Monday, September 27, 2010

తమిళ బ్లాగ్లోకంలో నా విజయ రహస్యాలు

తెలుగు బ్లాగ్లోకంలోనైతే ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుని వ్రాస్తూ వచ్చాను  http://www.blaagu.com/swamy7867 ఎన్.టి.ఆర్ మరియు వై.ఎస్.ఆర్ అనుకూల వైఖరి కారణంగా కొంత నష్ఠం జరిగి ఉండవచ్చు. కాని తమిళ బ్లాగ్లోకంలో ఉద్దేశ పూర్వకంగా కాక పోయినా కాకతాళీయంగా ఒక స్టాండ్ అంటూ లేక పోయింది . ఏ వర్గం తప్పు చేసినా ఖండిస్తూ వచ్చాను.
అయితే కుల వ్యవస్థకు,కులాహంకారానికి ,ముఖ్యంగా బ్రాహ్మణుల కులాహంకారానికి వ్యతిరేకంగా నా రచనలు ఉన్నవి

పెరియార్ తమ యావద్ జీవితాన్ని ధార పోసి నెలకొల్పిన " పగుత్తరివు"  ( విచక్షణా జ్ఞానం) అక్కడ   చెక్కు చెదరకుండటంతో ఇదీ నాకో ప్లస్ పాయింట్ అయ్యింది. పెరియార్ అనుకూల వైఖరిని  కొనసాగించాను.

బ్రాహ్మణుల కులాహంకారం, విద్య విషయంలో వారు అవలంబించే స్వార్థ పూరిత వ్యూహాలంటే నాకు పరమ చికాకు.

అటు పెరియార్ ను కొనియాడుతూ ఇటు జ్యోతిష్యం  ఆథ్యాత్మిక విషయాలు ఎలా వ్రాసానంటే... దేవుడున్నాడనడానికి దేవునితో పెద్ద అనుసంథానం అవసరం లేదు. దేవుడు లేడు అనాలంటేనే దేవునితో అసలు సిసలైన అనుసంథానం అవసరం   వాదిస్తూ వచ్చాను . అది పెరియార్ కు ఉండేదేమోనని  వాదిస్తూ వచ్చాను.

 నాకు సాటి బ్లాగర్లకు  ఉన్న తేడా  జ్యోతిష్యం,వాస్తుల్లో నాకు  ఉన్న ప్రానీణ్యత. పైగా స్వతా: కుదిరిన  సెక్సాలజి మరియు సైకాలజి సంబంధ టపాలు నా బ్లాగుకు ఒక వైవిద్యాన్ని తెచ్చి  పెట్టాయి.సెక్స్ అంటే స్వాతివంటి మాస్ పత్రికల్లో వచ్చే సరసమైన కథల్లా కాకుండా ఎజుకేటివ్ గా వ్రాస్తూ వచ్చాను.  ఉ. అడల్ట్ జోక్స్ అందించినప్పటికి వాటి వెనుక ఉన్న సైకాలజిని అనలైజ్ చేసాను.

కేవలం అక్రమ సంభంధాల చిట్టా విప్ప కుండా వాటికున్న కారణాలను అన్ని కోణాల్లోనుండి వివరించాను. అదెలా కుదిరిందో కాని సక్సెస్ మాత్రం వరించింది. చెప్పడం మరిచాను  ముఖ్యంగా నేను బ్లాగర్ల గ్రూపు రాజకీయాల్లో తల దూర్చ లేదు.

హెశ్చరిక:
ప్రస్తుతం తమిళ బ్లాగ్లోకానికి ఒక అగ్ని పరీక్ష పెట్టాను ప్రస్తుతం నా బ్లాగుకు 243 మంది సభ్యులే ఉన్నారు.ఈ సంఖ్య అక్టో. రెండు లోపు ఐదొందలు కావాలి కాకుంటే కొత్త టపాలు వెయ్యనని అల్టిమేటం జారి చేసాను. ఒక వేళ ఈ సంఖ్య అసాధ్యమైతే తెలుగు బ్లాగ్లోకం పైనే దృష్థి కేంద్రీకరించాలని నా ప్లాన్.

No comments:

Post a Comment