Monday, November 15, 2010

దూసుకెళ్తున్న సాక్షి వెనుక పడ్డ ఆంథ్రజ్యోతి తమాయించుకుంటున్న ఈనాడు

ఈ రోజుల్లో రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయో లేదో కాని తెలుగు దిన పత్రికలు మాత్రం నువ్వా నేనా అంటూ రాజకీయం చేస్తున్న మాట అందరికి విదితమే.ఒక్కో పత్రికకు ఒక అజెండా. తమ జెండా నెరవేరేందుకు అనువుగా జండా మొయ్యడం ఆనవాయితీ అయ్యింది. అవి ఇప్పుడు కాస్త సృతి మించి ఒక పత్రిక మరో పత్రిక మీద ఒక చేనల్ మరో చేనల్ మీద బురద చల్లుకునే స్థాయికి చేరుకుంది.

అజెండా ఏదైనా,జెండా ఏదైనా మొదట ఆ పత్రికలు ప్రజల మన్నెనలు పొంది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. తొలిసారిగా పత్రికా రంగంలోకి సాక్షి వచ్చినప్పుడు లభో దిభోమంటూ ఆరోపణలు గుప్పించేరు. వై.ఎస్., జగన్ రాత్రికి రాత్రి గడ్డపారలతో వెళ్ళి ఖజానాకు కన్నం పెట్టి మరి దుడ్లు తెచ్చి పత్రిక నడుపుతున్నంత సీన్ క్రియేట్ చేసేరు. ఇదిగో నిలిచి పోయింది,అదిగో నిలిచి పోతుందని అస్తు పలుకుతుండేరు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి ఓడి పోతుందని సాక్షి నిలిచి పోతుందని కలలు కనేరు.వారి కలలు కల్లైంది.

వై.ఎస్. మరణానంతరం - జగన్ తిరుగుభాట అందుకుంటే మురిసి పోయేరు. ఈ పత్రికల కల్మిషాలు,అక్కసు వాటి వెనుక ఉన్న స్వలాభాపేక్షలు మీకు తెలియనివి కావు. వీరి సర్కులేషన్ కథ తెలుసుకోవాలంటే http://www.rni.nic.in లో లాగిన్ చెయ్యండి.

నేనైతే అలెక్సా డాట్ కామ్ లో వీరి జాతకాలు వెలికి తీసాను. వీరి వెబ్ సైట్స్ కి ఉన్న ప్రజాధరణ ఎంతమాత్రమని చూసాను.

ఇందులో ఈనాడు మన దేశంలో 226వ ర్యేంకులో ఉంది. తదుపరి స్థానం సాక్షి దక్కించుకుంది 322వ ర్యేంకు. పాపం ఆంథ్రజ్యోతి 785 వ ర్యేంకులో కొట్తుమిట్టాడుతూంది. మరిన్ని వివరాలకు ఈ టపాలోని స్క్రీన్ షాట్స్ చూడండి. లేదా లాగిన్ చెయ్యండి:



http://www.alexa.com

4 comments:

  1. no sishya,acc to alexia,eenadu[globally-2373] is in 1st nd sakshi[globally-4629] is in 2nd.ajyothi is in 3rd[globally-8,373]

    ReplyDelete
  2. సాక్షి కూడ ఒక పత్రికేనా..? వారి వార్తలు భట్రాజు బాగోతాలు తప్ప అందులో ఏమి ఉంటుంది....!!

    ReplyDelete
  3. సాంబార్ గారికి బూడిదకూడా మిగలదు. హె హె

    ReplyDelete
  4. "ఖర్"-శబ్దం కూడా చేర్చండి .దీనికి అర్ధం "గాడిద"అని.రాజశేఖర్,కులశేఖర్,గుణశేఖర్,చంద్రశేఖర్..వగైరాలన్నమాట.ఎంత గ్లోబలైనా ,ఆచరణకి మాత్రం లోకలే బెస్ట్ శిష్యా ..i had given them for just info sake,thata all.its ment for criticise u.

    ReplyDelete