లేచి పోయే భార్యలే ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే అవకాశం లేక నరకాన్ని భరిస్తున్న భార్యల సంఖ్య ఇంకా ఎంత పెద్దదుంటుందో మీరే ఊహించుకొండి. అలా లేచి పోయే భార్యలకు వకాల్తా పుచ్చుకోవడం నా ఉద్దేశం కాకున్నా , కేవలం "కోరికలు" నెరవేరలేదని వెళ్ళిపోతున్నారని, "కొవ్వెక్కి" వెళ్ళి పోతున్నారని మాత్రం నేను చెప్పను. కేవలం ఈ కారణం చేత లేచి పోయేట్లుంటే పత్రికల్లో మ్యేట్రిమోనియల్స్ లాగా "లేచి పోయిన వారి ఆచూకి"కోసం సెపరేట్ శీర్షికలు వచ్చేవి.
నా ఈ 43 మైనస్ 20 సం.ల అనుభవంలో ఇలా లేచి పోయినవారి కథలు వెయ్యి దాకా చూసి ఉంటాను. ఒక డాక్టరు భార్య నలుగురితో ( ఒకే సమయంలో కాదండి బాబూ) ఒక్కో సారి లేచి పోయి రిటర్న్ వచ్చింది.
అవివాహితునిగా ఉండగా వివాహితతో లేచి పోయి, చేతిలో డబ్బులై పోయాక ఆవిడ ఈడ్ని చీకొట్టి తరిమివేస్తే రిటర్న్ అయ్యి ఒక విడోను పెళ్ళాడి,ఇద్దరు పిల్లల్ని కన్నాక మళ్ళీ ఒక అవివాహితతో లేచి పోవాలని ప్లాన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండలేక, లేచి పోయి ఎక్కడున్నాడో తెలీని యంగిస్కాన్ ఒకడి గురించి చెప్పాలంటే సీరియల్ వ్రాయాల్సిందే.
మా ఊళ్ళో పెద్ద కిరాణా కొట్టువాని భార్య ఆ కొట్టులోనే పని చేసే కుర్రానితో లేచి పోయింది . ఆ కుర్రాడు నగా నట్రా అంతా ముందురోజే తన వద్దకు రాబట్టుకొని మర్సటి దినం ఆమె
తిరుపతి రైల్వే స్టేషన్లో కాచుక్కూర్చుంటే ఈడు దాని వంక కూడ చూడలేదు.ఈ పింజారి వెదవ ఓనర్ రొటీనుకే భానిసయినట్టున్నాడు.
ఆవిడ కొన్ని గంటలు వేచి చూసి తిరిగి ఇల్లు చేరింది. ఆ కుర్రాడ్ని నగా నట్ర కోసం వారం రోజులు గదిలో బంధించి మరీ కొట్టారు. కాని వాడి నోట ఒక మాట కూడ పెగల్లేదు. చికాకు పుట్టి తరిమి వేసారు. మూన్నెల్లయ్యాక ఆ విశ్వాస ఘాతకుడు మరో పెద్ద కిరాణా షాపు నెలకొల్పాడు.
ఇటువంటి వాటికి అసలైన కారణం భార్యా భర్తల్లో ఒకరు రొటీనుకు భాగా అలవాటు బడడం మరొకరు రొటీను పై విసిగి వేసారి పోవడమే అనిపిస్తూంది.
ఒక సారి వాన పడినప్పుడు ఆ వాన నీరు ఏ రూట్లో వెళ్ళిందో మళ్ళీ ఎన్ని సార్లు వాన కురిసినా అదే రూట్లో వెళ్తుంటుంది.(మద్యలో ఎవడన్నా బడాబాబు దానిని ఆక్రమించి వేయకుండ ఉన్నంత వరకు) .మనుషులు కూడ ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఇదే నాకు మండుద్ది.
మా ఊళ్ళో కిరాణా కొట్టు నడిపే వైశ్యులు పాపం ఉ.పూ నాలుగు గంటలకు లేస్తారో మూడుకే లేస్తారో లేదు నిద్రే పోరో తెలీదు కాని ఉదయం ఐదు గంటలకే షాపుకు వచ్చి లోపల కుక్కేసిన బస్తాలన్నింటిని లాగి రోడ్డును ఆక్రమించి సర్దుతుంటారు. మరి షాపు మూసేదానికి రాత్రి పది పదకొండవుతుంది.
