అందరికీ సమాదానం ఇస్తూ పోతే ఇక మరో పని చేసుకోలేను కాబట్టి సవివరంగా కమెంటు వ్రాసి ఎన్నో పాయింట్లు అందించిన శంకర్ గారికి ఈ సుధీర్ఘ సమాదానం ఇస్తున్నాను.
నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎటువంటి వైషమ్యం లేదు. వ్యక్తిగతంగా అందరూ నా స్నేహితులే.కాని జయేంద్ర వంటి క్రిమినల్ ను కేవలం కులప్రీతితో వెనకేసుకొచ్చే వారి తత్వాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.
ఇక శంకర్ గారి విమర్శ + నా ప్రతి విమర్శ ఇక్కడ:
శంకర్ గారూ,
ఇది మీ టర్న్ .మీ వ్యాఖ్యలోని ముక్క ముక్కకి ముక్కల మద్య ఖాళీలకు సైతం సమాధానమిస్తా. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్నిదాచుకోవాలంటే ఒక్క చక్కటి మార్గముంది.అదేమంటే "మౌనంగా ఉండడం" లేదా "అతి తక్కువగా మాట్లాడటం/వ్రాయడం. పాపం ! మీకీ సూక్తి తెలిసుండ లేక పోవడంతో ఇలా నోరు (చెయ్యి) పారేసుకున్నారు)
//నేనొక “సాంబారు గాణ్ణి” అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ కాబట్టి, నీ పోస్టులకి ఇంత విలువ ఇవ్వక్కర్లేదు, //
సాంబారుగాడు అంటే తమిళుడని అర్థమంతే. తమిళులంటే మీకు పడదనే భావం వస్తూంది. రూపాయికి సింబల్ డిసైన్ చేసినవాడూ ఒక తమిళుడే ..దాన్ని సైతం వాడరా?
//అందుకే కనీసం ఎవరూ కామెంట్స్ రాయాట్లేదు, అంతేగాని నీకు భయపడి కాదు.//
సాహసవంతుడు ఎంత దాచుకున్నా అతనిలోని సాహసం ఇట్టే భయిట పడినట్టే భయస్తుల భయం కూడ ఇలా -మీ కమెంటులా భయిట పడి పోతుంది. భయస్తుడే సదా సర్వకాలం తనకు భయంలేదని బాహుటంగా చాటుకుంటుంటాడు
//ఇక పాయింట్ కొస్తే, రాజుల పరిపాలన, బ్రాహ్మణ వ్యవస్థ కుప్పకూలి, నేటికి సుమారు వెయ్యి సంవత్సరాలు కాలేదా (మన దేశాన్ని ముస్లిమ్ లు, ఆంగ్లేయులు ఆక్రమించుకొని ఎన్నాళ్ళయ్యింది?//
బాసూ రేపు మావోలు జనజీవన శ్రవంతిలోకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అప్పటికీ కొనసాగుతుందీ ఈ వ్యవస్థ. పునాది నేటిది మొన్నటిది కాదు. యుగ యుగాల పునాది ఇది.
//ఆ తర్వాత స్వంతంత్ర వుద్యమ కాలంలో కుల, మత, జాతులను మర్చిపోయి, అంతా సమానంగా పోరాడి, మన దేశాన్ని మనమే పాలించుకుందాం అనే సదుద్దేశంతో అంతా ప్రాణాలు అర్పించారు//
సమానంగా పోరాడారని ఎలా చెప్పగలము బాసూ..వారి జనాభాఎంత బహుజనుల జనాభా ఎంత? వారిలో నూటికో కోటికో ఒక్కరు రంగంలోకి దిగి పోరాడి ఉండొచ్చు.ఇతరులు బ్రిటీషువారిచ్చిన అవార్డులు,రివార్డులు,రాయితీలు అనుభవిస్తూ వచ్చినవారేగా? ప్రభుత్వ సేవలో తరించిన వారేగా? ఇందులో పోలీసు శాఖలో ఉన్నది ఎంత మంది. దుభాషీలుగా పబ్బం కడుక్కున్నదెంతమంది?
// సరిగ్గా అప్పుడే బ్రిటీష్ వాదులు మనలో ఈ జాతుల చిచ్చు, కుల చిచ్చు పెట్టేరు//
అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి బాసూ.. రాముడు వద్దకు ఒక ఫిర్యాదు వస్తుంది." శూద్రుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు " ఇది ఫిర్యాదు యొక్క సారాంశం .వెంటనే రాముడు విల్లమ్ములతో భయలు దేరి ఒక్క బాణంతో ఆడ్ని చంపేసాడు. -ఇదీ బ్రిటీషువాడు పెట్టిన చిచ్చేనా?
