Monday, November 22, 2010

శరీరం,మనస్సు,బుద్ది ఆత్మ

మానవునికి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి/ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి శరీరం,మనస్సు,బుద్ది,సబ్ కాన్షియస్ మైండ్ అంటూ నాలుగు ఆయుధాలున్నాయి. వీటి ప్లస్ ఏమిటో, మైనస్ ఏమిటో ,ఒక దానికి మరోదానితో ఉన్న లింక్ ఏమిటో ఇప్పుడు చూస్తాం.

1.శరీరం:
మహా విశ్ఫోటముతో తయారైన ఈ విశ్వంలోని మూలకాలతో తయారైనదే ఈ శరీరం. కావున ఈ శరీరం పంచభూతాలతో,గ్రహాలతో సదా ప్రభావించబడుతూ ఉంటుంది. ఇందులో 70 శాతం నీటి పదార్థమె ఉంటుంది. ఈ నీటిలోని కెమికల్ కాంబినేషన్ సాక్షాత్తు సముద్రపు నీటిని పోలి ఉంటుంది. సముద్రపు నీటిని పున్నమి చందృడు ఎలా ఆకర్షిస్తాడో అందరికి విదితమే. ఈ విదంగా మానవ శరీరంలోని ఒక్కో అంశాన్ని,ఒక్కో అంగాన్ని ఒక్కో గ్రహం ప్రభావిస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరం ప్రక్రుతి సిద్దంగా తయారయ్యే వీలు కల్పీంచి (గర్బదారణ రుడీ అయిన క్షణంనుండి తల్లి ప్రక్రుతి విరుద్ద కార్యకలాపాలు,ఆహార పద్దతులు,క్రుత్రిమ దుస్తులు, అల్లోపతి మందులు మానాలి. అలాగేబిడ్డ పుట్టినాక కూడ ఆ బిడ్డపై క్రుత్రిమ ఆహార,ఔషదములను ప్రయోగించక శరీరానికి ఏమి తోస్తే అది చేసే స్వాతంత్ర్యాన్ని కల్పించాలి. 

అలా చేసిన నాడు ఆ శరీరం ఒక మిని విశ్వంగా ,ఈ విశ్వానికి ఒక రేడియో రిజీవర్ గా మారుతూంది. శరీరం యొక్క ప్లస్ ప్రక్రుతితో దానికున్న అనుసందానం,అహంకార రాహిత్యాం. (ఉ.మనకుకానివారైనా సరే మనకు నచ్చిన తిను బండారాలను ఆఫర్ చేసినప్పుడు నోళ్ళూరుతాయి. మనలను ఘోరాతి ఘోరంగా అవమానించిన అమ్మాయిని చూసి సైతం కామోద్రేకం కలుగుతుంది. ఇది ఒక అధ్భుత యంత్రం అన్నది దీని ప్లస్. కాని ఇది కేవలం మనో,బుద్దులకు బానిస అన్నది దీని మైనస్.( ఒక్కోసమయంలో ప్లస్సే మైనస్ గా,మైనస్సే ప్లస్ గాను పని చేస్తుంది. శరీరం ,మనస్సు,బుద్ది ఇందులో ఏది బలం పొంది ఉంటేఅ ది వీతిలో బలహీనమైనదానిని కమాండ్ చెయ్యగలదు.

2.మనస్సు:

ఆంగ్లములో దీనిని మైండ్ అంటారు. మైండ్ లో రెండు విదాలున్నాయి. ఒకటి యూనివర్సల్ మైండ్. మరొకటి ఇండివ్యూజువల్ మైండ్. ప్రతి బిడ్డ యూనివర్సల్ మైండ్ తోనే ఈ భూమికి వస్తుంది. ఆ యూనివర్సల్ మైండ్ కు తనకి,తన వారికి,ఈ సంస్థ విశ్వానికి సంభందించిన past,present,future మూడు తెలుసు.ప్రారంభ దశలో తనను ఈ ప్రపంచమునుండి విడిగా చూసే తత్వం అలవడి ఉండదు. కాని పుట్టిన బిడ్డకు దాని చుట్టు ఉన్నవారు నువ్వు వేరు,ఈ ప్రపంచం వేరు అంటూ నూరి పోస్తారు. 

