ఈ సీరియల్ మొదలు పెట్టి రెండో ఎపిసోడ్ మీద ఒక అనానిమస్ రెస్పాండ్ అవుతూ నువ్వెంత సంపాదించావని ప్రశ్నించేరు. ఈ ప్రశ్నకు సమాదానం చివరన చెబుతాను. ఇక్కడ నేను చెప్పే విషయాలు మీకే పుస్తకంలోను దొరకదు. ఇవన్నింటిని నెను కనీశం పదహారు సం.లు మరియు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి తెలుసుకున్నవి. వాటిని మీకు పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నాను. నా నిభందన గుర్తుందిగా నేను సూచించే సరి కొత్త ఆలోచనలను ఈ సైట్ చూసి అమలు చేసేవారు, తమ విజిటింగ్ కార్డులో స్ఫూర్తి :www.sambargaadu.blogspot.com అని ముద్రించుకోవాలంతే.
సంపాదనలో మనం విఫలమ్మవడానికి అతి కీలకమైన కారణం ఒకటుంది. వ్యయ,అదాయాల్లో రెవిన్యూ,క్యేపిటల్ అంటూ రెండు ఉంటాయి.
మీకు ఇట్టే అర్థం కావడం కోసం తమాషాగా చెబుతా. మీరు కోడి కొన్నారనుకొండి అది క్యేపిటల్ వ్యయం. గుడ్డు కొన్నారనుకొండి అది రెవిన్యూ వ్యయం. మీరు కోళ్ళు పెంచుతున్నారు. కోడి అమ్మి డబ్బులొస్తే అది క్యేపిటల్ ఆదాయం. గుడ్దు అమ్మి డబ్బులొచ్చాయనుకొండి అది రెవిన్యూ ఆదాయం.
ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో సంపాదించాలన్న కుతకుతలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో క్యేపిటల్ ఆదాయంలో నుండి ఇష్థమొచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే రెవిన్యూ ఆదాయం క్రమేనా తగ్గి గుండు సున్నగా తయారవుతుంది. ( ఈ పొరభాటు కూడ చేసాను నా రోజు వారి ఆదాయాన్ని గొప్ప దూరదృష్ఠితో సుదూరపు కలల సాకారం కోసం వెచ్చిస్తూ వచ్చాను)
అలానే రెవిన్యూ ఆదాయంలో నుండి పైసా కూడ ఖర్చులు పెట్టుకోకుండా వాటిని క్యేపిటల్ వ్యయాలకు మళ్ళిస్తూ రావడం కూడ మంచిది కాదు. ( నేనీ పొరభాటు చేసే గతంలో సంపాదించిన సొమ్మును ఒక్క సారిగా పోగిట్టుకున్నాను - గ్లూకోజ్ వ్యాపారం చేసానోచ్- ఈ వివరాలు మరో సందర్భంలో చూద్దాం).
పెద్ద మొత్తంలో సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కాని దానికని ఒక వ్యూహం రచించుకొని వన్ స్టెప్ అట్ వన్ మూవ్ మెంట్ తరహాలొ ముందుకు సాగాలి.
పైగా పె.మొ.ఆ విషయంలో ఈ రోజు అయిపోతుంది,రేపు అయిపోతుందని ఆతృత పడ కూడదు. టూ వీలర్ వేగానికి, ఫోర్ వీలర్ వేగానికి, కంటెయినర్ వేగానికి తేడా ఉంటుందిగా? పె.మొ.ఆదాయమన్నది కంటెయినర్ వంటిది. ఏ మలుపులోనన్నా చిక్కుకు పోవచ్చు.
అది మన గుమ్మం దాక వచ్చి చేరే వరకు పస్తు ఉండాల్సిన అవసరం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్ ఉండాలి. లేకుంటే కంటెయినర్లో సరుకును , అది చిక్కుకున్న మలుపులోనే సగం దరకే విక్రయించవలసిన పరిస్థితి వస్తుంది.
సంపాదన మాటకొస్తే ప్రతి ఒకరు జీవితంలో ఏదో సందర్భంలో సంపాదిస్తారు. కాని ఆ సందర్భం మినహాయించి అన్ని సందర్భాల్లోను ఆర్థిక అటు పోట్లతో సతమతం అవుతుంటారు. సంపాదన ప్రక్రియ అన్నది ప్రతి రోజూ కొనసాగాలి. ఆ ప్రక్రియ ప్రతి సెకను కొనసాగాలి. అదే అసలు సిసలైన సంపాదన.
పోనీ ఈ రోజుకి ఈ చిట్కా చాలనుకుంటా ఇదివరకే నెను హామి ఇచ్చినట్టుగా ఒక కొత్త వ్యాపారం గురించిన రూట్ మ్యేప్:
సిటి ఇన్ఫర్మేషన్ సెంటర్
ఇందుకు కావల్సింది ఒక ఫోను, చిన్న గది, పదహారు గంటలూ ఫోన్ అటెండ్ చెయ్యడానికి మనుషులు. వధూ వరుల సమాచారం నుండి, టు లెట్ సమాచారం దాక, ఫ్లాట్స్, ప్లాట్స్, ఇంటి స్థలం నుండి పాత కాలేజి పుస్తకాలదాక ఏ సమాచారాన్ని అయినా స్వీకరించి వర్గీకరించి వీలుంటే ఒక కంప్యూటర్లో గాని ,లెడ్జర్స్ లో గాని దాచుకోవాలి. సమాచారం ఇచ్చేవారి వద్ద ఎటువంటి ఫీజు వసూలించ రాదు.సమాచారం కోరే వారి వద్ద మాత్రమే ఫీజు వసూలు చెయ్యాలి.( మూడు నెలల దాక)
వ్యాపారం బాగా పుంజుకున్నాక సమాచారం ఇచ్చేవారి వద్ద నుండు పది, ఇరవై రూపాయలు, సమాచారం కోరేవారి వద్దనుండి యాబై రూపాయలు స్వీకరించవచ్చు. కొందరు సదా సర్వ కాలం సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కొందరి సదా సర్వకాలం సమాచారం అవసరమవుతుంటుంది.
ఇట్లాంటి వారికోసం నెలవారి రుసుము కూడ పరిచయం చెయ్యొచ్చు
ఓకే బ్రదర్స్.. తదుపరి టపాలో మరిన్ని చిట్కాలు, మరో కొత్త సంపాదన మార్గాన్ని చూద్దాం
ஒண்ணும் புரியல சார்
ReplyDelete