Showing posts with label caste system. Show all posts
Showing posts with label caste system. Show all posts

Friday, January 14, 2011

సాంబారుగాడి పై వేటుకు రంగం సిద్దం


ఓ ఇంట పాము దూరింది. దానిని ఆ ఇంటివారి పెంపుడు కుక్క చూసింది. మొరగడం ప్రారంభించింది. ఆ ఇంటివాడు ఆ కుక్కను నోర్ముయించడానికి కొంత సేపు ప్రయత్నించి తిక్కరేగి డబుల్ బ్యేరెల్డ్ గన్ తీసి కాల్చేసాడు. ఆ కుక్క హరీమంది.

ఆ ఇంట దూరిన పాము అంతా నిద్రపోయాక తన పని తాను చేసి పారేసింది. సరిగ్గా అదే నా విషయంలోను జరుగనుంది. జయేంద్ర పై నా విమర్శల పై కమెంటు చేసిన వారిపై ఏ చర్యా ఉండదు (పాము దూరడాన్ని ఎవ్వరూ గుర్తించలేదు) కాని వారి కమెంటు పై నా స్పందన పై మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది.అదేమంటే నా బ్లాగును నిషేదించడం.

బహుసా జెల్లడ,మాలికా డాట్ ఆర్గ్,కూడలిలలో కనిపించే చిట్ట చివరి టపా ఇదేనేమో? ఎందుకైనా మంచిది ఈ పేజిని బుక్ మార్క్ చేసుకొండి. ఇక జయేంద్ర పై నా విమర్శ పై వచ్చిన కమెంటు పై నా స్పందన ఇదో !

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు//
మీ వాళ్ళను మోసి మోసి భుజాలు కాయలు కాసాక,కాయ కోసి కల పండిందని మీవారే తింటుంటే చూసి ఏడవక చేసేదేముంది?

//కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు//
మేం ఏడుస్తే కరిగి పోయేదానికి మీరేమన్నా మాలా  సామాన్యులా? కేవలం బుర్రతో ఆలోచించే మేధావులు కదండి. గుండె ఉన్న స్థానంలో బండను కుదుర్చుకుని (బ్రాహ్మణ )స్త్ర్రీలను సైతం మీరు పెట్టిన యాతనలు అన్ని ఇన్ని కావుగా?

బాల్య వివాహాలను నిర్భందిస్తూ " నీ కూతురు పెద్దమనిషయ్యే ముందే పెళ్ళి చెయ్యాలి.లేకుంటే ప్రతి నెల ఆమె భహిష్ఠును త్రాగాలని ఆజ్నాపించినవారుకదా?
(సతరు శ్లోకం సైతం ఉంది - మీరు  ఆధారం కోసం నిలదీస్తే భయిట పెడతా)

//మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,//

కీలకమైన పొజిషన్లే అయితే అక్కడి వారు పది రూపాయలిస్తేగాని చెయ్యని పనిని మీవారు రెండు రూపాయలకు చేసి పెడ్తూ అక్కడి నిరుధ్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారన్న సంగతి తెలుసులెండి సారి

//(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు//
మీ వేదాల ప్రకారం సముద్రం దాటితేనే బ్రష్థులవుతారుగా.. మరి మీ వారి విదేశీయానానికి వేదాలు అడ్డురాలేదా బ్రదర్!

// కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి //
ఇదంతా తమ పుణ్యమే కద బ్రదర్.. వర్ణాల క్రింద విభజించింది మీరే కద తండ్రి!

//వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు//

వారికి సెక్రెట్రియేట్లో , మార్కెటింగ్ డిపార్ట్ మెంటుల్లో ,ఎస్టాబ్లిష్మెంటు సెక్షన్లలో కూర్చుని స్కెచ్ ఇచ్చేది తమవారే కదా..దొంగ లెక్కలిచ్చే ఆడిటర్లు,దొంగ కేసులు వాదించే లాయర్లు ఎంతమంది లేదూ

// ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు//
మీ వాళ్ళు వేదం వింటే చెవిలో సీసంకరిగించి పొయ్యాలన్నారుగా.. చదివితే నాలిక కోస్తామన్నారుగా.ప్రతిదానికి సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. అసలు విషయాలను దాచి పెట్టింది మీరే కదా..

