Friday, January 7, 2011

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన " జయేంద్ర : భాగం2

నిజానికి శంకరా కమిషన్ రిపోర్టు గురించి ఒక టపా వ్రాయడమే ఎక్కువ. జయేంద్ర సరస్వతి ఏదో సమస్త హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అన్న అపోహ చాలా మందిలో ఉన్నా అతను కేవలం ఒక కులానికి పరిమితం అన్న సంగతి అందరికీ తెలుసు. పైగా అతను ఓ మాటన్న మాత్రాన విభజన జరిగిపోయేది లేదు.. ఆగేది లేదు.

దీని పై టపా వ్రాయడంలో నా ఉద్దేశం పూజ్యులుగా చలామణి అయ్యేవారు సైతం సందర్భాలను పట్టి స్టాండ్ మార్చుకుని  పూజ్యాలుగా మారిపోతారని చూపడమే.

కాని గత జన్మలో జయేంద్రుడు ఏం చేసాడో ఏమో తెలీదు గాని మితృలు రాజేష్ జయేంద్ర తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. నన్ను రెచ్చ కొట్టి రచ్చకీడ్చి మరో టపా వ్రాసేలా చేసారు.

గతంలో ఒక సారి ఇలానే ఏదో వాగితే మరెవరో భాగా భుద్ది చెప్పారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ మాట పాపం ఆ మితృనికి తెలీక పోవడం అతని ఖర్మ.

నిజంగా నాకు టపా వ్రాయడానికి సైతం టైమ్ లేదు. తమిళంలో ఐదు వందలకు తక్కువ లేకుండా హిట్స్ కొట్టే నా రచనలు బ్లాగ్లోకంలో వంద రెండొందలకే పరిమితం కావడం కారణంగా ఉత్సుకత కుడ తక్కువే.అయినా ఏదో రోజు నిజం నిలకడ మీద తేలనీ అని వ్రాస్తున్నా.

మరీ  ఈ పొడవాటి కమెంటు పై కమెంటు చెయ్యడం తెలివితక్కువ పనేమో అనిపిస్తూంది. ( ఈ సమయంలో ఒక జాతకానికి ఫలితం పంపితే రూ. 250  నాదవుతుంది. కనీశం ఉచిత జ్యోతిష సలహా క్రింద వచ్చి పెండింగ్లో ఉన్న ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపితే పుణ్యమన్నా వస్తుంది.)

అయినా ఇలా వ్రాస్తూ పోవడం రాజేష్ కు సమాదానం చెప్పే వంకతో  జయేంద్ర గురించిన మరిన్ని సత్యాలను తెలుగు బ్లాగ్లోకానికి చాటాలనే .

రాజేష్ గారి కమెంటులోని ప్రతి మాట వెనుక,  మాటకు  మాటకు నడుమ ఉన్న పెడర్థాలు,వెటకారాలు  వక్ర బాష్యాలను కడిగెయ్యకపోతే నేను వై.ఎస్. అభిమానిని ఎలా అవుతాను?

(గుర్తుకు తెచ్చుకొండి అసెంబ్లి లో వై.ఎస్. డవులాగు - బాధితులు శ్రీ చంద్రబాబు - " నీ అమ్మ ఎందుకు నిన్ను కన్నానా అని బాధ పడేలా కడిగేస్తా)


// "
ఏరా అర్థం అయిందా, ఏవన్నా?//

నాది మృగరాజైన సింహ రాశి. మనుషుల బాసలకే కాదు మృగాల హూంకరింపులను  సైతం అర్థం చేసుకోగలను. తమరు ఏరా అని సంభోధించి జయేంద్రకు తగిన శిష్యులనిపించేరు. శభాష్!

కానీ తమరు ఎంతో బెటర్ లెండి. ఊక దంపుడు కమెంట్ వ్రాసేరు. ఆయన గారైతే నన్నూ శంకర్ రామన్ని  నరికించినట్టుగా నరికించేవారు.

//అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. //
జయేంద్రకు ఓటు హక్కుంటే సాలు .లేకున్నా బాధలేదు.భారతీయుడుగా అతని అభిప్రాయం అతను చెప్పే హక్కు అధికారం మస్తుగా ఉన్నవి. కాని సం.నికోసారి సం.పేరు మారినట్టు అభిప్రాయం మారితే ఎలా? ఆయనగారి ఉపదేశాలూ ఇలా మారి పోతాయేమో? సమాజంలో ఆదర్శనీయులుగా,ఆచరణ యోగ్యులుగా చలామణి అయ్యేవారు కనీశం అలా నటించాలి కదా . మరీ రాజకీయ నాయకుల్లా మాట మారుస్తే ఎల్లా అని ప్రశ్నించడమే నా ఉద్దేశం

//సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!. //

సత్య సాయి బాబా అంటే .. నేనే భగవంతుడంటుంటారు. ఎవరో చంపడానికొస్తే అలార్మ్ మ్రోగనిచ్చి బతికి బయిట పడ్డారే ఆ మహానుభావులేగా..ఉటంకించడానికి మరో వ్యక్తి మాట గుర్తుకురాలేదా బాసు..

//అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది. //

అవున్లెండి .ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంటుకి ?. ( కొత్త డాక్టరు కన్నా పాత రోగి నయమంట కదా?)

//.ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?//

రామకృష్ణ పరమహంస  ఎక్కువగా తీపి తింటున్న బాలునికి అది మానమని చెప్పే ముందు తాను మానారు కదా? ఇదే జయేంద్రవంటి మిడి మిడి జ్నానంతో రోజుకో వాగుడు  వాగే జయేంద్రలను కొలిచే కొలబద్దం..

ఒక కంపెనీ భాగా ఎదిగిపోతే సూపర్ టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విభజిస్తారు బాస్..

//ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా? //
గతంలో నా బ్లాగును నిషేదింప చేసినవారెవరో వారి ఆత్మ సాక్షికి తెలియాలిగాని వారితో నాకేంపని.వారి పాపాన వారు పోతారు అని నా ఉద్దేశం

//స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.

http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm


తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి. .//

మీకు నామీద ఎంత కోపమున్నప్పటికి మీడియాను నన్నూ ఒకే దొడ్డిన కట్టేస్తారా? మీరు సూచించేది ఏదో ఒక కేసుకు సంభంధించిందేకాని శంకర్ రామన్ హత్య కేసుకు సంభంధించింది కాదు కదా? దివంగత తమిళ రచయిత్రి అనురాధా రమణన్ పాపం ఆమె అప్పటికే పేషంట్ .రోజులు లెక్కపెట్టుకుంటుంటే ఆ సంఘఠన జరిగిందని ఆరోపణ. దీనికి సంబంధించి ఏదైనా పంచి పెట్టుంటే దాని తాలూకు లింకుకూడ ఇవ్వండి

//అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//

ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు.  నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు

1 comment:

  1. నీలాంటి వీధి కుక్కలు ఎన్ని మొరిగినా

    ReplyDelete