మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.
డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.
కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.
ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?
సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్. మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..
బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..
వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?
మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు
No comments:
Post a Comment