చిత్తూరు సహకార చెక్కిర ఫ్యేక్టరి - పర్యావ "రణం"
జయేంద్ర వంటివారు మతాన్ని,ఆథ్యాత్మికాన్ని కలుషితం చేస్తుంటే గళం విప్పినట్టే చిత్తూరు సహకార సెక్కిర ఫేక్టరి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే గొంతెంతి నినదిస్తున్నాను.
నేను పసలేని గీతలు చెప్పే భగవంతులకన్నా సృష్ఠిని భగవంతునిగా చూడటానికే ఇష్ఠపడతాను. సృష్థి భగవంతునికన్నా సీనియర్.
సృష్ఠితో పోల్చుకుంటే మనం అత్యల్పులం. పైగా సీనియారిటి ప్రకారం చూసినా సృష్ఠి సీనియర్ మోస్ట్. మనం కొన్నాళ్ళు ఉంటాం. చస్తాం. ఇక ఎన్నో లక్షల తరాలు పుట్టాలి. కాని మన భాధ్యతా రాహిత్యం వలన కేవలం పర్యావరణ కలుషితం కారణంగా పిల్లలు పుట్టలు పుట్టలుగా చస్తారనిపిస్తుంది కాని పది కాలాల పాటు బతుకుతారనిపించలేదు.
సరే విషయానికొస్తున్నా. ప్రజల కొసం పజలు చేసుకునే రాజ్యం ప్రజాస్వామ్యం. సభ్యులు సభ్యుల కోసం చేసుకునేది సహకారం. పైగా ఈ షుగర్ ఫేక్టరి రైతులకోసం రైతులచే నడిపించబడే ఫ్యేక్టరి.
దీనివలన జరిగే ఇతరత్రా కలుషితాల కథ పెద్దగా తెలీక పోవచ్చు కాని (తప్పక ఉంటాయి)
ఒక్క వాయు కాలుష్యం ద్వారానే గిన్నెస్ రికార్డు స్థాయికి "పని"చేసేస్తున్నారు.
వీరు ఏం కాలుస్తున్నారు? ఎందుకు కాలుస్తున్నారు? తెలీదు కాని ఫ్యేక్టరి చిమ్ని నుండి దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగలోనుండి బొగ్గు తునకలు వచ్చి పడతాయి. (బెంచి రవ సైజులో ఉంటాయి) గాలికి అవి పట్టణ ప్రజలందరిని వారి ఇళ్ళ మేడల మీదికి వచ్చి మరీ పలుకరిస్తాయి.
గాలీవాటంగా పట్టణమంతటా వ్యాపిస్తాయి. అంతేగా అని మీరనుకోవచ్చు. కాని వీటివలన ఫ్యేక్టరి పరిసరప్రాంతాల్లో ఉన్న ప్రజలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. (కట్టమంచి,దొడ్డిపల్లె).
పొలాలపై,గొడ్డు గోదల పై, పితికిన పాలు పై, మనుషుల శరీరం పై పడేవి వానొచ్చినప్పుడు,కడిగినప్పుడు పోతాయంటారేమో? పాలు వడపోస్టే సరిపోతుందనుకుంటారేమో? స్నానాలు చేస్తే శుభ్రమై పోతాయంటారేమో?
కాలుకి చెప్పుల్లేకుండా నాలుగడుగులు వేసి కాళ్ళు కడిగితే లీటర్ల కొద్ది నీళ్ళు వినియోగించినా నలుపు నలుపే అంటే చూసుకొండి.
ఇవన్ని ఒక ఎత్తైతే ఈ బొగ్గు తునకలు మనుష్యుల స్వాశ కోశల్లోకి వెళ్తే? మానవ శరీరం తనలోకి అన్యవస్తువులను అనుమతించదు. పసి పిల్లలకు మలబద్దకం ఉంటే తమలపాకు కాడెను దాని ఆసనద్వారంలోకి దోపుతారు.వెంటనే మలవిశర్జణ జరుగుతుంది. శరీరం అన్యవస్తువైన కాడెను భయిటకు తోసి వెయ్యడానికే అంత ఆతృతతో మలాన్ని భయిటకు పంపుతుంది.
ఇంత ఎందుకు ఒక నూలు పోగును ముక్కు దగ్గరకు తీసుకెళ్తే వెంటనే తుమ్మొస్తుంది. ఇదెందుకంటే దానిని భయిటకు తరిమే ప్రయత్నం.
పై తెలిపిన బొగ్గు తునకలు పొరభాటున స్వాశ ద్వార స్వాశకోశంలోకి చేరిపోతే శరీరం దాన్ని భయిటకు పంపి వెయ్యడానికి ప్రయత్నిస్తుంది. స్వాశకోశ గల్ల ఉత్పత్తి చేసి గల్లద్వార దానిని భయిటకు పంపాలని ప్రయత్నిస్తుంది.అదృష్ఠం భావుండి ఆ తునక భయిటపడితే సరే సరి. ఒక వేళ అది ఊపిరితిత్త్లుల్లో నాటుకు పోతే ?
శరీరం ఆ తునక నాటుకు పోయిన భాగం కుళ్ళి పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ తునక రిలీజై పోతుందని శరీరం ఉద్దేశం. కాని కాని.. దీనిని మనం టి.బి అంటాం గుర్తుందో లేదు దీనికి క్షయరోగమని మరో పేరుకూడ ఉంది.
క్షయం అంటే క్షీణించడం. కరగడం.కృంగడం. శరీరమే కృంగి పోతుంది. సాధారణ వస్తువైతేనే ఈ ఎఫెక్టు. పై తెలిపిన బొగ్గు తునకలో ఏముందో? ఏమో? అది ఊపిరితిత్తుల్లో నాటుకు పోతే ఏం చేస్తుందో ఏమో?
ఇప్పటికి లక్షల టన్నుల బొగ్గు తునకలు గాలిలో కలిసి పట్టణమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎందరి ఊపిరి తిత్తుల్లో ఆశ్రయం పొందాయేమో? ఎంత మంది క్షయరోగానికి గురయ్యారేమో? అందులో ఎంతమందికి అది లంగ్ క్యేన్సర్ స్థాయికి వెళ్తుందేమో?
జిల్లా కేంద్రంలోనే ఇంతటి దుస్థితి అంటే మారుమూల గ్రామాల్లో, అఠవి ప్రాంతాల్లో కలుషితం ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకొండి.
గమనిక:
ఈ విషయమై పలువురు ఔత్సాహికులు ఇప్పటికే పలుమార్లు యాంటి పొల్యూషన్ బోర్డు, కోర్టుతలుపులు సైతం తట్టేరు .కాని ప్రయోజనం ఏమో శూన్యం.
కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో దాచినా, మంచి గాలి,నీరు,సారవంతమైన నేలను మిగల్చకుంటే తమ వారసులు సైతం కుక్కచావు చావవలసిందేనన్న చిన్న సత్యం మన నాయకులకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో? షిట్ !
No comments:
Post a Comment