//, అది ఇప్పటికీ రావణ కాష్టంలా కాలుతునే వుంది, వుంటుంది కూడా…//
స్థూలంగా కాలుతున్నా బహుజనుల గుండెలు మాత్రం గతంలో వారు పెట్టిన చిత్రహింసల చిచ్చు కాస్త చల్లారాయనే చెప్పాలి. చాలా మంది తెర వెనుక జరుగుతున్న "కుట్ర్లల"గురించి తెలీక "హ..ఇంకా ఏం బ్రాహణత్వం పాపం వారి మానాన వారు బతుకున్నారని అని చెప్పేవారు కూడ ఉన్నారు.
అయితే జయేంద్ర వంటి వారి చేష్ఠలు,వారి చేష్ఠలకు వత్తాసు పలికేవారు మాటలు/వ్రాతలు ఆ మంటలో పెట్రోల్ పోస్తున్నవి.
//ఎందరో మహానుభావులు రాసారు మన ఈనాటి రాజ్యాంగాన్ని//
ఇక్కడే ఉంది అసలైన జిష్ఠు అంటే మీ ఉద్దేశం బి.ఆర్ అంబేద్కర్ పాత్రను చిన్నది చేసి చూపడమే. అయ్యా వెదవ సలహాలు లక్ష ఇవ్వొచ్చు .కాని వాటినంతా ఏరి, కూర్చిన అసలైన పాత్రను అంబేద్కర్ పోషించారు. ఇదే కీలకం.
//కాని ఈ రాజకీయ వేత్తలు వాళ్ళకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తూ //
ఈ మార్చడాలకు కావల్సినంత తెలివి తేటలు శూద్రులకు ఏదీ? వారికి ఇటువంతి దిక్కుమాలిన సలహాలిచ్చి బ్రష్థు పట్టించిందెవరంటారూ? తమ కులాన్ని క్రాపు,కోటు ,సూట్ల వెనుక దాచుకున్న బ్రాహ్మణోత్తములైన సెక్రట్రీలు,ఆడిటర్లు కాదంటారా?
//అడ్డగోలు గా కోట్లు సంపాదిస్తున్నారే,,//
అలా సంపాదించిన వారికి యజ్న ,యాగాదులు చెయ్యిస్తామంటూ దోచుకుంటున్నారే వీరికి ఆ దోపిడిలో భాగం ముట్టినట్టేగా?
//వీళ్ళలో ఎంత మంది బ్రాహ్మలున్నారు?//
ఇదేగా వారి వైవిధ్యం. ప్రయోగించే వీలు,వెసలుబాటు ఉన్నప్పుడు అధికారం ఏ ఎదవ దగ్గర ఉంటే ఏమనిగా వారు తెరవెనుక భాగోతాలు నడిపిస్తున్నది.
//(స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? నీ ద్రుష్టిలో గుంటనక్కలని పిలవబడే బ్రాహ్మలు కాదే?)//
ఇదేంటి బాసూ.. జయేంద్రలాగా పారా పారాకు మాట మారుస్తున్నావు? ఓహ్.. రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేద్కర్ కాదు "మేధావులు". రాజ్యాంగానుగునంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది మాత్రం బహుజనులే అన్నది మీ ఉద్దేశం అవునా?
నేనెక్కడ కూడ బ్రాహ్మణులు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని చెప్పను. చెయ్యిస్తున్నారు. అదీ బహుజనుల్లో నుండి అధికారంలోకి వచ్చిన బహుజనుడి చేత తమ చేతికి రక్తం అంటకుండా చెయ్య్సిస్తున్నారు. తమ వద్ద ఉన్న భూమిల్ని -అగ్రకులస్తులు-వారివద్దనుండి బహుజనులు తీసుకున్నారన్న అక్కసుతో కదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో క్షవరం చెయ్యిస్తున్నారు?
// మరి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎంత దారుణంగా వుంది//
అన్నీ కరెక్టే బాసు..ఇలా దిగజారేలా చెయ్యించింది ఎవరు అన్న పాయింటు మీదేగా మీకు నాకు విభేదం. మీరేమో బహుజనులే చేసారంటారు. నేనేమో మీ వారే చేతికి మట్టంట కుండా చేసారని చెబుతున్నా.
//అసలు సామాన్యుడు (ఏ కులం వాడైనా) బతికే రోజులున్నాయా?//
ఇదేంది బాసూ.. మొన్నేగా ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడు మావాళ్ళు మాత్రం లక్షలు సంపాయిస్తున్నారని చెప్పేరు. బహుజనులు ఎమ్.ఎల్.ఏలు,ఎం.పీలు,మినిస్టర్లైనంత మాత్రాన వీటన్నింటికి వారే కారణమని ఎలా చెప్పగలం.
ఒక్క ఎన్.టి.రామారావు తప్ప, జయలలిత తప్ప మరెవ్వరైనా సరే ప్రభుత్వ ఉధ్యోగుల జోలికి పోయి బతికి బట్ట కట్ట కలిగారా? సరే వీరిలో కూడ మా సంఖ్య అల్పమంటారేమో? అత్యధికంగా ఉన్న బహుజనులను నడిపే పొజిషన్ మీదే కద బాసూ.. ఒక వేళ బహుజనుడే యూనియన్ లీడర్ అయినా ఆడ్ని నడిపేది మీరే కదా?
