Monday, January 3, 2011

స్నేహం ప్రేమ పది కాలాల పాటు కొనసాగాలంటే

ఓషో చెబుతారు : ప్రతి ఒక్కరు స్నేహాన్ని -ప్రెమను కోరుకునే వారే గాని పంచేవారు ఎవ్వరూ లేదు. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి వద్ద అడుక్కుంటే ఏం దొరుకుతుంది?

మన జీవితమనే రైలు తన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లను దాటుకుని వెళ్ళినా చివరికి ఆగనున్నది మరణమన్న స్టేషన్లోనే.

మరణాన్ని ఆప గలిగే స్నేహం -ప్రేమా ప్రతి ఒక్కరికి లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచమే పెద్ద బస్ స్టాండు. ఇక్కడికి వచ్చే బస్సులు కేవలం చావూరికే తీసుకెళ్తాయి.

అందాక బస్ స్టాండులో ఉన్న సాటి ప్రయాణికులతో కలిసి మెలిసి ఉంటే ఏం చక్కా కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ మనది,  మన స్నేహితులదే కాదు మన శతృవులది సైతం తాత్కాలిక బసే. ఈ ఒక్క పాయింటును అర్థం చేసుకుంటే శతృవులతో సైతం మనకు స్నేహం సాధ్యమే.

శతృవులను ప్రేమించడం గురించి తరువాత చెబుతాను గాని ప్రస్తుతానికి ఈ స్నేహం ప్రేమల గొడవేమోచూద్దాం.

ప్రపంచం చాలా పెద్దది. కోట్ల కొలది జనాలుంటారు. మీరు+మీ స్నేహితుడు/ప్రేమికుడు/ప్రియారాలు మాత్రమే ఉంటే ఎంత భావుండేదో అని మీరుఎన్నో సార్లు ఊహించుకుని ఉంటారు. కాని నిజమేమంటే
మీరిద్దరు మాత్రం ఉంటే ఒకరినొకరు చంపుకుని చచ్చి పోయేవారు.

కాబట్టి మీ ఇద్దరి నడుమ విద్యా -కుటుంభం-సమాజం ఇలా ఎన్ని ఉంటే అంత మంచిది అప్పుడే
స్నేహానికి -ప్రేమకు లాంగ్ లైఫ్.

మీరు మొబైల్ వాడేవారయ్యుంటే మీకు చార్జర్ సుపరిచితమే. చార్జర్ లోపల ఏముందో తెలీదనుకుంటా? మన ఇంటికి సరఫరా అయ్యే పవర్ 250 Volts .దీనిని డైరక్టుగా మొబైల్లోని బ్యేటరికి పంపితే మెటాష్ అయిపోతుంది.

అందుకని చార్జర్ లోపల ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఉంటారు. ట్రాన్స్ ఫార్మర్ అంటే మరేమో కాదు. అందులో వంద మీటర్ల పొడవుగల సన్నని రాగి తీగ ఉంటుంది. 250 Volts పవర్ ఒక కొనలో ఎంటర్ అయ్యి వంద మీటర్లు ప్రయాణం చేసి మరో కొనకు వచ్చే సరికి అది 4 volts గా మారుతుంది.

మీలో కలిగే ప్రేమ/స్నేహాన్ని అడ్డు అదుపు లేకుండా అవతలివారిపైకి వదిలితే మొబైల్ బ్యేటరిలాగా మెటాష్ అయిపోతారు.

అందుకే మీ ప్రేమ విద్యా -కుటుంభం-సమాజంవంటి నూట పదహారు మీటర్ల తీగకుండా ప్రయాణం చెయ్యాలి.

ఎదుటువారిని కేవలం బంకమట్టిలా భావించడం మనకు నచ్చినట్టుగా షేప్ అప్ చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం.

రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.

ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.

ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ  కురిపించారో ఆలోచించండి.

ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.

కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..

