గతంలో ఓ టపాలో మా నాన్న గురించి వ్రాసినట్టే ఈ టపాలో నా తల్లి గురించి వ్రాస్తాననుకుంటే ఆశ దోశ అప్పడం వడా.. ఈ టపాలో మా అమ్మ గురించి కాదు. మన అమ్మల కన్న అమ్మ గురించి వ్రాస్తా. ఈ అమ్మ గురించి నేను వ్రాసిన పద కవితలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటిని బ్లాగులో పెట్టాలంటే మూన్నెల్లు ఒక టైపిస్ట్ ఓవర్ టైమ్ చెయ్యాల్సి ఉంటుంది. అయినా తనివి తీరడం లేదు.
ఒక జన్మంతా నమ:శివాయ జపించాలట. అలా చేస్తే గాని తదుపరి జన్మలో రామ నామం జపించే అర్హత కలుగదట. ఆ జన్మంతా రామ నామం జపిస్తే ఆతరువాతి జన్మలో అమ్మ మీద మనస్సు మళ్ళుతుందట.ఎవరో చెప్పారు.
నా వరకు నా తల్లి మూడు జన్మల ప్రాసస్ ఒక్క జన్మలో పూర్తి చేసింది. నేను జ్యోతిషం నేర్చుకున్న కొత్తలో నా జాతకంలో సూర్య చంద్రులు ప్రక్క ప్రక్క రాశుల్లో ఉన్నారని -అది శివశక్తి యోగమని ఎక్కడో చదివి కొంత కాలం పంచాక్షరి జపించాను. ( ఇది మహా అయితే ఒక ఏడాది ఉండొచ్చు అంతే)
ఆతరువాత టీన్ ఏజ్ ప్రభావంతో పీడించిన కామవాంచ కట్టిడికి హనుమన్న నామం -ఆయన సాన్నిత్యం పొందటానికి రామన్న నామాలు జపించాను. ఇది 1987 నుండి 2000 డిసెంబరు 23 వరకు. అంటే పదమూడు సం.లా?
అమ్మవారి పై నా మనస్సు మళ్ళింది. ప్రారంభదశలో అష్ఠ కష్థాలు పడ్డాను. సరిగ్గా 20సం.లకు నా జీవితాన ఒక మలుపొచ్చింది. మరి మూడేళ్ళు పూర్తయి పోతున్నాయి. నా జాతకనా సకట యోగం ఉన్నది. ప్రతి రెండుంకాలు రోజుకొక సారి నా స్థితిగతులు పూర్తిగా మారిపోవాలి. నా జాతకాన 6,8,12 అధిపతులు లగ్నంతో సంభంధ పడినారు. ఇది ఎంతటి దుర్భరమో జ్యోతిషంలో ఓనామాలు తెలిసిన వారు సైతం అర్థం చేసుకోగలరు.
పైగా సంపాదన మార్గాల్లో పేర్కొన్నట్టుగా నా ఆదాయం కేవలం లీగల్ గా ఉంటే సరిపోదు ధర్మ సమ్మతంగాను ఉండాలనుకునే చాదస్తపు ము.కొడుకుని. అయినా పది మందిలో గౌరవంగా బతికేస్తున్నానంటే ఇదంతా కేవలం ఆమె పెట్టిన భిక్ష మాత్రమే.
కులాంతర వివాహానంతరం ఒక మూడు సం.లు మా నాన్న పుణ్యమా అని కాలం గడిచి పోయినా 1994 నుండి 2007 దాకా నేను అనుభవించిన దారిద్రియం, అపఖ్యాతి మరొకరికి సంభవించి ఉంటే ఒకటి పిచ్చెక్కి ఉంటుంది.లేదా ఆత్మ హత్య చేసుకుని ఉంటారు.
నేనా మాత్రం ఆ గడ్డుకాలాన్ని తట్టుకుని భయిట పడగలిగానంటే అది ఆమె దయ కాక మరేది కాదు. ఈ రాత్రికి మూడు జాతకాలకు ఫలితాలు పంపవలసి ఉంది. టైమ్ అర్థరాత్రి పన్నెండవుతూంది. అయినా నేనీ టపా టైప్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మూడు జాతకులు నన్ను ఆశ్రయించటానికి కారణం ఆమె.
ఆమెకు కనీశం థ్యాంక్స్ అన్నా చెప్పకుంటే నాకూ ఓటేసిన ప్రజానీకాన్ని నట్టేట ముంచే రా.నాయకునికి తేడా ఏముంది.
మరి ఆమెతో నాకు కుదిరిన అవగాహణ ఏమంటే " తల్లీ ! నువ్వు నన్ను రక్షించు.. నేను ఈ దేశాన్ని రక్షిస్తా .." రిజర్వు బ్యాంకులోకి ప్రవేశించాక ఐదురూపాయల కట్టకు కన్నం పెట్టడం మూర్ఖత్వం కాదా? సర్వ శక్తి సంపన్నురాలైన ఆమె వద్ద ఇంతకన్నా పెద్ద కోరిక కోరే తెలివి తేటలు నాకు లేక ఈ చచ్చు కోరిక కోరా..
కాలం కలిసొస్తే ఆమెకు నాకు మద్యనున్న భాంధవ్యాన్ని మీతో ( జగతితో) పంచుకుంటా. ఇంతకీ శీర్షికలోని తల్లి ఓకే. లొల్లి ఓకే ( నాదే) అదేంటి ఉల్లి అంటారా?
ఉల్లిపాయను ఉలుస్తూ పోతే చివరికి ఏమీ మిగలదట .. మానవ జీవితం కూడ అటువంటిదే ..అనుమానం ఉన్నవారు మీ పూర్వికుల జీవితాలను ఒక సారి నెమురవేసుకొండి.
నా మీ జీవితాల పరిస్థితి కూడ అంతే. ఉన్నంత కాలం ,మనలను ఉలుస్తున్నంత కాలం కాస్త కన్నీళ్ళన్నా పెట్టిస్తాం. ఆనంద బాష్పాలు.
వెల్
ReplyDeleteyes it is the true path of matured devotion.siva-vishnu-sakthi.I am also in the same path sishyaa.
ReplyDelete