వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?
మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.
వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.
ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.
రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం నిర్వివాదాంశం. దిల్లీ వారు ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.
తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.
ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.
తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.
1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.
5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్ జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.
తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.
పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.
రాష్త్ర గ్రహస్థితి ఎలా వుందండి? విడిపోతుందా? ఎప్పుడు? ఓ పోస్ట్ వేయండి సిద్ధాంతి గారు.
ReplyDelete