అబిమాని: ఏంది గురువా.. నీ వాణి బోణి కాని వాణి అంటారీళ్ళు?
నేను: కేవలం అక్టోబరు 27 వ తారీఖు మాత్రం 387 మంది చదివారు నా బ్లాగు. ఇది బోణి అయినట్టేనా లేనట్టా
అభిమాని: కరెక్టే గురువా.. మరి ఆ హిట్స్ ప్రతి రోజూ రావాలిగా?
నేను: శిష్యా..తమిళ బ్లాగ్లోకం వేరు తెలుగు బ్లాగ్లోకం వేరు. అక్కడ పెరియార్ నాటిన హేతువాద, బ్రాహ్మణ వ్యతిరేక మొక్క మహా వృక్షమైంది. డజన్ల కొద్ది అగ్రగేటర్లు ఉన్నారు. కాని తెలుగులో అలా కాదు..నేనా హేతుబద్దత కలిగిన ఆథ్యాత్మికతను ప్రభోదిస్తాను ఇది పాథకులకు రుచించలేదేమో?
అభిమాని: అదేం గురువా ఇదేదో సామెతను గుర్తుకు తెస్తూంది..
నేను: లేదు శిష్యా నేను సత్యమే చెబుతా.. తమిళంతో పోల్చుకుంటే అసలు తెలుగువారి ఇంటర్ నెట్ వినియోగమే తక్కువ. కావంటే తెలుగు అగ్రగేటర్ల అలెక్సా ర్యేంకు తమిళ అగ్రగేటర్ల అలెక్సా ప్రపంచ ర్యాంకు చూడు నీకర్థమవుతుంది. .
బ్లాగ్ డాట్ కామ్ : 1,028,071 తమీళ్ మణం డాట్ నెట్ : 22,941
కూడలి డాట్ ఆర్గ్ : 109,137 ఇండ్లి డాట్ కామ్ : 8542
మాలికా డాట్ ఆర్గ్ : 2,33,012 తమిళ 10డాట్ కామ్: 33,756
హారం డాట్ కాం : 217,872 ఉలవు డాట్ కామ్ : 52,993
ఇదెలా సాధ్యమైంది అంటారా?
సహజ సిద్దంగానే తమిళులు కార్య సాధకులు . మనవారే లేని పోని పట్టింపులకు పోయి దెబ్బ తింటాం . కాబట్టి తమిళ జాతీయులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. ముఖ్యంగా శీలంక తమిళ సోదర్లు ప్రపంచమంతటా వ్యాపించారు. . క్రైసిస్ లో స్వదేశాన్ని, మాతృ భూమిని విడిచి వెళ్ళిన వారు కాబట్టి కేంద్రీకృత లక్ష్యాలతో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. దీంతో తమిళ వెబ్ లోకం కూడ కొత్త ఊపుతో దూసుకు పోతుంది.
మనవారి పరిస్థితి ఏమిటో వేరే చెప్పక్కర్లేదు అందుకే చ్నెబుతున్నా బోణి కానిది నా వాణి మాత్రం కాదు అసలు తెలుగు వాణియే పెద్దగా వినపడటం లేదు
No comments:
Post a Comment