Wednesday, November 17, 2010

మీ టపాలు.. నా టప టపాలు

సహచర బ్లాగర్లందరికి నా నమస్కారం,
బ్రవుసింగ్ అంటేనే జస్ట్ అలా అలా స్క్రాల్ చేసుకుంటూ పోవడమే.. నేను మీ టపాలన్నింటిని పూర్తిగా చదివానని అబద్దం చెప్పను. ఊరికే అలా ఇలా స్క్రాల్ చేసానంతే .. నాకు తోచినవి వ్రాస్తున్నా. ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు.కొందరి టపాల పై ఏమీ వ్రాయకుంటే నాకు ఏదీ తోచలేదని అర్థమంతే..

"అనంతమైన ఆలోచనలు :: ఎవరన్నారు నా కాళ్లమీద నేను నిలబడట్లేదని ,,,,ఆయ్………."
ఆలోచనలకు అంతము లేకపోవచ్చు కాని .. ఆది మాత్రం ఉంది అది సెక్స్. అందరం కేవలం   కాళ్ళ మీదే నిలబడితే గినెస్ రికార్డుకెక్కడం  కుదరదు బాసూ.. చెయ్యి మీద నిలబడటం ప్రయత్నించరాదూ..

"సాహిత్య అభిమాని :: దొరికిన పెన్నిధి!"
సాహిత్యం? ఇంకెక్కడిదీ డిగ్రీ చదువుకున్న వారు సైతం తెలుగులో ఒక ఉత్తరం ముక్క వ్రాయలేని మొదర్నష్ఠపు రోజులొచ్చాక.. ఎందుకైనా మంచిది ఎవరన్నా మ్యూజియంకు పిలుస్తే వెళ్ళేరు.. మిమ్మల్ని అక్కడే ఉంచేస్తారేమో?( భావితరాలకోసం)

"అఖిలవనిత :: వెన్నెల చిరునామా"
మనవారు స్రుష్ఠించిన పొల్యూషన్ తో వెన్నలకు సైతం బూజులు పట్టిందేమో? ఎందుకైన మంచిది ఒక బూజుకర్రతో వెళ్ళండి

//మీ కోసం :: హోమియోపతి వైద్యం జబ్బుల నుండి ఉపశమనం కలిగిన అనుభూతిని కలిగిస్తుంది...పరిశోధన//

హోమియో అంటే "ఒకటని" అంటే రోగము,ఔషదము ఒకటేనని, అంటే రోగ కారకమైన పదార్థాన్నే తక్కువ మోతాదులో ఇస్తే జబ్బు నయమవుతుందని ఎక్కడో చదివాను ఇది నిజమేనా బాసూ..

//ప్రమోట్ తెలుగు :: మీ చెవి గుర్తింపునకు ఆధారం!//
మనల్ని కన్న (తెలుగు) తల్లే కాన్వెంట్ చదువులు చదివి ఉంటే ఇక ఎక్కడనుండి ప్రమోట్ చెయ్యాలి తెలుగును?

//Subrahmanyam :: సామెతలు-18//
బూతు సామెతల మీద ఒకాయన రిసెర్చ్ చేసాడని విన్నా? ఆ వివరాలేమన్నా తెలుసా బాస్ మీకు?

//FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ :: Leaders are Born HERE//
కొందైరైతే లంచంలో పుట్టి లంచంలో పెరిగి లంచంలోనే పోతారని బోగట్టా ఇది నిజమేనా గురువా?

//అనాలిసిస్ :: ఓదార్పుయాత్ర స్పూర్తితో సినిమా//

పోన్లెండి కూని కోళ్ళ స్ఫూర్తితో కాకుండా ఓదార్పుయాత్ర స్పూర్తితో సినిమా తీస్తే బెటర్ గానే ఉంటుందేమో? ( హీరో జగన్ లా అరిగి పోయిన రికార్డులనే మళ్ళీ మళ్ళీ వినిపించడుగా?)

//Avakaaya.com :: Recipes in Avakaaya.com//

నోరు,ఆసనం రెండు ఒకే గొట్టంయొక్క అంత్యారంభాలే. నెరవేరని సెక్స్ కోరికలు గలవారు తిండి పోతులవుతారట. అలా అస్తమానం తింటుంటే నోట ఏర్పడే కదలికలు ఆసనద్వారం దాక ప్రాకి దాని సమీపంలో ఉన్న జననేంద్రియాన్ని తాకుతాయట

//ఊహలు-ఊసులు :: నిక్ నేమ్స్//
అటో గ్రాఫ్ పంథాలో ఒక టపా ..బాగు బాగు..

//నేను-మీరు :: How I Escaped My Rapist//
ముక్కు మొఖం తెలీని వాడు స్థూలంగా జరిపే  ర్యేప్ అంటే ఇలా తప్పించుకోవచ్చు. అంకుల్,మామయ్య
టీచర్, లెక్చరర్ ముసుగుల్లో  జరిగే ర్యేప్ గాని ర్యేప్ల నుండి తప్పించుకోవడం ఎలా?

//కథా మంజరి :: అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !//
అప్పటికీ బుద్దిరాని వారికి ఎలా బుద్ది తెప్పించడం?

//mirchbajji :: లావెండర్ బాత్ చేస్తే మృదువైన చర్మం.//
బాసూ.. చర్మం,కండరాళ్ళు అన్నీ ముఖ్యమే వీటన్నింటికన్నా హృదయం చాపా ముఖ్యం కదా.. హిప్పాక్రటిక్ భావాలతో ,హిప్పాక్రటిక్ మాటలతో,చేతలతో ,విశ్లేష్ణలతో సెప్టిక్ ట్యాంకుకన్నా బ్రష్ఠు పట్టి పోయిన హృదయం మృదువుగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలో కూడ చెప్పరాదూ?

//కబుర్లు కాకరకాయలు :: శుభాకాంక్షలు//
శుభాన్ని కాంక్షించడం కూడ ఇప్పుడు వ్యాపారమై ఏడ్చింది. ఎవడికి శుభం కాంక్షిస్తే మనకుశుభం,లాభం జరుగుతుందో వాడికి మాత్రం వార్తా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలిచ్చే కాలం ఇది.

Na Mano Bhavalu (నా మనో భావాలు) :: తెర తొలగదా?నిజమవ్వదా?
మనస్సుకు రోగం వస్తుంది - ఇది పాశ్వాత్య శాస్త్ర్రం ,మనసే రోగం ఇది తూర్పు దేశాల నిర్ణయం

//సాహిత్య అభిమాని :: ఈ  శిధిలాలలో//

అవును దొరా.. నేటి శిధిలాల్లోనే నాటి అభ్యున్నది దాగి ఉంది. వెలికి తీద్దామా?

//జగ్గంపేట మెట్టసీమ :: ముస్లిం సోదర్లు అందరికి "బక్రీద్ " పర్వదిన శుభాకాంక్షలు//
కొడుకును బలి పెట్టడానికి సిద్దమైతే భగవంతుడు గొర్రెను బలి పెట్టు చాలని కరుణించిన దినమిది. మరి కొడుకు కోసం దేశాన్ని బలి పెట్టే అమ్మలున్నారుగా..సో ... క్రిటికల్ ..

//వెంకట్.బి.రావు's Blog :: తెలుగు పద్యం పోకడలు (1)//
ఇంకా పద్యమంటే జనం పారిపోతారు ఒట్టు... శ్రీ శ్రీనుండి మొదలు పెట్టు..

//సమిధ :: ONLY FOR SELECTED READERS from next week//
అయ్య బాబోయి నేనూ ఇలానే తమిళంలో మొదలు పెట్టి ఎదవయ్యా.. వద్దు గురువా? పాయిజనస్ పరీక్ష

//a2z డ్రీమ్స్ :: అందమైన ప్రేమకథ ‘ఆరెంజ్’//
ప్రేమ అందమైనవాటి మీదే పుడ్తుది  కాని ఆ ప్రేమ కథగానే మిగిలి పోతుంది

//వరూధిని :: డాలర్ పెళ్ళాం - రూపాయ్ మొగుడు (ఈ  సినిమా టైటిల్ రిజిస్టర్ చెయ్య బడినది)//
ఎంత డాలర్ పెళ్ళామైనా పెళ్ళామే గా.. ఎంత రూపాయి మొగుడన్నా మొగుడేగా..( స్త్ర్రీ వాదులూ నా మీద పడకండి - ఇది జస్ట్ ఫార్ ఫన్)

//మొదటి రోజు.....మొదటి షో సినిమా రివ్యూ .... :: ఆంధ్ర లో ఆడపిల్లలికి డాలర్ల భర్తే కావాలంట....//
కెరసిన్ స్టవ్ పేలుడు సరిపోలేదేమో ? మైక్రో ఓవన్ మీద మోజు పుట్టినట్టుంది

//My VALUABLE LESSONS :: అనామిక (హారం)//
ఇవి ఉత్త పాఠాలా? గుణ పాఠాలా గురువుగారూ..

//అక్కినేని2అక్కినేని :: " స్వప్న సుందరి " విశేషాలు//
డి.టి.ఎస్, డిజిటల్ వచ్చినాక ఇంకా విశేషాలేమిటీ? వి "శేషాలు"మాత్రమే

//.ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... :: 'ఈనాడు' పై ఫిర్యాదుకు స్పందించిన వేతనసంఘం//
పట్టిన పట్టు విడువని విక్రమార్కుని వలే టార్గెట్ కొట్టండి సార్.. విష్ యు ఆల్ ది బెస్ట్

No comments:

Post a Comment