Thursday, December 9, 2010

టామి వెర్సస్ టైగర్ ( ఇది జగన్ చిరు గురించిన టపా కానే కాదు)

టామి అని,టైగర్ అని పేర్లుండడం చూసి మీకు మీరై ఇవి రెండూ వేర్వేరు జీవరాశులని ఊహించుకోకండి. రెండూ అక్షరాల పులులే. ఈ రెండు పులులు  చిత్తూరు కలెక్టర్ బంగళాలో కలుసుకున్నాయి. అప్పుడు ఆ రెండూ ఒకరికొకరు చెప్పుకొన్న ఆత్మకథలను క్లుప్తంగా ఇస్తాను. ఆతరువాత సంభాష్ణలోకి ఎళదాం

టామి టైగురుకు చెప్పుకున్న ఆత్మ కథ:

మా తాత ఒక టైగర్. ఆయన పేరు చెబితే  ఆ ప్రాంతమంతా హడల్. ఇప్పటికీ కొందరికి ఆయన పేరు చెప్పుకుంటే వళ్ళు పులకరిస్తుంది. కొందరికైతే వళ్ళు జలదరిస్తుంది. మా నాన్న కూడ ఒక టైగర్. మొదట జిల్లా లెవలు. ఆపై రాష్ఠ్ర్రం లెవల్లో ఎదగాలని అప్పట్లో ఆయన అభిమానులు తపించేవారు. అందుకు అదేదో పెద్ద సర్కస్ కంపెని ఉందని అందులో చేరితే అలా ఎదగొచ్చని సలహా ఇచ్చేవారు. అతనో సర్కస్ కంపెనిలో చేరాడు.

ఆ కంపెనికి దేశ వ్యాప్తంగా శాఖలుండేవి .మా నాన్న ఆంథ్ర ప్రదేశ్ శాఖలో చేరాడు. మా నాన్న పులే. కాని ఆ కంపెనిలో వృధాగా తిని కూర్చున్న  ముసలి నక్కలు ఆయన్ని బలే ఇబ్బంది పెట్టేవారు.

మా నాన్న తాను పుట్టి పెరిగిన  అడవి, అది తనకిచ్చిన స్వేచ్చ, భలం, ఆత్మవిశ్వాసం, దాని సౌందర్యం అన్ని తలచుకుని మదనపడుతూ రింగ్ మాస్టర్లు చెప్పిన విదంగా ఏవేవో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. జనం కూడా భాగానే మెచ్చుకునేవారనుకో. కాని ఈ రింగ్ మాస్టర్లు సర్కస్ ఓనరమ్మను కలిసి మా నాన్న ఇంకా ఆడవిని మరిచి పోలేదని, స్వేచ్చా జీవి అని, మొరటోడని ఎప్పటికైనా ఓనరమ్మకే ఎదురు తిరుగుతాడని పెద్ద ప్రోగ్రామ్స్ ఏవి ఇవ్వకూడదని చాడి చెప్పేవారు.

అప్పుడప్పుడు బఫూన్లను మా నాన్న మీద రింగ్ మాస్టరుగా నియమించేవారు. ఒక దశలో  ఈ అవమానాలు భరించలేక మరికొందరు పులులు ఇతరత్రా జంతువులతో ఆ సర్కస్ కంపెని వదిలి పెట్టి భయిటకొచ్చేసాడు. వీరందరు కలిసి చిన్న సర్కస్ కంపెని ఒకటి పెట్టేరు.

కాని ప్రకృతి నుండి దూరంగా దూరంగా వచ్చేసిన జనం, ఆహార వేటకు ఇరవై కిలో మీటర్లు తిరిగే శక్తి ఉన్నా పక్క వీథిలోని మెస్ కి టూవీలర్లో వెళ్ళి రోగాలు తెచ్చుకునే జనం

" నువ్వు సర్కస్లో ఎం చక్కా వార్తలు చదివేవాడివి, ఏం చక్క తోకతో పల్లు తోముకునేవాడివి .బంతాట ఆడేడివి ఆ సర్కస్లో నీ ప్రోగ్రామ్ బలే ఉండేదని" ఊరించేరు.

