బేసికల్ గా నేను ప్రజాభిమానిని. ప్రజాభిమానాన్ని చొరగొన్నారు కాబట్టి ఎన్.టి.ఆర్ అభిమానినైనాను. ఎన్.టి.ఆర్ ఆదర్శ పథకాలను (ముఖ్యంగా రెండు రూపాయలకే కిలో భియ్యం పథకం) అమలు చేస్తుండటంతో ఎన్.టి.ఆర్ అసలు సిసలైన వారసుడు వై.ఎస్.ఆరేనని స్ఫురించి వై.ఎస్. కు మద్దత్తు పలకడం ప్రారంభించాను. చిత్తూరు వాసిగా వై.ఎస్. ప్రకటించిన ఎం.ఎల్.ఏ అభ్యర్ది విజయం కోసం నా సాయశక్తులా పని చేసాను.
జగన్ విషయానికొస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయం ఖచ్చితంగా జగన్ ,జగన్ స్థాపించిన సాక్షి తో నే సాధ్యమైందన్నది నా విశ్లేష్ణ. ఎంత గొప్ప నాయకుడైనప్పటికి ప్రతి పక్షాలన్ని ఏకమైనప్పుడు ఆయన వారందరి ప్రభావాలను బేరేజు చెయ్యగలిగారేమో గాని అధిగమించగలిగాడని నేను నమ్మడం లేదు.
ఆ ఎన్నికల్లో పార్టి కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే నెగ్గింది. సాక్షి రీడర్ షిప్ ,వ్యూయర్ షిప్ లెక్కిస్స్టే ఆ ఒక్కశాతానికి సరిగ్గా సరిపోతుంది.
అటువంటప్పుడు వై.ఎస్సే ఒకడగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డిని సి.ఎం.చేసి ఉండాల్సింది. ఎప్పుడైతే జగన్నికాక విజయమ్మను కడప ఎం.ఎల్.ఏ చేసారో, ఎప్పుడైతే రోశయ్యను సి.ఎల్పి లీడర్గా ప్రతిపాదించమన్నారో అక్కడికే అదిష్ఠానం మనోభావం నాకిట్టే అర్థమైపోయింది.
13/9/2010 నాడే కాంగ్రెస్ వై.ఎస్. పేరిటి కొత్త పార్టి ఏర్పాటు చెయ్యాలని వ్రాసాను. పైగా సతరు పోస్టును జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యేక్స్ ,పోస్టు ,కొరియర్ల ద్వారా పంపాను. వీలైనన్ని ఎం.ఎల్.ఏలకు ఇమెయిల్ కూడ పంపాను. దానిని చదవ కోరితే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అందుకే ఈ టపాకు బెటర్ లేట్ దేన్ నెవర్ అని పెట్టాను. పోనీ జగన్ భవిష్యత్ ఏమవుతుందంటారా? అదేమి బంగారం కాదు గాని ప్లాటినమ్ అని గంతపదంగా చెప్పాను.చెబుతున్నాను. రానున్నది జగన్నామ సం. ఈ బ్లాగులో ఈ శీర్షికన కూడ ఒక టపా ఇదివరకే వ్రాసాను.
http://anvvapparao.blogspot.com/2010/11/blog-post_30.html
ReplyDelete