Monday, January 3, 2011

స్నేహం ప్రేమ పది కాలాల పాటు కొనసాగాలంటే

ఓషో చెబుతారు : ప్రతి ఒక్కరు స్నేహాన్ని -ప్రెమను కోరుకునే వారే గాని పంచేవారు ఎవ్వరూ లేదు. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి వద్ద అడుక్కుంటే ఏం దొరుకుతుంది?

మన జీవితమనే రైలు తన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లను దాటుకుని వెళ్ళినా చివరికి ఆగనున్నది మరణమన్న స్టేషన్లోనే.

మరణాన్ని ఆప గలిగే స్నేహం -ప్రేమా ప్రతి ఒక్కరికి లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచమే పెద్ద బస్ స్టాండు. ఇక్కడికి వచ్చే బస్సులు కేవలం చావూరికే తీసుకెళ్తాయి.

అందాక బస్ స్టాండులో ఉన్న సాటి ప్రయాణికులతో కలిసి మెలిసి ఉంటే ఏం చక్కా కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ మనది,  మన స్నేహితులదే కాదు మన శతృవులది సైతం తాత్కాలిక బసే. ఈ ఒక్క పాయింటును అర్థం చేసుకుంటే శతృవులతో సైతం మనకు స్నేహం సాధ్యమే.

శతృవులను ప్రేమించడం గురించి తరువాత చెబుతాను గాని ప్రస్తుతానికి ఈ స్నేహం ప్రేమల గొడవేమోచూద్దాం.

ప్రపంచం చాలా పెద్దది. కోట్ల కొలది జనాలుంటారు. మీరు+మీ స్నేహితుడు/ప్రేమికుడు/ప్రియారాలు మాత్రమే ఉంటే ఎంత భావుండేదో అని మీరుఎన్నో సార్లు ఊహించుకుని ఉంటారు. కాని నిజమేమంటే
మీరిద్దరు మాత్రం ఉంటే ఒకరినొకరు చంపుకుని చచ్చి పోయేవారు.

కాబట్టి మీ ఇద్దరి నడుమ విద్యా -కుటుంభం-సమాజం ఇలా ఎన్ని ఉంటే అంత మంచిది అప్పుడే
స్నేహానికి -ప్రేమకు లాంగ్ లైఫ్.

మీరు మొబైల్ వాడేవారయ్యుంటే మీకు చార్జర్ సుపరిచితమే. చార్జర్ లోపల ఏముందో తెలీదనుకుంటా? మన ఇంటికి సరఫరా అయ్యే పవర్ 250 Volts .దీనిని డైరక్టుగా మొబైల్లోని బ్యేటరికి పంపితే మెటాష్ అయిపోతుంది.

అందుకని చార్జర్ లోపల ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఉంటారు. ట్రాన్స్ ఫార్మర్ అంటే మరేమో కాదు. అందులో వంద మీటర్ల పొడవుగల సన్నని రాగి తీగ ఉంటుంది. 250 Volts పవర్ ఒక కొనలో ఎంటర్ అయ్యి వంద మీటర్లు ప్రయాణం చేసి మరో కొనకు వచ్చే సరికి అది 4 volts గా మారుతుంది.

మీలో కలిగే ప్రేమ/స్నేహాన్ని అడ్డు అదుపు లేకుండా అవతలివారిపైకి వదిలితే మొబైల్ బ్యేటరిలాగా మెటాష్ అయిపోతారు.

అందుకే మీ ప్రేమ విద్యా -కుటుంభం-సమాజంవంటి నూట పదహారు మీటర్ల తీగకుండా ప్రయాణం చెయ్యాలి.

ఎదుటువారిని కేవలం బంకమట్టిలా భావించడం మనకు నచ్చినట్టుగా షేప్ అప్ చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం.

రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.

ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.

ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ  కురిపించారో ఆలోచించండి.

ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.

కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..

3 comments:

  1. చాలా బాగుంది...మీదైన మార్కు eccentricity లేకుండా. అన్నీ ఇలాగే రాయొచ్చు కదా.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు. థాంక్యు.

    ReplyDelete
  3. 2011లో మీ బ్లాగులో కామెంట్ల పంట ఎలావుంటది? సాంబార్ గాడు గారు. మీ సాంబార్ రెసిపీ ఏమిటో ఓ పోస్ట్ లో తెలపండి.

    ReplyDelete