Showing posts with label ఆంద్ర. Show all posts
Showing posts with label ఆంద్ర. Show all posts

Tuesday, January 11, 2011

తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి

మీకంటే మేమే చాలా వెనుక పడ్డామని సీమాంద్ర నేతలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ వాదులు వినిపించుకోలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా శ్రీ కృష్ణా కమిషన్ అదే మాట చెప్పడంతో వారు ఆత్మ రక్షణలో పడేరు.

వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?

మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.

వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.

ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.

రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు  దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం  నిర్వివాదాంశం. దిల్లీ వారు  ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.

తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.

ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.

తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.

1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.

2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం

3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి

4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.

5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్  జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన  బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం  రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే  నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల  కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ  శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో  వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.

తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత  లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.

పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.

Friday, January 7, 2011

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన " జయేంద్ర : భాగం2

నిజానికి శంకరా కమిషన్ రిపోర్టు గురించి ఒక టపా వ్రాయడమే ఎక్కువ. జయేంద్ర సరస్వతి ఏదో సమస్త హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అన్న అపోహ చాలా మందిలో ఉన్నా అతను కేవలం ఒక కులానికి పరిమితం అన్న సంగతి అందరికీ తెలుసు. పైగా అతను ఓ మాటన్న మాత్రాన విభజన జరిగిపోయేది లేదు.. ఆగేది లేదు.

దీని పై టపా వ్రాయడంలో నా ఉద్దేశం పూజ్యులుగా చలామణి అయ్యేవారు సైతం సందర్భాలను పట్టి స్టాండ్ మార్చుకుని  పూజ్యాలుగా మారిపోతారని చూపడమే.

కాని గత జన్మలో జయేంద్రుడు ఏం చేసాడో ఏమో తెలీదు గాని మితృలు రాజేష్ జయేంద్ర తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. నన్ను రెచ్చ కొట్టి రచ్చకీడ్చి మరో టపా వ్రాసేలా చేసారు.

గతంలో ఒక సారి ఇలానే ఏదో వాగితే మరెవరో భాగా భుద్ది చెప్పారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ మాట పాపం ఆ మితృనికి తెలీక పోవడం అతని ఖర్మ.

నిజంగా నాకు టపా వ్రాయడానికి సైతం టైమ్ లేదు. తమిళంలో ఐదు వందలకు తక్కువ లేకుండా హిట్స్ కొట్టే నా రచనలు బ్లాగ్లోకంలో వంద రెండొందలకే పరిమితం కావడం కారణంగా ఉత్సుకత కుడ తక్కువే.అయినా ఏదో రోజు నిజం నిలకడ మీద తేలనీ అని వ్రాస్తున్నా.

మరీ  ఈ పొడవాటి కమెంటు పై కమెంటు చెయ్యడం తెలివితక్కువ పనేమో అనిపిస్తూంది. ( ఈ సమయంలో ఒక జాతకానికి ఫలితం పంపితే రూ. 250  నాదవుతుంది. కనీశం ఉచిత జ్యోతిష సలహా క్రింద వచ్చి పెండింగ్లో ఉన్న ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపితే పుణ్యమన్నా వస్తుంది.)

అయినా ఇలా వ్రాస్తూ పోవడం రాజేష్ కు సమాదానం చెప్పే వంకతో  జయేంద్ర గురించిన మరిన్ని సత్యాలను తెలుగు బ్లాగ్లోకానికి చాటాలనే .

రాజేష్ గారి కమెంటులోని ప్రతి మాట వెనుక,  మాటకు  మాటకు నడుమ ఉన్న పెడర్థాలు,వెటకారాలు  వక్ర బాష్యాలను కడిగెయ్యకపోతే నేను వై.ఎస్. అభిమానిని ఎలా అవుతాను?

(గుర్తుకు తెచ్చుకొండి అసెంబ్లి లో వై.ఎస్. డవులాగు - బాధితులు శ్రీ చంద్రబాబు - " నీ అమ్మ ఎందుకు నిన్ను కన్నానా అని బాధ పడేలా కడిగేస్తా)


// "
ఏరా అర్థం అయిందా, ఏవన్నా?//

నాది మృగరాజైన సింహ రాశి. మనుషుల బాసలకే కాదు మృగాల హూంకరింపులను  సైతం అర్థం చేసుకోగలను. తమరు ఏరా అని సంభోధించి జయేంద్రకు తగిన శిష్యులనిపించేరు. శభాష్!

కానీ తమరు ఎంతో బెటర్ లెండి. ఊక దంపుడు కమెంట్ వ్రాసేరు. ఆయన గారైతే నన్నూ శంకర్ రామన్ని  నరికించినట్టుగా నరికించేవారు.

//అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. //
జయేంద్రకు ఓటు హక్కుంటే సాలు .లేకున్నా బాధలేదు.భారతీయుడుగా అతని అభిప్రాయం అతను చెప్పే హక్కు అధికారం మస్తుగా ఉన్నవి. కాని సం.నికోసారి సం.పేరు మారినట్టు అభిప్రాయం మారితే ఎలా? ఆయనగారి ఉపదేశాలూ ఇలా మారి పోతాయేమో? సమాజంలో ఆదర్శనీయులుగా,ఆచరణ యోగ్యులుగా చలామణి అయ్యేవారు కనీశం అలా నటించాలి కదా . మరీ రాజకీయ నాయకుల్లా మాట మారుస్తే ఎల్లా అని ప్రశ్నించడమే నా ఉద్దేశం

//సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!. //

సత్య సాయి బాబా అంటే .. నేనే భగవంతుడంటుంటారు. ఎవరో చంపడానికొస్తే అలార్మ్ మ్రోగనిచ్చి బతికి బయిట పడ్డారే ఆ మహానుభావులేగా..ఉటంకించడానికి మరో వ్యక్తి మాట గుర్తుకురాలేదా బాసు..

//అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది. //

అవున్లెండి .ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంటుకి ?. ( కొత్త డాక్టరు కన్నా పాత రోగి నయమంట కదా?)

//.ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?//

రామకృష్ణ పరమహంస  ఎక్కువగా తీపి తింటున్న బాలునికి అది మానమని చెప్పే ముందు తాను మానారు కదా? ఇదే జయేంద్రవంటి మిడి మిడి జ్నానంతో రోజుకో వాగుడు  వాగే జయేంద్రలను కొలిచే కొలబద్దం..

ఒక కంపెనీ భాగా ఎదిగిపోతే సూపర్ టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విభజిస్తారు బాస్..

//ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా? //
గతంలో నా బ్లాగును నిషేదింప చేసినవారెవరో వారి ఆత్మ సాక్షికి తెలియాలిగాని వారితో నాకేంపని.వారి పాపాన వారు పోతారు అని నా ఉద్దేశం

//స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.

http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm


తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి. .//

మీకు నామీద ఎంత కోపమున్నప్పటికి మీడియాను నన్నూ ఒకే దొడ్డిన కట్టేస్తారా? మీరు సూచించేది ఏదో ఒక కేసుకు సంభంధించిందేకాని శంకర్ రామన్ హత్య కేసుకు సంభంధించింది కాదు కదా? దివంగత తమిళ రచయిత్రి అనురాధా రమణన్ పాపం ఆమె అప్పటికే పేషంట్ .రోజులు లెక్కపెట్టుకుంటుంటే ఆ సంఘఠన జరిగిందని ఆరోపణ. దీనికి సంబంధించి ఏదైనా పంచి పెట్టుంటే దాని తాలూకు లింకుకూడ ఇవ్వండి

//అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//

ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు.  నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన"జయేంద్ర సరస్వతి




కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమైఖ్య వాదానికి చెయ్యిచ్చారు. ప్లేటు ఫిరాయించేరు.గతంలో సమైఖ్య రాష్ఠ్ర్రమే శ్రేయస్కరమని చెప్పిన "పెద్దమనిషి"ఇప్పుడు మాట మార్చారు.హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా రాష్ఠ్ర్రాన్ని రెండు ముక్కలు చెయ్యొచ్చని చెప్పేరు. ఇందుకు  తెలంగాణావారు ఒప్పుకోరుగా..ఆందోళనలు జరుగుతాయిగా అని విలేకర్లు ప్రశ్నిస్తే రెండ్రోజులు జరుగుతాయి,తరువాత సర్దుకుంటాయని శెలవిచ్చేరు.
ఇప్పటికే శంకర్ రామన్ హత్య కేసులో ఇరుక్కుని సతమతమవుతున్న జయేంద్ర వారికి ఈ ఉచిత సలహాల జబ్బు ఎలా సోకిందో అర్థం కావడం లేదు. జయేంద్రకు దమ్ముంటే తమిళ నాడును రెండు రాష్ఠ్ర్రాలుగా చెయ్యాలని శలవివ్వాలి.

మఠానికి ఆస్త్లులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ఆతరువాత ఉచిత సలహాలిస్తే మేలన్నది నా అభిప్రాయం.

(ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు పెట్టి నా బ్లాగు నిషేదింప చెయ్యడం ఖాయం కాబట్టి ఆపుతున్నా)

గమనిక: స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ.. బాధితురాలు ఒక రచయిత్రి,