Monday, January 17, 2011

డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?

పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.

మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.

మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?

మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.

మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.

మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.

ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.

ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..

ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో  గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!

No comments:

Post a Comment