Wednesday, November 17, 2010

మన ఎం.పి.ల మెయిల్ అడ్రస్సులన్ని బోగస్

నేష్నల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (http://www.nic.in) ప్రతి ఎం.పియొక్క వివరాలను శేఖరించి పొందు పరిచింది. కొందరు ఎం.పిలు పాపం నిజాయితి పరుల్లా ఉన్నారు. ఎటూ మనం స్పందించపోయేది లేదు.ఎందుకు మెయిల్ ఐడీస్ ఇచ్చి ఆశ పెట్టడమని బొత్తిగా మయిల్ ఐడిస్ ఇవ్వలేదు. చాలామంది ఉత్తములు ఇచ్చేరు. వారందరికి మెయిల్స్ పంపాను. కాని ఆ మెయిల్ ఐడీస్ అన్నీ ఉత్తుత్తివెనని తేలింది.ఎలా? అని అడుగుతారు.ఆ వివరాలు ఈ టపా చివరన తెలియ చేస్తాను. ఇంతకీ వారికి మెయిల్ పంపేటంత రాచకార్యం నీకేమొచ్చింది నాయనా అని ఆడుగుతారు.  చెబుతాను.

ఆపరేషన్ ఇండియా2000:
ఇది మన దేశ సర్వసమస్యలకు సమూల పరిష్కారంగా నేను రూపొందించిన యాక్షన్ ప్లాన్ .1986 నుండి గుండు పగులకొట్టుకుని మరి రూపొందించాను.

ఇందులో ఐదు ముఖ్యాంశాలున్నాయి. అధ్యక్ష తరహా పాలన ,ప్రజలుప్రత్యక్షంగా తమ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. దేశంలోని ప్రతి ఒక్క నిరుధ్యోగికి ఆందులో స్థానం ఉంటుంది. మహిళలు,అంగ వైకల్యం గలవారు,పాత నేరస్తులు ఇలా ప్రతి ఒక్కరికి ప్రత్యేక సైన్యంలో స్థానముంటుంది. గ్రామ స్థాయి నుండి రైతు సంఘాలు నెలకొల్పుతారు .దేశంలోని పొలాలన్ని రైతు సంఘానికి లీజు ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. సమిష్ఠివ్య వసాయానికి రంగం సిద్దం చేస్తారు.. ప్రత్యేక సైన్యం నదుల అనుసంథానం చేపడుతుంది.అలాగే వ్యవసాయఉ త్పత్తుల రవాణా ,నిల్వ ,ఎగుమతికి అవసరైమన రోడ్లు, రైల్వే మార్గాలు,గిడ్డంగులు,కోల్డ్ స్టోరేజి ,ఓడ రేవ్లను అభివ్రుద్ది చేస్తుంది. దేశంలో స్విజ్ తరహా బ్యాంకు ఒకటి నెల కొల్ప బడుతుంది. పరదేశాల్లో మగ్గుతున్న నల్ల దనం స్వదేశం చేరుకునే ఏర్పాటు చెయ్య బడుతుంది.

100 రోజుల గడువులోపు అన్య దేశాల బ్యాంకుల్లో మగ్గుతున్న నల్ల దనమంతా స్వదేశం చేరాలి. గడువు ముగిసాక ప్రతుత కరెన్సి రద్దు చేయబడుతుంది.కొత్త కరెన్సి అమల్లోకివ స్తుంది. పాత కరెన్సి కలిగి ఉన్నవారు అవి తమ చట్టబద్దమైన సంపాదనే అని నిరూపించి బ్యాంకులద్వారా కొత్త కరెన్సి పొందవచ్చు అని ప్రకటిస్తారు

ఇందులోని ప్రతి ఆంశాన్ని కూర్చటం వెనుక ఎంతో శ్రమ,అద్యయనం ఉన్నాయి. ఒక్కో అంశం అమలుతో కొన్ని వేల సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రస్తుతానికి ఈ ఐదు అంశాల అమలుతో పరిష్కారం కాగల కొన్ని అంశాలను పొందు పరుస్తున్నాను.