దీంతో విధిలేక మానాన్న అదే కంపెనిలో చేరారు.పెద్ద ఓనరమ్మ పోయి ఆమె కొడుకొచ్చాడు,కొడుకు పోయి కోడలొచ్చింది. కాని చాలా మంది మేధావులు ఆ సర్కస్ కంపెనియే చట్ట విరుద్దమని, సర్కస్ కంపెని నెపంతో స్కేమ్స్ చేస్తున్నారని అదని ఇదని దర్ణాలు,రాస్తా రోకోలంతా చేసేరు.

కంపెనికి బలే చెడ్డ పేరు వచ్చేసింది. కలెక్షన్ బాగా పడి పోయింది. రాష్ఠ్ర్రంలో  గూడారమే ఖాళి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తరుణంలో కొత్త ఓనరమ్మ  నీ మీద ఏ రింగ్ మాస్టర్లు ఉండరు , ఏం చేసినా నువ్వే అని చెప్పి హెడ్ ఆఫీసుకెళ్ళి పోయింది.

మా నాన్న అష్ఠ కష్ఠాలు పడి  ఇక్కడ ఉన్న గబ్బిలాలు, నక్కలు,తోడేళ్ళను మ్యేనేజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ  కంపెనిని మంచి స్థాయికి తెచ్చేసాడు. ఈ ప్రయత్నంలో నేను అతని బిడ్డగా అతను అందుభాటులో లేనప్పుడు అతని ప్రతిథిగా చిన్నా చితకా ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడ్ని.  ఒక ఐదేళ్ళు ఏ సమస్యా లేకుండా పోయింది. మా నాన్న ఎంత పెద్ద పులి అయినప్పటికి అలవాట్లో పొరభాటుగా వై? (ఎందుకు?) అని ప్రశ్నించినా చివరికి ఎస్ అని చేసేవాడు. పులిబిడ్డనైన  నాకు సైతం టామి అని పేరు పెట్టారంటే చూసుకో.

కష్ఠాల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ పార్ట్నర్ షిప్పులు కలిసి క్రమేణా స్థిర పడటం మొదలైంది.
మెయిన్ బ్రాంచ్  స్థిర పడేసరికి రాష్ఠ్ర్రంలోని బ్రాంచ్ రానింపు కొద్దిగా తగ్గింది. పాత సర్కస్ కంపెని ఒకటి టిక్కెట్ ఫ్రీ, పాప్ కార్న్ ఫ్రీ అని ప్రకటించడం ,  కొత్త సర్కస్  కంపెని ఒకటి కొత్తగా రావడం. అందులో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి పెద్ద పెద్ద డైరక్టర్ల దగ్గర పని చేసిన ఒక పులి ఉండటం వల్ల ఇలా రానింపు తగ్గినా ఉనికికి ప్రమాదం రాకుండా ఉండేందుకు సర్కస్ కంపెని అడవర్టైజ్మెంట్ కోసం నేను ఒక టివి చానల్, దినపత్రిక పెట్టడంతో గండం గట్టెక్కింది.

దీంతో ఓనరమ్మ దీని పై దృష్ఠి సారించింది. పూర్వంలోలాగా పెత్తనం చెయ్య దలచింది.
ఆ సమయానికి మా నాన్న ఓక కుట్రకు బలై పోయాడు. ఎలాగూ సర్కస్లోని జంతువుల గురించి భాగా తెలిసినవాడ్ని, మా నాన్నతో కలిసి మెలిసి పని చేసి వాటి లొసుగులు తెలిసిన వాడ్ని,జనం నాడి తెలిసినవాడ్ని , సర్కస్ దివాళా తీసి పోకుండా చానల్,పత్రిక నడిపిన వాడ్ని కాబట్టి నన్నే ఇన్ చార్జిగా పెడతారనుకున్నాను. ప్చ్! చివరికి నన్ను బఫూన్ చెయ్యాలని (చూ)చేసేరు.

