Sunday, November 7, 2010

ఆదివారం నాటి టపాలు నా చిటపటాలు

» ఎం. ఎస్. నాయుడు :   నీ రాత్రి నీకు
ఎవరి రాత్రి వారిదే.. కాని మన నాయకుల తప్పిదాల ఫలం మాత్రం మన అందరికి

» మెహక్ :   మీకు ఈ పదాలకు అర్థాలు తెలుసా ?
అర్థాలు,పరమార్థాలు,గూడార్థాలు తెలుసుకున్నాకే మాట్లాడాలని జనం నిర్ణయించుకుంటే మౌన వ్రతమే దిక్కు

» ప్రజాశక్తి :   అమెరికాకు అగ్రతాంబూలం
దానిని నమిలి మన ముఖాన మూంచి పోతాడన్న మాట

» ప్రజాశక్తి :   తీవ్రత తగ్గిన 'జల్‌'
అది సరే ! రాష్ఠ్ర్ర రాజకీయాల్లో జగన్ జల్ మొదలైనట్టుందే

» నా లోకం :   ఇదీ పుస్తకాల వల్ల మనకుపయోగం !
ఏమిటో బాసు పుస్తకాలకు కాలం చెల్లిపోయేలా ఉంది.నేటి తరం రేపు నెలసరి బడ్జెట్లో న్యూస్ పేపర్ సైతం ఉండదేమో?

» Life is a way :   ఒబామా
పాపం ఒబామా అక్కడ అంటుకున్న నిరుధ్యోగ మంటలార్పటానికి ఇక్కడికొచ్చాడు..పాపం!

» Mr. నారద :   పాత కాగడ మళ్ళీ దుకాణము తెరిచాడు.
నూనె డబ్బా తెచ్చుకున్నాడో లేదో పాపం..

» శాస్త్ర విజ్ఞానము :   ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలీలీ
భూమి గుండ్రంగా ఉందని చెప్పి తుఫాను భాధితుడు టైపులో  సత్య భాధితుడుగా మిగిలిన అగ్ర  అమాయకుడు పాపం

» తురుపుముక్క :   క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 32 సమాధానాలు!
క్లాస్ వర్క్ సరే బాసు.. దరల పెరుగుదలతో  మాస్ మెటాష్ అయిపోయి లైఫే పజిల్ గా తయారై ఉన్నారే వారికీ ఏదైనా సమాదానం చెప్పండి -ఉంటే

» Blossom Era :   ఫ్రూట్ సలాడ్
2009 ఎన్నికల్లో చంద్ర బాబు కట్టిన మహా కూటమి తరహాలో పళ్ళ కూటమి అన్న మాట

» ధ్రువతార :   తిరోగమన పధంలో తెలుగు సమాజం- YSR మహత్యం
గుడ్డిలోమెల్ల మిన్నా అని నెత్తికెక్కించుకున్నాం గాని మీరు చూపరాదు.. బెటర్ చాయిస్

» akshravanam. .अक्षर वन. అక్షరవనం :   ఎంత మంచి వాడవురా ..చిత్రం :నమ్మినబంటు (1960)
ప్రేమించేటప్పుడు అలానె అనిపిస్తుంది బాసు! ఆతరువాతే మహిళా స్టేషన్లు,ఫ్యేమిలి కోర్టులంతా

» అరుణతార :   అక్టోబర్‌ మహావిప్లవం-ప్రస్తుతదశలో దాని విశిష్టత
తెల్లారితే కార్పోరేషన్ వాడు నాలాలో నీళ్ళొదలి,సిటి బస్ టయానికొచ్చి పావలా ఉధ్యోగాన్ని కాపాడుకుంటే అదే విప్లవమనే స్థాయికి జనం వచ్చేసారు. ఇంకా మీరు విప్లవం గిప్లవం అంటే ఎలా?


» అరుణతార :   ఒబామా పర్యటనలో వాణిజ్య ఎజెండా
అమెరికా స్వలాభ అజెండా -భారత్  గొరుకుడు అజెండా అంటే పోలే

» టపాకాయ :   ‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!
కొంపదీసి రాహుల్ జి గురించి కాదు కదా ఈ టపా? పాపం ఆయనపాటికి ఎగరనీ బాసు.. గంత (పదవి) ఆయనను మోయనిస్తే మన గుంత మనమే త్రవ్వుకున్నవారమవుతాం

» TELUGODU తెలుగోడు :   ఒబామా కు మార్గదర్శి ఎవరు ?
అతనిని వెంబడిస్తున్న శనిమహాత్ముడే.. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్టే తాను చెడ్డ అమెరికా ప్రపంచాన్నంతా చెడిపేస్తుంది


» శ్రీ జాబిలి :   ఈ రోజు (08-11 సోమవారం) నా ప్రాణ మిత్రుని పుట్టిన రోజు కాబట్టి ఈ నా బ్లాగ్‌ చదివిన వారు తప్పకుండా శుభాకాంక్షలు తెలుపగలరు...

అదెంత పనీ ! వాహన సౌఖర్యం కలిగించి క్వార్టరు ,ఐదొందలు,ఒక బిరియాని ప్యాకెట్ అందిస్తే ఆ మాత్రం చెయ్యరా జనం

» mirchbajji :   Michelle, Obama ముంబై స్కూల్ లో చేసిన డాన్సు చూద్దామా...
ఆయన ఆడితే మనకు పోయేదేమి లేదు గురువా.. ఆయన ఆడించినట్టు మనోళ్ళు ఆడితేనే అడుక్కు తింటాం

» వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events :   సి.వి.రామన్ (C.V.Raman)
అమ్మో ! ఇంకా మీరు 20వ శతాబ్దానికే రాలేదా?

» తెలుగిల్లు :   పేరులో ఎంతో ఉంది! పేరులోనే అంతా ఉంది!!
మీ టపా నేమాలజి గురించేమో ? అదో మిద్య బాసూ.. నేమ్ నెంబరుకు చెందిన గ్రహం మీ జాతకచక్రంలో భలం పొంది ఉంటేనే నేమాలజి ఫలిస్తుంది

» mirchbajji :   రోజురోజుకూ.. సహనం నశించి పోతోంది: వైఎస్.జగన్
అదే రాత్రి రాత్రి బాంబులు పేల్చాడుగా?

No comments:

Post a Comment