ఇది వారి ఉద్దేశం కానప్పటికి నువ్వు ఫలానా..నీ చాయ ఇది,నువ్వు చిన్నదానివి,కుక్క పెద్దది అంటుండడంతో పాప లో నేను అనే ఆలోచన పుడుతుంది. ఈ ప్రపంచాన్ని విడిగా చూసే Maturity (ఆథ్యాత్మికంగా చూస్తే ఇదే immeturity) వస్తుంది. దీనినే అహంకారం అని తెలుగులో ego అని తెలుగులో అంటారు.
ఒక విషయాన్ని తెలుసుకోవడానికో/ఒక సమస్యను పరిష్కరించుకోవడానికో పై తెలిపిన నాలుగు ఆయుధాలతో భీకరంగా ప్రయత్నించి విఫలమైనప్పుడు అతనికి సాయ పడటానికి ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఆత్మ అన్నా కుండలి అన్నా ఒక్కటే. పై తెలిపిన నాలుగు ఆయుధాలతో తీర్చ లేని సమస్య /తెలుసుకోలేని విషయమే మనిషిని ఆత్మ సాక్షాత్కారానికి ముస్తాబు చేస్తుందన్నది నా అనుభవం.

కాని మానవుడు నిద్రావస్థలోనుండి మేలుకున్న ఆత్మను/కుండలిని ఉత్తేజ పరచే ప్రయత్నాలను విరమించుకుంటాడు.(తన సమస్య పరిష్కారమై పోయింది కాబట్టి) . నేను నా చిన్నతనం లోనె పురాణాలు ,ఇతిహాసాలు, ఎందరో యోగులు,గురువుల చరిత్రలను తిరగేసాను. అవి కేవలం డేటా ఫైల్స్ గా నా మదిలో ఉండి పోయాయి.

తీరా నా ఉనికికి ప్రమాదం వాటిల్లినప్పుడు, నా ప్రయత్నాలన్ని బెడిసి కొట్టినప్పుడు,పరాజయాల పరంపర (ఆముదాల మురళి పద ప్రయోగమిది) కటిక పేదరికం ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు నా body,mind,knowledge,subconcious Mind ఏది నాకు సాయ పడలేదు. కాని నా పఠణము నాకు మెకన్నాస్ గోల్డు సినిమాలో నిథి ఉండే స్థలాన్ని చూపే మ్యాపుగా ఉపకరించక పోయినా , నా అన్వేషణ పూర్తైనాక సత్యం దర్శనమిచ్చాక “ఒరె ఒరె నా అనుభవాలేం కొత్తవి కావు” అనే అనుభూతినినాకు కల్పించాయి.
అదెందుకో తెలీదు కాని ఏ రంగానైన నేను అడుగు పెట్టినప్పుడు నాకో శైలి,పంథా,విశిష్టత యాద్రుచికంగా కుదిరాయి. ఆథ్యాత్మికంలోను ఇంతే..

ఇంతకీ నేను చెప్పొచ్చిందేమంటే మానవుని వద్ద శరీరం,మనస్సు,బుద్ది,సబ్ కాన్శియస్ మైండ్ అనే ౪ ఆయుధాలు ఉంటాయి . సమస్యను ఎదుర్కోవడంలోనైనా, ఒక మిస్టరిని చేదించడంలోనైనా ఇవన్ని విఫలమైనప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగును. కుండలి అన్నా III డైమన్షన్ అన్నా ఇదె.

ఇక సమస్య/వెతుకులాట లెక ఆత్మ సాక్షాత్కారం సాధ్యం లేదా అంటే ఉంటుంది. గత జన్మల్లోని సాధన ఫలంగా ఈ జన్మలో అసంబంధమైన చిన్న ఉలుకుతోనో,చిన్నపలుకుతోనో జరిగి పోవచ్చు.
ఓకె. సమస్య లేదు. ప్రశ్నా లేదు,గత జన్మల సాధన ఫలం లేదు .ఇంకేమన్నా మార్గాలున్నాయా?

.ప్రత్యక్ష అనుభవాలు గల వ్యక్తి గురువైతే, శిష్యుడు ఎటువంటి తర్కానికి తావీయక,గురువు పై పూర్తి విశ్వాసంతో, వాన కొరకు వేచియున్న సహారా ఎడారిగా గురువు కనుసైగలకు వొళ్ళంతా కళ్ళతో వేచియుండి గురు ఆజ్నను” తు చ” తప్పక పాటించటానికి సిద్దంగా ఉండి,గురు కరుణిస్తే పై తెలిపిన body,mind,knowledge,subconcious Mind అన్న నాలుగూ పూర్తిగా అలిసి పోయే,ప్రక్కకు కదిలి పోయే వాతావరణాన్ని గురు స్రుష్ఠించ గలిగితే ఆత్మ సాక్షాత్ కారం కలుగ వచ్చు.

సమస్య పరిష్కారంలో, సత్య శోధనలో body,mind,knowledge,subconcious Mind ల పరిమితి ఏమిటి అవి ఎందుకు ఓడిపోతాయి, అవి ఓడిన మరు క్షణమే ఆత్మ కు సాక్షాత్కరిస్తుంది.

No comments:

Post a Comment