Sunday, January 2, 2011

ఘంటశాల భగవద్గీతలో లోపాలు



భగవద్గీత పై నాకు ఎన్నో విమర్శలున్నాయి. వీటిని తమిళంలో ఏకంగా సీరియల్గానే వ్రాసి సంచలనం సృష్ఠించాను. కృష్టుడు ఎలా ఉంటాడని తెలియని వారు ఎన్.టి.ఆర్ ని చూసి కృష్టుడు ఇలానే ఉండి ఉంటాడని అనుకుంటుంటారు. ఇదే విదంగా ఘంటశాల నోటి మాటగా భగవద్గీత వింటుంటే కృష్ణుడి మాటలు ఇలానే ఉండి ఉండాలి  అని అనిపిస్తుంది. ఇందులో ఏ తర్కానికి తావులేదు.

ఘంటశాల గొంతులో ఉన్న అదోరకమైన వర్ణనాతీతమైన దైవత్వం కేవలం కాలికో బైండు పుస్తకాల్లో భంధీగా ఉన్న ఆ శ్లోకాలకు రెక్కలు తొడిగిన మాట నిజమే. పండితుల రకరకాల ఉచ్చారణలతో నలిగిన ఆ శ్లోకాల ఉచ్చారణకు ఒక నిఘంటువుగా ఘంటశాల భగవద్గీత నిలిచింది.

ఉదయ పూర్వం చలిలీ మా రాములవారి గుడివీథి దాటి వెళ్తుంటే ఘంటశాల నోట ఆ శ్లోకాలు చెవి చేరుతుంటే నా కవి హృదయం ఈ భివియంతట శ్రీ కృష్ణుడ్ని ఊహించుకుని ఉర్రూతలూగేది. గీతలోని  అహేతుకాలు, అవుట్ డేటడ్ డేటాలు అన్నీ నా బుర్రలోనుండి ఎగిరి పోయేవి.

ఇంతకీ లోపాలని శీర్షిక పెట్టి ఈ సొల్లేంటి అని మీరు విసుక్కుంటున్నారు కదా? పాయింటుకొస్తా!

నిజానికి నేను లేవనెత్తనున్న లోపానికి ఘంటశాల కారకులయ్యుండరని నా విశ్వాసం. గీత అన్నదే ఒక సంభాష్ణ. దానిని రికార్డు చెయ్యాలనుకున్నప్పుడు ఇద్దరు గాయకుల్ని ఏర్పాటు చేసి ఉండాలి.కృష్ణుడి పాత్రకు ఘంటశాల -అర్జునుని పాత్రకు మరో గాయకుడు.

అలాగే ఫలానా అద్యాయం ఫలానా శ్లోకాలు అన్న డేటాలను చెప్పడానికి మరో వ్యక్తి గొంతును వాడి ఉండాల్సింది.

ప్రస్తుతమున్న టెక్నాలజికి గీతను రీ రికార్డింగ్ చెయ్యడం చాలా తేలిక. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ పని చెయ్యొచ్చు. అర్జునుని వాయిస్ కు ఎస్.పి వాయిస్ సరిగ్గా సరిపోతుంది. డేటాలు చెప్పడానికి మరో బిగినర్ ఎవరినన్నా వాడుకోవచ్చు.

Saturday, January 1, 2011

నేటి జర్నలిజం తీరు తెన్ను


చిత్తూరు ఎమ్.ఎల్.ఏ  సి.కె. బాబుచే మా 2011 మల్టి కలర్ క్యేలండర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేనొక ప్రకటన విడుదల చేసాను. పదిహేను పత్రికలకు  ఫోటోతో సహా ప్రెస్ నోట్ ఇవ్వగా కేవలం ఒక్క సాక్షి దినపత్రికలో మాత్రం వచ్చింది.  దానియొక్క  క్లిప్పింగ్ +ఆ ప్రకటన పూర్తిపాఠాన్ని ఈ టపాలో అందిస్తున్నాను.  నా ప్రకటనను ఈ క్లిప్పింగ్ ను పోల్చుకుంటే నేటి జర్నలిజం యొక్క తీరు తెన్ను ఏమిటో మీకు కంటికి కట్టినట్టు కనబడుతుంది.