అద్యక్ష తరహా పాలన:
సుస్థిరత ఏర్పడుతుంది. (ఈ విడత యు.పి.ఏ కూటమికి మెజారిటి దక్కింది కాబట్టి కొంత మేలైంది.అయినప్పటికి తమిళనాడు సి.ఎం. ఎం.కరుణానిధి తమ కొడుకులు,మనమళ్ళకు మంత్రి పదవులు పొందటం కోసం ఎంతగా ఆట పట్టింఛారో మీకే తెలుసు) క్యేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలన్నది ప్రధాన మంత్రియొక్క హక్కు.

కాని ఏక పార్టి పాలన లేక పోవడంతో ,సంకీర్ణ ప్రభుత్వం కాక పోవడంతో ప్రధాని వత్తిళ్ళకు లొంగి అసమర్థులను సైతం క్యేబినెట్లోకి తీసుకోవలసి వస్తుంది. ఇక భారతదేశ చరిత్రలో ఏక పాటి పాలన అసాధ్యం. అధ్యక్షతరహా పాలన అమలైతే త్రికోణ పోటి నెలకొంటే 52శాతమున్న SC,ST,BC,MINORITYS సగం మంది ఓటర్లు ఐక్యమత్యంగా ఓటేసినా SC,ST,BC,MINORITYల ఆధరణ పొందిన అభ్యర్థి అధ్యక్శుడయ్యే అవకాశం ఉంది.

అలాగే రాజ్య సభలు ఇప్పట్లో కాలం చెల్లిన రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారినాయి. అధ్యక్ష తరహా పాలనలో అయితే దేశ అధ్యక్షునికి ఎం.పి.ల దయాభిక్షంతో పనిలేదు కాబట్టి అసలు సిసలైన మేధావులను రాజ్యసభలకు నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది

అధ్యక్షునికి (నేటి ప్రధానమంత్రిలా) ఎం.పి లను సంత్రుప్తి పరచవలసిన అవసరం ఉండదు. 24గంటలు ప్రజా సంక్షేమం,దేశాభివ్రుద్ది పై ద్రుష్ఠి సారించే అవకాశం ఉంది.

నదుల అనుసందానమే ద్యేయంగా 10కోట్లమంది నిరుధ్యోగులతో ప్రత్యేక సైన్యం:
ఉధ్యోగవకాశాలు లేక యువతయొక్క యువ శక్తి ఎన్నో విదాలుగా వ్రు)ధా అయిపోతుంది. హస్తప్రయోగం,ఈవ్ టీజింగ్,అక్రమసంబంధాలు,సూడో నక్సలిజం,తీవ్రవాదం,ప్రాంతీయ వాదం,వర్గ పోరు,కులాల కురుక్షేత్రం,బాషా ఉద్యమాలు,నేరాలు,కుటిల రాజకీయాలు,రౌడీయిజాలు,మాఫియా ఇలా ఎన్నో విషయాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఏకంగా దేశంలోని ప్రతి యువతకు ఉపాది కల్పించేస్తే ఇక రిజర్వేషన్,యాంటి రిజర్వేషన్ల గొడవలు,నియామకాల్లో అవినీతి వంటివాటికి తావే ఉండదు.ప్రతి యువతి,యువకుడు దెశ పున:నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించడం వలన దేశ భక్తి పెరుగుతుంది.

లింగ భేదాల్లేకుండా యువతీ యువకులకు ప్ర.సైన్యంలో స్థానం కల్పించడం వలన స్త్రీ) ప్రురుషుల నడుమ సమానత్వం ఏర్పడ్తుతుంది.

క్రమశిక్షణతోప్రాంత ,రాష్ఠ్ర), కుల,మత,బాషా వైషమ్యాలకు అతీతంగా కలిసి పనిచెయ్యడంవలన సదరు విభేధాలు,వైషమ్యాలు తొలిగి పోతాయి.పైగా యువతి యువకులు ప్రేమ వివాహాలకు పాల్పడితే కుల వ్యవస్థ కూలే అవకాశం కూడ ఉంది.

అవసరమైతే జైల్లోని ఖైదీలను,కళాశాల,విశ్వవిద్యాలయ విథ్యార్థి విథ్యార్దులను,ఇదివరకే ఉన్న సైన్యంలో కొంత భాగాన్ని సైతం ప్రత్యేక సైన్యంలోకి తీసుకొని నదుల అనుసందాన కార్యక్రమానికి వినియోగించుకోవచ్చు.

