నేను మీకు ఇస్తున్న ఫలితాలు నూటికి నూరు శాతం జరిగి ఉండాలని రూల్ లేదు. కొన్ని ఇదివరకే జరిగి ఉండొచ్చు. కొన్ని ఇక మీదట జరుగవచ్చు. కొన్ని అస్సల్ జరగక పోవచ్చు.
ఒకే నిమిషంలో ..ఒకే గ్రహ స్థితిలో పుట్టిన ఏ ఇరువురికీ ఒకే విదమైన ఫలితాలు జరగడం లేదు. ఇందుకు హేతు బద్దమైన కారణాలు అనేకం ఉన్నాయి.
ఉ. మీ జాతక ప్రకారం మీరు మెగా స్టార్ కావాలని ఉంటుంది (అనుకొండి) .. మీ తండ్రి జాతకం, మీ తల్లి జాతకం, మీ సోదరుల జాతకాలు, మీ భార్య జాతకం కూడా దీనికి తోడ్పడే విదంగానో కనోశం అడ్డు తగలని విదంగానో ఉండాలి. అప్పుడే మీరు మెగా స్టార్ కాగలరు.
దేవుడు ప్రధాని. గ్రహాలే మంత్ర్లులు. దేవుడు ఒక్కో గ్రహానికి ఒక పోర్ట్ ఫోలియో ఇచ్చారు. మీకు ఏ మంత్రితో ఎంత వరకు పరిచయానుభంధాలుంటే ఆ మెరకు ఆ మంత్రిత్వ శాఖలో పనులు అవుతాయి. అలాగే ..
మీ జాతకంలో ఏ గ్రహం ఎంత భలంగా, శుభ ప్రదంగా ఉంటే ఆ మెరకు ఆ గ్రహ కారకత్వంలో సక్సెస్ ఉంటుంది.
ఉ. మీ జాతకాన కుజుడు భావుంటే పోలీస్,మిలిటరి,రైల్వేల్లో రానిస్తారు
కారకత్వాలు అనేకం:
భూ ప్రపంచంలోని అన్ని విషయాలను, అందరు మనుషులను, సరుకులను 9 గ్రూపులుగా విభజించ వచ్చు. (గ్రహ కారకత్వాన్ని - పోర్ట్ ఫోలియోను బట్టి) .
ఒక గ్రహం శుభ ప్రదుడైతే తన కారకత్వంలో ఖచ్చితంగా మేలు చేస్తుంది. అది ఫలానా విషయంలోనే మేలు చేస్తుందని చెప్పడం అప్పుడప్పుడు కష్ఠ తరం అవుతుంది.
ఉ: ఇందాక చెప్పినట్టు కుజుడు భావుంటే పోలీసవ్వాలనే కాదు రౌడి కూడ కావచ్చు ( ఇతర రాజగ్రహాల భలం లేనప్పుడు) లేదా రియల్టర్ కావచ్చు, లేదావెల్డర్ కవచ్చు. ఇటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుసుకుని, వాటికి ఇతర గ్రహాల సహకారం ఎంత వరకుందని తెలుసుకుని సూచింఛ వలసి ఉంటుంది.
No comments:
Post a Comment