నాడు వై.ఎస్. అధికారంలో ఉన్నప్పుడు  ఆ రెండు పత్రికలు వారి వ్యూస్ ను న్యూస్ రూపంలో తాటికాయంత అక్షరాలతో ఫ్రంట్ పేజిలో ముద్రించేవారు.  వారి ఆశలు -కోరికలు -కలలను పాఠకుని పై రుద్దేవారు (ఇప్పటికీ అదే పని చేస్తున్నారు -సాక్షిలోనైతే జగన్ ను జగత్ రక్షకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూంది -ఇది మరీ ఓవర్)

వారు వ్రాసిన ఏక పక్ష వార్తలు -ఆరోపణల పై సి.ఎమ్. మరియు సి.ఎం కార్యాలయం ఇచ్చే వివరణాత్మక ప్రకటనలకు  కూడా ఇలాంటి గతే పట్టింది. అందుకే సాక్షి పుట్టింది.

నా ప్రకటన పూర్తిపాఠం:
చిత్తూరు ఎమ్.ఎల్.ఏ  సి.కె.చే మా 2011 మల్టి కలర్ క్యేలండర్ విడుదల
చిత్తూరు ( డిసెంబరు,31)
చిత్తూరు,గుడిపాల సి.కె అభిమానుల సౌజణ్యంతో  ప్రముఖ పాత్రికేయులు చిత్తూరు మురుగేషన్ విడుదల చేసిన 2011 మల్టి కలర్  క్యేలండరును చిత్తూరు ఎమ్.ఎల్.ఏ సి.కె.బాబు స్థానిక చిత్తూరు క్లబ్ ఆవరణలో శుక్రవారం విడుదల చేసారు. ఈ క్యేలండరును పురప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా మురుగేషన్ విడుదల చేసిన ప్రకటనలో కులమతాల  కురుక్షేత్రంగా, తయారవుతున్న రాజకీయాల్లో వాటికి అతీతంగా కేవలం ప్రజాభిమానంతో వరుస విజయాలు సాధిస్తున్న సి.కెను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 2009 ఎన్నికల్లో దన ప్రవాహాన్ని ఎదురీదుతూ విజయం సాధించడమే  అతనికున్న ప్రజా భలానికి   తిరుగు లేని సాక్ష్యం అన్నారు.

తన అభిమానుల అభిమానిగా ప్రతి ఒక్కరికి అందుభాటులో ఉంటూ , 365 రోజులు, 24 గంటలు ప్రజాసేవకే పరిమితమైన సి.కె కున్న ప్రజాభిమానమనే వెల్లువలో ఎవరో ఆడించినట్టల్లా ఆడే   పార్ట్ టైమ్ రాజకీయ నాయకుల కుట్రలు, దుష్ప్రచారాలు కొట్టుకు పోతాయన్నారు

తాము విడుదల చేసిన క్యేలండరులో ప్రతి రోజు మంచి సమయాలను సూచించామని క్యేలండరు కావల్సిన వారు 9397036815 నెంబరుకు ఫోన్ చెయ్యాలని మురుగేషన్ తమ ప్రకటనలో తెలిపారు

దారిద్రియం దగ్ద చేయగా మిగిలేదే అసలైన మీరు

తల్లీ !
ఎన్నో కథలు చదివాను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను కంటున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవితపు
సుఖ దుఖాల్లో పాలుపంచుకుంటున్నా
అయితే అమ్మా....
నా కథలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
క్షణాల్లో,గంటల్లో,రోజుల్లో,నెలల్లో వీరి స్థిథి గతులు
తలక్రిందలై పోతుంటే
నేను మాత్రం జస్ట్ ప్రేక్షకుడిగా -ఏలీన్ గా- గ్రహాంతరవాసిలా
ఎలా చూడగలుగుతున్నానే వీరి ఆరాటాలను -జీవన పోరాటాలను

నా తల్లికి కుచేలుని భార్య పేరు
కుదిరింది కాబట్టే
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతూందా?
ఈ దారిద్రియమే నా ఆలోచనలను కేంద్రీకృతం చేసి
తాబేలువలే నన్నో లక్షయపు గూడులో చెర పెట్టిందా? లేదా బధ్ర పరచిందా?

పుట్టిన నాటినుండి నేటి వరకు
ఎదో రూపంలో
ఎదో మోతాదులో
దారిద్రియం... దారిద్రియం..
ఈ దారిద్రియాన్ని దగ్దం చేసేందుకు
ఎంతగానో ఎదిగాను
మరెంతగానో దిగ జారాను
కాని .. కాని ..కాని
దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.. శాపంలా
వెంటాడుతూనే ఉంది
ఎందుకమ్మా?
కాని ఒక్క విషయాన్ని అంగీకరిచాలి
నా పేదరికమే నిజమైన "నేను" ఏమిటో నాకు స్ఫురింప చేసింది.

కొంపదీసి ఇదీ నీ స్వరూపమేమో?
బహుసా ! నేను భవిష్యత్తులో కేవలం డబ్బు మనిషిగా
పరివర్తన (ఐ మీన్ దిగజారి) చెంది ఈ సమాజాన్ని
దోచుకుని నా జాతకాన్ని సార్థకం చెయ్యాలని
ఈ టీర్ట్మెంటా తల్లీ!

అమ్మా!
నా గోడును ఏ మాటలతో చెప్పాలనుకున్నా
అదే గోడును మరేవో   మాటలతో నీకు విన్నవించుకున్న
సందర్భాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి
అన్ని విదాల అర్హత ఉండిఅదృష్ఠవంతుడిగా ఎదగనిచ్చే జాతకంలోనే పుట్టాను
నా ప్రయత్నంలో అతి ఉండొచ్చు గాని
లోపం మాత్రం లేదు

ఈ దేశాన్ని ఉద్దరించాలనుకున్నాను
కనీశం నా కుటుంభాన్ని సైతం
పోషించలేని దుస్థితిలోనే ఉన్నాను
గురు చంద్ర సంయోగ ఫలమగు
పద్నాలుగు సం.ల వనవాసం ఇదేనేమో అనుకుని
ఓర్చుకున్నాను

అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను ఒక భీజాన్ని ఐదు సం.లుగా ద్యానిస్తూనే ఉన్నాను

ఏవో కొన్ని చిల్లర  అద్భుతాలు జరుగుతున్నాయి గాని
నా దారిద్రియం మటుకు దగ్దం కావడం లేదు
ఎందుకు?

గతాన్ని విడిచి పెడతాం
అప్పుడు నేను కేవలం ఒక తెలివైన చిలుకను మాత్రమే

మరి నేడు?
హే మదుర మీనాక్షి !
నీ చేతిలోని చిలుకంతటి స్థాయికి ఎదిగాను
హే అంబ!
నా పలుకులు నీ పలుకులంతగా భీభత్సాన్ని సృష్ఠిస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడలాడుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు కొణ ప్రాణంతోనన్నా
కొట్టుమిట్టాడుతూనే ఉంది
పొరభాటున నా దారిద్రియానికి చిరంజీవత్వం
ప్రసాదించలేదుగా?

పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించ లేదుగా?
బై మిస్టేక్.. ఈ నా దారిద్రియం నీ ప్రతిరూపం కాదు కదా?

నేను చెయ్యాలి యుద్దం!
అందుకు కావాలి నా దారిద్రియం దగ్దం
అని ఒక మూల ఆలోచిస్తున్నా

శిలనై ఉన్న నన్నుశిల్పంగా మలచింది ఈ దారిద్రియమేనో ఏమో అన్న అనుమానమూ కలుగక మానడం లేదు..

చెడ్డవానికి చెడిపోయే కాలం వచ్చే సమయాన అతనికి మంచి ఆలోచన ఇచ్చి ముంచేయడం

మంచివానికి భాగుపడే కాలం వచ్చిన సమయాన
అతనికి చిన్న చెడు ఆలోచన ఇచ్చి సెటిల్ చెయ్యడం నీ స్టైల్..

