నాకన్నా చంద్రబాబును విమర్శించినవారు ఎవ్వరూ ఉండరు. ( అప్పట్లో ఆయన చేతలు అలా) ఇప్పట్లో ప్రతిపక్ష నేతగా నా అంతగా కీర్తించ పోయే వారు ఉండరనుకుంటా ( ఈ రోజు శాసన సభలో ఆయన మాటలు అలా).
ఈ రోజు మంచి హోమ్ వర్క్ చేసి భాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. రైతాంగం ఎదుర్కొంటున్న క్షోభను కంటికి కట్టినట్టుగా చూపారు. భూములు బ్రాహ్మణుల చేతనుండి, అగ్ర కులాలవారి చేతికి ,ఆ పై బహుజనుల చేతికి ( కౌలు పద్దతిన) ఎలా వచ్చాయో వివరించడం ప్రారంభించి బాబు ప్రసంగిస్తుంటే నాకు వళ్ళు పులకరించింది.
వ్యవసాయ రంగంలో రైతులను ఇబ్బంది పెడుతున్న, నష్ఠ పరుస్తున్న ప్రతి చిన్న పెద్ద విషయాన్ని ప్రస్తావించి సుధీర్ఘ్ ప్రసంగమే చేసారు. నాలుగైదు గ్రామాలను ఒక యూనిట్ గా పరిగణించటం, కోతలనంతరం రిస్క్ కవరేజ్ ఉండక పోవడం ఇలా ఒకటి కాదు.
హేతుబద్దత లేని కేంద్ర ప్రభుత్వం యొక్క ఎగుమతి,దిగుమతి పాలసి ఎలా రైతులను నష్ఠ పరుస్తుందో వివరిస్తుంటే పాలకుల మూర్ఖత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
స్వామిదాదన్ కమిటి రిపోర్టు సారాన్ని బాబు ఏం చక్క స్పూన్ ఫీడింగ్ చేస్తుంటే అవి అమలైతే రైతులు భాగుపడరన్న నగ్న సత్యం పాలకులకు ఎప్పుడర్థం అవుతుందానన్న ఆవేదన కలిగింది.
పంట ఖర్ఛులు+ కూలి+ సూపర్ విషన్ కూలిలను లెక్కించి దానికి యాబై శాతం కలపాలట -ఇది స్వామినాదన్ కమిటి రిపోర్టు సారం. వారే వా!
కాని ఆయన గారి ప్రసంగం వింటుంటే ఈ సత్యాలు,రైతు దుస్థితి ఆ 9 సం.ల్లో బాబుకు ఎందుకు స్ఫురించలేదోనన్న బాధ కూడ కలిగింది. బహుసా ఈ ఆరేళ్ళ ప్రతిపక్ష నేత హోదా ఈ వాస్తవికతను ఆయన్కు బోధించిందేమో?
బాబు ఇలా ఉద్వేగంతో ప్రసంగిస్తుంటే ఒక మంత్రి రన్నింగ్ కామెంట్రి ఇవ్వడం - బాబు అతనికి హితువు చెబుతుంటే సాక్షాత్తు సి.ఎమ్ ఆ మంత్రికి వంతె పాడటం చాలా చైల్డిష్ అనిపించింది.
బాబుకు చికాకు పుట్టించి అతని ప్రసంగాన్ని పక్కదోవ పట్టింఛాలని సి.ఎమ్ మొదల్గొని పాలక పక్షం అందరు ప్రయత్నించినా ఏమాత్రం తునక కుండా అహానికి తావివ్వక తన వ్యాఖ్యల్లో పొరభాటుంటే తొలగించ వచ్చని చెప్పి అనుకున్న విషయాలను అనుకున్నంత సూటిగా చెప్పగలిగారంటే బాబు పరిణితి చెందిన స్టేట్స్ మెన్ అనిపించుకున్నారు.
బెటర్ లేట్ దేన్ నెవర్ అని ఇప్పటికైనా బాబు ప్రసంగంలోని సత్యాలను కిరణ్ కుమార్ గ్రహించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటే మర్యాదగా ఉంటుంది. అలా కాక డిసెంబరు 21,22 దాకా లాగితే సీను సితారే..
Exactly..!!
ReplyDelete