ఇదేంటి నిన్నా మొన్న దాక వై.ఎస్. ఆర్ అమర్ రహే జై జగన్ అన్న వ్యక్తి ఇలా మాట మార్చాడనుకోకండి. పరిస్థితి చెయ్యి దాటి పోతూంది. ఇప్పుడు నువ్వా నేనా అని చూసుకోవలసిన పరిస్థితి లేదు. ఒక్క మైక్రో ఫైనాన్స్ బిల్లు విషయంలో దిల్లీలోనుండి ప్రణబ్ ముఖర్జి మాట్లాడుతున్నారు. దీని వెనుకటి కథా కమేషా ఏమిటో అందరికి తెలిసిందే.మైక్రో ఫైనాన్స్ కంపెనీల నెట్ వర్క్ అధ్యక్షుడు విక్రమ్ తో సోనియా, రాహుల్ గాంథిలకున్న సంభంధమేమిటో ,ఒక దశలో బ్యేంక్ కరప్టుగా ప్రకటించ బడనున్న వ్యక్తికి (విక్రమ్) ఇన్ని లక్షల కోట్లు ఎలా సర్దుబాటు అయ్యాయో చందమామ పాఠకులు సైతం ఇట్టే చెప్పగలరు.
బ్యాంకులు మహిళలకు సూటిగా రుణంగా అందివ్వవలసిన సొమ్మును తమ ఖాతాలోకి డైవర్టు చెయ్యించుకుని వడ్డీలకు వడ్డీలు గుంజేరు. వీరి తాకిడికి ఇల్లొదలుకున్న వారెందరో, ఊరే విడిచి పెట్టిన వారు ఎందరో, ఊపిరే తీసుకున్నవారెందరో? వీటన్నింటికి మూలం డిల్లీలో ఉంది.
గతంలో బడా నేతలు దోచుకున్న సొమ్మంతా స్విస్ బ్యాంకులో దాచి పెట్టేవారు. వాటికి వడ్డీలు రావు కదా పైగా హ్యేండ్లింగ్ చార్జస్ కూడ ఉంటాయి. కాని ఇప్పట్లో నేతలు తమ అవినీతి సొమ్మును వడ్డీకి తిప్పే స్థాయికి ఎదిగిపోయేరు. పైగా వీరు వడ్డీలు గుంజింది ఏ కోటీశ్వరుల వద్దనుండో? లక్షాధికారులవద్దనుండో కాదు.
మన ఊళ్ళో ఇడ్లీలు,బోండాలు, చీపురుకట్టలు అమ్ముకునే నిరుపేదలైన అక్క చెల్లెళ్ళు, అమాయకులైన మహిళల వద్దనుండి. మరీ ధారుణంగా వడ్డీలు గుంజేరు. దీని అసలు కథ నదిపించేదెవ్వరో తెలీక రోశయ్య ఆవేశ పడి పోయి ఆర్డినెన్స్ పాస్ చెయ్యడంతో ఇంటికి వెళ్ళారు.
ప్రస్తుత ప్రభుత్వం మై.ఫై బిల్లును అసెంబ్లీలో దాఖలు చేస్తుంటే దిల్లిలో ప్రణబ్ సూచనలు ఇస్తున్నారు. ఇంతకన్నా సంక్షోభం మరెక్కడుంది. తెలంగాణ పేరుతో చిచ్చు పెట్టేరు. రాష్ఠ్ర్రాన్ని రెండు దేశాలకంటే ఘోరంగా విభజించి పాలించ చూస్తున్నారు.
రైతు కన్నీళ్ళు తుడవాలంటే దిల్లికి వెళ్ళి విన్నవించుకునే దుస్థితి. గతంలో కేంద్రంలో మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ పరస్పర సైద్దాంతిక వైరుధ్యాలను పక్కన పెట్టి కలిసి పని చేసినట్టే
రాష్ఠ్ర్ర ఆత్మ గౌరవాన్ని, రాష్ఠ్ర్ర మహిళల శీలాన్ని,స్వేచ్చను రక్షించుకోవాలంటే కాంగ్రెసుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావల్సిన తరుణం ఇదే. ఈ మెగా కూటమిలో బా.జా.పా ను సైతం కలుపుకోవచ్చు. ( వారు కూల్చటానికి మరో మసీదు లేదుగా).
బాబు పరిపాలించిన 9 సం.ల కాలం , వై.ఎస్. పరిపాలించిన ఐదు సం.ల కాలంలో చోటు చేసుకున్నట్టుగా ఇంతకాలం బురద చల్లుకున్న , ప్రచారం చేసుకున్న స్కేమ్ల పై ఒక ఉమ్మడి విచారణ కమిషన్ వేస్తే సరి. జగన్, తె.దే.పా కలిసి పని చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
ఇక్కడివారు తమలో తాము కలహించుకుంటుంటే అక్కడి వారు విభజించి పాలించు చందాన రాజకియ చదరంగం ఆడుతున్నారు. వారి కుట్రకు రాష్థ్ర్రాన్నిరాష్ఠ్ర్ర ఆత్మ గౌరవాన్ని, రాష్ఠ్ర్ర మహిళల శీలాన్ని,స్వేచ్చను రక్షించుకోవాలంటే ఈ ఐక్యతా రాగం అందుకోక తప్పదు.
తెలంగాణ అంటారా ? అది కావాలో వద్దో ఆ ప్రాంత ప్రజలే నిర్ణయించుకునే వీలు కల్పించాలి. ప్రత్యేక రాష్ఠ్ర్రం నినాదానికి కారణమైన అంశాల పై వందరోజుల అక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించుకుని దాని పై చేతనైనవి చేసి తదుపరి తెలంగాణ ప్రాంతంలో ఓటింగ్ నిర్వహించాలని ఒక అవగాహణకు రావచ్చు. రాష్ఠ్ర్ర ఆత్మ గౌరవం ముఖ్యమో ? తెలంగాణా ముఖ్యమో తేల్చుకోమని తె.రా.స ను ఇరుకున పెట్టి ఈ ప్రతిపాదనకు ఒప్పించాలి.
ఈ మెగా కూటమికి చంద్రబాబు నేతృత్వం వహించాలని ఎందుకు చెప్పానంటే ఆ 9 సం.ల బాబు ప్రస్తుతం లేడు. ఆయనలో పరిణితి,పరిపక్వత వచ్చింది. పైగా బాబు ప్రధాన రాజకీయ ప్రత్యర్ది అయిన వై.ఎస్ లేని ఈ క్షణాన రాష్ఠ్ర్రం తరపున కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టిని ఎదుర్కొనే వ్యూహం, సత్తా బాబు ఒకరికే ఉంది.
అ.. చెప్పడం మరిచాను. బుద్ది గడ్ది తిని సోనియా పిలువగానే దిల్లీకి పరుగులు తీసాడుగాని చిరంజీవి కూడ తెలుగు తల్లి ముద్దు బిడ్డే కాబట్టి ఈ మెగా కూటమిలో ప్రజా రాజ్యాన్ని కూడ తేవాలి
ikkada raashtra mahilala seelam gurinchi enudu matladaru ? I don't understand.
ReplyDeleteChandra babu ye yenda ku aa godugu pattukune vyakthi. athaniki viswaneeyatha ledu. athani nammukunte inka mana bathuku chittoor old bus stand avuthundi
ReplyDelete