రుషులు మహర్షులు తమ జీవితాలను అర్పించి రూపొందించిన జ్యోతిష్య శాస్త్ర నిభంధనలు , 1989 నాటి నుండి నేటి దాక నేను గడియిచిన అనుభవాలు ,తర్కం, కాల దేశ వర్థమానాల్లో వచ్చిన మార్పులు అన్నింటిని రంగరించి నేను వ్రాసిన ఫలాలు తదుపరి మెయిల్లో పంప బడతాయి.
అంతకు పూర్వం ఈ మెయిల్ను ఒక ప్రింట్ అవుట్ తీసి ఐదారు సార్లైనా చదువుకుంటే తదుపరి నేను పంపే ఫలితాలను సరిగ్గా అర్థం చేసుకునే వీలుంటుంది.
మనవి:
ఈ ప్యాకేజ్ మీ వ్యక్తిగత రెఫెరన్స్ కోసమే. ఇందులో ఉన్న విషయాలను సేకరించటానికి నా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఉన్నాను. కాబట్టి ఈ ప్రింట్ అవుట్ ను ఇతరులకు ఎరవు ఇవ్వడం కాని జిరాక్స్ చేసి ఇవ్వటం కాని చేయొద్దు. వీటికి నేను కాపి రైట్ కలిగి ఉన్నాను. మీరలా చేస్తే అది ధర్మ విరుద్దమే కాదు. చట్ట విరుద్దం కూడా.
బ్లాగులోని నా రచనలతో మీకు జ్యోతిష్యం పై కొంత అవగాహణ కుదిరి ఉండవచ్చు. తమిళంలోనైతే టపాల సంఖ్య రెండు వేలను సమీపిస్తుంది.తెలుగులో నాకు అంత సీన్ లేదు . అందుకే ఈ సుధీర్ఘ ఉపోద్ఘాతం.
కేవలం మీరడిగిన వాటికి సమాదానం ఇస్తేనే మీరు సంతృప్తి చెందేవారు. కాని నా క్లెయింట్స్ ను ఎజుకేట్ చెయ్యాలన్నది నా ఉద్దేశం.
ఒక ప్రధాన మంత్రి/ముఖ్యమంత్రి తన మంత్రులకు శాఖలు (పోర్ట్ ఫోలియోస్) విభజించి ఇచ్చినట్టే భగవంతుడు కూడ ఈ ప్రపంచంలోని రంగాలు,వస్తువులు, మనుష్యులు,జంతువులను 9 భాగాలు చేసి (శాఖలుగా విభజించి) నవ గ్రహాలకు వాటి పై ఆధిపత్యం కల్పించి ఉన్నాడు.
మీకు ఒక మంత్రితో సత్సంభందాలుంటే ఆ మంత్రిత్వ శాఖలో అన్ని పనులు అవుతాయికదా. అలానే మీ జాతకంలో ఒక్క గ్రహం మంచి పొజిషన్లో ఉంటే ఆ గ్రహానికి సంభంధించిన రంగాలన్ని అనుకూలిస్తాయి. ఈ మెయిల్ చివరన నవగ్రహాల పోర్ట్ ఫోలియో ఇచ్చాను.
ఇలాగే మీ జాతకం ఒక పోర్టబుల్ టివి వంటిది. జాతక చక్రంలోని పన్నెండు గళ్ళు ఒక్కో చానల్ వంటివి, ఒక్కో చానల్ మీ జీవితానికి సంభంధించిన కొన్ని విషయాలను చూపుతాయి. పై తెలిపిన నవగ్రహాల్లో ఒక్కో గ్రహం రెండేసి చానల్ కు భాధ్యత వహిస్తాయి. సూర్య చంద్రులకు మాత్రం చెరో ఒక చానల్ పై ఆధిపత్యం ఉంటుంది.
ఏ చానల్ ( భావం) ఏ ఏ విషయాలను చూపుతాయో ( కారకత్వం ) ఈ మెయిల్ చివర పేర్కొన్నాను. జాగ్ర్తత్తగా పరిశీలించండి.
ఇలా ముందుగా ప్యేకేజ్ ఇవ్వడం వలన ప్రతి సందర్భంలోను హోటెల్ సర్వర్ లాగా గ్రహ కారకత్వాలు/భావ కారకత్వాలు ఏకరవు పెట్టే అవసరం ఉండదు. ఈ భావం చెడింది. ఫలాన గ్రహం బలహీనపడిందంటే సరిపోతుంది.
మీరు ఈ మెయిల్ యొక్క ప్రింట్ అవుట్లో ఏ భావం (చానల్ ) ఏ ఏ విషయాలను సూచిస్తుందో, ఏ గ్రహం ఏ ఏ విషయాలపై ప్రభావం చూపుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు.
లగ్న ఫలం,రాశి ఫలం వంటివి నూటికి నూరు శాతం నిజంకావాలని లేదు. ఇతర గ్రహ స్థితులను పట్టి అవి అటు ఇటుగా వొర్క్ అవుట్ అవుతుంటాయి.
మీ జాతకంలోని ఏ గ్రహస్థితిని, ఏ గ్రహ సమ్మేళనాన్ని విడువ కుండా ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. కాని అనుభవంలో చూసినప్పుడు జ్యోతిష్కులు చెప్పే అన్ని దుష్ఫలితాలు జరిగిపోవడం లేదు. అన్ని శుభ ఫలితాలు జరిగి పోవడం లేదు. ఒకే గ్రహ స్థితి ఏ ఇరువురికి ఒకే విదమైన ఫలితాలు ఇవ్వడం లేదు.
