జ్యోతిషమన్నది భవిష్యత్తుకు సంభంధించింది. భగవంతుని అనుమతి, ఆశిస్సులు లేనిదే జ్యోతిష్కుడు చెప్పలేడు. మీరూ వినలేరు. పాత కే.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో స్మగ్లింగ్ జరిగే దృశ్యాల్లో రెండు గౄపుల వారూ చిరిగిన కరెన్సి ఒకటి పెట్టుకుని ఉంటారు. ఆ రెండింటిని ప్రక్కన ఉంచి అవి కలుస్తేనే సూట్ కేసు మార్చుకునే వారు.
వచ్చిన వ్యక్తికి తన గతమేమిటో తెలుసు.జ్యోతిష్కునికి భవిష్యత్ ఏమిటో గంటాపదంగా చెప్పే సామర్థ్యం ఉంటుంది.(గతాన్ని వివరించటంలో ఒక ఇబ్బంది ఉంది. అదేమంటే ఒకే గ్రహస్థితిలో పుట్టిన ఏ ఇద్దరికి కూడ ఒకే విదమైన ఫలితం జరుగదు.
చిరంజీవి పుట్టిన అదే లగ్నం,అదే జాతకంలో నిమిషానికి నలుగురు చొప్పున 120 నిమిషాలకు 480 మంది పిల్లలు పుట్టిఉంటారు. కాని ఒక్క చిరంజీవి మాత్రమే మెగా స్టార్ అవుతారు. తక్కిన 479 మంది ఏమై పోయారు? అంటే చిరు తన జీవిత ప్రారంభదశలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బలకు జడిచి ప్రయత్నం విరమించి ఉండొచ్చు. తదుపరి దశలో చిరంజీవి సైతం పొందని కొన్ని అంశాలను పొంది ఆనందంగా జీవిస్తిండవచ్చు.
కాబట్టి జాతకుడు ,జ్యోతిష్కుడు పరస్పరం సహకరించుకుంటే గాని భవిష్యత్ గోచరించదు. భవిష్యత్తు గతంలో నుండే రూపు దిద్దుకుంటుంది.
పైగాజాతక చక్రంలోని గ్రహాలన్ని బాంబులు లేదా ఫౌంటెన్ వంటివి. వాటిలో ఎన్ని బాంబులు ఇది వరకే పేలిపోయాయో అంచనా వేసుకో కలిగితే ఇక ఎన్ని బాంబులు పేలనున్నాయను తెలుసుకుని చెప్పడం తెలికవుతుంది. ఫౌంటేన్స్ కథ కూడ ఇంతే
జ్యోతిష్కులకు సూచన:
మీకు తన భవిష్యత్ గురించి సర్వం తెలుసన్న అపోహతో జాతకుడు మీ వద్దకు వస్తాడు. మీరు అతనిని ఎజుకేట్ చెయ్యాలి. గ్రాహాలు ఇచ్చే ఫలితాలు కూడ ఎస్.ఎస్.సి.పరీక్షలోని ప్రశ్నా పత్రం వంటిదని అందులో చాయ్స్ ఉంటుందని వివరించాలి. ఉ: సప్తమ శని దుష్ఠ కళత్రం, కళత్ర హీనం, అరూప కళత్రం,రోగ కళత్రం.
మిమ్మల్ని ఆశ్రయించిన జాతకుడు మీ ఒక్క మాటను నమ్మి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాడు. మీ ఒక్క మాట అతని జీవితపు దశ దిశలను నిర్దేశించనుంది. కాబట్టి ఏకాగ్రతతో జాతక చక్రాన్ని పరిశీలించి - గ్రహాల మాటను ఏ మాత్రం తటపటాయించక, గంటాపదంగా చెప్పండి. అందుకని అతి విశ్వాసమూ వద్దు. కేవలం ఒక గ్రహంయొక్క స్థితిగతిని పట్టి ఫలితాలు చెప్పక , తక్కిన గ్రహాలు, వాటి భలా భలాలు,వీక్షణాలు అన్నింటిని దృష్థిలో ఉంచుకుని ఫలితాలు చెప్పండి.
జాతకులకు సూచన:
బాల జ్యోతిష్కుడు వృద్ద వైద్యుడు అన్నారు. వృద్దుడైనా,బాలుడైనా జ్యోతిష్కుడు అన్నాక అతను గురు సమానుడు. యధ్భావం తద్భవతి అన్నట్టుగా మీరు గొప్పవాడని పరిగణిస్తే పనికి మాలిన వాని నోట కూడ మీ భవిష్య వాణి వినే అవకాశం కలుగుతుంది.అలా కాక పరీక్షించే ఉద్దేశం, వితండవాదం వంటివి పనికి రావు. మీరు ఒక మంచి జ్యోతిష్కుని మనసు బాధ పెడితే అది మీకు శ్రేయస్కరం కాదు.
భవిష్యత్తు గతంలో నుండే రూపు దిద్దుకుంటుంది.???
ReplyDeleteనమస్తే. నా జన్మ నక్షత్రం, లగ్నం, వయసు చెబితే నా భవిష్యత్తు గురించి చెప్పగలరా?
ReplyDelete