ఎందుకో డబ్బు మీద నాకున్న అపోహలను తొలగించావు

వీరి డబ్బు జబ్బును కుదర్చాలంటే నేనదే డబ్బును సంపాదించి చూపాలి..

మరీ వీరిలా డబ్బును ప్రాణంతో ముడి పెట్టుకుని,మరణానికి చేరువవుతూ కాక
ఆడుతూ పాడుతూ..

ఇంకా సంపాదిస్తా.. లక్ష్యం సాధిస్తా.. ఆపై వీరికి సృష్థి రహస్యం భోదిస్తా..

Thursday, December 30, 2010

అన్నగారి కోసం నేను వ్రాసుకున్న కథ


అన్నగారు బతికుండి ఆయనగారి సినిమాకంటూ నేనో కథ చెప్పే అవకాశం వస్తే!

అన్నాగారంటే ఒక్క ఎన్.టి.రామారావు గారే. ఆయన బతికుండి ఆయనకు సినిమాలో నటించే ఓపికుండి ఆయనకు నేనో కథ చెప్పే అవకాశం వస్తే ఎలా ఉండేదో ఊహించుకుని ఈ టపా వ్రాస్తున్నా

(ఇదెలా సాధ్యమని మీరు అడగవచ్చు. చెబుతా! చంద్రబాబు వెన్నుపోటు అనంతరం ఎన్.టి.ఆర్ చనిపోలేదనుకొండి. అతను చంద్ర బాబుకు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రచార కార్యక్రమం విజయవంతమైయుండేది.  ఆ తొమ్మిది సం.లు తె.దే.పా పాలన సాగేది. ఆ 9 సం.ల్లో ఏదో రోజు తిక్క పుట్టి ఒక సినిమా చెయ్యాలనుకొని - అదీ లేటెస్ట్ ట్రెండులో- నా గొప్పతనం ఎవరి నోటో విని నన్ను పిలిపించేవాడే)

నేను: నమస్తే అన్నగారూ..

ఎన్.టి.ఆర్:రండి బ్రదర్ ! కూర్చోండి. శివాజి గణేశన్ "ముదల్ మరియాదై"చేసాడుకదా.. అలాంటి కథాంశంతో మేకప్ లేకుండా మేము ఒక సినిమా చెయ్యాలనుకున్నాం.

నేను: వావ్ ! సూపర్ సార్ !  ఇప్పుడే చెబుతా..

ఎన్.టి.ఆర్: హూం మొదలు పెట్టండి

నేను: ఓపనింగ్ సీన్ ఏమంటే  మీరు మీ ఒరిజినల్ హేర్ స్టైల్ , ఒరిజినల్ ఫేస్ జస్ట్ ఒక్క మీసం మాత్రం   అదనంగా ఉంటుంది. ఈ గెట్ అప్లో మీరు  నార్త్ ఇండియా టూర్ భయలు దేరేందుకు పెట్టా బేడా సర్దుతుంటారు

ఎన్.టి.ఆర్:ఇదేంటి బ్రదర్ జీవితంలో  అంతా పూర్తయ్యాకే కదా తీర్థ యాత్రకు భయలు దేరుతారు? మరి మొదటి సీన్లోనే పెట్టా బేడా సర్దడమే..
నేను:  నాకు పావు గంట టైమ్ ఇవ్వండి సార్ ..కథ పుంజుకుంటుంది
ఎన్.టి.ఆర్: ఓకే ఓకే ..కానీయండి
నేను: ఈ సినిమాలో మీ క్యేరెక్టరు ఏమంటే .. మీవయస్సుకి,తరానికి పొంతనలేని కుర్రతనం ఉట్టిపడుతుంటుంది. కాలనిలోని కుర్రాళ్ళంతా మీ శిష్యులే. వారి క్రికెట్ టీమ్లో మీరూ సభ్యులు. వారు ఎదో న్యూసెన్స్ చేసి పోలీసోళ్ళు బుక్ చేస్తే అందులో మీరూ ఒక నిందితులు

ఎన్.టి.ఆర్: ఇదేదో వెరైటిగా ఉందే .. చెప్పండి చూద్దాం
నేను:అంతే కాదు సార్ .. మీరంటే ఆడోళ్ళకి చచ్చేంత ఇష్ఠం. పదాహారేళ్ళ అమ్మాయినుండి - నలబై ఏళ్ళ ఆంటి వరకు అందరూ మీతో క్లోసుగా ఉంటారు. మీ అబ్బాయికి ఇది అలవాటే కాబట్టి నో ప్రోబ్లం. కాని కోడలు ?