ఇస్లాం తప్పు చేసిన అంగాన్ని తెగ కొయ్యమని చెప్పినట్టుంది మీ వాదన. అసలు ఆ అంగాన్ని కదిలించింది బుర్రేగా. ఆ బుర్రలాంటి వారు బ్రాహ్మణులు.అయితే బుర్రకు శిక్ష ఉండదు. దాని ఆదేశానుసారం పని చేసిన అంగాన్ని మాత్రం నరికి వేస్తారు.
ఉ. కేంద్ర మంత్రి రాజా - అతనికి ఈ స్కామ్ చేసే" సాంకేతిక" సహకారం అందించిన "ఆళ్ళు" కాలో చెయ్యో స్వతంత్రించి పని చెయ్యవు కాక చెయ్యవు.
// ఒక ఆడ పిల్లకి పట్ట పగలే రక్షణ లేదు(ఎన్ని యాసిడ్ దాడులు జరుగుతున్నాయి?//
ఇందుకుకారణం వేదం -వెళంకాయ్,పురాణం, పునీతం అంటూ సెక్సును దాదాపుగా నిషేదించడమే. ఈ పుణ్యం కూడ తమదేగా.
//ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు,//
కాళ్ళు చేతుల్లాంటివారే -వీరికి మతమనే మత్తు ఇచ్చి - సెక్సు గురించిన గిల్టి తెప్పించి -వారిని కామ పిశాచాలుగా మార్చింది అహేతుకమైన ప్రవచనాలేగా
// వాళ్ళకి కొమ్ము కాస్తుందీ కూడా బ్రాహ్మలేనా తండ్రీ?//
ఇటువంటి కేసులు వాదిస్తున్న లాయర్లు ఎంతమంది వారిలో బ్రాహ్మణులెంత ? ఒక లెక్క తేల్చండి చూద్దాం
//ఒక కులం వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతూ తరతరాలుగా కోట్ల ప్రజల సొమ్ముని మింగేస్తూ వుంటే నీ లాంటి సాంబారు నా…(ఇంకో తిట్టు) అంతా ఏం చేస్తున్నారు?//
వారి వెనుకనుండి స్కెచ్ ఇస్తూ చేతికి మట్టి అంటకుండా భాగం పొందుతున్నవారిని చూసి గోళ్ళు గిల్లుకుంటున్నాం
//ఇక ప్రబుత్వ వుద్యోగుల్లో ప్రతిభ వున్నా, లేక పోయినా సీనియర్లని వెనక్కి తోస్తూ అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేస్తూ, పని చేసినా చెయ్యక పోయినా జీతాలు తీసుకుని, లంచాలను తీసుకుంటూ అటు ప్రజల సొమ్ముని, ఇటు ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్న వాళ్ళలో బ్రాహ్మలెంతమంది వుంటారు?//
వారలా ప్రవర్తించడానికి కారణం అతని హక్కులను కాల రాసి, ఆడ్ని జంతువుకన్నా హీనంగా చూసి రెచ్చ కొట్టింది కుల వ్యవస్థ కాదా? వాడ్ని బహుజనుడిగా గౌరవించి ఉంటే వాడిలో ఈ దనవ్యామోహం ఎందుకొస్తుంది.వాడు తన కులాన్నే మరిచి పోవాలని ఎవడికీ తీసి పోనని నిరూపించుకోవడానికి ఎంచుకున్న తప్పుడు మార్గమిది. మరి ఈ మార్గంలోను "Script work" మనవాళ్ళదే మరి.
//అందుకే ఇప్పుడు ప్రెవైటేజషన్ పెరిగి//
ఇది రిజర్వేషన్ పై ఒళ్ళు మండిన చాణక్యుల కుట్ర అనేగా చెబుతున్నా
//గవర్నమెంటు వుద్యోగాలు తగ్గించి//
ఈ మాటకూ ఆ మాటే నా సమాదానం
//అన్ని పన్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు,//
ప్రైవేట్ వాళ్ళంటే ఆకాశంలోనుండి దూకారా బాసూ.. ఆళ్ళు మనోళ్ళేగా.. మరి ఆళ్ళని ఆడించేది కూడ "మనోళ్ళేగా". మరి ప్రైవేట్లోనైతే టోటల్ వ్యవస్థను నియంత్రించే స్థాయికి ఎదగడం తేలిక
// అప్పుడు ప్రతిభ వున్న వాళ్ళే నిలబడతారు.//
ప్రతిభతో పాటుగా - భార్య -ఈడొచ్చిన కూతుళ్ళతో కలిసి పార్టీలకు కూడ అటెండ్ కావాలి మరి. ప్రైవేట్ అంటే అదీ అసలైన జిష్థు..
// ఇదీ కూడా మా బ్రాహ్మల పనే అంటావా?//
అంతేగా?
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment