ఒక కుటుంభ పెద్ద ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంభ సభ్యులు ఎంతగా ఇబ్బంది పడతారో అంతకు మించి రాష్ఠ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోశయ్య ఒక్క మాటలో సి.ఎం గిరి నుండి తప్పించుకుని తన ఆర్థిక మంత్రిగా మరో ఇన్నింగ్స్ ను కొన సాగించి ఉండొచ్చు. కాని ఎవరైనా ఆశకు అతీతులు కారు కదా?నిజానికి రోశయ్య గుల్జారిలాల్ నందా కేటగిరికి చెందిన వ్యక్తి. నెంబర్ టూ గా సమర్థుడై ఉండవచ్చు. కాని స్వధర్మం వీడి పరధర్మానికి ఎగ బడిన పాపానికి తానూ హింసకు గురై ప్రజలను హింసిస్తున్నారు.
వై.ఎస్ పై అతని కుటుంభ సభ్యులపై వస్తున్న నిందలు ఆరోపణల వెల్లువ చూస్తుంటే వై.ఎస్. వారిని ఎంతగా ఇబ్బంది పెట్టారో అర్థమై పోతూంది. కేవలం ఒక్క వ్యక్తి మరీ అతను సిని హీరో కాడు. గొప్ప వాగ్దాటి గల వ్యక్తీ కాదు. 55సం.ల వయస్సు వరకు ఐరన్ లెగ్ లా నిరాధరణకు గురైన వ్యక్తి. అయినా సరే ప్రపంచ ఖ్యాతి గాంచిన చంద్రబాబును ,ఆతని రాజకీయ చతురతను రెండు పర్యాయాలు దెబ్బ కొట్టారు. స్వంత పార్టిలో కురు వృద్దులని పేరు తెచ్చుకున్న ముసలి నక్కలను నయానో భయానో నోరు విప్పకుండా చేసారు. నేడు పెను భూతంగా మారిన తెలంగాణ సమస్యను,కే.సి.ఆర్నుబాటిల్లోబంధించి ఉంచారు. సూర్యుడు ఉన్నంత కాలం తారల చమక్కులు కంటికి అగుపడనట్టే ఆయన ఉన్నంత కాలం అన్నీసర్దుకు పోయాయి.
ఆయనేం మూర్ఖుడు కాడు. ఆయనకు తెలిసే ఉండాలి తాను చేస్తున్నది పులి మీద స్వారి అని. అయినా తప్పలేదు. వై.ఎస్. అభిమానుల్లో ఒక విశ్వాసం ఉంది. రోశయ్య పనికి మాలిన వారని, వై.ఎస్. బతికి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని. నిజానికి వై.ఎస్. బతికున్నా రోశయ్య రేంజికే దిగ జార్చి ఉంటుంది కాంగ్రెస్ అదిష్ఠానం.
2004 ఎన్నికల్లో వై.ఎస్. తిరుగు లేని మెజారిటి తెస్తే కేంద్రంలో యు.పి.ఏ ప్రభుత్వం కమ్యూనిస్టుల దయా భిక్షం మీద కొన సాగ వలసిన పరిస్థితి. 2009 ఎన్నికల్లో కేంద్రంలో యు.పి.ఏ ప్రభుత్వానికి తిరుగు లేని మెజారిటి కలుగగా రాష్ఠ్ర్రంలో అది భారిగా తగ్గి పోయింది.
నిజానికి ప్రతిపక్షాలంతా ఏక త్రాటి పై నిలబడి, ఒక మెగా స్టార్ స్థాపించిన కొత్త పార్టి భరిలో ఉండగా ఈ మాత్రం విజయం యాదృచికం కాక పోవచ్చు - వైఎస్ వీర భోజ్యమే కావచ్చు. కాని సోనియా గాంథికి ఈ పరిస్థితి అనుకూలంగా మారింది. గతంలో వై.ఎస్. కు ఇచ్చిన అపరిమిత స్వేచ్చకు కోత విధించే మూడ్ లోకి వచ్చేసారు. అదృష్త వశాస్తో దురదృష్ఠ వశాస్తో వై.ఎస్. మరణించారు. వై.ఎస్. పై పడ వలసిన విమర్శన భండలు రోశయ్య నెత్తి మీద పడుతున్నాయి. వై.ఎస్ పాలన చివరి అంకంలోనే నైరుతి రుతు పవణాలు ఆలశ్యం కావడం గమనార్హం. పైగా మితి మీరిన ఆత్మ విశ్వాసంతో వై.ఎస్. ప్రకటిస్తూ వచ్చిన సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి గుది బండలుగా మారాయి. మింగ లేక కక్క లేకా అవస్థలు పడుతూ పరిపాలన సాగించారు వై.ఎస్.
నేడు రోశయ్య చేపట్ట దలచి చేయి కాల్చుకుంటున్న పొదుపు వ్యూహాలను వై.ఎస్. అయినా పాటించి ఉండ వలసిందే. వీటిని అమలు చెయ్యడానికి రంగం సిద్దం చేసేందుకే డెలివరి మెకానిజం పై దృష్ఠి సారించారు వై.ఎస్. మరో నెల బతికి ఉన్నా రచ్చ భండ కార్యక్రమంతో తమకు సత్యాలు తెలియ వచ్చాయంటూ బిల్డప్ ఇచ్చి స. పథకాలకు కోతలు విదించేవారేమో? కాని తాను ఏర్పరచుకున్న రాబిన్ హుడ్ ఇమేజ్ చెక్కు చెదరకుండానే వై.ఎస్. దివంగతులయ్యారు.
ఇందిరా గాంథి చని పోయినప్పుడు ఆమె చనిపోయిన 24 గంటల్లో రాజీవ్ ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యారు ఇందిరామరణానంతరం డిల్లీలో చలరేగిన అల్ల్లర్లల్లో సిక్కుల ఊచ కోత జరిగితే రాజీవ్ "ఒక పెద్ద మర్రి చెట్టు కూలినప్పుడు ఈ మాత్రం అలజడి ఉంటుందని కొట్టి పారేసారు.
కాని ఇక్కడ డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆకస్మిక దుర్మరణానికి గురైనపటికి ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరుగలేదు. వై.ఎస్.పై అభిమానంతో తమకు తాము హాని చేసుకున్నారే తప్ప ఎదుటి వారికి ఎక్కడాఎటువంటి హానీ తలపెట్తలేదు.
మెజారిటి ఎం.ఎల్.ఏలు జగన్ సి.ఎం కావాలని లేఖ ఇచ్చినా పెడ చెవిన వేసి అనిశ్చితిని సృష్ఠించింది అదిష్ఠానం. నేనిక్కడ జగన్ వై.ఎస్. కుమారుడు కాబట్టి సి.ఎం చేసి ఉండాల్సిందని చెప్పడం లేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు కేవలం బా.జ.పా పొందిన రెండు శాతం ఓట్ల బలంతో, కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపు పొందితే, 2009 ఎన్నికల్లో వై.ఎస్ కేవలం ఒంటి చేతితో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో నెగ్గారు.
ఆంథ్ర ప్రదేశ్ ప్రింట్ మీడియా,ఎలక్ట్ర్రానిక్ మీడియా ఏక త్రాటి పై నిలిచి కాంగ్రెస్ పాలన పై దుమ్మెత్తి పోస్తుంటే జగన్ సాక్షి దిన పత్రిక మరియు టి.వి చేనల్ ప్రారంభించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి వచ్చిన ఓట్లెన్ని,అందులో ఒక శాతం ఓట్ల సంఖ్య ఎంత - సాక్షి దినపత్రిక పాఠకులు ఎంతమంది అని ఒక లెక్క కడితే అప్పుడు తెలుస్తుంది వై.ఎస్. తమ పథకాలతో ,చరిస్మాతో ,వ్యూహాలతో ప్రతిపక్షాల బలాన్ని బేరేజు చేసి ఉండ వచ్చేమో గాని కాంగ్రెస్ పార్టి విజయం మాత్రం జగన్ పెట్టిన బిక్షే.
అప్పట్లో రాజీవ్ స్థితికి నేడు జగన్ స్థితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ను దిల్లీ పిలిపించుకుని అతనిని కన్విన్స్ చేసి జగన్ కు పి .సి. సి, లేదా డెప్యూటి సి.ఎం పదవిచ్చి సర్దేసి ఉంటే నేడు రాష్ఠ్ర్ర ప్రజలు ఎదుర్కొంటున్న చిక్కుల్లో సగానికి పైగా వారించ బడేది.
ఈ విషయంలో జగన్ తప్పిదాలు కూడ లేక పోలేదు. వై.ఎస్ మరణానంతరం గురక పెట్టి నిద్ర పోయిన జగన్ హఠాత్తుగా నిద్ర లేచారు. తొలూత ఓర్పు ఓర్పు అంటూ సంయవనం పాటించిన జగన్ తదుపరి ఓదార్పు ఓదార్పు అంటూ అరిచి గీ పెట్టడం మొదలు పెట్టారు.