మిట్ట మద్యాహ్నం గిరాకియే లేకున్నా కునుకు పాటు పడుతుంటారే గాని ఇంటికి మాత్రం పోరు. కార్మికుడు ఎనిమిది గంటలే పనిచెయ్యాలని ఎప్పుడో రూల్ వచ్చేసినా వీరు మాత్రం కుటుంభం, భార్యా,పిల్లలు,తమ రుచులు,అభిరుచులు,భయిట ప్రపంచం అన్నింటిని గాలికొదిలేసి గొడ్డు చాకిరి చేస్తుంటారు.
నా భావం ఏమంటే పుట్టాము గనుక బతకాలి.బతకాలంటే కొంత డబ్బు కావాలి.అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. మరి దానికి ఒక టైమ్ లిమిట్ ఉండాలిగా. కొడుకు ఏ గల్లా పెటెలో నుండి ఐదొందలు నొక్కేసాడా? వెయ్యి నొక్కేసాడా? ఏ అమ్మాయి వెంట పడుతున్నాడు వంటి సమాచారం కూడ లేక నిత్యం అను నిత్యం షాపు షాపు అని చస్తుంటే ఎలా?
ప్రతి ఊళ్ళోని బజారులో షాపు వారంతా ఒక చోట కలిసి తమకంటూ ఒక టైమింగ్ ఏర్పాటు చేసుకుంటే ఏం? ( ఆడు ముందుగా తీస్తాడు. వీడు ముందుగా తీస్తాడు.నా గిరాకీ అంతా పోతుందని ఆరాట పడేగా ఈ పని చేస్తున్నారు.అందరూ ఒక నిర్ణయానికొస్తే బెటర్ కదా)
పండుగలు,పబ్బాలు,బంద్, పెళ్ళీ,పేరంటాలు దేనికి మరి దేనికి హాజరు కాక ,తాము సంఘ జీవులమనే బావత్తు కూడ లేక ఈ యాంత్రిక జీవితం గడపడం ఏలా? చివరికి ఊభకాయం, అల్సర్,గ్యాస్,షుగర్,బి.పి వంటి రోగాలకు గురి కావడం దేనికి? కుటుంభ సభ్యులతో సంబంధాలు బెడిసి కొట్టి ఎదవలవడం దేనికి? లేచిపోయిన భార్యలు,కూతుళ్ళ కోసం వెతుక్కోవడం దేనికి?
వ్యాపారస్తులే కాదు ఆఫీస్ గోయర్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తుంటారు. వీరు ఇల్లు చేరడానికి రాతి పది పదకొండు అవుతుంటుంది. ఆఫీస్ గోయర్స్ మాత్రమే కాదు రిటైర్డ్ పెర్సన్స్, నిరుధ్యోగులు, పారా సైట్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తారు.
తాపి పని చేసే వారు ఉదయం ఒక చౌక్లో గుమి కూడుతుంటారు.వీరి అవసరమున్నవారు అక్కడొచ్చి వీరిని ఎంగేజ్ చేసుకుంటారు.ఇది ఓకే. సాయంత్రం మళ్ళీ వచ్చి అక్కడే గుమి కూడుతారు. సరే మంచి చెడ్డా మాట్లాడుకుంటారనుకుంటే సా. ఆరునుండు రాత్రి పది పదకొండు వరకు ఇదే తంతా.
వీరు మందుకొట్టి,చిక్కెన్ పకోడా తిని తేపి వెళ్ళే లోపు ఇంట ఉన్న వారు ఏం కావాలి?వారి మనస్సులు ఏం కావాలి?
ఆ కాలనిలోని ఏ పింజారి వెదవో వీరిని "లేచి పోదాం రా!" అని రెచ్చ కొడితే రచ్చకెక్కాలిగా?
హ్మ్ .. బావుంది. చక్కగా రాశారు.
ReplyDelete