గమనిక: ప్రస్తుతం పాక్,చైనా,నేపాల్ దేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటే ,ఆయా దేశాలు సైతం నదుల అనుసందానంలాంటి బ్రుహత్తర పథకాలను అమలు చేసేలా చూస్తే డిఫెన్స్ వ్యయాన్ని భారిగా తగ్గించుకోవడమే కాక నదుల అనుసందానికి కొంత నిదులు సమకూరుతాయి.


1998లో ఈ ప్లాన్ ను ఎం.పిలకు అందచెయ్యాలని రెండు వందల ప్రతులు రోనియో వెయ్యించి నాటి లోక్సభ స్పీకర్ జి.ఎం.సి బాలయోగిగార్కి పంపాను.

నెలలు తరబడి నో రెస్పాన్స్. రిమైండర్లు ఎన్ని గుప్పించినా అంతే సంగతులు. ఆ లోపు ఎన్నికలొచ్చాయి. ఎన్.టి.ఆర్ అభిమానిగా ఆ ఎన్నికల్లో తె.దే.పాకు పని చేసాను. ఎం.పి అభ్యర్ది ఎన్.రామకృష్ణా రెడ్డిగారికి బూత్ ఏజెంటుగా కూర్చున్నాను. సతరు గేట్ పాస్ జతపరచి ఎం.పి గారికి ( గెలిచాడులెండి) నా సోది వ్రాసాను.

ఎం.పి.గారికి నేను వ్రాసిన లేఖను ఉటంకిస్తూ స్పీకర్ కార్యాలయం స్పందించింది.

మీరేదో పార్సెల్ పంపామంటున్నారు.మాకు అటువంటిదేది అందలేదు అన్నది ఆ లేఖ సారాంశం. వెంటనే నేను తపాలా శాఖవారిని సంప్రదించి సతరు పార్సెల్ వారికి డెలివరి అయినందుకు ఆధారాలు సంపాదించి పంపాను.

అందుకు వారు " ఆధారాలైతే పంఫారు గాని మీ పార్సెల్ ను మా కార్యాలయంలో లొకేట్ చెయ్యలేక పోతున్నాం. మరో ప్రతి పంపితే వెంటనే అవసరమైనన్ని ప్రతులు మేమే తయారు చేసి ఎం.పిలకు అందివ్వడం పెద్ద పనేంకాదు"అని ఉత్తరం వ్రాసేరు.

నేను వెంటనే ఆదరా బాదరా ప్లాన్ రెడి చేసి పంఫాను. బాలయోగి పోయారు. డెప్యూటి స్పీకర్ గారికి యాబై రూపాయల పోస్టల్ ఆర్డరు పంపాను."దేవరా..నేను చివరన పంపిన ప్రతినన్నా నాకు వెనక్కి పంపండి నేనే స్వయంగా దిల్లీ వచ్చి పంచుతా - పోస్టేజికి గాను ఈ పీ.ఓ జతపరచానని వ్రాసా. చాలా ఏళ్ళ వరకు నో రెస్పాన్స్.

ఈ లోపు నాకు ఇంటర్ నెట్ బ్రవిజింగ్ మీద మోజు పుట్టి  అందులో మునిగి తేలుతుండగా పై తెలిపిన http://www.nic.in సైట్ తగిలింది .అందులో ఎం.పీల మెయిల్ ఐడీస్ ఉన్నాయి.

వెంటనే అందరు ఎం.పీల మెయిల్ ఐడీస్ శేఖరించి నా ప్లాన్ పంపాను. నా మెయిల్స్ కి వచ్చిన సమాదానమేమంటే " నో సచ్ యూజర్" .

అంటే http://www.nic.in సైట్ తాలూకు సెర్వర్లో అటువంటి వాడుకరియే లేదన్నమాట. మరి ఎం.పీల బయోడేటాలో ఎందుకా బోగస్ మెయిల్ ఐడీలను పొందుపరచడం..

తి.ము.కొ

No comments:

Post a Comment