తొలూత ఎనలేని ఓర్పు వహించడం ఎంత తప్పో ఇప్పట్లో అరిచి గీ పెట్టడం కూడ అంతే తప్పు. ప్రస్తుతమ్ చేపడ్తున్న ఓదార్పు యాత్రలో కూడ అంటి ముట్టని వ్యాఖ్యలు చేస్తున్నారు గాని తనను నమ్ముకున్న వారి పక్షాన విరుచుకు పడటం లేదు. వై.ఎస్. లా మిమిక్రి చేస్తే చాలని భావించారేమో? వై.ఎస్ నమ్మినవారికి ఎంతగా అండగా ఉండే వారో గతాన్ని ఒక నెముర వేసుకుంటే మంచిది.
వై.ఎస్. పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగీయులను జగన్ ఒక్క ప్రశ్న అడిగితే చాలు వారి నోళ్ళు మూత పడతాయి. " గతంలో చిరంజీవి , వై.ఎస్. రాష్ఠ్ర్ర దనాన్ని సోనియాకు దోచి పెడ్తున్నారని అరోపించారు కదా? ఆయనను పార్టి అదిష్ఠానం దిల్లికి పిలిపించి మంతనాలు జరపటంలోని ఆంతర్యమేమిటి? దీంతో ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు పోతాయి? వై.ఎస్. దోచి పెట్టారని అంగీకరించినట్టు కాదా? చిరంజీవి సైతం దోచి పెట్టారని ఆరోపించారే కాని దొచుకున్నారని చెప్పలేదే"
నేను కాంగ్రెస్ వాదిని కాను. వై.ఎస్. అంటే పడి చచ్చే అభిమానిని కాను. గుడ్డిలో మెల్ల చందాన చంద్ర బాబుతో పోల్చుకుని వై.ఎస్.ను భలపరుస్తూ వచ్చానంతే. ప్రస్తుతం ఉన్న నాయకులంతా ప్రాంతాల వారిగా విడిపోయారు. ఈ రాష్ఠ్ర్రాన్ని ఒక్క త్రాటి పై నడిపించ గల ఏకైక మంత్రం వై.ఎస్..మాత్రమే.
ఆ మంత్ర భలంతోనే జగన్ గోల్డెన్ తెలంగాణా అంటూ సరి కొత్త నినాదాన్ని తెర మీదికి తేగలిగారు ఆయన
మెహబూబాబాద్ పర్యటనకు సంకల్పిస్తే ఈ ప్రభుత్వం సిగ్గు లజ్జా లేక అతనిని హైదరాబాదుకు తరలించింది. ఆరోజే జగన్ కు తగిన బధ్రత కల్పించి తెలంగాణ లో జగన్ ఓదార్పు యాత్రను కొన సాగించి ఉంటే జగన్లో ఇంతటి అబధ్రత తలెత్తేది కాదు. ఉప ఎన్నికల్లోను పార్టి కాస్త లాభ పడేది
నేను ఇంతగా కలత చెంది వ్రాస్తున్నది కాంగ్రెస్ పార్టి పై ప్రేమతోనో? వై.ఎస్. పై భక్తితోనో కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టికి అధికారాన్ని ఇచ్చేరు. వై.ఎస్. స.పథకాలు కొనసాగాలని ఆకాంక్షించేరు.సమైఖ్య వాదానికి అనుకూలంగా ఓటిచ్చేరు. ఇది ప్రజా స్వామ్యం. ప్రజలే ప్రభువులు.ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి.
అందుకు కాంగ్రెస్ పార్టి ఐక్యమత్యంగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలకు అనువుగా పని చెయ్యాలి. కాని
ఇది రోశయ్య నేతృత్వంలోని పరిపాలనతో అసాధ్యమని తేలి పోయింది. ఉన్న మరో చాన్స్ జగన్. అంత:పుర రాజకీయాలు, కిచ్చెన్ క్యేబినెట్స్ ఎన్నటికి ప్రజల ఆకాంక్షలకు అనువుగా పని చెయ్యలేవు.
అవినీతి ఆరోపణలంటారా ? సోనియాతో సహా అందరిని ప్రాసిక్యూట్ చేస్తే నిజా నిజాలు భయిట పడతాయి.
No comments:
Post a Comment