ఎన్.టి.ఆర్: ఐ సీ.. అంటే నన్ను గెంటి వేస్తారా?
నేను: అదెలా జరుగుతుంది సార్. మంత్రి మండలిని సైతం మీరు భతరఫ్ చెయ్యిస్తారుగాని
ఎన్.టి.ఆర్: హ హా... చెప్పండి
నేను: మీరిలా కాలని కుర్రాళ్ళకు ప్రేమా ఇతరత్రా విషయాల్లో సహకరిస్తూ వారిని దారిన పెడుతూ వచ్చే సమయంలో ప్రేమికులిద్దరు ఆత్మ హత్య చేసుకుని చని పోతారు. అంటే ఆ ప్రేమ జంటలోని అబ్బాయికి అమ్మాయి మీతో చనువుగా ఉండటం పట్ల అనుమానం
మీరు వాత్సాయన మహర్షిలా లెక్చర్లు దంచుతుంటారు. ( మన సినిమాలో మీరిందాక ఎయ్యని గెట్టప్పుతో ఒక పాట కూడ పెట్టొచ్చు సార్ అదే వాత్సాయనుడు) అబ్బాయికేమో ప్రీ మెచ్యూర్డ్ ఎజాగులేషన్ ఉంటుంది..

ఎన్.టి.ఆర్:  ఇదేంది బ్రదర్! మరీ కాశివిశ్వనాథ్ కథలా పోతూంది.
నేను: డోంట్ వొర్రి సార్! ఇది ఒక చిన్న ట్రాక్ రెండు మూడు మ్యేండేజ్ షాట్సుతో పూర్తై పోయేది.

ఎన్.టి.ఆర్: ఓకే ఓకె.. వారిద్దరు ఆత్మహత్య చేసుకుంటారు .. అందరు నన్నాడి పోసుకుంటారు నేను విరక్తితో నార్త్ ఇండియా టూర్ అంతేనా బ్రదర్

నేను: అమ్మమ్మా.. ఇంత సింపుల్ ట్విస్ట్ ఉంటే మరీ టివి సీరియల్లా తయారవుతుంది అన్నగారూ .. అసలు కథ ఏమంటే వాళ్ళది ఆత్మ హత్యలు కావు. హత్యలు. మీ సలహా మెరకు ఇద్దరు మనస్సు విప్పి మాట్లాడుకుని సర్దుకుంటారు. కాని  వారు కాపురమున్న అదే కాంపవుండ్లో విదేశి విథ్యార్దుల ముసుగులో తీవ్రవాదులు ఉంటారు. అందరు కుర్రాళ్ళు మీతో కలిసి మెలిసి ఉన్నా వారు మాత్రం మీతో కలవరు. వీరితో గొడవలు కారణంగానే పోలీస్ స్టేషనుకు సైతం వెళ్ళాల్సి వస్తుంది. వారి రహస్య కార్య కలాపాలు అకస్మాత్తుగా
ఈ జంట కంట పడుతుంది. కాబట్టి తీవ్రవాదులు వాళ్ళని ఫినిష్ చేసి ఆత్మ హత్యలా చిత్రీకరిస్తారు. మీరు అరెస్ట్ కావడం -బెయిల్ మీద భయిటకు రావడం కాలని కుర్రాళ్ళ సాయంతో మిస్టరి చేధించడం జరుగుతాయి

ఎన్.టి.ఆర్: ప్రోబ్లమ్ సాల్వ్ అయిపోతుందికదా? మళ్ళీ నార్త్ ఇండియా టూర్ ఎందుకని?
నేను: చెబుతా.. మీరు మైక్రో లెవల్లో యూత్ తో ఇంటరాక్ట్ అవ్వడం - వారి సాయంతో తీవ్రవాదుల గుట్టు రట్టు చెయ్యడం చూసి మన కేంద్ర నిఘా విభాగం మీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి మిమ్మల్ని దిల్లీకి పిలిపిస్తుంది. కాని ఈ విషయం ప్రపంచానికి తెలియ కూడదుగా.. అందుకే నార్త్ ఇండియా టూర్ ముసుగు

ఎన్.టి.ఆర్: ఇదేదో భాగానే ఉందిగాని పతాక సన్నివేశాలన్ని అయిపోయినట్టుందే.. కథను ఎలా ముందుకు నడపడం?

నేను: మీరున్నారుకదా సార్.. మీ చెరిస్మా లాక్కెళ్తుంది. చెబుతా.. చెబుతా..

(సశేషం తరువాతి టపాలో)

Wednesday, December 29, 2010

జగనన్న తమిళ తంబి సందించే 5 ప్రశ్నలు


అఫిషియల్గా చూస్తే మీరు నాకన్నా చిన్నవారే. కాని ప్రతి ఒక్కరు (మీకన్నా పెద్దవారు సైతం) అన్న అంటుంటే మీరెక్కడ ఇగో ఫీల్ అవుతారో అని జగనన్నకు అనే శీర్షిక పెట్టాను. ఇక ప్రశ్నలు :

1. వై.ఎస్. తలచుకుని ఉంటే ..అతను తెలంగాణకు సుముఖుడే అయితే ఎప్పుడో వచ్చేది తెలంగాణ. మీరు సైతం పార్లెమెంటులో సమైఖ్యాంద్రకు మద్దత్తుగా ప్లే కార్డులు కూడ ప్రదర్శించేరు. కాని సాక్షిటివి కథనాలు ( కె.సి.ఆర్ కు ప్రాధన్యత) ఆయన మాటలు చూస్తుంటే మీరూ జై తెలంగాణ అనేసారని పిస్తూంది. మీ వైఖరి ఇప్పటికన్నా స్పష్థం చెయ్యాలిగా?

2. పార్టికి మీరే పేరు పెట్టండి అని - ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండని సెల్ నెంబరు కూడ ప్రకటిస్తున్నారు. పార్టీ రూపు రేఖలు ప్రదిపాదించమని వెబ్ సైట్ కూడ పెట్టేరు. ఇవన్ని చంద్రబాబు స్టైల్స్. అతనికింత చెడ్డ పేరు రావడానికి కారణం సలహాలివ్వండని కోరడం - ముసాయిదా మీద మీ అభిప్రాయాలు తెలపండి అనడం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా అనడం వంటి అతి చేష్ఠలే (తీరా చూస్తే సలహాలు -అభిప్రాయాలన్ని భుట్ట దాకలే)
అసాధ్యమని తెలిసినా ఇటువంటివి ప్రకటించడం మంచిదేనా? పైగా www.i4jagan.in హోం పేజిలోని వై.ఎస్. ఆర్ ఫోటో మరీ డల్ గా ఉంది. ఆ ఫోటొ తొలగించి ఈ పోస్టులో నేను ఉంచినంత తేజోమయంగా ఉన్న ఫోటో పెట్టమనండి


3. మీకు మద్దత్తు తెలిపిన ఎమ్.ఎల్.ఏలు రాజినామా చెయ్యరు. కాంగ్రెస్ పార్టి వారిని సస్పెండూ చెయ్యదు. ఎంతకాలం ఈ నాన్చుడు? వై.ఎస్. మరణానంతరం మీ నాన్చుడు వైఖరివలనే ఎంత నష్ఠం జరగాలో జరిగి పోయింది. ఇంకా నాన్చడం దేనికి?