గుడ్దిలో మెల్ల మేలన్న చందంగా బాబాల వెంట పడేరు బహుజనులు

//(వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా)//
కాదు కాని మీకు నకిలీలు

//బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి,//
మీ ఈ మాటను కాదన్నానా? కాదంటానా?

//ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, //
ఏం చేద్దాం గురూ.. మీరు మరీ కాపి రైట్ కోసం కకృత్తి పడేరు -సీక్రెట్ సీక్రెట్ అని టెన్షన్ పెట్టేరు. అసలు దొరకనప్పుడు నకిలీలకు మార్కెట్ రావడం మాములేగా?


//నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,//
మీ (వారి) అజెండా ప్రకారం పని చేసే ఎవడన్నా చేరేది శ్రీకృష్ణ జన్మస్థానం (కేంద్ర మంత్రిరాజా) లేదా ఖబర్ స్థాన్ ( రాజీవ్ గాంది) నాకా ఉద్దేశం లేదుగాని బాబాల సంగతి ఎప్పుడో ఉతికి ఆరేసి ఎండేసా.. మీకా తుత్తర అవసరం లేదనుకుంటా

నన్ను కుహానా జ్యోతిషుకుల పట్టికలో చేర్చడంతో నేనెంతటి నిజాలను నిర్భయంగా వ్రాసానో చెప్పకనే చెప్పేరు.

థ్యాంక్స్. ఇప్పటికీ ఒక్క ముక్క చెబుతున్నా వ్యక్తిగతంగా నాకు ఏ బ్రాహ్మణుని మీద గోరంత కోపమో,విరోధమో లేదు. నా ఆవేశానికి కారణం ఇప్పటికీ (ఇంత కాలం ఏలి - దోచి కూడ) భుద్ది మార్చుకోకపోవడమే..

//"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది"//
బ్రాహ్మణోత్తమా ! కాల దర్మం మీకు తెలియనిది కాదు. మారే కాలాన్ని పట్టి అన్నీ మారిపోతాయి. గతంలో నూటికి తొంబై శాతం వ్యవసాయం మీదే ఆధార పడి బ్రతికేవారు. పొలం దున్నడానికి ఎద్దులు అవసరం కాబట్టి గోవులకు ఎక్కడలేని ప్రాధన్యత ఇచ్చే వారు.పైగా అవి సాధు జంతువులు కాబట్టి  వాటిని కలిగి ఉండటం పెద్ద రిస్క్ లేని పని. అందుకే మీవారు మరింత కలర్ ఇచ్చి రాజులకు మస్కా కొట్టి బేవార్సుగా వేలాది ఆవులు తెచ్చుకునేవారు.అయితే వాటిని మేపడం యాదవులు చేస్తారు. అవి పాలీయడం మానేస్తే ఊళ్ళో పంచముడు తీసుకెళ్తాడు. చస్తే ఆడే తీసుకుపోతాడు. ఇది గో పురాణం వెనుకున్న అసలైన కిటుకు.

ఇక బ్రాహ్మణులంటారా at that time they were just un productive consumers of the society. ఎక్కడ తమర్ని సైతం కాయ కష్ఠం చెయ్యమంటారోనన్ని భయపడి ఇలా బిల్డప్ ఇచ్చుకునేసేరు.

// బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు)//
ఐ సీ ! మరి నేను కూడ సమాజ హితం కోరేవాడ్నే .. మీ వాళ్ళ వలే గ్రహ దోషాలకు పరిహారంగా  యాగాలు చెయ్యమని వేలకు వేలు గుంజడం లేదు.కుజ దోషముంటే రక్త దానం చెయ్యమంటున్నా. సర్ప దోషం ఉంటే ఇతర మత గ్రంథాలు చదవమంటున్నా. మరి మీ సంఘంలో నన్నూ ఒక సభ్యునిగా చేర్చుకోమనగలరా? ఎందుకండీ ఈ హిప్పాక్రసి. బ్రాహ్మణత్వమన్నది పుట్టుకతో నిర్ణయించబడుతుందని చంటి పిల్లవాడు సైతం చెబుతాడు.


// ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి,//

ఆర్టికిల్ ఏంది ఖర్మ! దుమ్ము దులిపాను. కేసులు పెట్టాను. పేపరుకెక్కాను . ఆమరణ నిరాహార దీక్షకూడ చేసాను.

// తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
దమ్మా? నా కణకణాల్లో జీర్ణించుకు పోయిందదొక్కటే సుమండి..

Thursday, January 13, 2011

మళ్ళీ ప్లేటు ఫిరాయించిన జయేంద్ర

ఇక్కడో మాట..అక్కడో మాట -ఈ రోజో మాట ..రేపో మాట. ఇదే వరస. ఇక్కడేమో హైదరాబాద్ ఉమ్మడి రాజదాని ప్రాతిపదికన  రాష్ఠ్ర్రం విడిపోవాలని సూచించిన జయేంద్ర ..................

.........చెన్నైకి వెళ్ళగానే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని - రాష్ఠ్ర్ర విభజన తన ఉద్దేశాం కాదని చెప్పేరు.
గురువింద చందంగా తన పై ఉన్న ఆరోపణలు,కేసుల గొడవ చూసుకోకుండా ఇలా "నీతులు" "ఉచిత సలహాలు" విసరడం దేనికో అర్థం కావడం లేదు.ఇకనన్నా కులప్రీతితో జయేంద్రను వెనుకేసుకొచ్చేవారు మారితే మంచిది.

నా బ్లాగు పై నిషేదానికి కౌంట్ డౌన్ ప్రారంభం..

రోగాల పుట్ట, ఆఖరు ఘడియల్లో ఉన్న. మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను, కేవలం కుల ప్రీతితో వెనుకేసుకురావడమే కాక శాపనార్థాలు పెడుతూ నన్నెదవను చేస్తూ కమెంటు వ్రాసాక నేను స్పందించాక (మరీ వై.ఎస్ బాణిలో ) నా బ్లాగు నిషేదానికి గురికాకుండా ఉంటుందా? అసంభవం ఆలోపు జయేంద్రను వెనుకేసుకొస్తున్న వారి విమర్శలకు నా సమాదానాన్ని ఈ టపా ద్వారా అందిస్తున్నా.

మానవహక్కులు తదితర కారణాలతో జయేంద్రను వెనుకేసుకొచ్చినా  అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం కుల ప్రీతితో వెనుకేసుకొస్తే దానిని ఏమనాలి? కుల గజ్జి అనాలా? కుల పిచ్చి అనాలా? నాకర్థం కాని సంగతి ఏమంటే రెడ్డి రెడ్డిని పొడుస్తే ఆడు చావడా? కమ్మను కమ్మ నరికితే ఆడు చావడా?

అసలెక్కడివి ఈ కులాలు? మరెక్కడివి ఈ మతాలు? అన్నీ మద్యలో వచ్చినవేగా? నాటి ఆఠవిక జీవితంలో కుల మతాలు లేవే.. కుల మతాలు ఎలా పుట్టుకొచ్చుంటాయో నా "దివ్య దృష్ఠి"లో చూసి చెబుతా.

ఆఠవిక జీవితంలో ఎప్పుడు వానొస్తుందో,ఎప్పుడు వరదొస్తుందో, మరెప్పుడు పెద్దపులు దాడి చేస్తుందో చెప్పలేని స్థ్తితి. మనుషులు గుంపులుగా ఒక నాయకుని క్రింద బతికేవారు. ఎవడైతే భలవంతుడో ఆడే నాయకుడు. ఎవడైతే భాగా ఏటాడతాడో ఆడే నాయకుడు. సాధారణంగా శారిరక భలం ఉన్నవారికి భుద్ది బలం కాస్త తక్కువే.

ఇదే అదనుగా ఆ గుంపులోని బలహీణులు + సూక్ష్మ భుద్ది గలవారు ఆ నాయకునికి దగ్గరై ఉండాలి. వానొచ్చే వేళ,వరదొచ్చేవేళ,పెద్ద పులు వచ్చి పడే వేళలను ప్రకృతి/పశు పక్ష్యాదుల్లో వచ్చే చలనాన్ని బట్టి చెప్పగలిగి ఉండాలి. ఈ ఒక్క పాయింటు మీద నాయకుని దగ్గరై ఉండాలి. ఇతరులను నాయకునికి దగ్గరై పోకుండా జాగ్రత్త పడి ఉండాలి.

ఈ సలహాదారు పోస్టు వంశ పారంపర్యంగా వచ్చుండాలి. పై తెలిపిన ముందు జాగ్రత్తలకు మానవాతీత శక్టులను జోడించి నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని దైనందిన జీవితాన్ని,జీవనాన్ని సుఖమయం చేసుకుని ఉండాలి.

ఈ సలహాదారులే,పూజారులుగా అవతరించి ఉండాలి. నాయకుని పై తమకున్న పట్టుతో ఇతరులను సైతం తమ సేవకు /పోషణకు విణియోగించుకునే ప్రయత్నం చేసి  ఉండాలి. అప్పుడు పౌరులు దీనిని వ్యతిరేకించి ఉండాలి.

గుంపు పెరిగినట్టే సలహాదారుల తీగ కూడ పెరుగుతుందిగా? ఎందుకూ పనికి ఆని ఈ సలహాదారుల గుంపును వృధాగా పోషించడం దేనికని (నా బోటివారు) కొందరు నిలదీసి ఉండవచ్చు.

ఆ తరుణంలో ఈ ఎదవలు ఒకటై ఉండడంతోనేగా ఈ సమస్య.. వీరిని వర్ణాల పేరుతో విడకొడితేగాని వీరి పోరు పడలేమనుకున్న సలహాదారుల గుంపు వర్ణాలను సృష్ఠించి ఉండాలి .

(నిజానికి పుట్టే బిడ్డయొక్క వర్ణం ఎలా ఫిక్స్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా ఇంకో తరుణంలో చెబుతా. )

వర్ణాల మద్య ఐక్యతను దెబ్బ తీయడం కోసం వారి మద్యే వారు కొట్టుకుని చావాలని కుతంత్రాలతో కూడుకున్న డివిషన్ ఆఫ్ లేబరును అమలు చేసి /వారి మద్యే వివిద గ్రేడింగులు ఇచ్చి ఉండాలి.

నాయకుడు వారి చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది సుసాధ్యమే. ఈ సలహాదారుల వంశీయులే నేటి బ్రాహ్మణులు. ఇటువంటి తెగ ప్రతి దేశంలోను ఉంటుంది.పేర్లే వేరై ఉంటాయి.

ఏ దండయాత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా.ఏ రాజు వచ్చినా వీరు వారివద్ద పనికి కుదిరి (దుబాషీలుగా/సలహాదార్లుగా/స్వదేశీయుల గుట్టు చెప్పే వారిగా) తమ హోదాను నిలుపుకుంటూ వచ్చేరు.

ఎప్పుడైతే ముస్లీంల దండయాత్ర మొదలైందో అక్కడ నుండి వీరి ప్రాముఖ్యతలు క్షీణించడం మొదలయ్యాయి. వాడు లాయిలాహి ఇల్లల్లాహి మొహమ్మదు రసూరుల్లాహి అంటూ వీరి విగ్రహాలను, యాగాలను,పూజలను పొరక పుల్లక్రింద తీసి పారేసాడు.