ఇందుకు ఎన్నో కారణాలున్నవి. తల్లి,తండ్రి ఆశిస్సులు, జెనటికల్ కాజస్, వాస్తు, సోదరులు, భార్య/భర్త జాతకాలు ఫలాల పై తమ ప్రభావాన్ని చూపుతాయి.
మరో పాయింట్ కూడా ఉంది. గ్రహాలు తమ దుష్ప్రభావాన్ని చూపినప్పుడు మీరు వాటిని అంగీకరించి సర్దుకు పోయినప్పుడు వాటి తీవ్రత తగ్గి పోతాయి. ఉ. మీ జాతక ప్రభావం కారణంగా గయ్యాళి భార్య వస్తే మన ఖర్మ ఇంతేనని మీరు ఇతర విషయాల పై దృష్ఠి పెట్టి జీవితం సాగిస్తే ఇబ్బంది లేదు. అలా కాక ఆమెను సరిదిద్దాలనో ,వదిలించుకోవాలనో ప్రయత్నించినప్పుడు దుష్ఫలం రెట్టింతలవుతుంది.
పైగా ఒక పొజిషన్ లో ఉన్న గ్రహం నేను ఈ ఒక్క ఫలితాన్నే ఇస్తాను అని మంకు పట్టు పట్టదు తాను ఆధిపత్యం వహించే ఏదో విషయంలో తన తడాకా చూపుతుంది. అలాగే తాను సంభంధపడిన ఏదో ఒక భావ కారకత్వాన్ని ప్రభావిస్తుంది.
మరో పాయింట్ ఏమంటే మీ వర్థమానం గతాన్ని పట్టి, భవిష్యత్తు వర్థమానాన్ని పట్టి కొద్దో గొప్పో మార్పుకు గురవుతుంది. భగవంతుడు మానవుడను స్వతంత్రంగా జీవించమని శపించి ఉన్నాడు. ప్రతి జీవితం ఒక డ్రాయింగ్ అనుకుంటే భగవంతుడు/ గ్రహాలు అందుకు అవుట్ లైన్ ను మాత్రమే నిర్ణయిస్తాయి. ఆ అవుట్ లైన్ లోపు మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
కాబట్టి నేనిచ్చే ఫలితాలు ఇదివరకే వంద శాతం మీకు జరిగి ఉండాలని అర్థం చేసుకోకండి. ఇప్పటివరకు జరగని ఫలితాలు భవిష్యత్తులో జరుగ వచ్చు. భవిష్యత్తులోను జరగని ఫలితాలకు బదులుగా ఆ ఫలితాన్ని ఇవ్వవలసిన గ్రహం తన పోర్ట్ ఫోలియోలోని మరే రంగంలోనో ఇచ్చిందని తెలుసుకొండి.
ఉ. మీ జాతకానికి గురు శుభుడై ఉంటే మీరు టీచర్ మాత్రమే కావాలని లేదు. గురువుయొక్క పోర్ట్ ఫోలియోలోని ఇతర అంశాల్లో లాభ పడ వచ్చు. ఉ. కోర్టు, జడ్జి,ఫైనాన్స్,బ్యాంక్
గ్రహ కారకత్వాలు: (ఏ గ్రహం ఏ ఏ విషయాల పై తన ప్రభావం చూపుతుంది)
భావ కారకత్వాలు:( ఏ చానల్ ఏ ఏ విషయాలను సూచిస్తుంది)
1.లగ్నం :
జాతకుని శరీరం,మనస్సు, గుణ గణాలు ,అరోగ్యం
2.దన భావం:
దినసరి లేదా నెలసరి ఆదాయం, వాక్కు, కుటుంభంతో సంభంధాలు, కళ్ళు
3.సోదర భావం:
జాతకుని కనిష్ఠ (యంగర్) సోదర,సోదరీమణులు, దైర్య సాహసాలను, ప్రయాణాలను సంగీత జ్ఞానాన్ని,దాని పై ఆసక్తిని సూచితుంది
4.మాతృ భావం:
తల్లి, ఆమె తరపు భంధువులు, ఆమె తాలూకు ఆస్తి, ఇల్లు, వాహణం ,విథ్య ,హృదయం
5.పుత్రభావం:
బుద్ది,పుత్ర, పుత్రికలు,అదృష్థం ,ద్యానం యోగం, యాధృచిక దన లబ్ది
6.శతృస్థానం:
ప్రాణానికి ముప్పు తేని శతృ, నయం కాగల రోగం, తీర్చ కలిగిన రుణములను
7.కళత్ర భావం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ లను సూచిస్తుంది
8.ఆయువు స్థనం:
తీరని రోగాలు,అప్పులు,జైలు పాలు,గండాలు,మరణం,దివాళా తీయడం,మర్మాంగం
9.భాగ్య భావం:
తండ్రి,తండ్రి తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తిర్త యాత్రలు,మోకాలు
10.జీవన భావం:
వృత్తి,వ్యాపారాలు,పదవులు,పాపకృత్యములు
11. లాభ భావం:
వ్యాపారం,ఎల్డర్ బ్రదర్ సిస్టర్
12.వ్యయ భావం:
సెక్స్ లైఫ్,నిద్రా,ఖర్చులు పెట్టే విధానం,పాదాలు
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment