సంపాదనకు మార్గాలు:2
(బాసూ నిజంగానే ఈ టపాలో సంపాదన మార్గం ఒకతి చూపాను - మీరు సంపాదించాలంటే మీ చుట్టూ ఉన్నవారు కూద సంపాదిస్తూ ఉండాలి. కాబత్తి పక్కనే ఉన్న ట్విటర్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ తో పంచుకొండి)
సంపాదనలో మనం సక్సెస్ కావాలంటే మనకు డబ్బుతో అవసరం ఉండ కూడదు.( అవసరం ఆలోచించుకోనీయదు) లేని పోని కలలు,ఊహలు ఉండ కూడదు. మీకు కావలసింది డబ్బె అన్నప్పుడు ఎటువంటి ఆందోళనకూ అవసరం లేదు.
ఎందుకంటే ప్రతి ఒకరివద్దా డబ్బుంది. అంటే అది డబ్బుగా లేక పోవచ్చు.కాని డబ్బుగా మలుచుకోగల ఏదో ఒకటుంది.అదేమని గుర్తించ గలిగితే డబ్బు సంపాదించవచ్చు. దానిని గుర్తించడానికి కొంత కాలం పడుతుంది. సహజంగా మానవుని మస్తిష్కంలోని అహం కారణంగా చాలా సార్లు తప్పు ద్రోవ పడుతుంటాడు. మరీ టీన్ ఏజిలో ఇది సర్వ సహజం.
నేను బ్రాహ్మణేతర కులంలో పుట్టినప్పటికి నా జాతకప్రకారం నేను బ్రాహ్మణుడి వలే బ్రతకాలి ఇది నా రాత. కాని టీన్ ఏజిలో నేను చిరంజీవి అభిమానిని. చిరంజీవిలా బాడి బిల్డప్ చెయ్యాలని డాన్స్ చెయ్యాలని,డైలాగ్ చెప్పాలని ఉవ్విళ్ళూరేవాడ్ని.
టీన్ ఏజిలో సర్వదా మీ మనస్సు తప్పుడు దిక్కుకేసి లాగుతుంటుంది. (యవ్వనం, అంగ బలం, యధార్థం తెలీక పోవడం,భవిష్యత్ పై విశ్వాసం తదితర కారణాల వలన మీ అహం ఉచ్చంలో ఉంటుంది కాబట్టి) మిమ్మల్ని ఏరంగం తీవ్రంగా ఆకర్షిస్తుందో అది మీ రంగం కాదని ఇట్టే నిర్ణయించుకోవచ్చు.
మీ రంగం ఏదో గుర్తిస్తే అదే సంపాదన ప్రయత్నంలో సగం విజయం సాదించినట్టే. 1987లో విద్య పూర్తి చేసుకున్న నాకు నా రంగం ఇదని డిసైడ్ చేసుకోవడానికి రెండు సం.లు పట్టింది.. అయినా చంచలం కారణంగా అప్పుడప్పుడు నా రంగం కాని రంగాల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకునే వాడ్ని.
మరీ మీకు తెల్ల కాకి అవసరమంటే టెన్షన్ పడాలే గాని డబ్బు కావాలంటే గాబరా పడాల్సిన అవసరం లేదు. డబ్బు అందరిదగ్గరా ఉంది.డబ్బుగానే ఉంది. వారికి ఎన్నో అవసరాలుంటాయి. ఎన్నో సేవలు అవసరమవుతాయి. వాటిలో ఏదో ఒకదానిని నెరవేర్చే సత్తా, నైపుణ్యం మీకుంటే చాలు ఇట్టే డబ్బు సంపాదించవచ్చు.