కష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి విదేశి బాషలు నేర్వడం,గణితము,  మొదలగు వాటి పై దృష్ఠి పెట్టేరు.

తదుపరి వచ్చిన బ్రిటీషు పరిపాలనలో వారిచిన భిరుదులతో మురిసి పోయి జీవితాన్ని గడిపేసిన బ్రాహ్మణ మేధావులు కోకొల్లలు. కాని బేసికల్ గా మేధావులు కాబట్టి కాసింత బవిష్య వాణి తెలిసిన వారిగా స్వాతంత్ర్య ఉధ్యమంలోను కొందరు పాల్గొన్నారు.

రాజులు,సుల్తాన్లు  పోయి మంత్రులొచ్చేరు.వీరు వారి పక్కన సెక్రెట్రీలుగా,పి.ఏలుగా కుదిరేరు. వీరి మాటలు నమ్మినవారిని యాగాల పేరిట,పరిహారాల పేరిట ,దానాల పేరిట ముంచడమే అజెండాగా పెట్టుకునేరు.

దేవాలయాలను పైరవి సెంటర్లుగా చేసుకునేరు.  ఇంతకాలం వర్ణం,కులం పేరిట దూరం ఉంచిన బహుజనులను దగ్గర చేసుకుని మరింత దోచుకోవడం కోసం అన్య మత ప్రచారం భూచి చూపుతున్నారు.

పాలించేది ఏ పార్టి అయినా,మంత్రి ఏ కులస్తుడైనా అతన్ని వెనుకనుండి నడిపేది మాత్రం వీరే. నేడు స్పెక్ట్ర్రం కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒక దళితుడే కావచ్చు కాని కథంతా నడిపింది మాత్రం వీరే.

తాము మైనారిటిగా ఉండడంతో -వీరిచే అంటరానివారుగా -పంచములుగా -శూద్రులుగా ముద్ర వేయ బడిన -బాధితుల ప్రతిఘఠనల నుండి తమర్ని తాము రక్షించుకోవడం కోసం
ఐక్యమత్యమే మహాభలమంటూ ప్రవర్తిస్తున్నారు.

తమ కులానికి చెందిన వ్యక్తి అతనెంతటి దుర్మార్గుడైనా సరే వాడ్ని వెనుకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేరు.

మారే కాలాన్ని బట్టి తమ రంగాలను మార్చుకున్నారే తప్పా తమ అజెండాను మాత్రం మార్చుకోలేదు.  వారి అజెండా రెండే ఒకటి తమ ఐక్యమత్యాన్ని పెంచుకోవడం, రెండు : బహుజనుల ఐక్యతకు గండీ కొట్టడం.

నిజానికి నాటి సలహాదారులు చేసిన పనుల్లో చాలావాటిని వాతావరణ కేంద్రం ( వానలు ఎప్పుడు కురుస్తాయో చెబుతారు)  నేటి డాక్టర్స్,సైంటిస్టులు, గన్ మ్యేన్స్, సైకియాట్రిస్టులు చేస్తున్నారు. మనం గౌరవించాలి,పూజించాలి. అంతేగాని కేవలం కుల ప్రాతిపదికన ఎవరినీ గౌరవించాల్సిన అవసరమూ లేదు.

ఈ నేపధ్యంలో జయేంద్ర పై నా విమర్శల పై వచ్చిన కమెంటుకు నా సమాదానాన్ని రేపు అందిస్తాను.

ఇది నా పోస్టుపై వచ్చిన కమెంటు:

దీనికి సమాదానంగా నేనిచ్చిన ఉపోద్ఘాతమే నా ఈ టపా. క్రింది కమెంటును ఒక సారి చదవండి. దీని పై నా స్పందనను రేపు తెలియచేస్తా

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు, కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు, మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,

(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు) కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు,  ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు (వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా) బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి, ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,

"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది" బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు) ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి, తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//