దీంతో విసిగి పోయి ఇలా వచ్చేసాను.


టైగర్ టామికి చెప్పుకున్న ఆత్మ కథ:

అయ్యో పాపం! నీ కథ గనక వింటే గనక నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంది. నువ్వన్నావే కొత్త టైగర్ -కొత్త సర్కస్ కంపెని అని. ఆ టైగర్ ని నేనే. కొత్త కంపెని ఏమీ లాభసాటిగా నడవడం లేదు. సర్కస్ పెట్టిన కొత్తలో గోడ దూకి వచ్చినవారిలో సగం మంది  మొదటి  ఫో
ప్రారంభం కాక మునుపే వెళ్ళి పోయేరు. మిగిలిన సగం మంది అది  పూర్తికాక ముందే గోడ దూకి వెళ్ళి పోయేరు.

నువ్వా  సర్కస్ కంపెని వదిలి పెడితే ఆ సర్కస్ దివాళా తీయకుండా ఉండేందుకు నన్ను రమ్మన్నారు.  మీ నాన్నలాగే నేనూ ఒక అడవిలో రారాజుగా ఉన్నవాడ్నే. కాని ఆ అడవిలోకి కుర్ర పులుల రాకతో ఎక్కడ డి ఫేమ్ అయిపోతానోనని కొత్త సర్కస్ కంపెని పెట్టా బేడ్ లక్. ఇలా అయ్యింది . సర్లే పెద్ద కంపెని కదా చేరిపోదామని భయలు దేరాను. నీ మాటలు వింటుంటే గనక రేపు నా బతుకూ ఇంతేనేమో?

అన్నట్టు మనమిద్దరం కలిసి ఒక  సర్కస్ కంపెని పెడితే ఎలా ఉండేదో ఆలోచించు..

కొంత చర్చల అనంతరం టామి టైగర్ల మద్య ఒక అవగాహణ కుదిరింది. రెండూ చెట్టా పట్టాల్ వేసుకుని భయలు దేరాయి.  కలెక్టర్ సి.సి సిగరట్ తాగాలని వచ్చి ఈ రెండు పులుల ఐక్యతా  రాగం  విని  అదరి,వెదరి,చెదరి పరుగులు తీస్తూ వెళ్ళి కలెక్టరుగారికి విన్నవించాడు.

కలెక్టర్ వనికి పోతూ సర్కస్ కంపెనికి ఫోన్ చేసి కొత్త మ్యేనేజరుకు విషయం చెప్పాడు. కొత్త మేనేజర్  చేతులు కట్టేసుకుని, నోటి మీద వ్రేలు పెట్టేసుకుని హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పగా చిర్రెత్తిన ఓనరమ్మ , " వెంటనే కలెక్టర్ బంగళాకెళ్ళు ..రెండు ఫ్లాస్కులు తీసుకో .. ..తెచ్చి ఫ్రిడ్జిలో పెట్టేసుకుని ..రోజుకి మూడు పూట్లా సేవించు" అనేసి నెత్తి పట్టుకుంది.

2 comments:

  1. సాంబారుగాడూ, సూపర్!

    ReplyDelete
  2. సూపర్.. చాలా బాగా రాశారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది అనుకున్నట్టు టామీ కేవలం ఆవేశపరుడైన అమాయకుడు కాదు. పథకాలూ వ్యూహాలూ రచించడం లోనూ అమలు చెయ్యడం లోనూ ఈ గుంటనక్కలకీ, ఓనరమ్మకీ అందనంత ఎత్తులో ఉన్నాడు. He is capable of extracting good results.

    ReplyDelete