత లిక్కర్ తయారీ సంస్థలకు
*ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరు పై సమీక్షాధికారం డిగ్రీ కళాశాల విద్యార్థులకు..
*స్వయం సహాయక బృంధాలకు మని సీక్రెట్స్ , సంపాదన మార్గాల పై ప్రత్యేక శిక్షణ
*సమిష్ఠి వ్యవసాయానికి ముందుకొచ్చే గ్రామాలను ప్రభుత్వం దత్తత్తు తీసుకోవడం - భూమి పై హక్కు మాత్రం రైతులకే
*ప్రభుత్వ ఉధ్యోగులకు డే టు ఇన్ఫర్మేషన్ పై టెస్ట్ పై పరీక్షలు. తప్పితే సగం జీతంతో శెలవులు - మళ్ళి పరీక్షలు- అందులోను తప్పితే గోల్డెన్ షేక్ హేండ్. వారికి శారీరక, మానసిక పరిశోదనలు -రుగ్మతలుంటే ఉచిత వైద్య సేవ .
*ఎస్.సి,ఎస్.టి, బి.సి కులస్తుల్లో వంశ వృక్షంలో లేదా కుటుంభంలో తొలి పట్ట బద్దునికి అత్యంత ప్రాధన్యత.
*ప్రతి శాఖలోను కంప్యూటరీకరణ - పారదర్శకత
(ఇంకా ఉంది)

Tuesday, November 30, 2010
కాంగ్రెస్ : గాంది కాలం నుండి అదే ఒరవడి
నేడు ప్రజాభిమానం పొందిన జగన్ ను కాదని మొన్న రోశయ్యను, నిన్నా కిరణ్ కుమార్ రెడ్డిని సి.ఎం చేసిన అదిష్ఠానం వైనం మింగుడు పడక కార్యకర్తలు విస్తు పోతుంటారు. కాని ప్రజాభిమానం చొరగొన్న వారిని పక్కన పెట్టడం గాంది నెహృ కాలం నూండే కాంగ్రెస్ స్వంతమని వారికి తెలియదు
పాపం.గాంది Vs సుభాష్ చంద్ర బోస్:
నాడు కాంగ్రెస్ పార్టి అద్యక్షులుగా ఒకతనిని గాంది ప్రపోజ్ చేసారు. సుభాష్ చంద్ర బోస్ అతని పై పోటీకి దిగారు. వెంటనే మహాత్ముడని మన పిల్లలు బడిలో చదువుకునే గాంది తన పెద్దరికాన్ని తుంగలో తొక్కి తన అభ్యర్ది విజయం తన విజయమని, అతని ఓటమి తన ఓటమి అని ప్రకటించేరు. కాని ఎన్నికల్లో సుభాష్ చంద్ర బోస్ విజయం సాధించారు. వెంటనే గాంది నిరాహార దీక్ష చేపట్టారు. సుభాష్ చంద్ర బోస్ నొచ్చుకును తన పదవికి రాజినామా చేసి భయిటకొచ్చారు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి

Monday, November 29, 2010
జగన్ బెటర్ లేట్ దేన్ నెవర్ ! -Best of Luck !!
బేసికల్ గా నేను ప్రజాభిమానిని. ప్రజాభిమానాన్ని చొరగొన్నారు కాబట్టి ఎన్.టి.ఆర్ అభిమానినైనాను. ఎన్.టి.ఆర్ ఆదర్శ పథకాలను (ముఖ్యంగా రెండు రూపాయలకే కిలో భియ్యం పథకం) అమలు చేస్తుండటంతో ఎన్.టి.ఆర్ అసలు సిసలైన వారసుడు వై.ఎస్.ఆరేనని స్ఫురించి వై.ఎస్. కు మద్దత్తు పలకడం ప్రారంభించాను. చిత్తూరు వాసిగా వై.ఎస్. ప్రకటించిన ఎం.ఎల్.ఏ అభ్యర్ది విజయం కోసం నా సాయశక్తులా పని చేసాను.
జగన్ విషయానికొస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయం ఖచ్చితంగా జగన్ ,జగన్ స్థాపించిన సాక్షి తో నే సాధ్యమైందన్నది నా విశ్లేష్ణ. ఎంత గొప్ప నాయకుడైనప్పటికి ప్రతి పక్షాలన్ని ఏకమైనప్పుడు ఆయన వారందరి ప్రభావాలను బేరేజు చెయ్యగలిగారేమో గాని అధిగమించగలిగాడని నేను నమ్మడం లేదు.
ఆ ఎన్నికల్లో పార్టి కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే నెగ్గింది. సాక్షి రీడర్ షిప్ ,వ్యూయర్ షిప్ లెక్కిస్స్టే ఆ ఒక్కశాతానికి సరిగ్గా సరిపోతుంది.
అటువంటప్పుడు వై.ఎస్సే ఒకడగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డిని సి.ఎం.చేసి ఉండాల్సింది. ఎప్పుడైతే జగన్నికాక విజయమ్మను కడప ఎం.ఎల్.ఏ చేసారో, ఎప్పుడైతే రోశయ్యను సి.ఎల్పి లీడర్గా ప్రతిపాదించమన్నారో అక్కడికే అదిష్ఠానం మనోభావం నాకిట్టే అర్థమైపోయింది.
13/9/2010 నాడే కాంగ్రెస్ వై.ఎస్. పేరిటి కొత్త పార్టి ఏర్పాటు చెయ్యాలని వ్రాసాను. పైగా సతరు పోస్టును జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యేక్స్ ,పోస్టు ,కొరియర్ల ద్వారా పంపాను. వీలైనన్ని ఎం.ఎల్.ఏలకు ఇమెయిల్ కూడ పంపాను. దానిని చదవ కోరితే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అందుకే ఈ టపాకు బెటర్ లేట్ దేన్ నెవర్ అని పెట్టాను. పోనీ జగన్ భవిష్యత్ ఏమవుతుందంటారా? అదేమి బంగారం కాదు గాని ప్లాటినమ్ అని గంతపదంగా చెప్పాను.చెబుతున్నాను. రానున్నది జగన్నామ సం. ఈ బ్లాగులో ఈ శీర్షికన కూడ ఒక టపా ఇదివరకే వ్రాసాను.

Subscribe to:
Posts (Atom)