నేనిదివరకే వ్రాసిన మని సీక్రెట్స్ ఏ పుస్తకంలోనో దొరికింది కాదు. శుక్రవారం బిక్షకులు షాప్ టు షాప్ ఎక్కి దిగుతూ చిల్లర డబ్బులు సేకరించినట్టు నా చుట్టూ ఉన్నవారినుండి సేకరించాను. మరీ వారి ప్రవర్తనల్లో నుండి డైరక్టుగా ఈ సీక్రెట్స్ నేర్చుకోలేదు. వారు నెగటివ్ గా ప్రవర్తించి "షెడ్" ( దివాళా తీయడం) అయి పోతే వారు నేర్చుకున్నారో లేదో నేను నేర్చుకున్నా గుణ పాఠాలు.
తొలూత నేను సైతం జీసస్ బైబుల్లో పేర్కొన్న పక్షుల్లాగే " విత్తడమో, కోయడమో" చెయ్యక బ్రతికేవాడ్ని. నాన్న ఉన్నంత కాలం ఎలాగో సర్దుకు పోయింది. నాన్న పోయాక ఒక్క సారిగా యధార్థం నెత్తి మీద పిడుగులా దిగింది.
అవసరం నన్ను సంపాదన మార్గంలోకి తోసింది. నా అవసరంతో నా చుట్టూ ఉన్నవారు సంపాదించ కలిగినారే గాని నేను నష్ఠ పోవడమే జరిగింది. ఇలా నేను నష్ఠ పోయిన సందర్భాలు కోకొల్లలు. నాకు మరీ చికాకెక్కువ. స్టీరియో టైప్ కథలు, సినిమాలంటే నాకు వళ్ళు మండుతుంది. అలాంటిది జీవితంలో ఒకే విదమైన తప్పులు ఎలా చెస్తాను? కొత్త కొత్త తప్పులు చేసాను.
నేను ఏ టాటా,బిర్లా, అంబాని,వాడియా కుటుంభాల్లో బుల్లి మనముడిగా పుట్టి అన్ని తప్పులు చేసి ఉంటే వారి శతాబ్దకాల ఆస్తులన్ని కాలి పోయి మన దేశం ఆపరేషన్ ఇండియాతో అవసరమే లేక సంపన్న దేశమై ఉంటుంది.
నా తప్పులతో నా చుట్టూ ఉన్నవారంతా లాభపడ్డారని ఇదివరకే చెప్పానుగా
సంపాదన మార్గం: 1 " సెకండ్స్ బజారు"
ఒక సారి మీ ఇంటి అరక పైకి ఎక్కి చూడండి అందులో ఏవేవో చెత్తలుంటాయి. మీ అబ్బాయి పుట్టినప్పుడు కొన్న మస్కిటో నెట్, అతను పడుకొన్న ఊయల, తోసుకుని పరుగులు తీసిన త్రోపుడు బండి,అతను తోలిన ట్రై సైకిళ్ అన్నీ పడి ఉంటాయి. ( ఈ లిస్టు ఓటరు జాబితాకన్నా పెద్దది)
కాని మీ ఊళ్ళోనే ఎందరో పేద తల్లి తండ్రులుంటారు .వారికి వారి పాపకు మస్కిటీ నెట్ పెట్టుకోవాలనుంటుంది కాని ఆర్థక స్థోమత ఉండదు. మీ అరక మీద ఉన్నది మీకో అడ్డం, చెత్త కాని వీరికి?
ఈ పరిస్థ్తితిని దృష్ఠిలో ఉంచుకుని ఔత్సాహికులు ప్రతి ఆదివారం ఒక సెకండ్స్ బజారు నిర్వహించవచ్చు. ఇందుకు కావల్సింది ఒక ఖాళి స్థలం, ఒక షామియానా, కొంత అడ్వర్టైజ్ మెంట్. నామినల్ ఎంట్రన్స్ ఫీ పెట్టి సెకండ్స్ వస్తువులను లోనికి అనుమతించ వచ్చు. అవి సేల్ అయితే కొంత కమీషన్ టైపులో వసూలు చెయ్యొచ్చు.
ఈ సలహాను అమలు చేసి సంపాదించ దలచినవారు తమ ప్రకటనల్లో నా ఈ సైట్ పేరు యు ఆర్ ఎల్ ముద్రిస్తే చాలు ( ఇదే ఫీజు)
No comments:
Post a Comment