4.వై.ఎస్. మీద ,మీ మీద, మీ కుటుంభ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని మీరెందుకు తిప్పి కొట్టరు? ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆ పని ఎందుకుమీరే చెయ్య కూడదు (సాక్షిలో కాదు ముర్రో)

5. ఒక టివి చానల్, ఒక పత్రికను సైతం విజయ వంతంగా నడపలేని మీరు రాష్ఠ్ర్రాన్ని ఎలా
సక్రమంగా పరిపాలిస్తారు. ఇంకా కూడ సాక్షి నెంబర్ టూగానే ఉంది. ముందుగా వీటిలో వై.ఎస్., మీ పురాణాలు ఆపి నెంబర్ వన్ స్థానానికి తెచ్చే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు గాని ఎన్నికల సమయంలో ఇవి మీకు పెద్దగా సాయపడవు.

నిద్రలేని రాత్రులు

గురువుగారు,
ఈ టపా చదవనొచ్చారంటే మీకూ రచనంటే ఆసక్తి ఉందనే అర్థం . మీరు "రచయితలు - హోమీ సెక్సువల్స్ ఒకే కోవకు చెందినవారనే నా ఈ టపాను కూడ ఇష్ఠపడతారు. దానిని చదివేందుకు ఇక్కడ నొక్కండి


జాగారం నాకు కొత్తేమి కాదు
సుఫి సంస్కృతిలో జాగారం భాల పాఠం
బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేవడం కష్ఠమేమో గాని ఇలా జాగారం చెయ్యడం భాగా అలవాటు ఎస్.ఎస్.సి పరీక్షలకు మేల్కొని మేల్కొని ఈ జాగారం ఇలా అలవాటైంది
ఈ మాట వ్రాస్తున్న ఈ నా కార్యాలయానికి ఎదురుగా ఓ మసీదు
రెండు నిమిషాలకు పూర్వం రామాలయంనుండి సుప్రభాతం వినిపిస్తుండే
ఇప్ప్డుడేమో అల్లాహు అక్బర్
నేను ఇంటినుండి భయిటపదుతుండగా చర్చి గంట మోగింది

మన మానసిక స్థితిని పట్టి అన్నీ అహ్లాదంగానే అనిపిస్తాయేమో?

ఈ సృష్ఠిలోనే నాకు అత్యంత సన్నిహితమైంది నా మనస్సు.
మనసంటే గత సంఘఠనల,అనుభవాల కూర్పని యు.జి.కృష్ణ మూర్తి అంటారు

నాకేమో జన్మ జన్మల జ్నాపకాల కూర్పనిపిస్తూంది..
జ్నాపాకలంటే పత్రికా కార్యాలయాల్లో దుమ్ము దూళీలతో ఉండే ఫైల్ కాపీల్లాంటిది కాదు

అవి ఏ క్రమంలో పొందుపరచ బడ్డాయోకాని
ఏ క్రమంలో కోరుకుంటే ఆక్రమంలో లేస్తాయి

మరి సినిమాల్లోలాగా మాండేజ్ షాట్స్ లా కాక ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తల్లోని ఆడియో క్లిబ్బింగుల్లా కాక
టివి చానల్స్ లోని ఫ్లాష్ న్యూస్ లా కాక
జస్ట్ స్ఫురిస్తాయి..

ఒక ఉత్తమ  ఎడిటర్ ఎడిట్ చేసినంత నేర్పుతో స్ఫురిస్తాయి. మద్యలో రెండేసి అరగంటలు మిన: రాత్రంతా ఆన్ లైన్లో గడిపాను.

అక్షరాలు టైప్ చేస్తుంటే అవి అక్షరాలుగానే కనిపిస్తున్నాయి

పదాలు టైప్ చేస్తుంటే అవి పదాలుగా కనిపిస్తున్నాయి

విసిరేసినట్టుగా ఉన్నాయి గాని వాటి మద్య అమరిక ,భావం బోధ పడటం లేదు

కూర్పు,నేర్పు ,అతుకు ,అమరిక లేవనిపించాయి
ఇలా చేతకలం పట్టి కాయితం పై వ్రాస్తుంటే అదో  " తుత్తి"

ఒక సారి యూనికోడ్లో టైప్ చేసి పారేస్తే అది చిరంజీవత్వం పొంది ఎన్ని అవతారాలైనా ఎత్తగలదు.