Wednesday, December 22, 2010

మరణం గురించిన తీపి నిజాలు

అవ్రును . మరణం మన జీనయానం ఆగిపోకుండా ముందుకు నడిపే  ఒక ఇందనం. మరణం,మరణం గురించిన ఆలోచన, మరణం యొక్క చాయలే లేకుంటే ఈ జీవితమే శూన్యం కాగలదు. సృష్థికి మూలం ఎవరో తెలీదు గాని దీని మనుగడకు ఆది మాత్రం మరణమే ..

మరణం పలు మారువేషాల్లో ఎదురయ్యి మానావావనిని ముందుకు సాగేలా చేసూంది. అదెలా అని ఈ టపాలో వివరిస్తాను.


మరణం వచ్చాక శరీరం రాలి పోతుంది.ప్రాణం అఖండ విశ్వంతో అనుసందింపపడుతుంది. మైదునంలో  వీర్య స్కలన  సమయాన వొళ్ళు మరిచిపోయి ,కాలం తెలీని స్థితి ఏర్పడుతుంది. దీనిని బ్లాక్ అవుట్ ,బుల్లి మరణం అని కూడ వ్యవహరిస్తారు. ఈ స్థితిలో అర క్షణం పాటైనా మానవునికి వొళ్ళు తెలీని స్థితి ఏర్పడుతుంది. శరీరం అనే చెరలో కృంగుతుండిన ఆత్మ/స్ఫురణ అరక్షణం పాటైనా ఈ విశ్వంతో అనుసందింప పడుతుంది.
దనం రక రకాలైన హద్దులతో బంధింప పడియున్న మానవుడ్ని ప్రపంచంతో అనుసందిస్తుంది. ( బాషా, దూరం,కాలం ఇలా  అన్ని హద్దులను దనం చెరిపేస్తుంది).

మరణం మిమ్మల్ని సమాజం నుండి  దూరం చేసినట్టే , మైదునం కూడ కొంత సమయానికైనా సమాజం గురించిన ఆలోచనలను స్థంభింప చేస్తుంది. దనం సమాజంయొక్క విమర్శలనుండి మిమ్మల్ని దూరంగా ఉంచి రక్షిస్తుంది. మరణించాక మీకు మైదునం, దనంతో పని ఉండదు. మైదునం అందుబాటులో ఉంటే దనవ్యామోహం కట్టిడిలో ఉంటుంది.

దనం మీకు అందుభాటులో ఉంటే మీరు మరణంయొక్క చాయలతో యుద్దం చేస్తూ విజయం సాధిస్తూ ఆనందిస్తారు.( ఒంటరితనం, చీకటి,తిరస్కారం,దూరం,కాలం అన్ని మరణం యొక్క చాయలె) . మైదునం మీకు అందుబాటులో ఉంటే దనవంతులకు మైదునానికి సైతం సమయం ఉండదన్న తలంపుతో మీ ఆర్థిక దుస్థితిని సైతం మరిచి పోయి ఆనందిస్తారు.

ఇలా మరణం -మైదునం-దనం ఈ మూడింటి మద్య ఎంతటి యూనిఫార్మిటి ఉందంటే ఒకటి అందుభాటులో ఉంటే మరోటి జ్నప్తికి సైతం రావు.

ఎలట్రానిక్ పరికరాల్లో ఆన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నట్టే ప్రతి జీవిలోను తనను తాను రక్షించుకోవాలన్న తపన ఉన్నట్టే - తనను తాను చంపుకునే కాంక్ష కూడ ఉంటుంది.
మరణం పై కాంక్ష కూడ రక్షించుకోవాలన్న తలంపేనంటే విస్తు పోతారు. పునరభిమరణం పునరభి జననం కదా! మరణిస్తే మరో సారి బెటర్ గా జీవించవచ్చన్న ఆలోచనే మరణ కాంక్షకు కారణం.

ఆఠవిక జీవితంలో ప్రతి క్షణం మరణంతో చెయ్యాలి కరచాలనం. అందుకే ఆరోజుల్లో మైదునానికి ఏమాత్రం ప్రాముఖ్యత /వివక్ష /హద్దులు ఉండేది కాదు. మరణం యొక్క గొప్పతనం ఏమంటే అది మనకు ఎదురై కనుమరుగైన ప్రతి క్షణం మనం కొత్తగా జన్మిస్తుంటాం. మెమరిలోని చెత్తంతా ఎగిరిపోతుంది. మన ప్రియారిటి లిస్ట్ చాలా చిన్నదై ఉంటుంది.

స్థిరవాసంలో మరణంతో సాంగత్యం తగ్గింది - దీంతో మరణం గురించిన దిగులు పెరిగింది -అలా దిగులు కలిగినప్పుడు అందులోనుండి భయిటపడాలంటే ఉన్న ఒకే మార్గం మరణించటమే. ఐ మీన్ సెక్సులో పాల్గొనడం. సెక్సులో పాల్గిన్నప్పుడు ఆ బుల్లిమరణం కాస్త ఉపసమనాన్ని కలిగిస్తుంది.

స్థిరవాసంలో ఇలా మానవుని ప్రియారిటి లిస్టులో  సెక్స్ పై పైకి వచ్చేసింది. ప్రకృతిలోని మరో కృర నిభందన ఏమంటే మీకు ఏ విషయం మీద ఆశక్తి పెరుగుతుంటుందో ఆ శక్తి తగ్గి పోతూ వస్తుంది. అతి తిండి తినే వారు త్వరలో షుగరు రోగానికి గురైనట్టే.

