ఎవరికైనా సరే తమ బతుకు" పై తూ! నా బతుకు.." అనే భావం కలిగిందంటే చాలా కష్ఠమవుతుంది. ఇలా అనిపించ కూడదంటే కాషాయం కట్టి కాశికి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మొదట మన సంపాదన -జీవన విధానంలోని నిరర్థకతను అర్థం చేసుకోవాలి. నిన్నటి నా టపా చదవని వారు ఇక్కడ నొక్కి ఒక మారు చదవండి.
ఇక పాయింటుకొస్తా:
క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!
1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.
ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?
ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.
మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.
సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.
కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.
మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి? కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.
ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.
వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...
మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.
జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి. ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.
న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.
సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.
సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.
రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.
నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.
లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.
నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.
నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.
దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.
నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.
ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..
నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.
మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"
No comments:
Post a Comment