అలా మానవుని సెక్సు సామర్థ్యం తగ్గుముఖం పట్టడం మొదలైంది. మరణం పై భీతి మరింత పెరిగింది. అంతలో తన కండలు కరిగించి చక్క దిద్దిన  నెల స్థిరాస్తిగా ఏర్పడ్డది. మరణం తనను పూర్తిగా లెకుండా చేస్తుందన్న దిగులుతో తన సంతానాలను తనకు ప్రతి రూపంగా సరిపెట్టుకునే స్థితికొచ్చాడు. తన కష్థార్జితం తన సంతానాలకే దక్కాలని ఉవ్విళ్ళూరాడు. స్త్ర్రీ యోనిని బంధించ లేక ఆమెనే బంధించడం మొదలు పెట్టాడు. ఆమెను క్రమేణా భానిసగా మార్చాడు.

భానిస ఏ క్షణమన్నా ఎదురుతిరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆమెను ఏ విదంగా అనచాలన్నదాని మీదే దృష్థి కేంద్రీకరిస్తూ సెక్సు కోసమని ఆమె పై ఆధారపడితే అది ఆమె ముందు సరెండర్ అవ్వడమే అవుతుందన్న సబ్ కాన్షియస్ ఫీలిగ్ తో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టాడు.

మొదట్లో ఉండ మార్పిడి, ఆతరువాత కాసుల సంస్కృతి మొదలైంది. ప్రత్యామ్నాయం కోసం వెతుకుంటున్న మానవ మస్తిష్కం దనాన్ని సెక్సుకు ప్రత్యామ్నాయంగా అంగీకరించింది. అదే అవినీతికి దారి తీసింది.

ఇక్కడ స్త్ర్రీ విషయంలో కొంత సవరణలు చెప్పవలసి ఉంది. సెక్సు ద్వార బుల్లి మరణం అన్నది ఆమెకు దాదాపుగా అసంభవమైంది. బయాలజికల్ గా చూసినా, సైకలాజికల్ గా చూసిన స్త్ర్రీ అంత త్వరగా సెక్సుకు సమ్మతించదు.  దిగదు. దిగినా ఆమెలోని సర్వైవల్ సమస్యలు ( గర్భం, కుటుంభం, సమాజం గురించిన భయాలు)  సెక్సును స్వేచ్చగా ఆస్వాదించే అవకాశాన్ని ఆమెకివ్వడం లేదు కాబట్టి ఆమె భావప్రాప్తి చెందడం చాలా అరుదు. బయాలజికల్ గా చూస్తే పురుషునికి 7 కదలికలతో వీర్య స్కలనం -బుల్లి మరణం తఠస్తిస్తే ఆమెకు 23 కదలికలు అవసరమట.

ఇలా సెక్సు ద్వారా మరణాన్ని ( ఐ మీన్ బుల్లి మరణాన్ని - ఐ మీన్ భావ ప్రాప్తిని) పొందలేని స్త్ర్రీ ఇతరత్ర మార్గాల ద్వారా మరణాన్ని ఆహ్వానిస్తుంది. వీకర్ సెక్స్ కాబట్టి ఆవిడ సర్వైవల్ కోసం - మనుగడ కోసం - ఆమెకు ప్రకృతి పలు విశేషమైన శాక్తి సామర్థ్యాలను ఇచ్చింది .వాటిలో వన్ పెర్సంట్ వినియోగించుకున్నా ఇన్ని మర్డర్లు,మాన భంగాలు, యాసిడ్ దాడులు,గ్రుహ హింసలు,గ్యాస్ స్టవ్ పేలుళ్ళు జరిగేవి కావు.

ఆమెకు మరణం మైదునం ద్వారా అసాధ్యమైంది కాబట్టే స్వచ్చందంగా మరణాన్ని ఆహ్వాణిస్తూందోనన్న అనుమానం కూడ నాకుంది.

ఇంతకీ ఈ సమస్యకు ( అన్ని సమస్యలకు మూలమైన సమస్య మానవుడు తనను ప్రకృతి నుండి వేరుగా చూడటమే - కాబట్టే అనుసాందాన కోరిక - అందుకు శరీరాలే అడ్డమన్న తలంపు- అందుకోసం చచ్చే చంపే కోరికలు -అందుకే సెక్స్ - సమాజం దాదాపుగా దానిని నిషేదించింది కాబట్టి దనం వైపు పరుగులు- అవినీతి ) నెను సూచించే ప్రప్రధమ మార్గం ద్యానం -యోగం .

కామి కాని వాడు మోక్ష కామి కాలేడు కాబట్టి సెక్స్. ఇది చట్ట బద్దంగా+దర్మ బద్దంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఉధ్యోగవకాశం ఉండాలి (నదుల అనుసందానార్థం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమే) అప్పుడే వివాహం ద్వారా
చట్ట బద్దంగా+దర్మ బద్దంగా ప్రతి ఒక్కరు సెక్సును పొంద కలుగుతారు.

కాని నేటి స్థితి గతులను బట్టి చూస్తే ఇది అసంభవం. ( ఒక ఎన్.టి.ఆర్ లేదా వై.ఎస్. ఆర్ లాంటి మొండి ఘటం మళ్ళి పుట్టాలి) మరేం చెయ్యాలి?

అందుకే నేను వ్యభిచారానికి చట్ట బద్దతను ప్రతిపాదిస్తున్నాను. నేనైతే చాలంజ్ చేసి చెబుతున్నాను .ఈ ఒక్క అంశం అమలైతే చాలు . . మన దేశంలోని అవినీతి నూటికి 99.9% తగ్గి పోతుంది. ఆ తరువాత సైతం  అవినీతికి పాల్పడే వారు వారు మానసిక రోగులుగా ఉంటారు.వారిని పిచ్చాసుపత్రికి తరలిస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment